మీరు
ఇవాళ
మా ఇంట్లో సత్యన్నారాయణ వ్రతం లో
ఉన్న అనుభూతి చెందాలంటే కాసేపు ఇది చదవండి 🤓
" ఏరోయ్ గోపాలం నువ్వొక్కడివే వచ్చావ్?
మా అమ్మాయిని తీసుకు రాలేదే "
"దానికి సెలవు దొరకలేదు మావయ్య '
ఏడిసావ్ లే
వారం ముందు
wp లో పెట్టినా..
సరే కుశలమా?
నేను గుర్తున్నానా తాతయ్యా
వీరేశం గారి మూడో వాడ్ని కామెశాన్ని
ఓరి నువ్వా
ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉంటున్నావ్.
పులగుర్త లో ఉంటున్న. పౌరోహిత్యమే.
పగలు అకౌంట్స్ గట్రా రాస్తుంటా.
బావుందోయ్
ఓం గణానా..
అమ్మా ఎండు ఖరజూరాలు ఎక్కడ
ఓసెయ్ శ్యామలా
వంటింట్లో మందిరం పక్కన ఉంటాయి కాస్త అందుకో...
మీరు కాల్చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో ఉన్నారు కాసేపు వేచి ఉoడండి లేదా మళ్ళీ కాలచ్చేయండి.
వీడి బొంద ఎప్పుడు ఫోన్ చేసినా ఈ విస్సు గాడు బిజీ నే..
బాబాయ్ పిన్ని పిలుస్తోంది...
అయ్యా టిఫిన్లు వచ్చాయి రండి
ఏం అల్పాహారం
ఇడ్లీ వడ
హమ్మయ్య ఏ టమాటా బాత్ ఉప్మా నో అనుకున్నా
రారా సుబ్బు
రెండు వాయలు లాగిద్దాం
మావయ్య మీరు ఏకక్షారా?
ద్వి అక్షరా?
ఉదయం ఎప్పుడు నేను ద్వి అక్షరే..
వీళ్ళ భాష ఏంటిరా భాస్కరం?
ఏంలేదు మావయ్య ఏకాక్షరీ అంటే టీ.. ద్వి అక్షరి అంటే కాఫీ..
అయ్యా ఆచమనం చెయ్యండి గోవిందాయ స్వాహా
హాల్లో నేను సోమయ్య ని
ఎవరు మాట్లేది..
హాల్లో హాల్లో.. వినపడ్డం లేదు
ఆ లోనా
ఒక లక్ష కావాలి ఇస్తావేంటి
నీ యమ్మ
ఈ లోన్ ఫోన్లు ఒకటి
చంపె స్తున్నారు.. బావా
ఔను కానీ
జగన్ మళ్లీ వస్తాడoటావా?
విస్సు నీ పిల్లలు
ఏం చేస్తున్నారు
ఇడ్లీ కన్నా సాంబారే బావుంది రా కావుడూ..
ఓం ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దయన మహా.
హాల్లో నేను ఒక మూడు గంటల్లో ఫ్రీ అవుతా వ్రతo లో ఉన్నా గురూగారు...
హాల్లో ఎక్కడున్నారు పెద్దింటి వారి వీధి చివరకు రా
అక్కడ గోపాలం గారి ఇల్లు అని అడుగు
హాల్లో వినిపిస్తోందా..
ఆ అదే పెంకుటిల్లు వీధిలోకి వస్తే నువ్ గుర్తు..
ఎహె ఈ భాస్కరం గాడికి ఎప్పుడూ ఖంగారే చెప్పేది పూర్తి గా వినడు...
అమ్మా లేచి నుంచోండి
ఈ తంబులాలు పట్టుకోండి...
జానకత్తా వీధి గదిలో మంచినీళ్లు టిన్ వచ్చిందిట కాస్త లోపల పెట్టించు..
అమ్మా మీరు పూజ పై దృష్టి పెట్టాలి..
రా రా ఇంత ఆలీసెం గానా రావడం పొద్దున్నే బయలుదేరాం ఇదిగో బస్సు ఆటో పట్టుకు వచ్చే సరికి ఈ వేళ అయ్యింది వ్రత కధ ముఖ్యం కదా..
సరేటిఫిన్ కి దా...
పిన్నీ బాబాయ్ మందుల సంచి ఇమ్మంటున్నారు నాదగ్గర ఎక్కడుంది ఆయనే ఎక్కడ పెట్టుకున్నారో వెతుక్కో మను నేను వాయినాలు సద్దాలి..
కూటమి పాలన ఎలావుందిరా విస్సు..
బానే ఉంది బాబాయ్..
ఇతి ప్రథమో ధ్యాయ ప్రారంభం నైమిసారణ్యం లో..
వచ్చిన ఆడవారికి కాస్త బొట్టు పసుపు రాయవే పిన్నీ
సరళ వాసవిలను కాస్త ఆ ఫోన్ లు పక్కన పెట్టమనవే పొద్దున్నించి అవేలోకం వాళ్లకి
ఇతి రేవాకాండే సత్య దేవ కధ ద్వితీయ అధ్యాయ ఆరంభం ..
అత్త పీటల మీద పెట్టె బట్టల సంచి ఎక్కడ ఉందొ అడగ మంటోంది..
మావయ్యా
బజ్జీలు లోపల ఉడకలేదురా సోమయ్య
ఉంకో వేపు వేగాలి..
కాంట్రింగ్ వాళ్ళు ఎవూరు వాళ్ళో
మన రాయవరమే భీమయ్యే వీళ్ళకి వాడుక..
హాల్లో హాల్లో రాంగ్ నెంబర్
అయ్యా హారతి అందుకోండి.. మంగళం
కోసలేంద్రాయా
పిన్నీ బాబాయ్ క్యాటరింగ్ భోజనాల ఆటో వచ్చింది
ఒరేయ్ అన్నీ లెక్కచూసి పెరట్లో శ్యామియానా లో బల్లల పై సద్ధించండి
ఆ వస్తున్నా పిన్నీ.. ఓసెవు దొడ్డమ్మ
స్టవ్ పై ప్రసాదం మహా నివేదన కాస్త అత్తయ్య ని అడిగి పట్రావా...
అయ్యా పీటలపై నూతన వస్త్రాలు కట్నకానుకలు ముందు పెద్దవారు మీరు బామ్మ గారు నడవండి తాతయ్య గారు
నా చేయి పట్టుకోండి
అయ్యా ఎవరు ఎవరికీ వస్త్ర ద్వయం
చేగంటి సూర్య నారాయణ
చీగంటి కాదండి
చా
చాగంటి
సరే అయ్యా
తాత బామ్మ గార్లు మనవడు..
అమ్మ ఎదురు రాకండి ఓకే వైపు అందరు రావాలి ఆశీర్వదించి పట్టు పంచే పట్టు చీర అమ్మ మీరు ఎడమ వైపు..
ఒరే విస్సు భుజం పై ఈ కండువా వేసుకో..
టింగ్ ట్రింగ్ ట్రింగ్ హాల్లో గురు గారు చెప్పండి.. అంతే సాయంత్రం కలుస్తా ఆ సామానులు అరిటాకు లు తెస్తా..
భోజనాలు రెడీ బాబాయ్
అందరు కాళ్లు కడుక్కుని లేవండి
పిన్నీ నాకు నాలుగు ప్రసాదం ఉండలు పెట్టవా...
అమ్మా నాకు తాంబూలం ఇస్తే.. ఒరేయ్ ఆ డబ్బుల బాగ్ నా బీరువా లో ఉంది... పట్రారా
విసు
అన్నీ అరిటాకులు బాగా కడగండి.. టేబుల్ దగ్గర వడ్డన విస్సు భాస్కరం లలిత పిన్ని చాలు
పిల్లలు వాసు గోపీగాడులను మంచినీళ్లు నెయ్యి పట్టుకో మనండి
పిన్నీ...అత్తయ్య
పేరoటాలకి
పసుపులు
రాస్తునారా
జాకెట్ గుడ్డలు
మణి తెస్తోంది..
వంకాయ కూర అమోఘం
పప్పు లోకి నెయ్యి దట్టించు బాబాయ్ ఇప్పుడు అప్పట్లా లాగించ లేక పోతున్నా రా బి పి షుగరు కలిపి వచ్చాయి.
మావయ్యా కొంచెం కొత్తఆవకాయి వడ్డీస్తా...
ఒరేయ్ విసు
అటు ఎవరికో పులిహోరట...
పెరుగు క్యాన్ లు మూత రావట్లేదు మావయ్య..
అదే మరి మూత కూడా తీయడం రాదు చదివేది
బి టెక్ లు
బ్రేవ్... లేద్దామా.. ఆగండి చివర ఉన్న కాంతం పిన్ని ఇంకా ముక్కల పులుసు లోనే ఉంది తాతయ్య ఈ లోగా బూరికి వేలితో బెజ్జం చేయండి
ఒరేయ్ విస్సు ఆ నెయ్యి తాత గారి రెండు బూరేల్లో ధారగా పొయ్యి..
వంటకాలు ఎలా ఉన్నాయి
మన భీమన్న గాడు ఉప్పు కారాలు సరిగా వేసాడా
ఓర్నీ వచ్చావా ఎగగొట్టేస్తావేమో అని భయపడ్డా నిమ్మదిగా కూచోండి
బాబాయ్ అటు పెరట్లో గోలేం ఉంది అక్కడే చేతులు కడుక్కోండి మెల్లగా
కీల్లీ లు పెట్టారంటావా?
ఆ బిస్లారి సోడాలు కూడా పెడతారు నీకోసం
ఇప్పటికే వాడికి పదివేలు వదిలింది.
వచ్చి ఆశీర్వదించినoదుకు
చాలాలా సంతోషం మావయ్య రాకుండా ఎలా ఉంటామ్రా
నాదేం కాదు కానీ అవయసులో ఎండ కొండ చూడకుండా వచ్చిన జగన్నాదం తాతయ్య మంగ బామ్మ లు గ్రేట్..
కీల్లీ లో కవిరి తగ్గింది..
అంత
వెంటనే ఎండలో ఎందుకు వెళ్లడం తాతయ్య
కాశేపు పక్కింట్లో
మాగాపు వారి ఇల్లు అడిగా అందులో
a. c లో పడుకుని టీ తాగి వెల్దురు గాని...
ఇదండీ మా ఇంట్లో సత్య దేవ వ్రత ఊహా కధానిక మీరు కూడా చదివి మాకు చదివింపులు చదివించి ఆశీర్వదించి నందుకు
ధన్యవాదములు కృతజ్ఞతలు తో
మీ
శ👶కర్
🤝🤝💐🤝🙏🤝
No comments:
Post a Comment