Sunday, October 4, 2026

🧘‍♂️ మనం నిజంగా Spiritualityని వెతుకుతున్నామా? | UG Krishnamurti ఆలోచనలు | Beyond అనే భ్రమ

🧘‍♂️ మనం నిజంగా Spiritualityని వెతుకుతున్నామా? | UG Krishnamurti ఆలోచనలు | Beyond అనే భ్రమ

Author Name:PSBV

Youtube Channel Url:https://www.youtube.com/@pavan_devotional

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ol2OhgNR29Y





Title: 🧘‍♂️ మనం నిజంగా Spiritualityని వెతుకుతున్నామా? | UG Krishnamurti ఆలోచనలు | Beyond అనే భ్రమ

Author Name: PSBV

Description: 🙏 This video is an independent Telugu commentary inspired by the thoughts of UG Krishnamurti. The narration in this is not an original recording or direct quote from UG. Some of the visuals used in the video are AI-generated/AI-assisted.
Tell us your thoughts in the comments. 🙏
#bhakthitv #DevotionalTV #BIGTVTeluguLive #Devotional #Spiritual
#UGKrishnamurti #UGKrishnamurtiTelugu #Spirituality #Enlightenment #Truth
#Beyond #SelfRealization #Philosophy #TeluguSpirituality #Meditation #LifeTruth #TeluguMotivation

Transcript:
(00:00) అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా లోతైనది. మనం నిజంగా స్పిరిచువాలిటీ కోసం వెతుకుతున్నామా? లేక మనకు నచ్చని ఈ జీవితాన్ని తప్పించుకోవడానికి స్పిరిచువాలిటీని ఒక కారణంగా ఉపయోగిస్తున్నామా? ఒక్కసారి నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నువ్వు నిజంగా సత్యాన్ని వెతుకుతున్నావా లేక నీ బోరింగ్ జీవితానికి బియాండ్ అనే ఒక కొత్త కలను సృష్టించుకున్నావా? ఈ ఆలోచనను యూజి కృష్ణమూర్తి దృష్టితో చూద్దాం.
(00:37) మనం అనుకుంటాం నేను స్పిరిచువల్ నేను సత్యాన్ని వెతుకుతున్నాను నేను దేవుడి కోసం తపిస్తున్నాను అని కానీ ఇదంతా నిజమా కేవలం షో నా ఆత్మ వంచన చేసుకుంటున్నామా? యూజీ నవ్వి అంటాడు అబద్ధం నువ్వు రోజువారి జీవితం అంటే విసిగిపోయావు. ఉదయం లేవడం అవ్వడం అదే టిఫిన్ అదే ఆఫీస్ అదే మొహాలు అదే గొడవలు అదే బోర్ ఈ రొటీన్ లో నీకుఏమీ లేదు ఇది చాలదు అనిపిస్తోంది.
(01:07) ఇది పనికి రాదు అనిపిస్తోంది. ఈ ఎవ్రీడే ని ఇష్టపడలేక దీంతో ఉండలేక నువ్వు ఒక బియాండ్ ని కనిపెట్టావు. ఇక్కడ కాదు ఎక్కడో ఉంది. ఇప్పుడు కాదు టైంలెస్నెస్ లో ఉంది. ఈ జీవితం కాదు ఇంకో జీవితంలో ఉంది. ఈ నేను కాదు ఎన్లైటన్మెంట్ అయ్యాక వచ్చే ఇంకో నేను ఉన్నాడు. దేవుడు సత్యం మోక్షం ఆత్మ నిర్వాణం ఇవన్నీ నీ బోరింగ్ జీవితం నుండి పారిపోవడానికి నువ్వు తయారు చేసుకున్న మత్తు మందులు ఇంకో సినిమా నీకు అసలు సమస్య ఎన్లైటన్మెంట్ రాలేదు అని కాదు ఎదురుగా ఉన్న కప్పులో టీ ని ఎదురుగా ఉన్న మనిషిని ఇప్పుడు వీస్తున్న గాలిని నువ్వు చూడలేకపోవటం
(01:53) ఎవ్రీడే లోనే అంతా ఉంది కానీ నీకు అది వద్దు నీకు స్పెషల్ కావాలి నీ జీవితం స్పెషల్ కాదు అని తెలిసిపోతే ఆ నిస్సహాయతను తట్టుకోలేవు. అందుకే నువ్వు బియాండ్ అని కనిపెట్టావు. వెతుకుతున్నాను అంటున్నావు. నువ్వు వెతికే ప్రతిదీ నువ్వు తయారు చేసిందే నువ్వు ఎన్లైటన్మెంట్ అనే ఒక మాట విన్నావు. ఎవరో అది చాలా ప్రశాంతంగా ఉంటుంది.
(02:21) అక్కడ బాధ ఉండదు అక్కడ నేను అనే అక్కడ నేను అనేది పోతుంది అని చెప్పారు. నీ మెదడు దాన్ని ఒక ఫోటోలా తయారు చేసింది. ఇప్పుడు ఆ ఫోటో కోసం నువ్వు పరిగెడుతున్నావు. దేవుడైనా [గొంతు సవరించుకోవడం] సత్యమైనా బియాండ్ అయినా అవి బయట లేవు. నీకు ఈ జీవితం బోరు కొట్టింది కాబట్టి నీ మెదడు సృష్టించిన ఫ్యాంటసీ కొత్త ప్రపంచాలవి. వాటి గురించి గొప్పగా రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రవచనకారులు చెప్పిన మాటలు విని అదేదో అద్భుతంగా ఊహిస్తున్నావు.
(02:52) కాబట్టి నువ్వు వెతుకుతున్నది నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. ఎందుకంటే వెతికేవాడివి నువ్వే వెతకబడేది కూడా నువ్వు తయారు చేసిందే. దొంగ పోలీస్ ఇద్దరూ నువ్వే అయిన ఆటలో దొంగ ఎప్పటికీ దొరకడు. ఎవ్రీడే ని ఎందుకు ఇష్టపడలేము? ఎందుకంటే ఎవ్రీడే నీకు నిన్ను చూపిస్తుంది. ఈ క్షణంలో నువ్వు ఏమీ కాదు అని నీకు ఏ ప్రత్యేకత లేదు అని నువ్వు కేవలం ఒక సాధారణ జీవివి అని ఎవ్రీడే చెప్తుంది. అద్దం లాగా నిజం చూపిస్తుంది.
(03:27) ఆ నిజాన్ని చూడడం బాధ. అందుకే నువ్వు అద్దాన్ని పగలగొట్టి నీకు నీవే నేను దైవాంశ సంభూతుడిని నేను టైంలెస్ అని ఫీల్ అవుతున్నావు. నువ్వు పూజించే దేవుడు నీ నిస్సహాయతకు మరో పేరు నువ్వు వెతికే ససత్యం నీ ఒంటరితనానికి వేసుకున్న మేకప్ మరి ఏం చేయాలి? యూజీ సమాధానం ఏమీ చెప్పడు. ఆయన ఏ సాధన చెప్పడు ఏ మార్గం చెప్పడు ఎందుకంటే ఏదైనా చేయాలి అనే ఆలోచనే ఆ బియాండ్ ని బతికిస్తుంది.
(04:04) నువ్వు చేయాల్సింది ఒక్కటే ఈ క్షణం నుండి పారిపోకుండా ఉండడం ఈ టీ చప్పగా ఉంది ఉండనివ్వు ఈ ఆఫీస్ బోర్ గా ఉంది ఉండనివ్వు ఈ మనిషి నచ్చడం లేదు నచ్చకుండా ఉండనివ్వు నా జీవితానికి అర్థం లేదు లేకుండా ఉండనివ్వు దాన్ని కప్పడానికి బియాండ్ మీ తీసుకురాకు ఆ పారిపోకుండా ఉండే దమ్ము వస్తే అప్పుడు తెలుస్తుంది వెతకడానికి ఏమీ లేదు అని ఉన్నది ఇదే అని ఈ ఎవ్రీడేయే టైం లెస్ అని ఈ బోరింగ్ జీవితమే నువ్వు వెతుకుతున్న ఎన్లైటన్మెంట్ అని బియాండ్ లేదు ఉన్నది ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది. కానీ అది నీకు
(04:53) కావాలి అన్నట్లు ఉండదు. వెతకడం ఆపు వెతికేవాడే సమస్య. చివరగా ఒక్క మాట రేపు ఏదో అద్భుతమైన స్థితి వస్తుందని ఎదురుచూడకు ఏదో బియాండ్ లో సత్యం దొరుకుతుందని పరిగెత్తకు నువ్వు తప్పించుకుంటున్న ఈ క్షణాన్ని ఒక్కసారి చూడు ఎందుకంటే నువ్వు వెతుకుతున్నది ఎక్కడో ఉండకపోవచ్చు నువ్వు వెతుకుతు నిదానికంటే ముందు వెతుకుతున్న నిన్నే చూడాల్సి ఉండొచ్చు వెతకరా ఆపు ఈ క్షణం నుంచి చీ పారిపోవడం ఆపు అప్పుడు మిగిలేది ఏమిటో నువ్వే చూడు ఇదే ఈరోజు ఆలోచన ధన్యవాదాలు మళ్ళీ మరో ఆలోచనతో కలుద్దాం

No comments:

Post a Comment