Sunday, June 21, 2026

 🔔 *పర్యావరణం* 🔔

  *మనం మర్చిపోయిన లెక్క:*
              ➖➖➖✍️

*1. ఊపిరి లెక్క:*  ```
ఒక మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్ పీలుస్తాడు. దాన్ని 7 పెద్ద చెట్లు ఉత్పత్తి చేస్తాయి. 
నీ వయసు 40 అయితే 280 చెట్ల ఋణం ఉంది. ఎన్ని తీర్చావు?```

*2. నీళ్ల లెక్క*  ```
ఒక బియ్యం గింజ పండాలంటే 5 లీటర్ల నీళ్లు కావాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్ కుళ్లిపోవాలంటే 450 ఏళ్లు పడుతుంది. 
మనం తినేది ఎక్కువ, తిరిగి ఇచ్చేది తక్కువ. ఈ లెక్క తేడా వల్లే కరువు.
```

*3. మట్టి లెక్క*  ```
ఒక అంగుళం సారవంతమైన మట్టి తయారవ్వాలంటే ప్రకృతికి 500 ఏళ్లు పడుతుంది. 
మనం రసాయనం పోసి దాన్ని 5 నిమిషాల్లో చంపేస్తున్నాం. 
మట్టి చావు అంటే మన ఆహారానికి చావు.```


*4. శరీరం లెక్క*  ```
యోగా చేస్తూ విషపు గాలిని పీల్చడం ఎలా ఉంటుందో తెలుసా? చిల్లుపడ్డ బిందెలో నీళ్లు నింపినట్టు. 
ముందు గాలి శుభ్రం కావాలి. గాలి శుభ్రం కావాలంటే చెట్టు ఉండాలి.
```

*వదిలేయాల్సినవి 3:* 

1. *అవసరం లేని ప్లాస్టిక్:* ```కూరగాయలకు వేరు కవర్, పాలకు వేరు కవర్ వద్దు. ఒక గుడ్డ సంచీ చాలు.  ```

2. ⁠ *అవసరం లేని ప్రయాణం:*``` `
2 కి.మీ. లోపు అయితే నడవండి. కాలుష్యం తగ్గుతుంది, కాళ్లకు బలం.  ```

1. *అవసరం లేని ఆహారం:* ```ప్యాకెట్ ఫుడ్, మైదా, కూల్ డ్రింక్. ఇవి నీ శరీరానికి చెత్త, భూమికి చెత్త.```

*పట్టుకోవాల్సినవి 3:* 

1. *ఒక చెట్టు బాధ్యత:*```
ఇంటి దగ్గరో, బడి దగ్గరో ఒక చెట్టును దత్తత తీసుకో. అది చనిపోయే వరకు నీ బిడ్డే.  ```

1. *ఒక నీటి బొట్టు పొదుపు:* ```పంపు కింద బకెట్ పెట్టు. బ్రష్ చేసేటప్పుడు నీళ్లు కట్టేయ్. చిన్న పొదుపే, పెద్ద ఫలితం.  ```

2. ⁠ *ఒక మట్టి పని:* ```
వారానికి ఒక్కసారి కూరగాయల వ్యర్థాలు కంపోస్ట్ చేయి. చెత్త కాదు, అది మట్టికి బలం.```

*గుర్తుంచుకో:*  ```
పర్యావరణం అంటే దూరంగా ఉన్న అడవి కాదు. 
నువ్వు కూర్చున్న నేల. నువ్వు పీల్చే గాలి. నువ్వు తాగే నీళ్లు. 
వీటిని కాపాడుకుంటే చాలు, భవిష్యత్తు సురక్షితం.```

*పుట్టినరోజు  కొత్త నిర్వచనం:* ```
కేక్ కట్ చేయి, కానీ అదే రోజు నీ వయసు అన్ని మొక్కలు నాటు. 
40వ పుట్టినరోజా? 40 మొక్కలు. అదే నిజమైన వేడుక.

ఈ భూమి మనకు ఆస్తి కాదు. మన పిల్లల నమ్మకం. 
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.```
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻..

No comments:

Post a Comment