*హీరో టు విలన్...*
*_ది జర్నీ ఆఫ్ జగపతిబాబు!_*
హీరోగా ఓ వెలుగు..
మధ్యలో ఓపలేని విరామం..
విలన్ గా ప్రయత్నం..
*లెజెండ్* కి ఎదురెళ్లి
సూపర్ సక్సెస్..
*శ్రీమంతుడు* కి తండ్రిగా
మరో యత్నం..
*_అడ్ని బతకనివ్వండిరా.._*
ఆ గొంతులో ఓ మ్యాజిక్..
ఆనక ఆనక
విలనీలోనూ
సరికొత్త లాజిక్..
వరస హిట్లతో
కొత్త ప్రయాణం..
జగపతిబాబు
*సినిమా తోరణం*
*సినిమాతో రణం..!*
అతడిలో ఓ వేదాంతి..
ఊహ తెలిసినప్పటి నుంచి
పరిచయం ఉన్న రంగం
అయినా చాలాకాలం
అటెళ్ళని మనసు..
*_అడవిలో అభిమన్యుడై_*..
*_పెద్దరికం_* తో ముందుకెళ్లి..
మధ్యలో *_గాయం_* పాలవుతూ..
ఓ *_శుభలగ్నం_* లో తనకుతానే
*_శుభాకాంక్షలు_* చెప్పుకుని
పెద్దకెరీరుకు
_*మావిచిగురు*_ తొడిగి..
హిట్టుల *_అంతఃపురం.._*
మహిళాలోకం మెచ్చిన *_మనోహరం.._*
జగపతి బాబు ట్రెండు..
*చిన్న శోభన్ బాబుగా*
*కొన్నాళ్ళు బ్రాండు..!*
ఇప్పుడేమో కొత్త గోదా
విలనీకి ఓ హోదా..
పరుగులు పెట్టని ప్రయాణం
*_మనకు లేక అదో ఏడుపా_*
*_పరులకుంటే మరీ ఏడుపా.._*
ఇది కాదు
జగపతిబాబు టైపు..
ప్రశాంత జీవనమే
అతగాడి కైపు..
ఇప్పుడు విలనీలో
*_ఫణీంద్రే పెద్ద తోపు..!_*
జగపతిబాబుకు
జన్మదిన శుభాకాంక్షలు..
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
7995666286
No comments:
Post a Comment