Sunday, October 25, 2026

వేమన పద్యాలలో దాగి ఉన్న రహస్యం: అక్రమ సంబంధాలు మరియు హింస గురించి ఇంత లోతైన విశ్లేషణ ఎక్కడా చూడలేరు

వేమన పద్యాలలో దాగి ఉన్న రహస్యం: అక్రమ సంబంధాలు మరియు హింస గురించి ఇంత లోతైన విశ్లేషణ ఎక్కడా చూడలేరు

Author Name:The nagraj show

Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VHKYvnHecBc





Title: వేమన పద్యాలలో దాగి ఉన్న రహస్యం: అక్రమ సంబంధాలు మరియు హింస గురించి ఇంత లోతైన విశ్లేషణ ఎక్కడా చూడలేరు

Author Name: The nagraj show

Description: వేమన పద్యాలలో దాగి ఉన్న రహస్యం: అక్రమ సంబంధాలు మరియు హింస గురించి ఇంత లోతైన విశ్లేషణ ఎక్కడా చూడలేరు

ఈ వీడియో వేమన యొక్క శక్తివంతమైన పద్యాల ద్వారా అక్రమ సంబంధాల ఇతివృత్తాన్ని మరియు వాటి పర్యవసానాలను అన్వేషిస్తుంది.
అటువంటి చర్యల యొక్క నైతిక మరియు సామాజిక చిక్కులను లోతుగా పరిశీలిస్తుంది, ధర్మం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ వీడియోలో వేమన మాటలకు ప్రాణం పోసే ఆకర్షణీయమైన కథనం ఉంది.

@thenagrajshow
please watch:
   • వేమన పద్యాలలో దాగి ఉన్న రహస్యం: అక్రమ సంబం...  
   • తల్లిదండ్రుల గురించి వేమన గారు చెప్పిన సత్...  
   • వేశ్యలను గురించి పచ్చి నిజాలు చెప్పిన వేమన...  
   • తల్లిని గురించి వేమనపద్యాలు ఇంతవిపులంగా ఎవ...  
   • బూతు మాటలతో రాసిన వేమన తత్త్వపద్యాలు||ఇంత ...  
   • మీరంతా పొలంలో దిష్టిబొమ్మలు ||విపులంగా వేమ...  
   • ఇంత విపులంగా వేమన పద్యాలు ఇంతవరకు ఎవరు చెప...  
   • విభూదిపూస్తే శివభక్తుడా|ఇంత విపులంగా వేమన ...  
   • ఆంధ్ర - తెలంగాణ యాసల్లో ఏది గొప్పది |వేమనప...  
   • స్త్రీ పెదవుల మీద ఆశలేని వారిని వేమనగారు ఏ...  
   • గయ్యాళి, దొంగసన్యాసి, నీటి కొంగ, ఇంత విపుల...  
   • గుళ్లో రాయికి రంగువస్త్రాలెందుకు వేమనపద్యా...  
   • పాండవులను గురించి వేమనపద్యాలు ఇంత విపులంగా...  
   • ఆ వేమన పద్యంలో ఇంత విస్తృతమైన భావం ఉందంటే ...  
   • భార్యను గురించి నిజాలు బయట పెట్టిన వేమనపద్...  
   • వేమనగారి అప్పు పద్యాలు ఇంతవిపులంగా ఎవరూ చె...  
   • చండాలునికి నిజమైన భక్తునికి సరైన అర్థం చెప...  
   • ఇంత వివాదాస్పద వేమనపద్యాలు చదవాలంటేనే భయమే...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా ప్రవచన కారులు కూ...  
   • వేమన పద్యాలు డబ్బులకు పడకసుఖం అందించే స్త్...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన తత్వపద్య...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మ...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మ...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా గురువుల గురించిన...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మ...  
   • వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మ...  

#lifeadvice
#ethics #inspirationalquotes #motivation #inspirational #వేమనపద్యాలు #vemanapadyaluwithbhavam #vemanapadyalu
#vemanapadyaluwithmeaning
#వేమనపద్యాలు #వేశ్యలు #సమాజం #నీతి #ధర్మం #తెలుగుపద్యాలు #వేమనశతకం #vemanapadyalu #తెలుగుపద్యాలు
controversial poetries, cultural analysis, cultural critiques, cultural reflections, literary analysis, literary insights, social commentary, social issues, telugu activism, telugu literature, traditional perspectives, traditional values, vemana insights, vemana literature, vemana padyalu, vemana poetry, vemana quotes, vemana satakam, vemana satakam in telugu, అక్రమ సంబంధాలు, క్రూర చర్యలు, తెలుగు సాహిత్యం, వివాదాస్పద పద్యాలు, సామాజిక వ్యాఖ్యానం

Transcript:
(00:00) [సంగీతం] నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేమల పద్యాలు వినబోయే ముందు ఈనాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి ఒక వార్తను యధాతదంగా మీకు చదివి వినిపిస్తాను ముందు ఆ వార్త విందాం తర్వాత పద్యాల్లోకి వెళ్ళిపోదాం. ఆ పద్యాలు ఈ వార్తకి సంబంధం ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కర్కసంగా వ్యవహరించింది.
(00:39) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ముగ్గురు పిల్లల ఆయువు తీసింది. మార్చి 27న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం ఆమెను ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం బీరంగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఔరి చింతల చెన్నయ్యతో రజిత అలియాస్ లావణ్యకు 2013 లో వివాహమైంది.
(01:23) ఆమెకంటే అతని వయసు 20 ఏళ్ళు ఎక్కువ వీరికి ముగ్గురు పిల్లలు చెన్నయ్య నీటి ట్యాంకర్ డ్రైవర్ ఆరు నెలల క్రితం గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆమెకు తన 10వ తరగతి క్లాస్మేట్ నల్గొండ జిల్లా గోడుకొండకు చెందిన శివకుమార్ తో చనువు ఏర్పడింది. క్రమంగా అది వివాహేతర సంబంధంకు దారి తీసింది. ఫోన్లో మాట్లాడడమే కాకుండా వీడియో కాల్స్ చేసుకునేవారు ఆమెకు వివాహమైనప్పటి నుంచి భర్త అంటే ఇష్టం లేదు. తరచు వారి మధ్య గొడవలు జరిగేవి.
(02:01) అవివాహితుడైన శివకుమారును తనను పెళ్లి చేసుకోవాలని రజిత కోరింది. పిల్లలను వదిలేసి వస్తే తనకు సమ్మతమేనని అతను బదిలిచ్చాడు. ఈ నేపథ్యంలో పిల్లలను చంపేస్తానంటూ రజిత మార్చి 27వ తేదీ సాయంత్రం శివకుమార్కు సమాచారం ఇచ్చింది. అదే రోజు రాత్రి భర్త ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ప్రియుడి సూచనలతో తొలుత పెద్ద కుమారుడు తర్వాత కుమార్తె చిన్న కుమారుడు వీరి గొంతు నులిమి టవల్ బిగించి ముక్కు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసింది.
(02:42) భర్త పనులు ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. తాను పెరుగన్నం తిన్నానని కడుపునొప్పి వస్తుందని అతనితో నమ్మబలికింది. కేకలు వేసింది. వెంటనే భర్త ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత ఇంటిలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి గమనించాడు. ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
(03:10) ఘటనాస్థలికి వెళ్ళిన పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపెట్టారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాజిత శివకుమారులను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితులుఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం. అసహ్యం పుట్టించే ఈ వార్తా కథనంలో స్త్రీ కన్నా 20 ఏళడ్లు పెద్దవాడైన భర్త కర్కశ హృదయం కలిగిన భార్య ఆవిడ మోజులో పడిన ప్రియుడు చివరికి ప్రియుడు ప్రియురాలి పరిస్థితి ఏం జరిగింది ఈ లక్షణాలన్నీ తెలిపే పద్యాలు వేమన గారి పద్యాల్లో ఉన్నాయి. వేమన గారు
(03:57) జీవితాలను ఎంత నిశితంగా పరిశీలించి ఈ పద్యాలు రాశారో నిజ జీవితంలో కొంతమంది మనుషులు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక వేమన గారి పద్యాల్లోకి వెళ్ళిపోదాం. ఆ పద్యాలు ఈ సంఘటనకు ఎలా సరిపోతాయో చూద్దాం. ఆలు మొగని మాట కడ్డంబు వచ్చెనా ఆలుగాదది మరగాలు కానీ యట్టియాలు విడచి ఎడవి నుండుట మేలు విశ్వదాభిరామ వినురవేమా ఆలు మగని మాట గడ్డంబు వచ్చెనా యాలుగాదది మరగాలు కానీ ఎట్టియాలు విడచి ఎడవినుండుట మేలు విశ్వదాభిరామ
(04:43) వినురవేమా ఆలు అంటే భార్య మరగాలు అంటే మరణము అని ఆలు మగని మాటకు అడ్డం వస్తే అది ఆలి కాదు అంటే భార్య కాదు మరగాలు అంటే మరణంతో సమానం ఎప్పుడైతే భార్య మగనికి అడ్డం చెప్తుందో మగన్నని వ్యతిరేకిస్తుందో అప్పుడు అది భార్య కాదు మరణమే అటువంటి భార్యని విడిచి అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకోవడం మేలు అంటాడు వేమన గారు మగని మాటకు ఎప్పుడైతే ఆడది అడ్డం చెబుతుందో మగన్నని తిరస్కరించి వ్యతిరేకిస్తుందో అలాంటి ఆలు భార్య కాదు ఆవిడ మరణంతో సమానం అటువంటి దాన్ని వదిలేసి
(05:29) అడవిలోకి వెళ్లి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమంటాడు. తనకన్నా 20 ఏళ్ళ పెద్దవాడైనటువంటి భర్తను వ్యతిరేకించి ఆయన్ని ద్వేషించి అతనితో కలిగినటువంటి సంతానాన్ని కూడా తీవ్రంగా ద్వేషించి ఎప్పుడో తనతో చదువుకున్న వాడి ప్రేమలో మోజులో పడిపోయింది. ఇలాంటి దాన్ని వదిలేసి అడవిలోకి పోయి తపస్సు చేసుకోవడమే మేలు కదా పతికి మారు పల్లుకు పడతియే శునకంబు మీరు సతికి గవయ మిగులు వగలు పంది పంది కూడి పడదో కొరంపిలో విశ్వదాభిరామ వినురవేమా పతికి మారు పలుకు పడతియేసునకంబు మీరుసతికి గవయ
(06:16) మిగులువగలు పంది పందికూడి పడదోకొరంపిలో విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ పడతి అంటే స్త్రీ మీరు అంటే అతిక్రమించడం సతి అంటే భార్య గవయ అంటే అంటే కోల్పోవడం మిగులు వగలు అంటే అధిక దుఃఖము పతి అంటే ఎవరు ఇక్కడ భర్త పతికి మారుపలుకు పడతియే శునకంబు భర్తకు మారుపలికి వ్యతిరేకించి మాట్లాడేటటువంటి భార్య కుక్కతో సమానం.
(06:53) మీరు సతిని గవయ మిగులు వగలు అలాంటి భార్యతో సంసారం చేయడం అధికంగా దుఃఖము మనకు మిగులుస్తుంది. అలాంటి భార్యతో సంసారం చేస్తే వాడికి దుఃఖమే మిగులుతుంది. మిగులు వగలు అధిక దుఃఖం మిగులుతుంది. వీరిద్దరి సంసారం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ పోట్లాటలతో నిండి ఉంటుంది. ఈ సంసారం ఎలా ఉంటుందంటే పంది పంది కూడి పడదోకో రొంపిలో రొంపి అంటే ఏంటి బురదగుంట మురికి కూపంలోనే పడతాయి కదా భార్యా భర్తలు ఇద్దరి వయసు వ్యత్యాసం వల్ల భార్యకు భర్త నచ్చకపోవడం వల్ల వారింట్లో గొడవల వల్ల ఈవిడ వేరొకరితో వ్యామోహం వల్ల ఈ సంసారము చెడిపోయి పిల్లలు చనిపోయారు.
(07:40) ఆవిడ ప్రియుడు మోజులో పడి పిల్లల్ని సంహరించింది. ప్రియుడు ప్రియురాలు ఇద్దరు జైలుకు వెళ్ళారు ఈ భర్తకు పడరాని శోకమే మిగిలింది. అంటే వీరందరూ కలిసి రొంపిలో పడ్డట్టే కదా విడువవ వలయునూరు విశ్రాంతి గాకున్న విడువవ వలయునూరు విశ్రాంతి గాకున్న విడువవలయునాలి విధము తెలసి విడువవలయునాలి విధము తెలసి విడువవలయు రాజు వితరణిగాకున్న విశ్వదాభిరామ వినురవేమా విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న ఊరును విడిచిపెట్టాలి అంటాడు ఎందుకోసం విశ్రాంతి కాకున్నా విశ్రాంతి
(08:28) కాకున్నా అనే మాటకి ఇక్కడ అర్థం అసౌకర్యంగా ఉంటే అసౌకర్యంగా ఉంటే ఆ ఊరిని ఎట్టి పరిస్థితిలో వదిలేయాలి ఖచ్చితంగా విడిచిపెట్టాలి విడువవలయునాలి విధము తెలిసి భార్య విధానము భార్య తనను ఇష్టపడుతుందా లేదా భార్యకు తానంటే తన సంసారం అంటే ఇష్టం ఉందా లేదా ఇషట ఇష్టం ఉంటే ఉంచుకోవాలి లేదంటే వదిలేయాలి అలాంటి భార్యను ఇష్టం లేనటువంటి భార్యను వదిలేయాలి విడువవలయు రాజు వితరణిగాకున్న వితరణి కాకున్నా అనే మాటకు అర్థం దానగుణం వితరణ గుణం లేనటువంటి రాజును ఖచ్చితంగా వదిలేయాలి అంటాడు ఇక్కడ ముగ్గురిని వదిలేయాలి అంటాడు మూడు రకాల
(09:12) వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రాంతాల్ని వదిలేయాలి అంటాడు విమల గారి ఈ పద్యంలో ఎవరిని విశ్రాంతి లేనటువంటి అంటే అసౌకర్యంగా ఉన్నటువంటి ఊరిని భార్య మనకు అనుకూలంగా లేనటువంటి మనను ఇష్టపడనటువంటి భార్యని దానగుణం లేనటువంటి రాజుని వీరిని తప్పకుండా విడిచిపెట్టాలి అంటాడు వేమన గారు ఈ పద్యంలో ఈ కథనంలో భార్య తనను ఇష్టపడటం లేదు వయసు వ్యత్యాసం ఉంది అనే విధానాన్ని గమనించి అతను ముందే భార్యను వదిలించుకుంటే ఇంత అకృత్యము జరగకపోయేది ఆయన ముగ్గురు పిల్లలు బ్రతికేవారు ఈ జేలు పాలు కావడం అభాసు పాలు
(09:59) కావడం జరగకపోయేది. జానలన ఎట్టి చెపలాయ తాక్షుల జానలన ఎట్టి చెపలాయ తాక్షుల వలపులరసి చూచి భ్రమయనేల వలపులరసి చూచి భ్రమయనేల బయలి రూపులరసి పరికింపగానేల బయలి రూపులరసి పరికింపగానేల విశ్వదాభిరామ వినురవేమా జానలు అంటే స్త్రీలు చెపలాయతాక్షులు అంటే చేపవంటి కన్నులు ఉన్నవారు చేప కన్నులు ఉన్నటువంటి స్త్రీలు వలపులరసి చూచి బ్రమయనేల వారి యొక్క వలపుల్ని వయ్యారాల్ని సింగారాన్ని చూసి
(10:46) బ్రమసిపోవడం ఎలా బ్రమసిపోకండి బయలి రూపులరసి పరికింపగానేల బయటి ఆకారాన్ని అంగసౌస్తవాన్ని సౌందర్యాన్ని చూసి బ్రమసిపోకండి స్త్రీలందరూ ఒకే రకంగా ఉండరు అందంగా ఉన్నారు కదా అని వారు అనకుగా ఉంటారు మంచివారు అనుకోవడం తప్పు అలాంటి వారిని గుర్తించండి అని ఈ పద్యం ద్వారా మగజాతిని తట్టి లేపుతున్నాడు వేమనగారు ఇప్పుడు ఇక్కడ 20 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నటువంటి అమ్మాయిని అతను వివాహంఆడడం అతని మొదటి తప్పు ఆ అమ్మాయి రూపురేఖల్ని అంగసౌష్టవాన్ని చూసి మోహించి అతను ఆమెని పెళ్లాడడం మొదటి మొదటి తప్పు
(11:31) తర్వాత ఆమె అతన్ని ఇష్టపడక వేరొకడితో వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం మరొక తప్పు ఇదంతా ఒక కర్కసమైనటువంటి చర్యకు దారి తీయడం మరొక సంఘటన వెర్రివానికైన వేషదారికైనా వెర్రివానికైన వేషదారికైనా రోగికైన పరమ యోగికైన రోగికైన పరమ యోగికైన స్త్రీల చూచినప్పుడే చిత్తంబు రంజిల్లు స్త్రీల చూచినప్పుడే చిత్తంబురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ స్త్రీ కేంద్రబిందువు ఆవిడ వ్యామోహంలో పడ్డవారు ఇక్కడ ఇద్దరు 20 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న పెళ్లి చేసుకున్న అతను చిరనాటి మిత్రురాలు కదా
(12:15) అని ప్రేమించి ఆవిడ ఉచ్చులో పడిపోయి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినటువంటి ఆ చిన్ననాటి మిత్రుడు ఇంకొకడు ఇలా స్త్రీల మోజులో పడిపోతారు ఎలాంటివారు వెర్రివానికైనా వేషదారికైనా పిచ్చ పిచ్చోడికైనా వేసదారికైనా బాగున్నవాడికైనా రోగికైన పరమ యోగికైనా రోగగ్రస్తుడికైనా పరమయోగి పరమ పురుషుడికైనా వాడు ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడికైనా రోగికైనా వెర్రివాడికి పిచ్చివాడికైనా వేషదారికైనా స్త్రీల చూసినప్పుడే చిత్తంబు రంజిల్లు స్త్రీలను చూడగానే వారి చిత్తము రంజిల్లుతుందంట అంటే వికసిస్తుందట విరాజిల్లుతుందంట స్త్రీల వ్యామోహము
(12:57) అలాంటిది స్త్రీ పైన మోజు రోజు అలాంటిది వారి చిత్తాన్ని చెడగొడుతుంది. ఈ సంఘటనకు కారణం కూడా ఆ స్త్రీ వ్యామోహమే వెర్రి మొద్దుకేల వేదశాస్త్రంబులు వెర్రి మొద్దుకేల వేదశాస్త్రంబులు ముద్దులాడికేల ముసలి మగడు ముద్దులాడికేల ముసలి మొగడు చద్ది మిగులనింట సంసారమేలరా విశ్వదాభిరామ వినుడవేమా వెర్రిమొద్దుకేల వేదశాస్త్రంబులు తెలివి తక్కువ దద్దములకు వేదశాస్త్రాలను బోధిస్తే వాడి వంట పట్టవు దాన్ని అర్థం చేసుకోవడానికి వాడు నానా తంటాలు పడతాడు అసలు వాడి బుర్రకే వేదం అనేది ఎక్కదు
(13:42) కాబట్టి వెర్రిముద్కు చవటాయలకు దద్దమ్మలకు వేద శాస్త్రాలు పనికి రావు ముద్దులాడి కేల ముసలి మొగుడు యవ్వనంగా ఉంటారో ముద్దులాడి అయ్యై యవ్వన దశలో ఉంటారో వారికి ముసలి మగడు ఎలా ముసలి మొగనిచ్చి పెళ్లి చేస్తే ఎట్లా చద్ది మిగులరనింట సంసారమేలరా అంటే భోజనం మిగలనటువంటి ఇంటిలో సంసారం ఎలా చేస్తారు అంటే అది నిండైన సంసారంగా పరిగణింపబడుతుంది ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు భోజన సౌకర్యాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అలాంటి ఇల్లు ఉండడం ఎందుకు అలాంటి సంసారం ఎందుకు అంటాడు వేమన గారు వెర్రిముద్దుకేల వేదశాస్త్రాలు ముద్దులాడికే ల ముసలి మొగుడు
(14:28) చద్దిమిగలనింట సంసారం ఎట్లా ఈ మూడు భావనలను ఈ పద్యం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియపరుస్తారు వేమన గారు. ముద్దులాడికేల ముసలి మగుడు అనేటటువంటి పాదము మనము ముందర చెప్పుకున్నటువంటి సంఘటనకు సరిగ్గా సరిపోయింది. ఆ 20 సంవత్సరాల వయసు వ్యత్యాసం వల్ల ఆవిడ భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోయింది. నాకు ముసలి మొగని ఇచ్చి కట్టబెట్టారు అనేటటువంటి ధోరణిలో ఆవిడ తన చిన్ననాటి స్నేహితుడు ఎదురుకాగానే వాడి మాయలో పడిపోయి వాడితో శారీరక సంబంధాన్ని పెట్టుకొని వాడితో పెళ్లికి సిద్దపడి తన కన్న పిల్లలని సంహరించడానికి కూడా
(15:11) వెనకాడలేదు స్త్రీల పైన వ్యామోహం వల్ల కలిగేటటువంటి అనర్థాలు ఇవి ఇలాంటి అసహ్యం పుట్టించేటటువంటి కథనాలు చదివినప్పుడు వేమన గారు రాసినటువంటి ఇలాంటి అద్భుతమైన పద్యాలు నాకు మనసులో మెదులుతాయి. ఆ విషయాలన్నిటిని కూడా మీతో పంచుకోవాలనే ఉత్సాహంతో ఈ పద్యాలను ఆ కథనాన్ని మీ ముందు ఉంచాను. నేను వివరించినటువంటి ఈ వార్తా కథనానికి సరిపోరిన సరిగ్గా సరిపోలిన పద్యం ఏదో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
(15:47) ఇంకా మీరు ఎలాంటి పద్యాలు వినాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ పద్యాలు మీకు ఎలా అనిపించాయి? నిజంగా నేను ముందుగా చెప్పినటువంటి కథనానికి ఈ పద్యాలు సరిపోయేలా లేదా అనే మాటల్ని అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవ్ ధన్యోస్మి శుభం భుయాత్ నీద్రశోకి [సంగీతం] స్వాగతం దీఘ్నసోకి స్వాగతం

No comments:

Post a Comment