*_స్వర్గపురికి పాటలపల్లకిలో!!_*
---------------------------------
లతాజీ వర్ధంతి..
06.02.2022
🎼🎼🎼🎼🎼🎼🎼
*ఆజారే పరదేశీ..*
*ఇలా ఏ దివ్యలోకాల నుంచి*
*వచ్చిందో పిలుపు..*
*అచ్చా తో హమ్ చల్తీ హై..*
*అంటూ తరలిపోయింది*
*గానకోకిల..*
*నాలుగేళ్ల మునుపు*
*ఇదే రోజున*
*ఫిర్ కబ్ మిలేంగే..*
*అంటే బాధ ఏలా..*
*ఉందిగా యాభై వేల*
*పాటల మేళా..!*
*ఎప్పుడు ఇచ్చిందో*
*చుప్కే సే దిల్ దేదే అంటూ*
*హో జాతా హై ప్యార్..!*
*పాటలతోనే మనువు..*
*ఆ పాటల్లోనే* *బ్రతుకుతెరువు..!*
*మనసు వికలమై*
*బాధల్లో నువ్వున్నప్పుడు..*
*చుట్టూ కారుచీకట్లు కమ్మిన*
*భీగిభీగీ రాతోన్ మే..*
*లతాజీ పాట ఎంత స్వాంతన*
*ఆమె గళంలో లాలిత్యం..*
*అందులోని అమ్మతనం..*
*ఆ పాటలు వింటుంటే*
*అమ్మ ఒడిలో తలపెట్టి*
*ఊరటనొందినట్టే..!*
*ఆమె పాట తోడుంటే*
*అబ్ తో హై హర్ ఖుషీ అప్నీ*
*సున్ సయిబా సున్*
*ప్యారుక ధున్..*
*మైనే తుజే సున్లియా*
*తూనే ముఝు సున్..*
*ఆమె గళం*
*మనం లక్షసార్లు విన్నాం*
*ఉండమ్మా ఇంకొన్నాళ్లని*
*మొరపెట్టుకున్నా*
*నా పాటలు వింటూ*
*నిదురపోరా తమ్ముడూ*
*ఆంటూ తానెళ్ళింది..*
*శాశ్వత నిద్రలోకి..*
*తన పాటను తానే వింటూ!*
*సత్యం శివం సుందరం..*
*షో మాన్ అభిరుచికి*
*ఆ సినిమాలోని కళాత్మకతకు*
*ప్రాణం పోస్తూ*
*లతమ్మ స్వరం..*
*హృదయాలలో*
*చీకట్లను పారద్రోలుతూ*
*ఆనంద జ్యోతులను*
*వెలిగించే భాస్వరం..!*
*లతాజీ..అరలక్ష పాటలు*
*నీతో అనలేదా..*
*హమ్ బనే తుమ్ బనే*
*ఎక్ ధూజే కే లియే అని..*
*మరెలా వెళ్లిపోయావమ్మా..*
*స్వర్గపురి నుంచి*
*వచ్చిందా సందేశం..*
*సెహర్ మే చర్చా హై అని..*
*లక్ష్మీకాంత్ ప్యారేలాల్* *జంటతో మ్యూజిక్ సిట్టింగా..*
*ఆనంద్ బక్షీ కూడా అక్కడేనా*
*రఫీ జీ,ముఖేష్ భయ్యా..*
*మా బాలూ*
*ఇప్పుడు నీ పక్కనేగా?*
*మరి మాకిచ్చిన మాట..*
*మైన్ తేరే ఇష్క్ మే..*
*మర్నా జావూన్ కహీన్ అని..*
*ఏ దిల్ తుమ్ బిన్ కహీన్..*
*నువ్వెళ్ళినా నీ పాటలతో*
*మేమున్నంత కాలం*
*తేరే బినా జిందగీసే కోయీ..!*
*అన్నట్టు మధురిమలొలికే*
*నీ స్వరపేటిక..*
*యాభై వేల పాటల పీఠిక..*
*ఎవరో ఇన్సూర్ చేసుకున్నారని..*
*నీ గళంలో ఏ మూలన*
*అమృతభాండం దాగుందో*
*ఆ గుట్టు విప్పుదామని..*
*చిన్నప్పుడు విన్నాం ఆ మాట*
*మాకు తెలుసు ఎప్పుడో*
*శివుని గళంలో* *గరళమెంతుందో..*
*నీ స్వరంలో*
*అంత సుర ఉందని...*
*అది ఎప్పటికీ ఈ భువిపై*
*నీ పాటల రూపంలో*
*అలా ప్రవహిస్తూనే ఉంటుందని..!!*
*అమరగాయని లతాజీకి*
*నివాళి అర్పిస్తూ..*
_*ఎలిశెట్టి సురేష్ కుమార్*_
*విజయనగరం*
*9948546286*
*7995666286*
No comments:
Post a Comment