🎻🌹🙏భద్రాచలంకి క్షేత్ర పాలకులు ఎవరు? ...ఆయన్ను ముందుగా దర్శించాల...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ప్రతీ క్షేత్రానికి క్షేత్రపాలకులు ఉటారు. మరి భద్రాచల పుణ్యక్షేత్రం
శ్రీ రామ దివ్యక్షేత్రాన్ని
🌿నిరంతరం పర్యవేక్షిస్తూ పరిపాలిస్తున్న క్షేత్రపాలకులు ఎవరు..
ఎక్కడ ఉంటారు..ఎలా దర్శిస్తారు ??
🌸మీరు గోదావరి నుండి రామాలయానికి వచ్చే మార్గంలో సరిగ్గా భద్రగిరికి గోదావరి ఘాట్ కి మధ్యలొ ఉన్న గుట్ట మీద ఒక ఆలయం కనిపిస్తుంది.
🌿(చిత్రం పెట్టాను పైన గమనించండి). అదే " శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహాస్వామి " వారి ఆలయం.
వారే ఈ భద్రచల వైకుఠ క్షేత్ర పాలకులు.
🌸ఇది శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థాన ఉపంగా మాత్రమే చాలా మందికి పరిచయం.
🌿 ప్రతీ సంవత్సరం లక్ష్మీ నరసింహాస్వామి వారి కళ్యాణం ఘనంగా చేస్తారు.
🌸 భక్తులు వివిధ శుభకార్యాలు, మ్రొక్కులు ఇక్కడ తీర్చుకోవడం విశేషం శనివారం స్వామివారికి చేయు అభిషేకలు ప్రత్యేకం.
🌿పుణ్యక్షేత్ర దర్శనం చేసేవారు తప్పకుండా ముందుగా క్షేత్రపాలకులను దర్శించడం సాంప్రదాయం.
🌸అలా భద్రాచలంలొ తలనీలాల మ్రొక్కు సమర్పణ, పవిత్ర గోదావరి పుణ్య స్నానలు చేసుకొని .
🌿 ముందుగా "శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహాస్వామి" ని దర్శించడం తరువాత శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య దర్శనంతో పరిపూర్ణ క్షేత్రదర్శన యోగ్యమైన మార్గంగా.
🌹ఆలయ చరిత్ర :🌹
🌸సహస్ర సూర్య తేజం తో ప్రకాశిస్తూ , అపార కరుణా కటాక్ష వీక్షణలు ప్రసరిస్తూ ప్రసన్న వదనుడై, యోగ ముద్రలో బ్రహ్మానంద స్వరూపుడై వెంచీసియున్నారు శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారు.
🌿 చరితం మధురాతి మధురం. పాపి కొండల వద్ద గోదావరి నదిలో స్వామి వారి అర్చారూపం ఉద్భవించింది.
🌸దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథలో ఉంది. యోగానంద లక్ష్మి నరసింహ స్వామి మానవ నిర్మిత మూర్తి కాదు.
దేవత నిర్మిత లేక మహర్షి నిర్మిత మూర్తి అయి ఉన్నాడు.
🌿పూర్వకాలం గోదావరి నది పైనే రాజమహేంద్రికి పడవలు వుండేవి భద్రాచలం నుండి.
పాపికొండల వద్ద ఒకానొక ప్రదేశంలో పడవలు ఆగి పోతున్దేవి. గోదావరి జలాల లోంచి బొబ్బలు వినిపించేవి.
🌸కొబ్బరి కాయలు కొట్టి హారతులు ఇస్తేనే కానీ పడవలు ముందుకు కదిలేవి కావు. ఈ వింత తెలుసు కోవడానికి కొందరు నిపుణులు గజ ఈతగాళ్లను రప్పించి ఆ ప్రాంతం అంత అహూ రాత్రులు వెతికారు.
🌿ఒక శుభ ముహూర్తాన శ్రీ యోగానంద నరసింహ స్వామి వారి మూర్తి దొరికింది(బైటపడింది). మహా వైభవముగా ఆ మూర్తి ని భద్రాచలము తీసుకోచారు .
🌸స్వామి వారి ఎచట ఈ ముఖముగా ప్రతిష్టించ వలెనని తికమక పడుచుండగా ఒక నాడు స్వామి వారు ప్రధాన అర్చక స్వామి వారి స్వప్నమున సాక్షాత్కరించి
🌿 " నాయనా! నన్ను భద్రాద్రి రామునకు ఎదురుగా గల చిన్న గుట్ట పై నా తిరు అవతార జన్మ తిది నాడు(వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం) ప్రతిష్ట కావింపుడు " అని చెప్పగా.
🌸మరు నాటి నుండి స్వామి వారి మందిర నిర్మాణం మొదలైనది . స్వస్తి శ్రీ ఆనంద నామ సంవత్సరం.. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నము నందు చిన్న గుట్ట పై స్వామి వారిని ప్రతిష్టించరు .
🌿ఆ రోజు శాంతి కళ్యాణం చేసి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయముగా శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయమునకు నిత్య నైమిత్తిక పూజలు జరుగుచున్నవి .
🌸గోదావరి లో బొబ్బలు పెట్టెవాడు అని ఒకప్పుడు బొబ్బల నరసింహ స్వామి అని కూడా ప్రసిద్ధి.
కానీ చాలా మంది దూరప్రాంత భక్తులు ఈ విషయం తెలియక పోవడం
కొంత, గుట్ట కాలక్రమేణ వివిద కట్టడాలతొ మూసుకు పోయి బయటకు తెలియక పోవడం.
🌸 స్వామి భక్తులు వారిని దర్శించుకోలేక పోయారు పాలక బృందం, దేవస్థానం వారు రామాలయం భద్రుని కొండను ఈ గుట్టని కలుపుతూ వoతెన నిర్మాణం ద్వారా భక్తులకు ఆలయాన్ని మరిoత చేరువ చేయడానికి సఫలీకృతం చేశారు
🌿దీనితో భక్తులు ముందుగా క్షేత్ర పాలకుడు నరసింహ స్వామిని
సులువుగా దర్శనం చేసుకొని
🌸తరువాత రామాలయానికి చేరుకొని
శ్రీ సీతారామ దివ్య మంగళ దర్శనం చేసుకొని క్షేత్ర దర్శన సంపూర్ణం భాగ్యo కలుగునని శాస్త్ర వచనం... స్వస్తి..🌞🙏🌹🎻. *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment