Friday, March 27, 2026

 *_అమ్మ ప్రేమకు ఆమే రూపం!_*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*కన్నయ్యను కనకపోయినా* *ప్రేమదీరా పెంచిన అమ్మ*
*యశోదమ్మ జయంతి*
*సందర్భంగా వందనాలతో..*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీకృష్ణుడి తత్వాన్ని తెలియజెప్పే అద్భుతమైన ఉదంతమిది..

మేనమామ కంసుడిని వధించిన తర్వాత తల్లిదండ్రులు దేవకీవసుదేవులను విడిపించడానికి కృష్ణుడు చెరశాలకు వెళ్ళాడు.

అప్పుడు దేవకీ కృషున్ని ఇలా అడిగింది..
కుమారా..నువ్వు అంత శక్తీమంతుడివి కదా. మరి నన్ను విడిపించడానికి పద్నాలుగు సంవత్సరాల వ్యవధి తీసుకున్నావేమని..

కృష్ణుడు చలించలేదు..
నెమ్మదిగా తల్లికి ఇలా బదులిచ్చాడు..
నువ్వు నన్ను లోకానికి పద్నాలుగు సంవత్సరాలు దూరం చెయ్యలేదా..

అర్థం కాని దేవకీ కొడుకుని 
అడిగింది..నేను నిన్ను పద్నాలుగు సంవత్సరాల పాటు లోకానికి దూరం చేశానా..అదెప్పుడు నాయనా..

త్రేతాయుగంలో..
నేను రాముణ్ణి..
నువ్వు కైకవి..
నన్ను పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు పంపలేదా..
ఇది కృష్ణుడి సమాధానం..

నేను కైకనా ..
అయితే నిన్ను కన్న 
ఆ భాగ్యశాలి కౌసల్య
ఈ జన్మలో ఎవరో కాస్త 
చెప్పు నాయనా..

కృష్ణుడి మొహంలో అదోలాంటి దీప్తి..
ప్రశాంతంగా ఇలా బదులిచ్చాడు..
ఇంకెవరు..
*_మా అమ్మ యశోద.._*
ఆ యుగంలో పద్నాలుగు సంవత్సరాలు కొడుక్కి దూరమైంది గనక ఈ యుగంలో ఆమెకు అదే పద్నాలుగు సంవత్సరాల పాటు ఉండి మాతృత్వ మాధుర్యాన్ని చవి చూసేలా చేశాను..నేను కూడా ఆ మమకారాన్ని తనివిదీరా ఆస్వాదించానని తల్లికి వివరించి చెరసాల నుంచి విముక్తం చేశాడు ..

చూసారా..కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే..
కారణజన్ములైనా దాని నుంచి
తప్పించుకోలేరు..

కిట్టయ్యకి తల్లిప్రేమను చవి చూపిన యశోద ఎంత అదృష్టవంతురాలో కదా..త్రేతాయుగంలో కైకేయిగా రాముని
పెంచిన ప్రేమను తృంచుకున్న
కైక ఆ పాపాన్ని ద్వాపరయుగంలో కూడా మోసి శ్రీ కృష్ణుడిని కొడుకుగా పొంది కూడా పద్నాలుగు సంవత్సరాల పాటు 
ఆ దేవదేవునికి దూరమై మాతృత్వ మమకారానికి నోచుకోని దుర్భర శాపాన్ని అనుభవించింది..

అవతారమూర్తిని 
ఒక యుగంలో పెంచినా.. 
మరో యుగంలో కన్నా చేసిన తప్పుకి తగిన ఫలితం అనుభవించక తప్పని కైక కథ తెలుసుకుని తదనుగుణంగా మసకలుకుంటే మంచిది..
ఎవరికైనా..

*_సురేష్ కుమార్ ఇ_*
      9948546286
      7995666286

No comments:

Post a Comment