Thursday, September 10, 2026

గణేష్ ఆగమనం పేరుతో ఇదేం అరాచకం.?|Priya Chowdary Shocking Comments on Ramnagar Ganesh Aagman Incident

గణేష్ ఆగమనం పేరుతో ఇదేం అరాచకం.?|Priya Chowdary Shocking Comments on Ramnagar Ganesh Aagman Incident

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5s8Erz0o0Gk



Transcript:
(00:03) గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ తొండమునేకదంతము తోరపు బొజ్జయున్ వామ హస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కోరిన విద్యకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీ తనయ గణాధిప నీకునే మ్రొక్కెదన్ ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనసుతో చదవండి మై డియర్ ఫ్రెండ్స్ భగవంతుడి యొక్క ఆ శ్లోకము ఎంత అద్భుతమైనటువంటి వర్ణన దాన్ని ఎప్పుడైనా మనం మనసుతో చదివామా చదవలే అక్కడఉన్న అక్షరాలు చదివాం ఈరోజు గణేశు మండపాల్లో జరుగుతున్నటువంటి కొన్నిటి
(00:49) గురించి మాట్లాడడానికి గణేశ ఆగమనం పేరు మీద జరుగుతున్నటువంటి హంగులు ఆర్భాటాల గురించి మాట్లాడే ముందు అలాగే ఈ హంగులు ఆర్భాటాలు జరిపేటటువంటి వాళ్ళు గణేష్ మండపం పెట్టేటటువంటి వాళ్ళు నిర్వాహకులు ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి. స్మరిస్తే అప్పుడు ఆయన ఏంటో ఆయన విలువ ఏంటో ఆయన తేజస్సు ఏంటో ఓజస్సు ఏంటో అర్థంవుతుంది.
(01:16) అరే అసలు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ఒక్క ఒక్క ఆలోచన అయినా సరే ఎవరికైనా ఉందా గణేష్ యొక్క చవితి ఏదైతే ఉందో గణేష్ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో అది ఒక అద్భుతమైనటువంటి పర్పస్ కోసము ఒక మహానుభావుడు పెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమము ఈరోజు ఎలాంటి వాటికి వేదిక అయిందంటే హంగులు ఆర్బాటాలు సరే అంతవరకు చూసినా పర్వాలేదు బానే ఉంది కానీ దాన్ని మించిపోయి పోటీ తత్వం పెరిగిపోయి వాళ్ళ వాళ్ళకంటే మేము ఎక్కువ చేయాలి అనేటటువంటి దానితో పోయి చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకునేటటువంటి స్థితికి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నారంటే ఏమనుకోవాలి నిజంగా
(01:54) చెప్తున్నాను గణేశుడు సాక్షిగా నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఆయన మెచ్చుతాడా? అరే ఏం అసలు గణేశ ఆగమనం అనేటటువంటిది ఎక్కడ ఉందయ్యా ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ అసలు ఈ ఈ వ్యవహారా ఈ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ ఉంది గణేష్ ఆగమనం అనేటటువంటిది ఎక్కడ ఉంది? ఈ ఆచారం ఎక్కడ ఉంది? అరే సైలెంట్ గా నేను హైదరాబాద్ వచ్చి 32 సంవత్సరాలు అయింది.
(02:17) ఈ 32 సంవత్సరాల్లో గత మూడు సంవత్సరాల నుంచే ఇది మరీ విపరీతం అయిపోయింది అన్నమాట. గణేష్ ఆగమనం అని మళ్ళీ డీజేలు పెట్టి గణేషుని తీసుకురావడమో ఆ తర్వాత విపరీతంగా దాని ముందు మళ్ళీ అందరూ డాన్సులు గోల్లు ఈల్లో కేకలు అరే ఆనందం పెట్టుకోండి కాదని అనడం లేదు. కానీ గణేశ ఆగమనం అనేటటువంటిది మనం చేసేటటువంటి గణేశోత్సవాల్లో ఎంతవరకు అది ఆ దాంట్లో భాగమా? చెప్పండి.
(02:41) ఆ ఆనవాయితి ఎక్కడఉంది అసలు లేనిపోని ఆనవాయితీలని ఆర్భాటాల కోసం ఎవరి వ్యక్తిగత ఇమేజ్ల కోసము అక్కడ ఉన్నటువంటి లోకల్గా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గొప్పలు చూపించుకోవడం కోసం భగవంతుడు మీ దగ్గర ఉన్నాడా భగవంతుడు పట్టుకొస్తున్నారా మీరు భగవంతుడు అందుకోసం ఉపయోగిస్తున్నారు నిన్న గాక మొన్న నిన్న జరిగినటువంటి విషయం రామనగర్ ఇష్యూ తీసుకోండి ప్రతి ఒక్కళళ ఇన్ఫ్లయెన్సర్లు అరే గణేష్ ఆగమన కార్యక్రమం ఉంది రండి రండి రండి రండి అని ఇన్ఫ్లయెన్సర్లు మరి అందరికీ వీడియోలు చేసి మరి పెట్టారు విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది. ఆ క్రౌడ్ వచ్చింది బానే ఉంది
(03:15) చెప్పించే వాళ్ళు బానే ఉన్నారు చెప్పినవాళ్ళు బానే ఉన్నారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత 18 ఏళ్ల పిల్లవాడు ఆ తొక్కిసలాటలో చనిపోయాడు. తొక్కిసలాటలో చనిపోయాడు అరే అసలు అక్కడ అంత క్రౌడ్ ఎందుకు ఉందండి అంత క్రౌడ్ వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ కనీసం ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా అక్కడ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా ఆ నిర్వాహకుడికి కనీసము అరే ఎలా ఉందంటే అండి ఇవాళ రేపట్లో అందరికీ ఎట్లా అయిపోయింది అంటే వీళ్ళకి ఎవ్వరికీ కూడా చెప్పేటటువంటి వాళ్ళు లేరు.
(03:46) ఓకే చెప్పిన వినేటటువంటి మనస్తత్వం కూడా లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మీరు నాయకులు అవ్వాలనుకుంటే అవ్వండి కానీ ఆ నాయకులు అవ్వడం కోసం మాత్రం దేవుని మాత్రం ఉపయోగించకండి మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను డీజేలు పెడుతున్నారు విపరీతమైన సౌండ్లతోటి పెడుతున్నారు ఆనందం కోసం పెడుతున్నారు దేవుడు ఉంటాడా పారిపోతాడు పారిపోతాడండి ఆ సౌండ్లతోటి ఆ గోలలతోటి ఆ కేకలతోటి అరే ఎక్కడైనా సరే గణేశ ఆగమనం అనేటటువంటిది ఆగమన్ అనేటటువంటిది ఎక్కడ ఉందయ్యా చెప్పండి అసలు ఆ ఆచారం ఎక్కడ ఉంది ఎవరో ఒకళ్ళు చేశారు అని చెప్పి ఎక్కడో ఏదో జరిగిందిఅని చెప్పి
(04:18) దాన్ని మనం కూడా చేద్దాం అని చెప్పేసిని తీసుకొచ్చారు అసలు మీకు గణేషుని మూర్తిని తీసుకొచ్చేటప్పుడు గణేష్ కాదు ఏ దేవతా మూర్తినైనా సరే మనము పూజ చేసేటప్పుడు పూజ స్థానానికి తీసుకొచ్చేటప్పుడు అసలు ఆ దేవతకి మొత్తం అంతా కూడా కళ్ళకి కట్టేస్తారు మొత్తం మూర్తిని చూపించరు మొఖం కవర్ చేసి తీసుకొని వస్తారు ఎందుకంటే ఆ కండ్లు ఆ తీసుకొచ్చిన తర్వాత పండగ రోజు మాత్రమే దానికి సంబంధించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమం చేసిన తర్వాత మాత్రమే ఆ ముఖాన్ని జనాలకి చూపించడం అనేటటువంటిది జరుగుతది.
(04:49) మొట్టమొదటిసారిగా అద్దంలో చూపిస్తారు తర్వాత మనుషులకు చూపిస్తారు ఇదఎక్కడ పోయే కాలం అండి మీకు అర్థం కాక అడుగుతాను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను అసలు ఆ ఆగమనం పేరుతోటి గణేష్ని ఎలా పట్టుకొస్తున్నారు మీరు గణేష్ ముఖం కవర్ చేస్తున్నారా అసలు గణేషుని పూజ చేస్తున్నారు ఏ పూజ ఉండదు పాడు ఉండదు ఏమ ఉండదు ఆ గణేషుని పెట్టుకుంటున్నారు మీ ఆనందం కోసం మీ దీని కోసం పట్టుకొని వస్తున్నారు దాన్ని ఒక లేనిపోనటువంటి హంగులు ఆర్బాటాలకి గురి చేసి ఇవాళ ఏమైంది ముక్కు బచ్చలారని పిల్లాడు 18 సంవత్సరాల పిల్లాడు చనిపోయాడు ఆ కుటుంబానికి ఎంత నష్టమో ఎవరికైనా ఎవరైనా ఆలోచించారా ఎవరైనా
(05:21) ఆలోచించారా ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజున కూడా ఇదే కదా జరిగింది పిచ్చి జనాలు పిచ్చి సెల్ ఫోన్లు వేసుకొని నిన్న చూసాను నేను ఆ గణేష్ ఆగమనంలో ఎవ్వరికీ భక్తి లేదు నేను నిజంగా చెప్తున్నా ఎవ్వరికీ భక్తి లేదు మొత్తం అందరూ సెల్ ఫోన్లు పైకి పెట్టుకొని దేవుని సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు తప్ప భగవంతుడు వస్తున్నాడన్న ఒక సంకీర్తన గాని ఒక జయ జయ ధ్వానాలు గాని ఒక భక్తి గాని ఒక భజన గాని లేదు ఆ డీజే సౌండ్లు ఆ డీజే సౌండ్లు లో ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేస్తున్నారు తప్పితే అక్కడ భగవంతుడి మీద ఎవరికి విశ్వాసం ఉంది ఎవరికి ప్రేమ ఉంది
(05:54) ఎవరికి గౌరవం ఉంది ఎవరికి భక్తి ఉంది ఇవాళ ఎవరు బాధ్యుడు ఎవడు బాధ్యుడు ఆ నిర్వాహకుడు ఆ సిద్ధికి ఎంత బాధ్యుడో ఆ సిద్ధిక్ ఆ వినాయకుడిని ఆ రామనగర్ వినాయకుడు ఆగమనానికి ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫ్లయెన్సర్ బాధ్యుడే నేను నిజం చెప్తున్నాను కదా రేవంత రెడ్డి గారికి చెప్తున్నాను దయచేసి ఈ ప్రోగ్రాం కి ఎవరెవరైతే ఇన్ఫ్లయెన్సర్లు అందరూ డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశారు ఎవ్వడు కూడా ఇవాళ రేపట్లో ఇన్ఫ్లయన్సర్లు చివరికి దేవుణని కూడా ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు అనిఅంటే మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కాదు అరే ఇంత నీచమైనటువంటి
(06:24) సిచువేషన్స్ అండి మీరు ఎవ్వడికి వాడు అద్భుతంగా డైలాగులు కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి ఇన్ఫ్లయన్స్ మీకు మీ ఫాలోవర్స్ అందరికీ పిలుపుని ఇచ్చేసారు అక్కడికి అందరూ వచ్చారు ఎవడరా బాధ్యులు ఇప్పుడు భగవంతుడు ముందు కూర్చొని మాట్లాడకూడదు కానీ బాధ అనిపిస్తుంది దేవుడి పేరు చెప్పుకొని మీరు వ్యాపారాలు చేస్తారా దేవుడి పేరు చెప్పుకొని రీల్స్ చేసుకుంటారా అరే లేనిపోని ఆచారాలు తీసు వచ్చి ఇక్కడ భగవంతుడి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పక్కదో పట్టిస్తారా మీ వ్యక్తిగతమైనటువంటి ఆ ఆర్బాటాల కోసం హంగుల కోసం దేవుని వాడుకుంటారా నేను మళ్ళీ అందరికీ కూడా నేను
(06:59) చెప్తున్నాను హిందూ బంధువుల అందరికీ చెప్తున్నాను నేను అసలు గణేశ ఆగమన అనేటటువంటి కార్యక్రమం లేదు లేదు లేదు ఎక్కడఉందో చూపించండి ఎక్కడఉందో చూపించండి మళ్ళీ ఎవడైనా రీలు పెడతాడు బొంబాయిలో ఉంది కలకత్తాలో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి అని అది ఎవ్వడికి వాడు ఆర్భాట కోసం పెట్టుకున్నాడు తప్ప ఇది ఆచారం కాదు కచ్చితంగా కాదు అరే దాన్ని తీసుకొచ్చామా చక్కగా స్వామిని తీసుకొచ్చి పెట్టినామా ఆ మూర్తిని చూపించకూడదు పూజ అనేటటువంటి క్రతువు వరకు కూడా స్వామి యొక్క ముఖాన్ని కప్పే ఉంచుతారు మొత్తం అక్కడ శుద్ధి చేసిన తర్వాత పండుగ రోజున బ్రాహ్మణుడు వచ్చి
(07:36) పురోహితులు వచ్చి మంత్రాలు చదివి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే స్వామి యొక్క ముఖాన్ని జనాలకి చూపించడం అనేట భక్తులకు చూపించడం అనేటటువంటి జరుగుతుంది అరే ఆచారాలన్నిటిని తొగలోకి తొక్కి మీ ఇష్టం వచ్చినట్టు తాయితక్కలడానికి గంతులు వేయడానికి ఇవన్నీ వాడుతున్నారా మీరు ఒక్క ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సినిమా పాటలు ఐటం సాంగులు దీనికోసమా గణేష్ మండపాలు దీనికోసం చందాలు ఇచ్చే వాళ్ళకి నేను చెప్తున్నానండి అందరూ చేసుకోండి హ్యాపీగా చేసుకోండి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ కోసం అనట్లే ఎవరైతే డబ్బుల నేను చాలా వాటిలో చూసాను ఇదివరకు విపరీతంగా విరాళాలు
(08:12) ఇచ్చేదాన్ని నేను గత సంవత్సరం నుంచి విరాళాలు చూసిచూ చూసి ఇస్తున్నాను నేను జనాలకి ఎందుకంటే ఆ పైసలు తీసుకోబోతున్నారు అరే గణేష్ ఆగమనం పేరుతోటి తీసుకొచ్చేటప్పుడు తాగి తీసుకొని వస్తున్నారు అది అయిపోయిన తర్వాత గణేష్ నిమజనం అయిపోయిన తర్వాత నిమజ్జనం రోజున ఇదే క్రతువు డీజేలు పోనీ డీజేలు పెట్టుకోండి పెట్టుకోండి అది కూడా నేను చెప్తున్నా భక్తి పాటలు ఎక్కడఉన్నాయి చెప్పండి భక్తి పాటలు ఎక్కడఉన్నాయి అపార్ట్మెంట్లో కూడా నేను చూసాను నేను చూసాను కదా నేను ఆపాను కూడా ఆపితే వెదవలు ఎన్ని మాటలు మాట్లాడారో నన్ను అది పెట్టుకొని దేవుని వెనక పెట్టుకొని
(08:45) తొమ్మిది రోజులు పూజ చేసినటువంటి దేవుని వెనగపెట్టుకొని ఇక్కడ ఐటం సాంధులకి తైతక్కలాడుతున్నారు గృహిణలతో సహా హౌస్ వైఫ్లతో సహా మహిళలతో సహా బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక్కొక్కలకి ముందే చెప్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను హిందూ సంఘాల అందరికీ చెప్తున్నాను దయచేసి ఐక్యతగా ముక్తకంఠంతో దీన్ని ఖండించండి ఐటం సాంగ్స్ అలాగే ఈ ఆగమనం పేరిట అంగులు ఆర్బాటాలతోటి ఏదైతే జరుగుతున్నాయో ఇలాంటివన్నీ దుశ్చర్యలు జరుగుతున్నాయో వాటిని ఖండించండి దయచేసి ఖండించండి నేను ఇంకా చెప్పాలి అంటే దయచేసి పెద్దలు పండితులు పీఠాధిపతులు ఎవరున్నారో దయచేసి ఈ గణేష్
(09:20) మహోత్సవం ఏమిటి గణేశుడు యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చే పద్ధతులు ఏంటి అవి ప్రతిష్టించేటటువంటి పద్ధతులు ఏంటి ఆ తొమ్మిది రోజులు పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్లాల్సింది ఏంటి ఇవన్నీ దయచేసి చెప్పండి చెప్పండి వీటన్నిటిని ఎలా ఉందంటే ఏ మొన్న చూసానండి లాస్ట్ ఇయర్ చూసాను నిజంగా కళ్ళలో నీళ్లు వచ్చినాయి నాకైతే అసెంబ్లీ ముందు నుంచి పోతుంటే అసెంబ్లీ ముందు నుంచి పోతుంటే ఓడిపోయిన పార్టీకి సంబంధించిన టువంటి పాటలు పెట్టి దేవుడు దేవుడు ఊరేగింపులో ఆడ మగ ఎంత దరిద్రమైన గంతులు వేస్తున్నారో స్వామిని తీసుకెళ్ళేటటువంటి ఆ ట్రాలీ పెద్ద ట్రాలీలో ఏ పార్టీకి సంబంధించినటువంటిది
(09:57) సెక్రటరీ వైపు నుంచి వెళ్తుందో అసెంబ్లీ వైపు నుంచి వెళ్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి డీజే పార్టీలు పెట్టినారు. కనీసం కొంచెం అన్న జ్ఞానం ఉన్న మీరు భక్తులు మీరు హిందువులు అంటే ఇక్కడ ఎవరు ఏం చేసినా పర్వాలేదు హిందువులనే మాట్లాడుతున్నారండి ఎస్ మనం హిందువులం కాబట్టే కాబట్టే మన దేవతల్ని మన దేవుళ్ళని మనం గౌరవించుకోవాలి మన ఆచారాల్ని క్రమ పద్ధతిలో నియమాలతో నిష్ఠలతోటి ఉండాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు అరే ఏ పండగ చూడండి అరే డిస్కో తెక్కకి నున్ను పండగలకి డిస్కో తెక్క ఐటం సాంగులకి నున్ను సంకీర్తనలకి అసలు తేడా తెలియకుండా పోతా ఉంది ఒకప్పుడు గణేష్
(10:35) మండపాల్లోకి వెళ్తే ఎంత చక్క పూజ చేసేవాళ్ళు ఎన్నో ప్రసాదాలు పెట్టేవాళ్ళు ఎంత అంత అక్కడ కూర్చొని భజనలు చేసేవాళ్ళు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉండేది మొత్తం పోయినయండి అప్పుడు అప్పటినుంచి కూడా ఉన్నాయి ఈకి కెమెరా డాన్సులు పెట్టడాలు రికార్డింగ్ డాన్సులు అవన్నీ పెట్టేవాళ్ళు పోలీసులు వచ్చి తన్ని లోపల వేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు వీళ్ళఎవ్వరు భక్తులు కాదు ఇవేమి పూజలు కాదు దయచేసి ఇప్పటికే హిందూ ధర్మాన్ని దుమ్మెత్తి పోస్తున్నటువంటి కుక్కలు నక్కలు బోళ్ళ అన్ని ఉన్నాయి వాళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకునియనా సరే వాళ్ళను దృష్టిలో పెట్టుకునియనా సరే ఒళ్ళు దగ్గర
(11:07) పెట్టుకోండి ప్రతి హిందువు కూడా దయచేసి దేవుని భగవంతుడండి నీకంటే ఎన్ని కోటాను కోట్ల కోటాను కోట్ల శక్తి కలిగినటువంటి ఆ శక్తిని గనుక హేళన చేశారో అంతకే అంత అనుభవిస్తారు మీరు లాస్ట్ టైం చూసాం ఒక సినిమా యాక్టర్ సినిమాలో తొక్కిసలాట జరిగితే తల్లి చనిపోయింది ఆ పిల్లవాడు జీవోత్సవం అయిపోయాడు కుటుంబం కుటుంబం నాశనం అయిపోయింది ఎవరి వల్ల అక్కడికి వచ్చిన క్రౌడ్ వల్ల ఎవరి వల్ల ఆ క్రౌడ్ ని మ్యనేజ్ చేయలేనటువంటి యాజమాన్యం వల్ల ఇవాళ నాలుగు డబ్బులు ఇచ్చేసి ఎవరి కాడు పక్కక వెళ్ళిపోయాడు కానీ బలయింది ఎవరండి ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి తల్లిని
(11:43) కోల్పోయినటువంటి ఆ బిడ్డ అలాగే చల్ల లేకుండా ఉన్నటువంటి బిడ్డను చూసుకుంటూ జీవితాంతం ఏడ్చేటటువంటి భర్త మిగిలారు దేనికి వెళ్తున్నారు చెప్పండి మీరు ఇంత క్రౌడ్ ఎందుకు అలవ చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు సరే క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సెల్ఫ్ డిసిప్లిన్ ఉందా అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రం ఎవడికీ లేదు సెల్ ఫోన్ లో రీల్ చేసుకుంటున్నాడు తప్పితే కనీసము మనస్ఫూర్తిగా భగవంతుని చూసి కాస్త నాలుగు సంకీర్తనలు నాలుగు మంత్రాలు లేదా ఏమీ రాలేదు భగవంతుడి నామ జపం చేయడానికి కూడా ఎవ్వరికీ ఇక్కడ మనసు లేదు ఈ కేవలం పూజ
(12:19) అన్నా క్రతువు అన్నా ఇంకొకడికి చూపించుకుంటానికి చేసేటటువంటివి మాత్రం ఎప్పటికైనా తిరిగి మీకే కొడితే భగవంతుడు చూడడని అనుకోకండి భగవంతుడికి ఏం తెలవదని అనుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ గణేష్ చందాలు వసూలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను చాలామంది ఏమేం చేస్తున్నారు అనేటటువంటిది మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది వాళ్ళ హిస్టరీ అంతా ఉంది.
(12:49) చందాలు వసూలు చేస్తున్నారు చందాలు వసూలు చేసిన తర్వాత వాటిల్ని తాగడానికి పెట్టుకుంటున్నారు అలాగే నిమజ్జనం రోజున తాగుతున్నారు అది అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులతో రిసార్ట్స్ కి వెళ్లి మరి ఎంజాయ్ చేస్తున్నారు. భగవంతుడు కోసము ఒకడి కష్టార్జితము మీకు ఇచ్చారు భగవంతుడు కోసం ఇచ్చారు వచ్చిన నలుగురికి భోజనం పెట్టమని ఇచ్చారు ప్రసాదం పెట్టమని చెప్పారు భగవంతుడికి కావలసినటువంటి పువ్వు పుష్పము ప్రసాదం చేయమని మీకు ఇస్తే ఆ డబ్బులతోటి మీరు తాగి తందనాలాడుతున్నారే ఆ డబ్బులతోటి తీసుకొని వెళ్లి రిసార్ట్సులో ఉంటున్నారే నేను అందరినీ మాట్లాడటం లేదు. నేను
(13:22) అందరినీ మాట్లాడడం లేదు భగవంతుని భగవంతుడిగా కొలిచేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈనాటికి కూడా ఇదిగో ఈ హిందుత్వం అనేటటువంటిది నిలబడింది ఇంతమంది వచ్చినా కూడా ఇన్ని ఎదుర్కుంటున్నా కూడా నిలబడుతున్నాం కానీ కొంతమంది ఉన్నారు బాధ్యత లేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అలాగే ఎందుకు పనికి రాని పనికిమాలిన వాళ్ళకి ఇది ఒక పని అయిపోయింది.
(13:43) వీళ్ళని మాత్రం అడ్డుకోవాల్సిందే నేను అన్ని హిందూ సంఘాలకి నేను చెప్తున్నాను ఎక్కడైతే ఈ విధమైనటువంటి ఇది నడుస్తుందో చందాలు వసూలు చేసి వాటిల్ని ప్రజల డబ్బు అది ప్రజల డబ్బు మీకేం హక్కు ఉంది మీరు విగ్రహం పెట్టినంత మాత్రాన జనం డబ్బుని తీసుకెళ్లి ఎంజాయ్ చేయమని ఉందా భగవంతుడి పేరుతోటి మీరు వసూలు చేసి మీరు ఏం చేస్తున్నారు బుద్ధి జ్ఞానం ఉందా మీకుేమన్నా నిజంగా లాస్ట్ ఇయర్ నేను చాలా మందిని చూసా చాలా మందిని చూశను అంతక ఇయర్ అంతకు ముందు సంవత్సరం చూసి కూడా లాస్ట్ ఇయర్ నేను అందరికీ హెచ్చరించి మరి డబ్బులు ఇచ్చాను అరేయ్ మీరు దీన్ని గనుక మిస్యూస్ చేశారంటే
(14:15) మాత్రం మళ్ళీ ఒక్క రూపాయి కూడా నేను ఇచ్చే ప్రసక్తి లేదు అన్నా కూడా మళ్ళీ జరిగింది వాళ్ళు మారట్లేదు మారట్లేదు దీని మీద హిందూ సంఘాలు మానిటరింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడి పేరుతో దోపిడీలు చేయకండి భగవంతుడి పేరుతో విందులు విలాసాలు కాదు జనం సొమ్ముతోటి ఎంజాయ్ చేసేటటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అలాగే ఈ నిమజ్జనం యాత్రలో ఈ డీజేలు ఐటం సాంగులు ఒకటి చెప్తున్నానండి డీజేలు పెట్టాలి లేకపోతే ఇంకొకటి నేను ఒక్కటి సింపుల్ గా అంటున్నాను మీరు డీజేలు పెడుతున్నారు ఒక అపార్ట్మెంట్లో విపరీతమైన సౌండ్ తోటి అక్కడ డాన్స్లు వేసేది ఎంతమంది ఉన్నారండి
(14:56) ండి ఎంతమంది ఉంటారు తిప్పి తిప్పి కొడితే 10 15 మంది ఉంటారు లేదా 20 మంది ఉంటారు లేదా 50 మంది ఉంటారు కానీ ఆ అపార్ట్మెంట్ లో ఇంకా 300 మందో 400 మందో ఉంటారు ఆ సౌండ్ ఏదైతే ఉందో ఆ శబ్దము పెద్దవాళ్ళు ఉంటారు హార్ట్ ఎటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు బీపి పేషెంట్స్ ఉంటారు అలాగే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎంత ప్రమాదమో మీకు తెలుసా ఆ డీజే సౌండ్ల వల్ల ఎంతమంది ఎంత సైకలాజికల్ ఎఫెక్ట్ కి గురవుతారో తెలుసా హార్ట్ ఎటాక్ ఉన్నటువంటి పర్సన్స్ హెల్త్ హార్ట్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ప్రమాదమో తెలుసా ఏవండీ బాధ్యత లేకుండా
(15:32) ప్రవర్తించేటటువంటి మిమ్మల్ని భగవంతుడు శిక్షిస్తాడు కాదు ఇకనుంచి నేను చెప్తున్నాను హిందూ సంఘాలు వీటి మీద దయచేసి ముందు నుంచి అందరికీ హెచ్చరికలు జారీ చేయండి ఇవాళ ప్రతి ఒక్కళళ సోషల్ మీడియాతో ప్రమోషన్లు చేస్తున్నారు. నేను చెప్తున్నాను ఈ ప్రమోషన్లు చేయండి. డీజేలు పెట్టే ముందు ఆలోచించండి అలాగే ఈ విధమైనటువంటి క్రౌడ్ కి వెళ్తున్నప్పుడు కూడా ఎవరి బిడ్డల్ని పంపించేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఇక్కడ ఎవరు కూడా మనము బాగానే డిసిప్లిన్ గా ఉంటాము మనం జాగ్రత్తగా ఉంటామ అని ఒక్కసారి మా వచ్చి మీద పడిపోతే ఏమి చేయడానికి అక్కడ
(16:07) ఏమి ఉండదు సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే నిర్వాహకులకు చెప్తున్నా మీరు ఎంతమందిని తీసుకెళ్తున్నారో మీ గణేష్ తో పాటు లేదా గణేష్ ని తీసుకురావడానికి ఎంతమంది వెళ్తున్నారో అందరిని క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకి చేర్చేటటువంటి బాధ్యత తీసుకుంటేనే జనాలకు పిలుపునివ్వండి జనాలని తీసుకెళ్ళండి లేకుండా చేతులు దులుపుకున్నారో చట్టం పరిధి నుంచి మాత్రం తప్పించుకోలేరు.
(16:31) ఒకవేళ మీరు ఇన్ఫ్లయెన్స్లు యూస్ చేసుకుంటామంటే కూడా మాలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అల్లు అర్జున్ అంతటాడే వెళ్ళాడు లోపలికి ఆఫ్టర్ ఆల్ మీరెంత ఈసారి మాత్రం అందరం మానిటరింగ్ పెడతాం. మీడియా మానిటరింగ్ పెడుతుంది రైట్ వింగర్స్ మానిటరింగ్ పెడతారు హిందూ సంఘాలు మానిటరింగ్ పెడతారు దయచేసి మీలా ఇంకా ఇకముందులాగా విచ్చలవిడితనాలు ఇలాంటి హంగులు ఆర్బాటాలు చేసి జనాలకి నష్టం కలిగించేటటువంటిది పూజలు వ్రతాలు దేవుని గనుక మీ సెల్ఫ్ ప్రమోషన్లకు వాడుకుంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు.
(17:04) ఐటం సాంగ్లు ఎక్కడ ఐటం సాంగ్లు వినబడితే నేను బజరంగ్ దల్ని రిక్వెస్ట్ చేస్తున్నా విహెచ్పి ని రిక్వెస్ట్ చేస్తున్నా హిందూ సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ మీ చెవికి ఈ సందర్భాల్లో అలాగే మండపాల్లో గాని అపార్ట్మెంట్లో గాని ఐటం సాంగులు దేవుడి ముందు వినబడితే మాత్రం మనం నిరసన తెలపాల్సిందే కచ్చితంగా నిరసన తెలపాల్సిందే వీటిని అడ్డుకోకపోతే ఎవ్వడు అడ్డుకోవడం లేదు కదా అని చివరికి దేవుడి ముందు కూడా దిక్కుమాలిన పాటలు పెట్టి దేవుని అపహాస్యం చేస్తుంటే కూడా ఏమి చేయలేని చేతగాని తనంతో నోరు మూసుకున్నాం మనం ఈ గణేష్ నిమర్జనానికి మాత్రం దయచేసి
(17:39) పూజలు చేయడం మానేసేయండి హిందూ సంఘాలు అన్నది అందరికీ చెప్తున్నాను బజరంగదల్ మొత్తానికి చెప్తున్నాను విహెచ్పి కి చెప్తున్నాను మనం పూజలు చేసే కంటే కూడా పహారా కాయడం అనేటటువంటిది బాధ్యత పెద్ద బాధ్యత మన మీద ఉంది దయచేసి పట్టించుకోండి భారత్మాతాకి జై రైట్

No comments:

Post a Comment