అంకితభావం ప్రధానం
మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా, అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవసేవ చేసి, తరించవచ్చు. కానీ మూగజీవాలు ఎలా దైవ సేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి ధూర్జటి సైతం ఇలా ప్రశ్నించి, తానే చక్కటి సమాధానమిచ్చాడు. ఆ మూగజీవాలు మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలె పురుగు. కాళం అంటే పాము. హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడి మహిమలను ధూర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపం చానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు.
మూగజీవాలు పరమాత్ముడి పట్ల భక్తిశ్రద్ధలు చాటుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడతాభక్తి గురించి తెలియనివారుండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించి పోయి, ఉడత ఒంటిని నిమిరాడంటే ఆ మూగజీవి ఎంత పుణ్యం చేసు కుంది! దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరి గిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ జూపి మోక్షమిస్తాడు. ఇది దైవాను గ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షి రాజు జటాయువు సీతమ్మ తల్లిని అప హరించుకుని వెళ్తున్న రావణాసురుడి దురాగ తాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయ త్నించాడు. ధిక్కారం సహించని రావణాసు రుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువును అను గ్రహిస్తాడు. దైవ సేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితం తోపాటు ప్రయత్నానికీ విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది. అనుగ్రహం దక్కుతుంది.
మనుషుల దైవ సేవలు రకరకాలుగా ఉన్నట్టే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలిబారిన పడి తాను ప్రాణాంతక పరిస్థితిలో విలవిలలాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు జొచ్చి వేడుకుంటాడు. 'కలడందురు దీనులయెడ' అని ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్న గజేంద్రుడికే ఒక దశలో 'కలడు కలండనెడు వాడు కలడో లేడో' అనే సంశయం కలు గుతుంది. అయినా విష్ణుమూర్తి వరదుడే. తన భక్తుణ్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగమేఘాల మీద బయలుదేరిన తీరును పోతనామాత్యుడు భాగవతంలో అమో ఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరూ, వాయీ లేని మూగ జీవాలు కూడా ఈ పని చేయగలవు. మోక్షమూ సంపాదించగలవు.
పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం, తోయంలలో ఏది ఇచ్చినా తీసుకుం టానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెబుతాడు. జగద్గురువే అలా చెప్పిన ప్పుడు తిరుగేముంది? వస్తురూపంలో కనిపించని తన హృదయపుష్పాన్ని మన కంటికి కనిపించని ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏముంటుంది?
శంకర నారాయణ
No comments:
Post a Comment