[6/15, 20:39] +91 98852 16452: 🌾*🕉️కర్మని బట్టే పునర్జన్మ*
🟡🔴🔵🟢🙏🟢🔵🔴🟡
🌾 *జన్మలో అనుభవించిన ప్రారబ్ధ కర్మలు పోను,
మిగిలిన పూర్వ జన్మల్లోని సంచిత కర్మలని, ఈ జన్మలో చేసిన ఆగామి కర్మలన్నింటినీ ఆఖరి శ్వాసతో ప్రతి జీవి తర్వాతి జన్మకి తీసుకువెళ్తుంది.
🌾వాసనలని గాలి ఎలా తీసుకువెళ్తుందో, అలా కర్మలన్నింటినీ శ్వాస తీసుకువెళ్తుంది. సూక్ష్మ శరీరం ఈ కర్మలతో ఏర్పడుతుంది.
🌾అదే జడ శరీరాన్ని ఆవరించుకుని ఉండేది."*
🌾*"అర్థా గృహే వివర్తంతే స్మశానే మిత్ర బాంధవా*
*సుకృతం దుష్కృతం చైవ గచ్ఛన్తమనుగచ్ఛతి*
🌾 *భావం:-*
🌾 *మరణించిన మనిషి సంపద తన ఇంట్లోనే ఉంటుంది.
బంధు మిత్రులు స్మశానం దాకే వస్తారు.
🌾వెంట వచ్చేవి మనిషి చేసుకునే దుష్కర్మలు, సుకర్మలు మాత్రమే.*
👌
🌾 *కర్మని బట్టే పునర్జన్మ*
🌾 *"కర్మ వల్లే జన్మ అనేది వస్తుంది.
🌾 ఓ జన్మలో ఓ జీవి చేసిన కొంత కర్మ తాలూకు ఫలాన్ని ఆ జీవి ఆ జన్మలో అనుభవించగా ఇంకా కొంత మిగిలితే, ఆ శేష కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరో జన్మని తీసుకుంటాడు."*
🌾*"మళ్ళీ ఆ రెండో జన్మలో ఈ ఫలాన్ని అనుభవిస్తూ చేసే కొత్త కర్మని అనుభవించడానికి మళ్ళీ కొన్ని పునర్జన్మలని పొందుతాడు.
🌾ఇలా కర్మ, జన్మ, మళ్ళీ కర్మల చక్రంలో జీవులమైన మనమంతా ఎంతో కాలంగా చిక్కుకుని తిరుగుతున్నాం.
🌾ఈ కర్మ చక్రం గురించి
శ్రీ ఆది శంకరాచార్య భజగోవిందంలో
ఇలా చెప్పారు."*
🌾*''పునరపి జననం పునరపి మరణం*
🌾*పునరపి జననీ జఠరే శయనం"*
🌾 *భావం:-*
🌾 *"మళ్ళీ మళ్ళీ పుడతారు, మరణిస్తారు, తిరిగి తల్లి గర్భాన పడతారు".*
🌾 *"మనిషిలో మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే దాన్ని బట్టి తర్వాతి జన్మ లభిస్తుందని (గీత 14 -15) శ్రీకృష్ణుడు చెప్పాడు.
🌾 తమో గుణ ప్రధానులకి జంతు జన్మలు వస్తే, రజో గుణస్థులు మనుషులుగా పుడతారు.
🌾సత్వ గుణస్థులు ఆథ్యాత్మిక సంపద అధికంగా గల ఇళ్ళల్లో పుడతారు."*
🌾*"రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే*
🌾*తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే"*
🌾 *భావం:-*
🌾 *"రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే, అతడు కర్మంటే ఆసక్తి గల మనుషుల్లో పుడతాడు.
🌾అలాగే తమో గుణం అధికమైనప్పుడు మరణించిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతాడు".*
👆
🌾 *"సత్వగుణ సంపన్నులు వచ్చే జన్మలో ఎలా పుడతారు?"*
🌾*"యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్*
🌾*తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే"*
- *గీత 14-14*
🌾 *భావం:-*
***
🌾 *"సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే అతడు ఉత్తమ కర్మలని ఆచరించేవారు చేరే నిర్మలమైన స్వర్గం మొదలైన దివ్య లోకాలని చేరుతాడు."*
🌾*"యోగ భ్రష్టుడు స్వర్గం మొదలైన దివ్య లోకాలలో అనేక సంవత్సరాలు గడిపాక పవిత్రులు, ధనవంతులు ఐనవారి ఇంట్లో పుడతాడు.
🌾(8-41) ఒకోసారి పై లోకాలకి పోకుండానే అతను జ్ఞానులైన వారి కుటుంబంలో పుడతాడు."*
🌾*"ఐతే ఇది చాలా దుర్లభ జన్మ. (గీత 8-42) లేదా ఆథ్యాత్మికంగా వున్నత స్థితిలోని యోగి కుటుంబంలో పుట్టి తిరిగి తన సాధనని కొనసాగిస్తాడు. (గీత 8-43)"*
🌾 *"దీన్ని బట్టి మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే తిరిగి అదే గుణంతో, అదే గుణానికి చెందిన జీవిగా పుడతారని తెలుస్తోంది.
🌾 చేసిన కర్మలు కూడా మనిషి తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి."*
🌾*"సుకర్మలు అధికంగా ఉంటే మనిషి జన్మ, మరీ అధికంగా ఉంటే ఉత్తమ మానవ జన్మ,
దుష్కర్మలు అధికంగా ఉంటే జంతువు, పక్షి, లేదా కీటకం, వృక్షాలు లాంటి జన్మలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది.
🌾మన కర్మని బట్టే దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. (గీత 9-8)"*
🌾*"ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః*
🌾*భూత గ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్"*
🌾 *భావం:-*
🌾 *"తమ తమ స్వభావ వశంలో పరతంత్రమైయున్న భూత సముదాయాన్ని నా ప్రకృతి నాశ్రయించి మాటిమాటికీ వాటి కర్మానుసారం సృష్టిస్తున్నాను."*
🌾 *"శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కర్మ మరు జన్మకి ఎలా దారితీస్తుందో వస్తుంది.
🌾నిష్కారణంగా భార్యని హింసించిన భర్త బాల వితంతువుగా ఏడు సార్లు పుడతాడు."*
🌾*"ఓ పురుషుడు నలుగురైదుగురు స్త్రీలని వివాహం చేసుకుంటే,
తర్వాతి జన్మలో ఆ పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు.
🌾అతని మీద తమ కామ వాసనలు నశించని స్త్రీలు పురుషులుగా జన్మించి, ఆ స్త్రీని అనుభవిస్తారు.
🌾 ఒకే జన్మలో ఇది జరిగితే వ్యభిచార దోషం కలుగుతుంది."*
🌾 *"వేరు వేరు జన్మల్లో వివాహం చేసుకుంటే ఆ దోషం ఉండదు.
🌾 కర్మ ప్రభావాన్ని బట్టి ఇది జరుగుతుంది.
🌾భార్యాభర్తలని విడదీసిన పాతకులు స్త్రీ, పురుష జన్మ కాని నపుంసక జన్మని ఎత్తి, సంసార సుఖం అంటే ఏమిటో తెలీక మనస్థాపాన్ని అనుభవిస్తారు."*
🌾 *"తీరని తీవ్రమైన కోరిక కూడా తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది.
🟡🔴🔵🟢🙏🟢🔵🔴🟡
No comments:
Post a Comment