శ్రీరామ నామ మహిమ
.శ్రీ రామ జయ రామ జయ జయ రామ.
.ఒక భజన బృందం వీధిలో రామనామ సంకీర్తనం చేసుకుంటూ పోతోంది. అయితే కొందరు ఆ రామనామ స్మరణను ఆగి వింటున్నారు. పోతున్నారు. ఒకతను మాత్రం దానిని అపహాస్యం చేశాడు.*అది గుర్తించిన ఒక జ్ఞాని అతనికి రామనామాన్ని ఉపదేశించి, 'దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు. నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో అన్నాడు. సరేనన్నాడతను. కాలక్రమంలో అతను చనిపోయాడు.*యమదూతలు అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు వద్ద నిలబెట్టారు.*యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, 'ఓమారు రామ నామాన్నిఉచ్చరించావు. అందుకు నీకు ఏం కావాలో అడుగు?' అన్నాడు.*అయితే అతనికి జ్ఞాని చెప్పిన*'ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు'*అన్నమాట గుర్తుకు వచ్చింది.కనుక అతను యమధర్మరాజుతో 'మీరు ఏమి ఇవ్వదలచుకున్నారో అది మీరే ఇవ్వండి. నేనుగా ఏదీ అడగను' అన్నాడు.. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు.*రామనామానికి తాను ఎలా వెల కట్టగలననిఅనుకున్నాడు.*ఎందుకైనా మంచిది ఈ విషయమై ఇంద్రుడిని కలిసి ఆయననే ఓ నిర్ణయం తీసుకోమంటే సరి పోతుందనుకున్నాడు. అతనితోపాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఓ షరతు విధించాడు. 'నేను మీతో రావాలంటే నన్ను పల్లకీలో తీసుకుపోవాలి. పైగా ఆ పల్లకీని మోసేవారిలో మీరొకరై ఉండాలి' అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్నూ ఓ బోయిగా చూడాలనుకుంటున్నాడంటేరామనామ మహిమ ఘనంగానే ఉందన్న మాట అని అనుకున్నాడు యమధర్మరాజు, అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకీ మోసే బోయీలలో యమధర్మరాజు ఒకడయ్యాడు.ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు.యమధర్మరాజు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు.మనమందరం కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతోపాటు ఇం ద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామమహిమకు వెలకట్టలేననీ, వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామనీ అన్నాడు.యమధర్మరాజు. ఇంద్రుడితోపాటు బ్రహ్మ కూడా పల్లకీ మోసే బోయీ లలో ఒకడయ్యాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. *'ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించాడు. అందువల్ల అతనికి ఏ పుణ్యం దక్కుతుందో మీరే చెప్పాలన్నారు యమ ధర్మరాజాదులు.**'ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో కూర్చోపెట్టి మోసుకువచ్చారు కదా. దీని నుంచే మీకు రామనామ మహిమ అర్ధం కాలేదా?' అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకొన్నాడు
No comments:
Post a Comment