Sunday, December 19, 2021

నేటీ జీవిత సత్యం. కష్టాలు మన మంచికే

నేటీ జీవిత సత్యం.
కష్టాలు మన మంచికే

ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు... ‘ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు?’

శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు... ‘నేనో చిన్నకథ చెప్తాను వింటావా?’

తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు...

“ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుక గా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు.

అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు..

ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు.

ఆ రంధ్రం లోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.”

తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను..

“ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే, దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది. కాని అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు.

అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది.!

అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

Bhagavadgeetha telugu audio

అందమైన అద్దం కథ

ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు
ఇది గమనించిన ఒక యువకుడు
తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు

నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది
నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య

అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నారు

అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది నీకు తెలుసా అన్నారు తాతయ్య
అవునా ఏంటో అవి చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు

నువ్వు అద్దంలో కి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటె అంతే చూపెడుతుందిగా అన్నారు
అవును అన్నాడు ఆ యువకుడు
ఎక్కువగానో తక్కువగానే చూపదుగా అన్నారు
అవును తాతయ్య అన్నాడు

అద్దం లాగ నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం
తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతే కానీ ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు
ఇది మొదటి పాఠం

అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది
నువ్వు లేకపోతే నువ్వు చూపెట్టదు అలాగే
ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం
ఇది రెండవ పాఠం అన్నారు

అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో పగలకొట్టము కదా అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా అవి సరిచేసుకోవాలి అని చెబుతుంది
ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య

ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా
చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అని ఆనందంతో అక్కడనుండి వెళ్ళాడు
ప్రయత్నిస్తే ఇంకెన్నో తెలుసుకోవచ్చు అని అనుకుని

బావుంది కదా అందమైన అద్దం కథ
AVB సుబ్బారావు

సేకరణ

Friday, December 17, 2021

ప్రపంచ శాంతి పెరుతో వాల్లు చేసే మత ప్రచారాలని మత మార్పిడీలని తిప్పికొట్టండి. హేతు వాదులని దూరంగావుంచండి.

 ఏసు క్రీస్తు తన 14 వయస్సు నుండి 29 వరకు ఎక్కడున్నాడో చెప్పగలరా...???

■  ఆయన కాశ్మీర్ లోయలోని హైందవ ఆశ్రమములో హిందు ధర్మములు నేర్చుకున్నాడని రష్యా పత్రిక ప్రముఖంగా రాసింది

★ఏసు కన్యకు జన్మించలేదు...

ఆయనకు నలుగురు సోదరులు కూడా ఆయనకు "మేరీ మెగ్ధాలిన్" తో వివాహమైనది.

★ఆయన శిలువపై మరణించలేదు. 1947 లో జేరుసలేం గుహలలో తోలుపై హిబ్రు బాషలో వ్రాసిన ప్రతులు దొరికాయి. వాటిని "Dead Sea Scroll" గా పిలుస్తారు. అవి వాటికన్ లో దాచారు.

★పాశ్చాత్య దేశాల్లో ముప్ఫై శాతం కూడా చర్చీలకు వెల్లటం లేదు. మతంపై విశ్వాసం సడలిపోయిందని అన్ని దేశాలు హిందు ధర్మంపై ఆసక్తిగా చూస్తున్నారన్న విషయం పరిశోదకులు తేల్చిచెప్పారు.

★అనేక పాశ్చాత్య చర్చలలో హిందు సాంప్రదాయక యోగాభ్యాసం నేర్పుతున్నరు.. హిందు సాంప్రదాయక యోగాబ్యాసాలకే ఎక్కువ వెల్తున్నారని తెలుసా...??

★కాశీ, బృందావన్, పుట్టపర్తి, షిర్డీ, తిరుపతి, పాండిచ్చేరి, రమణాశ్రమం, వంటి అనేక ఆధ్యాత్మిక క్షేత్ర ధర్శనార్ధమే విదేశీయులు మన దేశానికి వస్తున్నారని తెలుసా....???

★అనిబిసెంట్‌, రోమరోలా,హక్స్‌లే, షోపన్ డేవిడ్ ఫ్రాల్, వంటి అనేక మంది పాశ్చాత్యుల మేదావులు ప్రపంచ శాంతి హిందుత్వంతోనే సాధ్యం అని తెల్చారని తెలుసా...??

★ఇతర మతాలని దూశించి, మతం మార్చి వారి కుటుంబాలని విడదీసి నాశనం చేయమని మీ దేవుడు చెప్పాడా...???

★అసలు రెండు వేల సంవత్సరాల పూర్వం మీ మతము ఉన్నదా...??

మీ ఎసున్నాడా...???

అలాంటపుడు...లక్షల సంవత్సరాల చరిత్ర గల హైందవాన్ని ఎలా విమర్షించాలనుకుంటున్నారు...

◆నూనెలు రాసి ప్రార్థనలు చేసి కాన్సర్ వంటి అనేక రోగాలను నయంచేస్తాం అని ప్రచారం చేసే మత ప్రచారకులకు రోగాలు రావట్లేదా...?? ఆసుపత్రులకెల్లట్లేదా..?? మతాధిపతి పోప్ జాన్ పాల్ పరిస్థితి ముక్కులో ట్యూబ్ లు పెట్టుకొని అలోపతి వైద్యం చేయించుకున్నడే...???

★క్రైస్తవంలో అనేక శాకలున్నాయి.

ఒక శాకకు సంబంధించిన వారు వేరే చర్చికి వెల్లరు మరి మతం మార్చుకున్నవారు ఏ చర్చికి పోతారో...???

◆లక్షల సంవత్సరాల చరిత్ర హిందుత్వానిది అంత దూరమెందుకు రెండు వేల సంవత్సరాల. తరువాత ఎందరో ఋషులు, మునులు, యోగులు, భక్తులు, అనేకులు.. మరి అంతటి స్థాయి కలవారు ఎంతమంది క్రైస్తవంలో ఉన్నారు. అసలు ఎవరైనా ఉన్నారా...??

★మత మార్పిడీలు చేయటమే కాకుండా హిందు దేవతల పట్ల ద్వేశాన్ని నూరి పోస్తున్నారు..

భార్య భర్తల మద్య వివాదాలను సృష్టిస్తు.. శాంతికి భంగం కలిగిస్తు.. విడాకులకు సిద్ధం చెస్తున్నారు..

◆మా మతం స్వీకరిస్తేనే మిమ్మల్ని కాపాడతాం అని సునామీ భాదితుల్ని మత మార్పిడీ చేసారు.

మారని వారికి సహాయం అందించ లేదు ఈ క్రైస్తవ మిషనరీలు ఇదేనా మీ సేవా దృక్పదం.


రామాయణం చదివినా పుణ్యం వస్తది.

ఈ వెదవల గురించి ఆలోచించినా పాపం తగులుతుంది.

నా పాపాల్ని నా రక్తంతో కడుక్కోవాల్సి వస్తది అంత పాపం మరి.....

ఇప్పటి కైన క్రైస్తవ మిషనరీల వెనుక దాగి ఉన్న విషాన్ని తెలుసుకొని జాగ్రత్తపడండి.

ప్రపంచ శాంతి పెరుతో వాల్లు చేసే మత ప్రచారాలని మత మార్పిడీలని తిప్పికొట్టండి. హేతు వాదులని దూరంగావుంచండి.


మన మతం మన జన్మ భూమి

తల్లితో సమానం

డబ్బు ఎరకు చిక్కి కన్న తల్లిని అమ్ముకోకండి..

*నొప్పించినా ఇదే నిజం*🍁🍁🍁Jai Sree raam🍁🍁🍁

ఓ భర్త దర్గాకువెళ్లి మొక్కుకుని వచ్చాడు అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది...

 👨‍💼 ఓ భర్త దర్గాకువెళ్లి మొక్కుకుని వచ్చాడు అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది 


‍👩️భార్య : నీ తండ్రి చనిపోయినపుడే స్మశాననికి వెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేసి బుద్దిగా శుభ్రంగా స్నానం ఇంట్లోకి వచ్చావు  అటువంటిది ఇప్పుడు ఎవరిదో శవమున్నా సమాధిని ముట్టుకుని దణ్ణం పెట్టుకునొచ్చి స్నానం చేయకుండా లోపలికి వస్తావా?


👨‍💼భర్త : భగవంతుడా అది సమాధి మాత్రమే! దేవదూత గా చెప్తారు 


👩️భార్య : అంటే నీ తండ్రి దయ్యమా? రాక్షసుడా? మనకి ఏం తక్కువ? 33కోట్లమంది దేవతలున్నారు న్నారు 


👨‍💼భర్త : అదికాదు, మా ఫ్రెండ్ అబ్దుల్ తీసుకెళ్తే వెళ్ళాను, వెళ్లకుంటే బాగుండదు!


👩‍🦰భార్య :అదేఅబ్దుల్ ని ఎదురుగానే ఉండే హనుమాన్ మందిర్ కి కూడా తీసుకువెళ్లి

 మొక్కమను ఈ మంగళవారం?


👨‍💼భర్త : అతడెప్పుడూ రాడు, గుడికి దణ్ణం పెట్టుకోవడానికి, సరే నువ్వు బకెట్ నీళ్లు ఇచ్చేయ్!


👩️భార్య : సరే అయితే చెవులు పట్టుకుని నూరు గుంజీలు తీయండి అలాగే ప్రమాణం చేయండి, ఇంకొకసారెప్పుడు దర్గాలకి వాటికి వెళ్ళనని.

మనకి మన ఇల్లు కూడా మందిరం🛕, ఇక్కడ, రాముడు కృష్ణుడు శివుడు ఆదిపరాశక్తి అందరూ ఉన్నారు 🙏


🦸‍♀️భార్య : గుర్తుపెట్టుకోండి బైట మనం ప్రాణప్రతిష్ట చేసివాటిని పూజించడానికి వెళ్తాము కానీ, శవాలను కప్పెట్టిన వాటికీ మొక్కడానికి కాదు, ఇంకోసారి ఇటువంటిది చేస్తే మర్యాదగా ఉండదు.


*సనాతన ధర్మ రక్షణ, ఆచరణ మన ప్రధమ కర్తవ్యం.

                  జై శ్రీరాo

             🚩🚩🙏🚩🚩

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. దుర్గా, గాయత్రి, సరస్వతి, లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...

శుక్రవారం --: 17-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాటలు
పరోపకారానికి మించిన పుణ్యం లేదు , పరనిందను మించిన పాపం లేదు , ఒకరు మీకు నష్టం కలిగించినంత మాత్రాన వారిపై నిందలు మోపాల్సిన పని లేదు అర్థం కాకపోతే తెలుసుకోడానికి ప్రయత్నిoచాలి కానీ అపార్థం చేసుకోకూడదు ,

ఒక్క క్షణంలో జీవితం ఏమీ మారిపోదు కానీ ఆ ఒక్క క్షణంలో ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాళ్లను ఎవరూ నమ్మరు అదే మనసులో స్వార్థం పెట్టుకుని పైకి ప్రేమ నటించే వాళ్ళను అందరూ ఇష్ట పడుతుంటారు .

ఒక చెడ్డగుణం వంద సమస్యలకు కారణం అవుతుంది . ఒక మంచి గుణం వంద సమస్యలను పరిష్కరిస్తుంది సులువుగా వచ్చినది ఏదైనా విలువ తక్కువ, కష్టించి సంపాదించిన దానికి విలువ ఎక్కువ .

ప్రశ్నించడం అంటే ఎదిరించడం కాదు వాస్తవాల కోసం సత్యం కోసం స్వేచ్చ కోసం నీతి నిజాయితీ కోసం అభివృద్ధి కోసం అడగడం . కొన్ని సార్లు మనకి ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలను నేర్పుతాయి నీ సామార్ద్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తేలిసేలా చేస్తాయి .

సేకరణ ✒️ మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు*

సేకరణ

రాజయోగం లో ‘ఎనిమిది శక్తులు’ లభించును.చాలా ముఖ్యమైనవి. మహిమ కలిగినవి.

రాజయోగం
➖➖➖

రాజయోగం లో ‘ఎనిమిది శక్తులు’ లభించును.చాలా ముఖ్యమైనవి. మహిమ కలిగినవి.

మొదటిది ‘సంకీర్ణశక్తి’. తాబేలు తన అవయవములను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకొని తిరిగి బయటకు తేగలిగిన విధంగా రాజయోగి తన సంకల్పానుసారము తన కర్మేంద్రియములతో కర్మచేయగలడు. లేదా అంతర్ముఖుడై(విదేహిస్థితి) అనంతమైన శాంతి అనుభవించగలడు. ఈ ప్రకారమైన ఆత్మ స్వరూప స్థితిలో ఉండుటచే అతడు మాయకు ఏమాత్రమూ లోబడడు.

రెండవశక్తి ‘సమీకరణశక్తి’. ఈ ప్రపంచము ఒక సత్రము వంటిదని అందరు ఒప్పుకుంటారు. కానీ వ్యావహారిక జీవితమునందు ఎన్నో బాదరబందీలు తగిలించుకొని వీని నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడ మరలించు కొనలేరు. కాని యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచము నందు తగుల్కొన నీయకుండా పరమపిత శివ పరమాత్మతో ఆత్మిక సంబంధమును కలిగి ఉండుటలోనే తన బుద్ధిని వినియోగిస్తాడు. అతడు ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టె, దివ్యగుణములు అనే బెడ్డింగు సర్దుకొని నిరంతరం తన స్వగృహమైన పరంధామమునకు పయనించుటకు తయారుగా ఉంటాడు.

మూడవశక్తి ‘సహనశక్తి’. చెట్టు రాళ్ళురువ్విన వానికే మధుర ఫలముల నిస్తుంది. యోగి కూడా అపకారికి ఉపకారమే చేస్తూ వారిపట్ల సదా శుభభావన శుభకామన కలిగి ఉంటాడు. యోగము వలన లభించును.

నాల్గవ శక్తి ‘ఇముడ్చుకొనుశక్తి’ యోగాభ్యాసము వలన బుద్ధి విశాలమై మానవునకు గాంభీర్యత, మర్యాదా స్వభావము అలవడుతుంది. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు. ఎంతటి అవమానమునకైనా కృంగి కృశించడు. అతడు సముద్రమువలె ఉన్న తన ఉద్వేగమును దైవీకుల మర్యాద అనే చెలియలి కట్టను దాటనీయడు. గంభీరుడై ఇతరుల అవగుణములను చూడకుండా వారిలోని సుగుణాలనే రత్నాలే స్వీకరిస్తాడు.

ఐదవశక్తి గుణదోషములను ‘పరిశీలించు శక్తి.’ కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించునట్లు యోగి తన సాంగత్యంలోనికి వచ్చినవారి గుణదోషములను వెంటనే గ్రహించగలుతాడు. అతని ముందు వారిలోని సత్యాసత్యములు దాగవు. సదా జ్ఞానరత్నాలు మాత్రము స్వీకరించి అజ్ఞానమనే గులకరాళ్ళపై తన బుద్ధిని పోనీయడు.

యోగికి లభించే ఆరవశక్తి ‘నిర్ణయ శక్తి’. అతడు ఉచితానుచితములను వెంటనే గ్రహించగలుతాడు. వ్యర్థ సంకల్పములు, పరచింతన విడిచి ఎల్లపుడు పరమాత్మ స్మృతిలో నిమగ్నమై ఉంటాడు.

ఏడోవ శక్తి ‘ఎదుర్కొనే శక్తి’. యోగాభ్యాసముచే ఏడోవ శక్తి ‘ఎదుర్కొనే శక్తి’ లభిస్తుంది. మన కళ్ళముందు ఆత్మీయులు మరణించినప్పటికి తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టిముట్టినప్పటికి అతను ఏనాటికి చలించడు. నిరంతరము ఆత్మ దీపము ప్రకాశిస్తూ ఉండగా ఇతరులకు జ్ఞాన ప్రకాశమును వ్యాపింప చేస్తాడు.

ఎనిమిదవశక్తి ‘సహకార శక్తి’. యోగి తన తనువు, మనస్సు, ధనములను ఈశ్వరీయ సేవలో ఉపయోగించుటయేగాక ఇతరులకు కూడా సహకారమిస్తూ కలియుగమనే విషయవికారాల పర్వతమును లేవనెత్తుటకు తన పవిత్ర జీవితమనే వ్రేలు నిచ్చి స్వర్గస్థాపన అనే అత్యున్నత కార్యములో సహ యోగి అవుతాడు.*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట. బంధాలు.

నేటి మంచిమాట.

నీటిని ఎక్కువగా మరిగిస్తే అవిరైపోతాయి అలాగే భరిస్తున్నారుకదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి సన్నిహితులారా..

అబద్దం అప్పు వంటిది, అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరీ కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు..

నిజం నిప్పు వంటిది, అది చెప్పే వాడి నాలుకకు చేదుగా, వినేవాడి చెవులకు మంటగా ఉన్న కూడా మంచే చేస్తుంది..

తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు..తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి వుండడు..
తప్పు చెయ్యడానికి ఎవ్వరు భయ పడడం లేదు..చేసిన తప్పు బయట పడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు..

గెలవటం గొప్ప కాదు..ఓడిపోవడం తప్పు కాదు..మళ్లీ ప్రయత్నించకపోవడం అతి పెద్ద తప్పు..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. పొగడ్తలు

నేటి జీవిత సత్యం. పొగడ్తలు

వినే మాటల్లో కొన్ని పొగడ్తలు కూడా ఉంటాయి. పొగడ్తకు లొంగని వారు చాలా అరుదుగా ఉంటారు. అది మన బలహీనత యితే దాని వల్ల మనం నష్టపోతాం. సకాలంలో గుర్తించకపోతే దారు ణంగా దెబ్బతింటాం. కాకినోట్లో మాంసం ముక్కమీద కన్నేసిన నక్కు ఒకటి "కాకిబావా, కాకిబావా నీవు చాలా బాగా పాడతావు గదా.. ఏదీ ఒక పాటపాడు' అంటే మురిసిపోయిన కాకి పాడడానికి నోరు తెరవగానే మాంసం ముక్క జారి కిందపడడం, నక్క దానిని నోట కరుచుకుని వెళ్ళిపో వడం చిన్నప్పుడు కథల రూపంలో పిల్లలకు చెబు తుంటాం. అవి కాలక్షేపం కథలు కావు. జీవిత సత్యాలు. పొగడ్త మత్తు తలకెక్కితే విచక్షణ ఉండదు. చెయ్యకూడనివి చాలా చేస్తారు... తీరా అది గ్రహించేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఈ విషయంలో మహాభారతంలో శల్యుడికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. నకుల సహదేవులకు మేనమామ. కాబట్టి పాండవులకు మేనమామ. కృష్ణ పరమాత్మతో సమానంగా రథ సారథ్యం చేయగల నేర్పరి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సహాయపడదామని బయల్దేరాడు. ఈ విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు మార్గమధ్యంలో అద్భుత స్వాగత సన్నాహాలు చేసాడు. అది పాండవులే చేశా డనుకున్నాడు. తీరా దుర్యోధనుడని తెలు సుకుని పిలిపించాడు.. అతని పొగడ్తలకు, మర్యాదలకు మురిసి పోయి ఏం కావాలో కోరుకో... అన్నాడు. ' మీరు నా పక్షాన యుద్ధం చేయాలి" అన్నాడు. పొగడ్తల మత్తులో సరేనని శల్యుడు మాటి చ్చాడు. అయినా ఒకసారి ధర్మారాజును చూసి వస్తా అని అటు వెళ్ళాడు. అక్కడ ధర్మ రాజు కూడా వేగుల ద్వారా అప్రమత్తమై ఉన్నాడు. ధర్మరాజాదులు కూడా శల్యుడిని ఆకా శానికి ఎత్తేసారు, పొగడ్తలతో. 'మీకేం కావాలో చెప్పండి తీర్చేస్తా" అని వారికీ మాటిచ్చాడు. "అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు కాబట్టి దుర్యోధనుడు నిన్ను కర్ణుడికి రథసా రథ్యం చేయమంటాడు. నువ్వు రథం ఎక్కిన దగ్గరనుంచి అతనిని మానసికంగా హింసించు, నిందించు, అప్పడు బాణ ప్రయోగంలో ఏకాగ్రత కోల్పోతాడు. మేం అతనిని పడగొట్టేస్తాం."

అంటే సరేనని శల్యుడు వారికీ మాటిచ్చాడు. కర్ణుడి చావుకు తానూ ఒక కారణమయ్యాడు. ఇటువంటి అనుభవాలూ మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాం. అటువంటి బలహీనతల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు... ఇతరులను కూడా కాపాడుతూ ఉండాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది.

అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది.

భారతీయ సంస్క•తిలో దానిది మహిమాన్విత స్థానం. సనాతన ధర్మానికి అదే ప్రధాన సూత్రం. మానవ హితానికి మన పెద్దలు అనేక ధర్మాలను ఏర్పరిచారు. వాటిలో దానగుణ ధర్మం ఒకటి. అలాగే, షిర్డీ సాయిబాబా దానగుణ భావాన్ని తన భక్తుల్లో ఎంతగానో నాటుకునేలా పలు ఉదంతాలను నిదర్శనంగా చూపించారు. స్వయంగా తాను దానధర్మాలను ఆచరించారు.
దానగుణం గురించి షిర్డీ సాయిబాబా అద్భుతమైన బోధనలు చేశారు. ప్రధానంగా అవన్నీ కూడా ఆయన స్వయంగా ఆచరించి చూపినవే కావడం విశేషం. దానం అనగానే మన ఆస్తిపాస్తులు ఎదుటి వారికి రాసిచ్చేయడం కాదు. ఉన్న దాంట్లోనే కొంత పరులకు పంచడం. దీని వల్ల పుణ్యం పెరుగుతుంది.
‘‘దానాన్ని అన్యభావంతో చేయకూడదు. నేనే చేస్తున్నానని అనుకోకూడదు. ఇంకా చెప్పాలంటే దానం చేసేవారు దానం పొందే వారికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే, వారు మన దానాన్ని స్వీకరించడం ద్వారా మనకి పుణ్యాన్ని కలిగిస్తు న్నారు’’..
దాన గుణం గురించి బాబా చెప్పిన మాట లివి. ఎంత అత్యద్భుతమైన పలుకులివి?.
యోగ్యతనెరిగి దానం చేయాలి..
దానం స్వీకరించే వాళ్లకి భుక్తి కలగడం ముఖ్యం. ఇచ్చే వారికి ముక్తిప్రదాయకం. దానం ఇచ్చేవాళ్లకు ఆ గుణం రీత్యా పుణ్యం పెరుగు తుంది. తీసుకునే వాడికి కోరిక (ఆకలి) తీరు తుంది. నిరుపేదలు, నిస్సహాయులను ఆదుకునేం దుకు దానం అనే గుణాన్ని మన పురాణ, ఇతిహాస గ్రంథాలలో సర్వదా సుస్థిరమై వెలుగొందే స్థాయిలో చిత్రించారు. దానిని ఆచరించడం ద్వారా ఎవరికి వారు పుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని, సౌశీల్యాన్ని పొందవచ్చునని చెప్పారు. తల్లికి చేసే దానం వల్ల వందరెట్లు, తండ్రికిచ్చే దానం వల్ల వెయ్యి రెట్లు, సహ•దరులకు చేసిన దానం వల్ల అనంతంగానూ ఫలితాలు ఒనగూడుతాయని చెబుతారు. పాపాత్ములకు, దుర్వ్యసనపరులకు చేసిన దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. అంటే అది వ్యర్థమవుతుంది. యోగ్యులకు మాత్రమే దానం చేయాలి. పాత్రనెరిగి దానం చేయాలి. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభ కార్యాల్లో చేసే దానం విశేష పుణ్య ఫలాన్ని ఇస్తుంది.
దానాలు పదమూడు రకాలు
మన పురాణాలలో పదమూడు రకాల దానాల గురించి వివరించారు. అవికాక ఇంకా వస్త్ర, అన్నదానాల వంటివి ఇతోధికంగా ఉన్నాయి. అవతలి వారికి యోగ్యతను బట్టి మనం చేసే సాయమేదైనా దానం కిందకే వస్తుంది. దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. లోభత్వం చూపకూడదు. ఔదార్యం, దాక్షిణ్యం కలిగిన భావంతో చేసిన దానమే సత్ఫ లితాలను ఇస్తుంది. విసుగుదలతో, లోభత్వంతో, రాగద్వేషాలతో చేసే దానం వల్ల ఏ ఫలమూ కలగదు. పైగా అది వ్యర్థమవుతుంది. నిరర్థక దానం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ కలగదు. పేదలకు మనం చేసే అన్నదానం వల్ల మన ఖాతాలో పుణ్యం జమ అవుతుందని శాస్త్ర వచనం.
పేదలకు దానం చేస్తే దేవుడికి ఆవునిచ్చినట్టే!
మహాభారతం అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు దానధర్మాల మహిమ గురించి విపులీకరించాడు. దానం ఇవ్వలేని వాడు.. ఇవ్వగలిగే సత్పురుషుడిని యాచకుడికి చూపినా ఫుణ్యఫలం ప్రాప్తిస్తుంది. బీదలకు చేసే దానం దేవుడికిచ్చిన ఆవుతో సమానం. ఒకడు ఎంత ధనికుడైనా అతనిలో దానగుణం లేకపోతే అతనికి ఉన్న సంపద, ఆస్తి, అంతస్తు ఎందుకూ కొరగానివే. జ్ఞాని అయిన ధనికుడు తన సంపాదన లోని కొంత భాగాన్నయినా దానం చేయాలి. ధనికుడైన లోభి కన్నా దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. సముద్రంలో ఉన్న అపారమైన లవణజలంతో దాహార్తి తీరదు. కానీ చెలమలోని గుక్కెడు నీళ్లు దాహార్తిని తీరుస్తాయి. నీరు మంటను ఎలా ఆర్పివేయగలదో దానధర్మాలు పాపాలను అలా హరించి వేయగలవు.
లక్షమందిలో ఒక్కడే దాత..
వందమందిలో శూరుడు ఒక్కడే ఉంటాడు. వేయి మందిలో పండితులు ఒకరో ఇద్దరో ఉంటారు. పది వేల మందిలో వక్తలు ముగ్గురో నలుగురో ఉంటారు. కానీ లక్షమందిలో నిజమైన దాత ఒక్కడే ఉండొచ్చు.. ఉండకపోనూవచ్చు. దాన గుణ వైశిష్ట్యం అంతటి మహత్తరమైనది. క్షేత్రమెరిగి విత్తనం వేస్తే మంచి మొక్క మొలుస్తుంది. మహావృక్షం అవుతుంది. అలాగే అర్హత గలవాడికి దానం చెయ్యడం వల్లనే అనంత పుణ్యఫలం కలుగుతుంది. ఆర్భాటంతో, ప్రచారంతో, కీర్తికాంక్షతో చేసే దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. ఇక, ఎవరికీ తెలియకుండా గుప్తంగా చేసే దానం వల్ల అనంతమైన ఫలితం ప్రాప్తిస్తుందని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.
కాళిదాసు దానం..
మహాకవి కాళిదాసు భోజరాజు ఆస్థానానికి బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్నం వేళ. ఎండ మండిపోతోంది. ఒక పేదవాడు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తూ బాధపడుతూ వెళ్లసాగాడు. కాళిదాసు అతనికి ఎదురయ్యాడు. కాళ్లు కాలుతున్నా.. సహిస్తూ అవస్థ పడుతున్న ఆ పేద వాడిని చూసి జాలిపడిన కాళిదాసు తన చెప్పులను అతనికి ఇచ్చి తన నడకను కొనసాగించాడు. చెప్పులు లేనందుకు కాళ్లు చుర్రుమంటూ కాలు తున్నాయి. అయినా తను చేసిన పని వల్ల బాటసారికి కలిగిన ఆనందం, తృప్తి కాళిదాసులో అంతటి బాధనూ మైమరిపించాయి. అంతలో అటుగా రాజు గారి ఏనుగుపై ఒక మావటి వాడు ఆ వీధిలోకి వచ్చాడు. మండుటెండలో చెప్పులు లేకుండా, కాళ్లు కాలుతుండగా నడిచివస్తున్న కాళి దాసును చూసిన మావటి వాడు ఆయనను ఏనుగుపైకి ఎక్కించుకున్నాడు. నేరుగా ఆయనను రాజు గారి కొలువులోకి తీసుకెళ్లాడు. కాళిదాసు తమ కొలువుకు రావడంతో రాజుతో పాటు అక్క డున్న ఇతర పండితులు ఆశ్చర్యపోయారు.
‘‘మహాకవీ! ఇవాళ మాకీ మహర్దశ ఏమిటి? తమరి దర్శన భాగ్యం ఆనందం కలిగిస్తోంది’’ అన్నారంతా ముక్తకంఠంతో.
‘‘నేను చేసిన స్వల్ప దానానికే ఇంతటి గౌరవం లభించింది’’ అన్నాడు వినమ్రంగా కాళిదాసు.
ధనం కాదు.. దానగుణం మిన్న
నిర్మల హృదయంతో, నిస్వార్థ బుద్ధితో చేసే దానం మనిషిని మహ•న్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. దానం చేయడానికి మనకు ఎంత సంపద ఉన్నదనేది ముఖ్యం కాదు. ఆపదలో ఆదు కోవాలనే ఆవగింజంత మంచి భావన ఉంటే చాలు. అతను కుబేరుడి కంటే గొప్పవాడవుతాడు. మానవ జన్మకు సార్థకత చేకూర్చేది ధనధాన్యాలు, అనంత సంపద కాదు. దానగుణమే సార్థకతను కలిగిస్తుంది. కూటికి లేనివాడైనా సరే తనకున్న దాంట్లో కొంత దానం చేసి నిస్సహాయులకు తోడ్పడ వచ్చు. దానానికి ఉపయోగపడని ధనరాశి ఎంత ఉన్నా ఉపయోగం ఏమిటి? ఎవరికి ఏది అవసరమో గ్రహించి దానం చేసేదే అసలైన దానం.
దానం.. మన సంక్షేమానికే!
రక్త, నేత్ర, మూత్రపిండ దానాలు విశేషమైన వని ఆయుర్వేదంలోని అష్టాంగ మార్గం బోధి స్తోంది. ఇక, దీనులకు, ఆర్తులకు చేసే ఏ దాన మైనా విశిష్టమైనదేనని ఆదిశంకరులు ప్రబో ధించారు. మనం చేసే దానధర్మాలే మనకోసం ఏర్పర్చుకునే సంక్షేమ నిధులు. దానం చెయ్యడం అంటే మన కోసం భగవంతుడే వెతికేలా చేసుకోవడం. సంపద ఉంటే దానం చెయ్యాలి. లేకుంటే హృదయాన్ని అయినా దానం చెయ్యాలి. అప్పుడే మానవజన్మ చరితార్థం.
గీతలో పన్నెండు దానాలు..
‘‘యజ్ఞో వై విష్ణ్ణు’’ అని శ్రుతి సూత్రం. అంటే యజ్ఞమే విష్ణువు. సర్వవ్యాపకుడైన భగవంతుని ప్రీతి కోసం, విశ్వకల్యాణార్థమై, సంఘ శ్రేయస్సు కోసం, స్వార్థరహిత చిత్తంతో చేసే ప్రతి పనీ యజ్ఞమే!. గీతలోని నాల్గవ అధ్యాయంలో 12 రకాలైన యజ్ఞాల గురించి ఉంది. ఎవరెవరికి ఏవి అందుబాటులో ఉంటాయో వాటిని ఆచరించ వచ్చు. ఉదాహరణకు ధనవంతుడు ధనరూపంలో యజ్ఞం చేయవచ్చు. దీనిని ద్రవ్య యజ్ఞం అంటారు. అంటే- బీదలకు ధన సహాయం చేయడం, మంచి పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందచేయడం, పాఠశాలలు, వైద్యాలయాల నిర్మాణం, పేద విద్యార్థులకు ఉపకార వేతనం, అనాథ, వృద్ధాశ్రమాలను నిర్మించడం మొదలైనవి.
దానాన్ని యజ్ఞంగా భావించాలి..
దానాన్ని పేరు కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం కాకుండా, స్వార్థరహితంగా, ఈశ్వరార్పణ భావంతో, భగవదారాధనగా భావించి చేయాలి. విద్యావంతులు తను నేర్చుకున్న విద్యను ఇతరులకు ఉచితంగా బోధించవచ్చు. ఇది జ్ఞాన యజ్ఞమవుతుంది. ఇంకా- తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మొదలైనవి ఉన్నాయి. చేసే ప్రతి పనినీ యజ్ఞంగా భావించి చేయడమే నిష్కామ కర్మ. మన శక్తి, సామర్థ్యాలను బట్టి ఇత రులకు సాయపడవచ్చు. రోగులకు సేవలందించ వచ్చు. ఎటొచ్చీ ఇతరులకు సాయపడాలనే మనసుండాలి.

సేకరణ. మానస సరోవరం

సేకరణ

Thursday, December 16, 2021

జీవన మాధుర్యం

జీవన మాధుర్యం

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా సాగదు. అనుకోని సంఘటనలు ఎన్నో సంభవిస్తాయి. ఆకస్మిక ఘటనలు ఎదురవుతాయి. వాటి విషయంలో ఒక్కొక్కరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. అవి కష్ట నష్టాలను కలిగించేవి అయితే సాధారణ ప్రజలు భయాందోళనలకు గురవుతారు. నిరాశా నిస్పృహలకు లోనవుతారు.

అవి సంతోషదాయకమైనవైతే ఉబ్బితబ్బిబ్బవుతారు. గర్వంతో విర్రవీగుతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారి తీరు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా జెన్‌ గురువుల స్పందన మరింత భిన్నంగా ఉంటుంది.

జెన్‌ గురువు ఒకరు ఒక గ్రామ శివార్లలో నివసిస్తూ ఉండేవాడు. రోజూ పొద్దున్న వాహ్యాళి కోసం బాగా దూరంగా ఉన్న అడవిలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఒక రోజు అతను కొంత దూరం నడిచిన తరువాత ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. కొంత దూరంలో ఒక పులి కనిపించింది. అది కూడా ఆయనను చూసింది. మరొకరైతే భయంతో పరుగులు తీసేవారు. పులి కూడా అతణ్ణి పట్టుకోవడానికి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చేది. కానీ ఆ గురువు మామూలుగానే నడకను కొనసాగించాడు. పులి కూడా అతని వెనుక నెమ్మదిగా నడుస్తూ వస్తోంది.

ఆ గురువు నడిచి నడిచి ఒక కొండ అంచును చేరుకున్నాడు. అతని ముందు లోతైన లోయ ఉంది. వెనుక పులి వస్తోంది. కానీ ఆయన భయపడలేదు. చుట్టూ గమనిస్తే కొండ పై నుంచి లోయ వైపు పెరిగిన ఒక చెట్టు కనిపించింది. దాని కొమ్మలు లోయలో దూరంగా దిగుతున్నాయి. ఆ గురువు తను నిలబడిన స్థలం నుంచి లోయలోకి దిగుతున్న చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. పులి సమీస్తోంది. అతను. కింద ఉన్న లోయలోకి చూశాడు. అక్కడ ఒక సింహం సంచరిస్తోంది. అంతేకాదు, అతను పట్టుకొని వేలాడుతున్న చెట్టు కొమ్మను రెండు ఎలుకలు కొరుకుతున్నాయి. తను పట్టు తప్పి లోయలోకి పడిపోవచ్చు. లేదా చెట్టు కొమ్మ ఏ నిమిషంలోనైనా తెగి, కొమ్మతో సహా లోయలోకి పడిపోవచ్చు. ఎలాగూ తనకు చావు తప్పదని అతనికి తెలిసిపోయింది.
ఈలోగా అతనికి దగ్గరలో ఉన్న ఒక మరో కొమ్మ మీద పండ్లు కనిపించాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరూ పండ్లను తిని ఆనందించలేరు కదా? అది అసంభవం. కానీ అతను పరిణతి ఉన్న గురువు. ఒక్కొక్క పండునూ కోసుకొని తినడం మొదలుపెట్టాడు. అతనికి మధురమైన అనుభూతి కలిగింది. ఒకవైపు పులి, మరోవైపు లోయ, లోయలో సింహం... తప్పదనుకున్న మరణం. ఇక తాను జీవించగలిగేది కొన్ని క్షణాలు మాత్రమే! ఆ కొద్ది క్షణాలనూ భయంతో కాకుండా ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆయనకు కలిగింది. అదే ఆయనలో జ్ఞానజ్యోతిని వెలిగించింది.

ఈ కథను ఓషో చెబుతూ ‘‘ఆ గురువు ఆ క్షణంలో బుద్ధుడయ్యాడు. చావు అంత సమీపంలో ఉన్న సమయంలో.. పులి, సింహం, లోయ, విరుగుతున్న చెట్టు కొమ్మ, చివరకు తానొక వ్యక్తిననే భావన... ఇవన్నీ ఆయనలో మాయమైపోయాయి. పండ్ల మాధుర్యం, ఆ క్షణాల్లోని జీవన మాధుర్యం... అవే మిగిలాయి’’ అని అంటారు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
కష్టం.. ప్రార్ధనను నేర్పిస్తుంది.
ఇష్టం.. త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ.. ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ.. క్షమించడం నేర్పిస్తుంది.
విజయం.. గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి.. కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఓర్చుకుంటే.. నేర్చుకుంటావు..

మనిషిగా పుట్టాటమే ఒక అద్బుతం....
బ్రతికి ఉండటం ఒక అదృష్టం...
ముడి పడుతున్న పడుతున్న బందాలన్ని వరాలు...
ఎదురౌతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు...
కష్టం గురించి చింతించకు...........
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయి..

*శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

సప్తధాతువులు

సప్తధాతువులు:-

ఈ శరీరం సప్తధాతువులు చేత తయారు కాబడింది. అవి
1) రసం:- మనం భుజించే అన్నపానీయాలు 4 గం౹౹ల నుండి 6 గం౹౹లకు రసంగా మారును.
2) రక్తం:- రసం రక్తంగా మారుటకు 27 రోజులు పడుతుంది. (నక్షత్రాలు)
3) మాంసం:- రక్తం మాంసంగా మారుటకు 40 రోజులు పట్టును. (దీక్షలు)
4) మేధస్సు:- మాంసం మేధస్సుగా మారుటకు 52 రోజులు పట్టును. (అక్షరాలు)
5) ఎముకలు:- మేధస్సు ఎముకలుగా మారుటకు 64 రోజులు పట్టును. (కళలు)
6) మజ్జ:- ఎముకలు మజ్జగా మారుటకు 21 రోజులు పట్టును. (యజ్ఞంలో సమిధలు)
7) శుక్లము/ శోణితం (రేతస్సు/రజస్సు):- ఈ మజ్జ శుక్లము (పురుషునికి సంబంధించినది)/శోణితంగా (స్త్రీకి సంబంధించినది) మారుటకు 96 రోజులు పట్టును. ఇట్టి శుక్ల, శోణితాల కలయిక వల్లనే 84 లక్షల జీవరాశులు ఉద్భవించినవి.
ఈ శుక్లము/ శోణితం జీవునకు ఓజస్సుగా మారుటకు 108 రోజులు పట్టును. ఈ ఓజస్సే తేజస్సుగా పరిణమించును.
(ఓజస్సు= Inner Glowness, తేజస్సు= Outer Glowness)

సేకరణ

Wednesday, December 15, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అంతస్తులున్నాయనిఅహం పెరిగినట్టనిపిస్తే
స్మశానాన్ని ప్రదక్షిణ చేసి
సమాధులు చూసిరండి
కుదిరితే పోయినోడు
ఏమి తీసుకెళ్ళాడో
ఓ సారి అడిగి చూడండి

ఎప్పుడైనా మీకు
పరమాత్ముని మీద
ప్రేమనేది కలిగితే
ఆకలితో ఉన్నవాడికి
మీ చేతులతో అన్నం పెట్టండి
కడుపునిండా దీవెనలతో
మీ ఆత్మ సంతోషిస్తుంది చూడండి

ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు
నిద్రలేచి వికటాట్టహాసం చేస్తే
వాడిని ముక్కలుగా నరికేసి
సగర్వంగా తలెత్తుకొని నిలబడండి

ఎప్పుడైనా మీకు కొవ్వు పెరిగి
కండ బలంతో పొగరెక్కితే
ఏదైనా ఒక వృద్దాశ్రమానికెళ్లి
ఓ పూట నిశ్చలంగా గడపండి
సత్తువ తగ్గిన వారు కాటి వైపు
నడుస్తుంటారు చూడండి

జీవితమంటే ఏమిటో
బతుకంటే అర్థ మేమిటో
అవగతం చేసుకోండి...
అదే జీవిత పరమార్థం

అందుకే....
మన ప్రవర్తనే మన దిక్సూచని
తెలుసుకొని మసులుకోండి...*

మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. *🔥మరణం అంటే* *ఏమిటి🔥💦*

నేటి జీవిత సత్యం. 🔥మరణం అంటే
ఏమిటి🔥💦


'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది' అంటూ బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.
మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది, మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు, అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి, ఆత్మ అన్నది ఉన్నదా, శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది....

జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం !

కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు .

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

గీతా జయంతి

🕉️ గీతా జయంతి 🕉️

📚✍️మురళీమోహన్

🙏ఈ రోజు గీతా జయంతి

గీత జయంతి సందర్భంగా శ్రీమద్భగవద్గీత గురించి కొన్ని విషయాలు స్మరించుకుందాం.

భగవద్గీత:-
క్లుప్తంగా గీత

సందర్బం,చరిత్ర,కాలం,దాన్లో ఉన్న విషయం గురించి తెలుసు కుందాం?

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము.

కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి.

సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

భగవద్గీత కాలం:-

భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.

గీతా శ్లోక సంఖ్య:-

భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:

షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవఃఅర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయఃధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే

దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.

ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలొ (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.

భగవద్గీత ఆవిర్భావం:-

యోగములు:-(రామాయణం లో కాండముల వలే గీత లో యోగములు ఉన్నాయి)

1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస

భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధిశ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత విశిష్టత:-

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు.

భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనఃపార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్శ్రీ. కృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)

నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)

నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

భగవద్గీతలో ముఖ్య విషయాలు :-

;గీతా సారము_

(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)

కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.

కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.

భగవద్గీత విభాగాలు:-

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అర్జునవిషాద యోగము:-

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

సాంఖ్య యోగము:-

సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి(ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.

కర్మ యోగము:-

కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన

యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.

ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.

జ్ఞాన యోగము:-

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

కర్మసన్యాస యోగము:-

ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

ఆత్మసంయమ యోగము:-

ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

జ్ఞానవిజ్ఞాన యోగము:-

విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

అక్షరపరబ్రహ్మ యోగము:-

బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

రాజవిద్యారాజగుహ్య యోగము:-

కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -

" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

విభూతి యోగము:-

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.

విశ్వరూపసందర్శన యోగము:-

భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.

అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

భక్తి యోగము:-

పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:-

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.

క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

గుణత్రయవిభాగ యోగము:-

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

పురుషోత్తమప్రాప్తి యోగము:-

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.

దైవాసురసంపద్విభాగ యోగము:-

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------

భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము,క్షమా,ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.

ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.

శ్రద్దాత్రయవిభాగ యోగము:-

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?

మోక్షసన్యాస యోగము:-

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. 🙏�

సేకరణ

జీవన్ముక్తి - అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం?

🕉️జీవన్ముక్తి - అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం?🕉️

📚✍️మురళీమోహన్

🤘ఉర్వారుక మివ బంధనం అంటే...
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం, అద్భుతంగా గుడి కడతారు, తీరికగా అలంకారాలు అద్దుతారు, తోచినంత సేపు హాయిగా ఆడుకుంటారు, పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు.
కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటి దారి పడతారు, అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు...
‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం, పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.

‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే...
‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో.. ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో.. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో.. ఆట ముగిసే సమయానికి, వాటిని అదే విధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది...

వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది.
పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే..
ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది, అవి ఒక దాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి...

అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగా పెనవేసుకొని ఉంటాడు.
పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.
దోసపండు మిగల ముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది, ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది.
అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి, అంత వరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది...

ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచు కోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.

సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర యొక్క మహోపదేశం..
‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన..
అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది.
మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది, అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు...🙏

సేకరణ

మనిషి ఎలా బతకాలంటే

🥀 మనిషి ఎలా బతకాలంటే..🥀

📚✍️మురళీమోహన్

🧘‍♂️ తృష్ణాం ఛిన్ది భజక్షమాం జహిమదం పాపేరతిం మా కృథాః
సత్యం బ్రూ మ్యనుయాహి సాధుపదవీం నేవస్య విద్వజ్జనమ్‌
మాన్యాన్మానయా విద్విషో ప్యనునయం
ప్రఖ్యాపయ ప్రశ్రయం

కీర్తిం పాలయ దుఃఖితే కురుదయా, మేతత్సతాం చేష్టితమ్‌

ఆశ లేకుండటం, ఓర్పు కలిగి ఉండడం, గర్వం లేకుండడం, పాపాలను కలిగించే పనులు చేయకుండడం, నిజమే చెప్పడం, పండితులకు, ఆర్యులకు ప్రీతిని కలిగించే విధంగా ప్రవర్తించడం, సజ్జనులకు సేవలు చేయడం, నిర్మలమైన మనసుతో ఉండడం, శత్రువులను సైతం హితవచనాలతో ఓదార్చడం, పూజ్యులందు ప్రేమ, విధేయతలు కలిగి ఉండడం, దీనుల యెడ దయ కలిగి ఉండడం అందరూ ఆచరించదగ్గ మంచి పనులని దీని అర్థం. శాస్త్రమర్యాదననుసరించి ధర్మమార్గంలో ఆశను అదుపులో పెట్టాలి.

అలా చేస్తే అశాంతి అంతరిస్తుంది. జీవితం సుఖమయమౌతుంది. వ్యక్తికి తెలియకుండానే స్వార్థభావం తగ్గిపోయి సమానత్వం హృదయంలో స్థాపితమౌతుంది. అలాగే, మనిషికి ఓర్పు చాలా ముఖ్యం. అది అన్ని సద్గుణాలకూ ఆలవాలం. ఓర్పుతో తొందరపాటు తొలిగిపోతుంది. వ్యక్తికి నిత్యం తాను చేసే కార్యకలాపాలలో మంచిచెడ్డలను గమనించే తార్కిక శక్తి కల్గుతుంది. దీనివల్ల మంచిని మాత్రమే పాటిస్తాడు. మూర్ఖులు వివేకవంతులను కారణం లేకుండా అశాంతికి లోను చేయడానికి ప్రయత్నించినప్పుడు ఓర్పు అనే వజ్రాయుధంతో వాని చెడు తలంపును ఖండిస్తాడు. ఇక, గర్వం.. మంచి వ్యక్తిత్వాన్ని దరిజేరనీయకుండా చేస్తుంది. ప్రగతి మార్గాన్ని నిరోధింపజేస్తుంది. మానవుడు జీవితాంతం నేర్చుకునే పద్ధతిలో ఉండాలి. కానీ, గర్వం తనకంతా తెలుసుననే దురుద్దేశాన్ని కలిగేలా చేస్తుంది. పురోగతికి అడ్డుపడుతుంది.

పాపకార్యాల దుష్ఫలితం యమపాశమై బాధిస్తుంది. పాపకార్యాలు అనేకవిధాలు. త్రికరణాలని చెప్పబడే మనసును, మాటను, కాయాన్ని పాపకార్యాల జోలికి పోనివ్వకూడదు. మనోవాక్కాయ కర్మలు పవిత్రమైన పద్ధతిలో పయనిస్తే మనిషి మాన్యత పెరుగుతుంది. అందుకోసం మనసు ఇంద్రియాలను సన్మార్గంలో నడిపించాలి. వాక్కు (మాట) మంచిగా ఉండాలి. మంచిమాట ద్వారా మణులు కురిపించాలి. చెడ్డగా మాట్లాడి చేటు తెచ్చుకోకూడదు. మాటతో మంచికి కోటకట్టాలి. ఇక.. కలియుగంలో సత్యం తపస్సుతో సమానమని రామకృష్ణ పరమహంస బోధించారు. ఎంతోమంది మహనీయులు సత్యదీక్షలో నెగ్గి ఆదర్శవంతులయ్యారు. అలాగే, జీవితంలో ఎదగాలంటే పండితుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. తత్ఫలితంగా సదాలోచన, సత్వగుణ సంపన్నత, సత్కార్యాచరణ కల్గుతాయి. సజ్జనసాంగత్యం సర్వదోష నివారిణి. ఇక, దయాగుణం ధర్మమార్గాల్లో ఉత్తమమైంది. దీనులను అన్నివిధాలా ఆదుకోవడం మానవుల మాన్యతకు నిదర్శనం. అన్నదానం, ధనదానం, విద్యాదానం, వస్త్రదానం, శ్రమదానం విరివిగా చేయాలి. వీటిని అందరూ పాటిస్తే మానవత్వం పరిమళిస్తుంది. 🤘

సేకరణ

🍁యక్ష ప్రశ్నలు – జవాబులు*

🍁యక్ష ప్రశ్నలు – జవాబులు🍁

📚✍️మురళీమోహన్

🙏మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో
ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి
లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ
బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని
పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి
వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు.
నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే
విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు.
చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే
నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో
అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ
సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ
తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి
పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ
దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ
ప్రశ్నలు ఇవే!!!
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో
72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు🤘

సేకరణ

సద్గురూ! నేను ‘సాధన’ చేసేటప్పుడు, మగతగా నిద్రమైకంతో ఉంటాను. నేను ఇది అలసట వల్లనేమో అనుకున్నాను, కాని నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కూడా నిద్రపోతాను. నేను ధ్యానం చేసేటప్పుడు మెలకువగా ఎలా ఉండగలను ?

🍁ప్రశ్న : సద్గురూ! నేను ‘సాధన’ చేసేటప్పుడు, మగతగా నిద్రమైకంతో ఉంటాను. నేను ఇది అలసట వల్లనేమో అనుకున్నాను, కాని నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కూడా నిద్రపోతాను. నేను ధ్యానం చేసేటప్పుడు మెలకువగా ఎలా ఉండగలను ?🍁

📚✍️మురళీమోహన్

సద్గురు :- మొదట మనం నిద్ర అనేది ఏమిటో అర్థం చేసుకుందాం. మీ రోజువారీ జీవితంలో, పగటిపూట ఏ సమయంలోనైన మీకు నిద్ర వస్తూ, మిమల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మొదట మీ ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. మీ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందేమో తెలుసు కోవాలి. శారీరికంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీరు మామూలు కంటే ఎక్కువ నిద్ర పోయే అవకాశం ఉంది – శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.

రెండవ విషయం మీరు తినే ఆహారం. ఆరోగ్యం కోసం కొంచెం శాకాహార పదార్థాలు, ముఖ్యంగా వండనివి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆహారం వండినప్పుడు, అందులోని ‘ప్రాణశక్తి’ చాలా వరకు నాశనం అవుతుంది. మీకు నిద్రమత్తు కలగడానికి ఇదొక కారణం. మీరు కొంత వండని ఆహారం తింటే, ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా, వెంటనే జరిగే ఒక విషయం ఏమిటంటే మీ నిద్రావసరాలు బాగా తగ్గుతాయి.

మీ చురుకుదనానికి, మీ శక్తి వ్యవస్థకు సంబంధం ఉంది. మీ శక్తి వ్యవస్థని మీరు ఎంత జాగ్రత్తగా నియంత్రిస్తే, మీలో చురుకుదనం అంత మెరుగ్గా ఉంటుంది. మీరు ధ్యానం చెయ్యాలనుకుంటే, మీ అప్రమత్తత కేవలం మీ మెదడు నుంచే కాదు, మీ ప్రాణ శక్తి నుంచీ రావాలి. దీనికి తోడ్పడేందుకు, సాధారణంగా, యోగ మార్గంలో ఉన్న వారికి, మీరు కేవలం ఇరవై నాలుగు ముద్దలు తినాలని, ప్రతి ముద్దను కనీసం ఇరవై నాలుగు సార్లు నమలాలని చెప్తారు. అప్పుడు మీ ఆహారం ఇంకా మీ జీర్ణ కోశంలోకి వెళ్లకముందే, మీ నోటిలోనే చాలా వరకు జీర్ణమయ్యి, మీలో మాంద్యాన్ని కలిగించకుండా ఉంటుంది.

సాయంత్రం మీరు ఈ విధంగా భోజనం చేసి, రాత్రి నిద్రపోతే, మీరు తేలికగా ఉదయం మూడున్నరకే నిద్ర మేలుకో గలుగుతారు, ధ్యానం చెయ్యగలుగుతారు.

యోగ శాస్త్రంలో ఈ సమయాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఇది నిద్ర లేచేందుకు సరైన సమయం, ఎందుకంటే ఆ సమయంలో మీ ‘సాధన’ కు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది. దాని నుండి మీకు అదనపు సహాయం ఉంటుంది. మీరు తలస్నానం చేసి మీ తలను తడిగానే ఉండనిచ్చి, సాధన చేసుకుంటే, మీకు, ఎనిమిదింటి దాకా అంటే సుమారు మీ సాధన ముగిసేంత వరకూ మీరు చురుకుగానే ఉంటారు. మీరు పొద్దున్న భోజనం చేసేటప్పుడు కూడా కేవలం ఇరవై నాలుగు ముద్దలను తింటే, మీకు రాత్రిభోజన సమయం వరకూ ఎటువంటి మగతా ఉండదు. గంటన్నర లేక రెండు గంటల తరువాత మీకు ఆకలిగా అనిపిస్తుంది, అది మంచిదే. కేవలం కడుపు ఖాళీగా ఉన్నది కదా అని, మీరు ఆహారం తేసుకో అఖర్లేదు. కేవలం మంచినీళ్ళు తాగండి, మీరు రోజంతా చురుకుగా, శక్తిమంతంగా ఉంటారు. ఇది మీ శరీర వ్యవస్థకూ మంచిది, మీరు తిన్న ఆహారాన్ని వృధా చెయ్యకుండా, మీరు తిన్న ఆహారాన్ని బాగా ఉపయోగించడం నేర్చుకుంటుంది. ఆర్థికంగా, పర్యావరణపరంగా కూడా ఇది ప్రపంచానికి, మీ ఆరోగ్యానికి మంచిది – మీరు ఈ విధంగా తింటే మీకు అనారోగ్యం కూడా కలగదు. 👍

సేకరణ

🍁త్రివిధ త్యాగాలు🍁

🍁త్రివిధ త్యాగాలు🍁

✍️మురళీమోహన్

👉 ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.

చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా?

లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.

అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.

మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.

రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.

మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి.

ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?

ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి

కృష్ణార్పణం

==============================

సేకరణ

మీరు ఎప్పుడైనా* *నిజముగా మీకు ఏమి కావాలో ఆలోచించారా*

🤔🍁 మీరు ఎప్పుడైనా నిజముగా మీకు ఏమి కావాలో ఆలోచించారా 🍁🤔

✍️మురళీమోహన్

👌 సద్గురు :- మీరు ఎప్పుడయినా నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నాను ? ఎందుకు బ్రతకాలి ? ఏమి సాధించడానికి బ్రతకాలి ?నేను ఏమి సాధిస్తున్నాను ? అని ప్రశ్నించుకున్నారా ?

నిరంతరం లెగవడం , స్నానం చేయడం ,తినడం ,వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్లడం ,సాయంత్రం వరకు లేక రాత్రి వరకు పనిచేయడమే ,ఉద్యోగం చేయడమో ,వ్యాపారం చేయడమో తరువాత ఖాళీ ఉంటే ఒక మూవీ కి వెళ్లడమో ,లేక నిద్రపోవడమో చేయడం .మరలా మరునాడు మరలా దినచర్య యదా ప్రకారం కొనసాగడమే .

ఇదేన జీవితం ? ఇందుకేనా తల్లి కడుపు చీల్చుకుని వచ్చినది !. అందరు బ్రతుకుతున్నట్లే బ్రతికి చనిపోవడమేనా ? ఇదేనా జీవితము ? మీరు చూస్తున్న సినిమా హీరోలు వారి జీవితానికి ఒక సార్థకత ఏర్పరుచుకోవడానికి వచ్చి తాము ఈ ప్రపంచానికి ఒక గొప్పగా తమ జీవితాన్ని రూపు దిద్దుకుని ఈ ప్రపంచానికి నేను ఒక హీరోని అని చూపెట్టుకుని ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నిరూపించుకుంటున్నారు .

మీరు ఎంకరేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మేన్స్ ఆటలు ఆడి తాము ఏమిటో చూపెట్టుకుంటున్నారు .

మరి మీరు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు ? ప్రశ్నించుకున్నరా ? మీకు చాలి చాలని జీతంతో ,మీరు పెట్టిన పెట్టుబడికి రావలసిన లాభాలు రాక అంది అందని లాభాలతో ,ఎప్పుడు నా కోరిక తీరుతుందో అని వాపోతూ మీకు తెలిసిన ,తెలియని వారితో చెప్పుకుంటూ బాధతో జీవిస్తూ బ్రతకడమేనా జీవితం . ఇందుకేనా బ్రతికేది ?

ఆలోచించండి మీరు అందరిలాగా పుట్టి ,బ్రతికి ,చావడానికి ఈ భూమి మీదకు రాలేదు .మీరు ఎవరినైతే గొప్పగా చూస్తున్నారో వారి కంటే గొప్పగా ఎదగడానికి వచ్చారు .ఎప్పుడూ మీరు వారు గొప్పవారు ,వీరు గొప్పవారు అని చెప్పుకోవడమేనా ? మిమ్మల్ని గూర్చి ఈ ప్రపంచానికి ఎప్పుడు చూపెడుతారు ?ఆలోచించండి .

మీరు ఎందుకు పనికిరాని వారిననుకుంటున్నారా ? మీరు సాధారణ మనుష్యులు ,గొప్పగా ఎదిగినవారందరు అసాధారణ మనుష్యులనుకుంటున్నారా ? అందరు అమ్మ కడుపులోనుంచి వచ్చినవారే .వేరే గ్రహం నుండి ఈ భూమి మీదకు వచ్చినవారు ఎంతమాత్రమూ కారు .కాకపోతే వారి సామర్థ్యం చూపెట్టుకోవడానికి వచ్చారు .మీరు వారి సామర్థ్యం చూడడానికి వచ్చారు .అదే భేదం .అంతకన్నా ఇంకేమి లేదు .

ఈ భూమిమీదకు పశుపక్షాదులు వచ్చి పుట్టి చనిపోతున్నాయి .మీరు కూడా ఎందుకు పుట్టామో ,ఎందుకు చనిపోతున్నామో తెలుసుకోకుండా చనిపోతున్నారు .మార్చుకోండి ఎంతసేపు వారినో ,వీరినో చూడడం పొగుడుకోవడం కాదు మిమ్మల్ని గూర్చి పొగుడుకునే విదంగా ఎదగండి .ఎవరికి వారు ఎదిగితే మనల్ని ఎవరు పొగుడుతారు అనుకుంటున్నారేమో ,ఈ వాక్యం తెలియక ఇప్పటి మీరు ఎలాగైతే వున్నారో మీక్రింది వారు వుంటారు మిమ్మల్ని గూర్చి పొగడడానికి .

ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు .గ్రహించండి .మీకు మిరే సాటి .మీకు రారు మరెవ్వరు సరిసాటి .గ్రహించండి .లోపం ఎక్కడ వస్తుందంటే.మీరు చాలా చిన్నవారు అనుకోవడమే లోపం .

మీరు చిన్నవారు ఎప్పటికి కారు మీలో ఉన్న భయమే ,బిడియమే ,మిమ్మల్ని చిన్నవారిగా మీకు మీరు మాత్రామే కనబడుతున్నారు .ఆ విధంగా కనబడడము వల్లనే మిమ్మల్ని మీరు మరచిపోయి చిన్నవారిగా అందరికి కనబడుతున్నారు ..........

సాధన చేయండి ఎవరిని వారు ఉద్దరించుకోండి .ఎవరూ ఎవరినీ ఉద్దరించలేరు ,ఎవరిని వారు మాత్రమే వునరుద్దరించుకోవాలి .

మీకు ఉన్న అనారోగ్యము గూర్చి ,ఆర్థిక ఇబ్బందుల గూర్చి ,సామాజిక సమస్యల గూర్చి ,మీకు ఉన్న ఆధ్యాత్మిక చింతలను గూర్చి .వాపోతూ ,ఎదగలేక పోతున్నాను అని బాధపడడం మానండి .మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి .మీలో నిద్రాణంగా ఉన్న గొప్పతనాన్ని వెలుపలకు తీయండి ......🙏

సేకరణ

ఆచారాలు - శాస్త్రీయత

🍁 ఆచారాలు - శాస్త్రీయత🍁

✍️మురళీమోహన్

👌 ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే అనేక
అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి.
.
ఉదాః దక్షిణము వైపు చూస్తూ పడుకోరాదు. అది యమ స్థానమ్..
ఈ మధ్య పేపరులో చదివాను..అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారట...అలా పడుకోరాదని, భూమ్యాకర్షణ శక్తి వల్ల జరిగే మాగ్నెటిక్ ఫీల్డ్స్ కారణముగా బుర్రలో చెడు పరిణామాల గూర్చి.
మరి మన వాళ్ళు యముడు అన్నది అందుకే కదా... ఇలాంటివన్నమాట

మన వాళ్ళు బ్రహ్మముహూర్తం లో ధ్యానము జపాదులు చెయ్యడం ఉత్తమం అని సూచించారు. OBE(out of body experience) సమాధి స్థితిలో మొదటి దశ గురించి పాశ్చాత్యులు కనుగొన్న విషయం ఏంటంటే ఎక్కువ శాతం obe లు పొద్దున 4 నుంచి 6.30 మధ్యలో జరుగుతాయని కనుగొన్నారు. వారు obe లో చెప్పిన అంశాలు ఒక సాధకుడికి మూలాధారం జాగృతం అయినప్పుడు కలుగుతాయి

రాత్రిళ్ళు చెట్టుకింద పడుకుంటే దెయ్యాలు వచ్చి గుండెల మీద కూర్చుంటాయి అని చెప్పేవారు. ఇప్పుడు CO2 వల్ల ఊపిరి ఆడదు అంటున్నాము

మన పూర్వీకులు ఆచారాలుగా చెప్పిన విషయాలను logic గా ఆలోచించి ఇవి శాస్త్రీయ మైనవని అంటారు. విదేశీయులు... వాటిని నమ్మి పరిశోదనలు చేసి అవి నిజము అని నిరూపించు చున్నారు.
Ex: ఏకాదశి నాడు ఉపవాస లేదా నిరాహార దీక్ష ఆరోగ్యానికి మంచిది అని మన పూర్వీకులు చెప్పారు. ఒక జపాన్ శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధి కి విరుగుడుగా సంవత్సరములో 28 రోజులు, ఒక రోజు లో 10 గంటలు కడుపు ఖాళీ గా ఉంచితే క్యాన్సర్ వ్యాధి రాదు అని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందాడు.
కనుక సనాతన ధర్మాలు, ఆచారాలు అన్నికూడ TESTED, పామరులు కూడా సులభంగా ఆచరించే విధంగా ఆచార వ్యవహారాలను మన పూర్వీకులు నియమించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.

సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి, సూర్యునికెదురుగా నిల్చిని సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్పారు పెద్దలు. హుష్.. సెకండ్ షో సినిమా/ లేదా టివీ/ లేట్ నైట్ పార్టీ.. ఆ పైని కబుర్లు, పడుక్కునే సరికి దాదాపు రెండు దాటుతుందా.. మరి సూర్యుడు రాకుండా లేవాలిట.. అది చాదస్తం. కానీ ఇప్పుడు, అలా చేస్తే ఏమవుతోంది? వైటమిన్ డి లోపం, ఎండలో కూర్చోండి.. అదీ పొద్దుటి పూటైతే డి విటమిన్ బాగా శరీరంలో ఏర్పడి, కాల్షియం బాగా ఎముకల్లోకి వెళ్తుంది. పొద్దున్నే యోగా చెయ్యండి.. అంటూ డప్పు తీసుకుని మరీ చెప్తే వింటామండీ.

ఎక్కడైనా ఎప్పుడైనా ఎత్తున కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు....
ఇలా చేస్తే దరిద్రదేవతకు ఆహ్వానం అని పెద్దల హెచ్చరిక
ఇప్పుడు... అలా వూపడం వలన నరాలు దెబ్బతినడమో, బలహీనపడడమో ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నట్లు దశాబ్దాలకిందటే చదివాను.

గాయాలపై తులసి పసరు రాస్తే చాదస్తమనేవారు.
నేడు .... తులసి ఆయింట్మెంట్ చాలా మంచిదంటారు కదా..

ఉదయం పరగడుపున రాగి చెంబులో నీరు త్రాగమన్నారు మనపెద్దలు. అది చాదస్తంగా తలచి మానివేశారు. ఇప్పుడు రాగి పాత్రలో రాత్రంతా నిలవ వున్న నీరు తాగితే మీఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అందుకని ఇప్పుడుచాలామంది రాగి వాటర్ బాటిల్ లోనీరు తాగుతున్నారు. ఏదైనా శంఖంలో పోస్తేనేగానీ తీర్థంకాదు.

పని మనుషులు అన్నీ ముట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు . ఇప్పుడు అన్నీ ఇతరుల చేత చేయించుకుంటుంన్నందు వలననే శరీరం విశాలంగా పెరిగిపోతోందని తేల్చారు సూర్యోదయం కాకముందే లేవాలి
అనే నియమం ఒకటుంది. మనకు దీనికి కారణం ఏమంటే పగలు రాత్రి అనేక తిండిపదార్థాలు తింటాము రాత్రిపడుకునే ముందు చెంబెడు నీరు త్రాగిపడుకోమన్నారు. మనం నిద్రించిన తరువాత జఠరం బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు నెడుతుంది. మలముమూత్రముల ద్వారా కొంత చెమట ద్వారా కొన్ని వ్యర్థాలు మరియు ఇంకా కొంత మలినము ఫాలభాగాన పేరుకుంటుంది. ఇది సూర్యోదయమైతే మరలలోపలి కెళ్ళిపోతుంది. అందుచే బద్ధకం తలనొప్పి మొదలగునవి ఏర్పడుతాయి కావున సూర్యోదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని ముఖప్రక్షాళనంచేసుకుంటే ఆ రోజల్లా ఉత్సాహంగా ఉంటుందారోగ్యం. అందుకే సూర్యోదయానికిముందులేవమన్నది .కాని వింటున్నారా మనవాళ్ళు?
బయట ఆహారం తినద్దు..
పొద్దున్నే లేవండి..
నీళ్ళు చక్కగా తాగండి...
ఉతికిన వస్త్రాలనే ధరించండి...
చాతీ, పొట్ట భాగాలను నొక్కి వుంచే బట్టలను వేసుకొనివ్వకండి...పిల్లలని, మగవాళ్ళని,
6 కల్లా శరీర మలినాలు విసర్జించే వ్యవస్థ ని అలవాటు చేసుకోండి.
వెంటనే స్నానం చేయండి.
జుట్టుని ఎక్కువ సేపు దువ్వండి...
ఇంట్లో వెంట్రుకలు లేకుండ... తల్లో పేలు లేకుండా చూసుకోండి...
వీలైనంత...మౌనం గా వుండటానికి ప్రయత్నం చేయండి...
కొద్ది ఆచారాలు పాటించండి. శరీరానికి పని చెప్పండి... పాత అలవాట్లు మళ్ళీ జీవితం లోకి తెచ్చుకుందాం..🙏🙏🙏🙏🙏

సేకరణ

👉పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ'మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.*౼🤘

_👉పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ'మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.౼🤘


🤘'జాతస్య హి ధ్రువో మృత్యుః' అంటుంది మన గీత. పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం.

మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ'మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.

ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్‌ అంటే అనేకం. ఏకం, అనేకం కలిసి యూనివర్స్‌ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి.

కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.

మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి.

వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది.

తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్షంలోని 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి.

మన నక్షత్రాలు 27 అయినా అభిజిత్‌తో కలిపి 28 కదా! మాయ అంటే మనమెవరో తెలియకపోవడం. ఒకటి అనేకం కావడమే సృష్టి. ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం. అదే మరణం కూడా.

మనిషి పుట్టుకకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే రుతువు (బహిష్టు). మనుషులలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఈ బహిష్టు ప్రారంభమైన క్షణం నుంచి 24 గంటలు ఒకరోజు.

అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల. నెల అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. నెలరాజు, నెలపొడుపు అనే పదాలు ఇలా ఏర్పడినవే.

బహిష్టుకు 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరుతుంది.

శిశుజననంతో రుతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం.

భగవంతుడు తన శరీరంలో నాలుగో వంతు భాగంతో సృష్టిచేశాడని పురుషసూక్తం అంటోంది. కాలచక్రానికి సూర్యుడే ఆధారం.

సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు అవుతుంది.

ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది.

120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ, శ్రవణాల మధ్య అభిజిత్‌ నక్షత్రం ఉంటుంది.

ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్రాన్ని పరాశరమహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హోర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి.

27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు.

నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది.

120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే.

ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు. అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు.

మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15. రోజుకు 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తాయి. 12 రాశులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు, కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది.

తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది. ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది.

మనం యోగశాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.

మరణం అంటే శరీరం మార్పునకు లోనవడం.

ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు.

ఇక ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మ ఫలితాల గురించి అంటారా... సత్కర్మ ఉన్న వారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయి.

ఆ సత్కర్మ బలం లేనివారు ఎక్కడెక్కడో తిరుగుతూ వేల రూపాయల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటారు.

అణువుకూ ఆత్మకూ తేడా ఏమీ లేదు.

ఇదంతా సూర్యకాంతి శక్తి. మన జీవితాలన్నీ సూర్యకాంతి శక్తితో ప్రేరణపొంది నడుస్తున్నాయి. ఈ సూర్యకాంతే సృష్టి, స్థితి, లయలకు మూలం.

ఈ అనంత సూర్య శక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రీ మంత్రం కూడా చెబుతోంది.
ఇవన్నీ భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. వేదాలు, ఇతిహాసములు,
పురాణములు, స్మృతులు వీటి గురించి విస్తారంగా తెలుపుతున్నాయి. దేశ విదేశాల్లో పరిశోధకులు చేసి అనుసరిస్తున్నారు.🙏🙏

సేకరణ

Tuesday, December 14, 2021

👵జయహో జనయిత్రి*👵

👵జయహో జనయిత్రి👵

✍️మురళీ మోహన్

🙏సద్గురు: ప్రతి స్త్రీ కూడా తాను ఒక వ్యక్తిగా ఏమి చేయాలని కోరుకుంటే అది చేయాలి. అదేదో సమాజంలో ఒక ధోరణిగానో లేకపోతే ప్రపంచంలో అదొక్కటే చేయదగిన పనిగానో చిత్రించకూడదు. ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని కని వారిని పెంచి పెద్దచేయాలనుకుంటే అది ఆమెను రోజంతా పనితో తీరిక లేకుండా చేస్తుంది. ఆమె బయటికి వెళ్లి ఉద్యోగం చేయకోడదని నేననటం లేదు. ఒక వ్యక్తిగా ఆమె ఏమి కోరుకుంటే అది చేయవచ్చు. ఆ స్వేచ్ఛ ఆమెకుంది. కానీ ఇద్దరు పిల్లలుండడమంటే కేవలం పునరుత్పత్తి కాదు. మీరు తరువాతి తరాన్ని తయారు చేస్తున్నారు. రేపటి ప్రపంచం ఎలా ఉంటుందన్నది నేటి తరం తల్లుల స్వభావమే నిర్ణయిస్తుంది.

‘‘మీరేం చేస్తున్నారు?’’ అని నేను మహిళలను అడిగినప్పుడు, చాలా మంది‘‘ఏమీలేదు, నేను ఇల్లాలిని మాత్రమే’’ అని చెప్తుంటారు. ‘‘నేను కేవలం ఇల్లాలినే అని మీరెందుకు చెప్తారు?’’ అని అడుగుతాను నేను. ఇద్దరు ముగ్గురు జీవితాలను పెంచి పోషించడంలోని ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తిస్తున్నట్లు నాకనిపించడం లేదు. అది చాలా ముఖ్యమైన పని. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ వంటి మాటలెప్పుడూ మా అమ్మ నాతో అనలేదు. కాని ఆమె జీవించిన పద్ధతి ఎలాంటిదంటే ఆమె మమ్మల్ని ప్రేమించిందా, లేదా అన్న ఆలోచనే మాకెప్పుడూ రాలేదు. ఆమె జీవితమంతా మాకే అంకితమైపోయింది కాబట్టే అటువంటి ప్రశ్న ఎప్పుడూ తలెత్తలేదు. ఆమె మాకోసమే జీవించిందని మాకు తెలుసు. ఆ కాలంలో ఆవిడ మాతో లేని జీవితాన్ని అసలు నేను ఊహించను కూడా లేను.

నేనేమిటి అన్న విషయంలో మా అమ్మ ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించలేదు, కాని ఆమె నా చుట్టూ కల్పించిన వాతావరణమే లేకపోతే నేను ఇప్పుడున్నట్టుగా ఎప్పటికీ ఉండగలిగేవాడిని కాదు. అటువంటి వాతావరణాన్ని కల్పించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది, ఇదెక్కడో తన పాత్ర పోషిస్తుందని ఆమెకు సంపూర్ణంగా తెలుసు. నా విషయంలో ఆమె చేసిన అతి ముఖ్యమైన పని ఇది. ఇది ముఖ్యమైన పని కాదని ఎవరైనా ఎందుకనుకుంటున్నారు? మా చిన్నతనంలో మేము దేని గురించీ ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. మాకు కావలసిన ఆధారం ఎప్పుడూ ఉండేట్లు ఆమె చూసింది. మా చుట్టూ ఏం జరుగుతున్నా, దాన్ని పట్టించుకోకుండా మేము కాలం గడిపేయగలిగాం; రోజుల తరబడి కళ్లు మూసుకొని కూర్చునే అవకాశాన్నిది నాకిచ్చింది.

ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఆర్థిక చట్రమే. డబ్బు అంటే మీకు కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం. పురుషులు, వారి కుటుంబానికి కావలసినవి సమకూర్చుకునే పనిచేస్తుంటే స్త్రీలు జీవితంలోని మరింత సుందరమైన అంశాలగురించి మాట్లాడేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా సంపాదనలో పడాలని కోరుకుంటున్నారు. కుటుంబానికి అటువంటి అవసరం ఉంటే మంచిదే, ఆమె అలాగే చేయవచ్చు. కాని ఇది ఆమె చేయవలసిన పనుల్లో సంపాదనే మెరుగైన పని అన్న భావనను స్థిరపరచకండి. ఆమె పాడగలిగితే, సంగీత వాద్యాలు వాయించగలిగితే, వండగలిగితే – లేదా తన పిల్లల్ని ప్రేమిస్తే – ఆమె అందంగా ఓ పువ్వులాగ జీవించగలుగుతుంది – అది చాలు కదా.

స్త్రీ డబ్బు సంపాదిస్తేనే విలువైన పని చేస్తున్నదనుకోవడం సరైనది కాదు. ఆర్థికావసరం ఉంటే, ఆమెకటువంటి కోరిక ఉంటే, ఆమె అలాగే చేయవచ్చు. కాని లోకంలో మనం అటువంటి విలువలు స్థాపించవలసిన అవసరం లేదు. అది సమాజవికాసం కాదు; జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే జీవనోపాదే ఎక్కువ ముఖ్యమన్న తిరోగమనమైన చర్య అవుతుందది.🤔

సేకరణ

🍁సుఖ దుఃఖాలు🍁

🍁సుఖ దుఃఖాలు🍁

✍️మురళీమోహన్

🤘మనిషి జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. జీవితమంతా దుఃఖమయమంటారు కొందరు.
దుఃఖం సుఖానికి భూమికలాంటిది.

పూలవద్ద ఉన్న ముళ్లు పూల రక్షణ కోసమే. దట్టమైన చీకట్లో దీపకాంతి లభించినట్లుగా ముందుగా కష్టాలను అనుభవించాకనే సుఖానుభవం పొందడం ఆనందకరమంటాడు భాసమహాకవి. మనిషికి కష్టాలు, దుఃఖభావనలు, అలసట, ఆందోళన లేకపోతే లౌకిక జీవితం నిస్సారమవుతుంది.

కుంతీదేవి కృష్ణ భగవానుడితో ‘స్వామీ! మళ్ళీ మళ్ళీ విపత్తులే కలిగేలా చెయ్యి, విపత్తుల్లోనే నిన్ను శరణు వేడుకుంటాం. నువ్వొక్కడివే దుఃఖాన్ని దూరం చేసేవాడివని విపత్తులు మాకు బోధించాయి. సుఖాల్లో ఉన్నవారిని నువ్వు పట్టించుకోవు... నీ సంపర్కం కలిగించే విపత్తులే మాకు సంపదలతో సమానం’ అంటుంది.

బొమ్మలతో ఆడుకుంటున్న పిల్లవాణ్ని తల్లి పట్టించుకోదు. కడుపు నొప్పనో, కాలు నొప్పనో ఏడుస్తుంటే పరుగెత్తుకొస్తుంది.

దుఃఖంనుంచి
పారిపోకూడదు. ఒక సవాలుగా స్వీకరించాలి.

బంగారం శుద్ధం కావాలంటే నిప్పుల్లో పడాలి.

వెదురును విరిస్తేనే వేణువవుతుంది.

శిలను చెక్కితేనే దేవతామూర్తి ఉద్భవిస్తుంది.🤘

సేకరణ

🍁మీ లక్ష్యం ఎలా ఉండాలి?🍁

🍁మీ లక్ష్యం ఎలా ఉండాలి?🍁

✍️మురళీమోహన్

🍁 సద్గురు: మన మనస్సును మనకు కావాల్సిన వాటిపై కేంద్రీకరించడం ద్వారా జీవితంలో కొన్ని సాధించవచ్చు. అయితే, మనం దేన్ని సాధించడం అంటున్నామో దాని నిర్వచనం మార్చుకోవాలి. మీరు కోరుకున్నది మీకు దక్కడం అనేది మీరేదో సాధించినట్లు కాదు. మనిషి స్వభావాన్ని వ్యక్త పరచుకోవడానికి ఇదో చిన్న ప్రయత్నం. ముఖ్యంగా ఇది నాకు పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. ఈ వైఖరిని మార్చాలన్నది నా ఉద్దేశం.

వృత్తి, మానవ సంబంధాలు – మీరు చేర్చినట్లుగా – కమ్యూనిటీ ప్రాజెక్టులు, ఇవి కూడా ఒక రకంగా వృత్తిలాంటివే – మీరు కోరుకొనేవన్నీ భౌతికమైన విషయాలు. ఉదాహరణకు ఒక ఆటో రిక్షాను తీసుకోండి. ముగ్గుర్ని తీసికొని వెళ్లాల్సిన ఆటోలో పదిమందిని ఎక్కించుకొని తీసుకొని వెళతారు. డ్రైవర్ దాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఏదో లాగా కొండమీదికి తీసుకొని వెళ్లగలుగుతాడు; అతనిది ఒక విజయంగా భావిస్తాడు. ఆటో ఆపి చాయ్ తాగి విజయోత్సవం జరుపుకుంటాడు. వ్యక్తిగతంగా, ఆర్థిక లాభం దృష్ట్యా ఇది ఉపయోగకరమే కాని, అదొక విజయమో, ఒక దర్శనీయక విశేషమో కాదు. ఇదో చిన్న కోరిక, దీన్నిఅనేక విధాలుగా తీర్చుకోవచ్చు.

ఇటువంటివి ప్రజలు మనస్సులో గొప్ప విషయాలుగా కనిపించడానికి కారణం, వారు తమ లక్ష్యాలను ఒక పద్ధతిలో ఏర్పరచుకోవడమే. ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం ప్రారంభంలోనే మేమీ విషయాలు మాట్లాడతాము; యోగాలో మేము ఏం చెప్తామంటే మీరు లక్ష్యం మీద ఒక కన్ను ఉంచితే, మీరు ఆ లక్ష్యం చేరుకోవడానికి దారి వెతుక్కోవడానికి ఒక కన్నే ఉంటుంది. ఒంటి కంటితో ఉన్న ఓ మనిషి, తన ఇంటికి తోవ కనుక్కోవడమే ఓ గొప్పపని అనుకుంటాడు. అయితే రెండు కళ్లూ చక్కగా కనిపించే వ్యక్తికి ఇందులో గొప్ప తనమేమీ కనిపించదు. అతను తేలికగా తన ఇల్లు కనుక్కోగలడు.

మనిషి సామర్ధ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయకుండా, మనం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నాం. అప్పుడు, తక్కువ సామర్ధ్యం ఉన్న ఈ చిన్న యంత్రంతో, (కొండ ఎక్కగలిగినంత సామర్థ్యం లేని ఈ యంత్రం), ఈ చిన్న చిన్న లక్ష్యాలను సాధించడమే ఒక గొప్ప కార్యం సాధించినట్లుగా అనుకొంటూ ఉంటాం. కాని అదే తనను తాను మరింత శక్తిమంతమైన యంత్రంగా మార్చుకున్నట్లయితే, మీరు శ్రమ పడకుండానే అక్కడకు చేరగలరు. మనిషి తన దృష్టిని కేంద్రీకరించవలసిన విషయం ఇదే, అంతేకాని ‘‘నేను దేనిగా మారాలి?’’ లేదా “నా దగ్గర ఏమి ఉండాలి” అని కాదు. ‘‘ఈ జీవితాన్ని పెంపొందించటం ఎట్లా?’’ అన్నది మీ లక్ష్యం కావాలి. నేను ‘‘జీవితం’’ అన్నప్పుడు నేను మీ కెరీర్ గురించి కాని, సంబంధాల గురించి కాని, మీ కమ్యూనిటీ ప్రాజెక్టుల గురించి కాని మాట్లాడడం లేదు. నేను ఈ జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఈ శరీరంలో ఉన్న జీవాన్ని గురించి మాట్లాడుతున్నాను. దీనిని అది ఇంతవరకు ఉన్న స్థితి నుండి మరింత ఉన్నతస్థాయికి లేదా ఉన్నతమైన శక్తి కలిగిన జీవితానికి తీసికొని వెళ్లాలి. మీరు చేయవలసింది ముందు అదే. మీరు మీ దృష్టిని మీ జీవితాన్ని పెంపొందించటం మీద పెడితే అప్పుడు మీకు జరగవలసిందేదో అదే చేస్తుంది.

యోగ ఇందు గురించే. మీకు ఏమి ఉందో, మీరు ఏం చేయాలో అన్నదాని గురించి చింతించకండి; దీన్ని శక్తివంతమైన యంత్రంగా మలచుకోండి. అప్పుడు అదే ఏ కొండ పైకైనా ఎక్కుతుంది. మీ దృష్టి ఈ విధంగా ఉండాలి. అంతే కానీ ‘‘నాకు ఇటువంటి ఉద్యోగం కావాలి, నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, పొరుగున ఉన్న ఈ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి…’’ ఇటువంటివి కాదు. మీరు ఈ జీవాన్ని ఇప్పుడున్న దానికంటే శక్తిమంతమైన, సమర్థమైన స్థితికి తీసుకువెళ్ళండి; అప్పుడు మీరు ఊహించినదానికన్నా అధికమైన ప్రయోజనాలే పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవన ప్రమాణం మీరు జీవితంలో సమకూర్చుకున్న ఏర్పాట్లమీద ఆధారపడదు; మీ జీవన ప్రమాణాన్ని మీ అంతర్గత చోదక శక్తి నిర్ణయిస్తుంది. జీవితం అలానే ఉండాలి. జీవితం లోపలి నుండే కదా జరుగుతోంది. మీరు సమకూర్చుకున్న వస్తువులు, ఏర్పాట్లు సామాజికంగా గొప్పవి కావచ్చు, కానీ జీవితానికి, అస్థిత్వానికి సంబంధించి విలువైనవి కాదు.

అందువల్ల చిల్లర కోరికలను భవిష్యత్ దృష్టి అనకండి: ‘‘నేనో కొత్త మోడల్ కారుకొనాలనుకున్నాను, కొనుక్కోగలిగాను!’’ అది మీరెలాగూ కొనుక్కోగలరు, ఎందుకంటే వాళ్లు వడ్డీలేని ఋణం ఇస్తున్నారు, ఎలాగు పదేళ్లలో మీ నుండి వసూలు చేసుకుంటారు. ఇది జరగడంలో విశేషమేమీలేదు. ఎవరైనా కారుకొనవచ్చు, విశేషమేమీ లేదు. ఆ మీరేం చేస్తారు? మీ పొరుగువాళ్లు మిమ్మల్ని కారులో చూసి అసూయపడితే మీకు ఆనందం. కాని వాళ్లందరికీ అంతకంటే పెద్దకార్లు ఉంటే మీకు మళ్లీ దిగులే..!. కాని మీరు మానవ చైతన్యాన్ని పెంపొందించుకోగలిగితే మీరు నగరంలో ఉన్నా, కొండమీద ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఎలా ఉన్న సరే – అది మీకు అద్భుతంగానే ఉంటుంది. మీరు కోరుకోవలసింది ఇదే.🍁

సేకరణ