Monday, June 12, 2023

మీ ఆరోగ్యం మీ చేతుల్లో

 *మీ ఆరోగ్యం మీ చేతుల్లో*
💎💎💎💎💎💎💎💎💎
మనకు వచ్చిన ఎలాంటి వ్యాధినైనా స్వయంగా, ఎలాంటి ఔషధాలు వాడకుండా మనమే తగ్గించుకోవచ్చు.. అది ఎలా అనేది కింద చదువుదాం... కొందరి అనుభవాలను వివరిస్తున్నాను.
నవ్వు అన్నిటికన్నా ఉత్తమైన మందు...

 💎మైకెల్ బెర్నార్డ్ బెక్విడ్

"ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బైటపడ్డప్పుడు, లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, 'సరైన' ఆలోచనలతో దాన్ని పూర్తిగా వెయ్యటం సాధ్యమేనా? అని తరచు ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం స్పష్టంగా వుంది, ఔను, తప్పకుండా సాధ్యమే..

*నవ్వు అన్నిటికన్నా ఉత్తమమైన మందు*

 🌷కేథీ గుడ్మాన్, ఒక వ్యక్తిగత గాథ

నాకు స్తనంలో క్యాన్సరుందని రోగనిర్ధారణచేశారు. నాకున్న బలమైన విశ్వాసంతో, నేను బాగయిపోయానని మనసారా నమ్మాను. ప్రతిరోజూ ఇలా అనుకునేదాన్ని. "నన్ను బాగుచేసినందుకు ధన్యవాదాలు." అలా నిరంతరం అనుకుంటూనే ఉన్నాను. "నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు." నేను బాగయిపోయానని మనసులో అనుకున్నాను. నా శరీరంలో అసలు ఎప్పుడూ క్యాన్సరు ప్రవేశించనేలేదన్న దృష్టితో ఉండిపోయాను.

నన్ను నేను బాగుచేసుకోవటానికి చేసిన పనుల్లో ఒకటి. హాస్యప్రధానమైన సినిమాలు చూడటం. రోజంతా ఒకటే నవ్వులు. నేనూ నా కుటుంబ సభ్యులూ అలా నవ్వుతూనే గడిపేవాళ్లం. నా జీవితంలో ఒత్తిడి రాకుండా చూసుకోవటమే మా పని. ఎందుకంటే వ్యాధిని నయం చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఒత్తిడి అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనదని మాకు తెలుసు.

నాకు రోగనిర్ధారణ జరిగినప్పట్నించీ నాకు నయమయే దాకా పట్టిన కాలం దాదాపు మూడునెలలు - అది కూడా రేడియేషనూ. కెమోథెరెపీ లేకుండానే.

కేరీ గుడ్మాన్ చెప్పిన ఈ అందమైన, స్ఫూర్తిదాయకమైన కథ మూడు రకాల అద్భుత శక్తులు పనిచేసే విధానాన్ని తెలియజేస్తాయి: వ్యాధిని నయం చెయ్యటంలో కృతజ్ఞత
ఉండే శక్తి, స్వస్థతను పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి, శరీరంలోని వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికీ, సంతోషానికీ ఉండే శక్తి,

కేధీకి నవ్వుని చికిత్సలో భాగంగా చేసుకోవాలన్న ప్రేరణకలిగింది, అది కూడా నార్మన్ కజిన్స్ కథ విన్న తరువాత.

నార్మన్కి వచ్చిన వ్యాధికి 'నివారణలేదు' అని నిర్ధారణచేశారు. డాక్టర్లు అతను ఇంక కొద్ది నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పేశారు. అప్పుడు నార్మన్ తన వ్యాధిని తనే నయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మూడునెలలపాటు అతను హాస్యప్రధానమైన సినిమాలు చూడటం, నవ్వటం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అతని వ్యాధి ఆ మూడు నెలల్లో అతన్ని శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది. డాక్టర్లు అతను మళ్లీ మామూలు మనిషి అవటం ఒక అద్భుతమని ప్రకటించారు.

నార్మన్ నవ్వినప్పుడు, అతనిలోని వ్యతిరేకతంతా విడుదలయింది. దాంతోపాటు అతని వ్యాధి కూడా బైటికి పోయింది. *నవ్వు నిజంగానే అత్యుత్తమమైన మందు*.

 🌷డా|| బెన్ జాన్సన్

మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రాం నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరు "స్వయం చికిత్స". మీకు దెబ్బ తగుల్తుంది, అది పూడుకుంటుంది. మీకు బాక్టీరియావల్ల అంటురోగం వస్తుంది, రోగనిరోధకశక్తి వచ్చి ఆ బాక్టీరియా విషయం చూసుకుని, రోగాన్ని మాన్పుతుంది. రోగనిరోధకశక్తికి తనని తను మాన్చుకోగల శక్తి ఉంది,

  🌷బాబ్ ప్రాక్టర్

"ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతకలేదు. ప్రతిక్షణం మీ శరీరం కొన్ని లక్షల కణాలని విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని 1 లక్షల కణాలని సృష్టిస్తూ కూడా ఉంటుంది.

 🌷డా|| జాన్ హాజలిన్

*నిజానికి ప్రతిరోజూ మన శరీరంలోని కొన్ని భాగాలు భర్తీ చెయ్యబడుతూ. ఉంటాయి. మిగతా భాగాలు కొన్ని నెలలకి ఒకసారీ, ఇంకా కొన్ని రెండేళ్ల కొకసారీ భర్తీ చెయ్యబడతాయి. కానీ కొన్ని ఏళ్లల్లో మనందరికీ పూర్తిగా కొత్తదైన శరీరం లభిస్తుంది*.

సైన్సు నిరూపించినట్టు, మన శరీరాలు పూర్తిగా కొన్నేళ్లలో భర్తీ చెయ్యబడితే, మరి క్షీణించటం ఎలా జరుగుతోంది? ఏళ్ల తరబడి మన శరీరాలని అంటిపెట్టుకుని వ్యాధులూ ఎలా ఉంటాయి? వాటిని అక్కడ పట్టి ఉంచేది ఆలోచనలే. ఎప్పుడూ వ్యాధిని గమనిస్తూ ఉండటం, దానిమీదే ధ్యాస పెట్టటం వల్లే అలా జరుగుతుంది.

సేకరణ
 *డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జీవితాలను మనం ఎలా గడపాలి?

 *జీవితాలను మనం ఎలా గడపాలి?*
*~ఒక అద్భుతమైన సమాధానం - ‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుతారని తెలిస్తే ఏం చేస్తారో ఆ స్థితిలో జీవించాలి’’ అని చెప్పారు.*
*”మరో గంటలో మరణిస్తా” అని తెలియగానే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్కబెడతారు. వీలునామా రాయడం, కుటుంబ సభ్యుల్నీ, మిత్రుల్నీ పిలిచి వాళ్ళకేదయినా నష్టం కలిగించి ఉంటే క్షమించాలని అడగడం, వాళ్ళు హాని చేసి ఉంటే వాళ్ళను క్షమించడంతో పాటు మనసుకు సంబంధించిన కోరికలనూ, ప్రపంచాన్ని వదిలేస్తారు.*
 *ఒకేఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు.. "మీరు ఉన్నంతకాలం ఎందుకు ఆ పని చేయలేరూ?” అని. మహోన్నతమైనది కదా ఈ ఆలోచన?.*
 *శ్రీరామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి అయినా, శ్రీరమణ మహర్షి పొందిన ‘సహజస్థితి’ అయినా ఈ చట్రం లోనివే కదా.*
 *”అంతఃకరణాన్నీ, ఇంద్రియాలనూ జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టినవాడూ ఆశారహితుడైన సాంఖ్యయోగి.. శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తాడు” అని  శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు.*
 *మన భారతీయ పౌరాణిక, ఇతిహాస గాథల్లో భోగాలను తృణప్రాయంగా త్యజించిన చక్రవర్తులు కన్పిస్తారు. రుషభుడు కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్ళిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అధికారాలనూ, భోగాలనూ అన్నింటినీ కాలితో తన్నేసి అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.*

 *నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం. అపుడు ఏమీ మనల్ని అంటుకోవు. ముక్త జీవనమంటారు దానినే.*
 *ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరుక్కుని అహంకారం అనే పాశంలో బందీలు అవుతారో వారు ఎప్పుడూ అన్ని రకాల ఆధిపత్యాల కోసం జీవిస్తూ ఉంటారు.*  *సర్వ భూతాంతర్గతమైన ఈశ్వర దర్శనాన్ని పొందినవారికి అన్ని జీవుల్లో ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టుకోవడాన్నే యోగమంటాం.*
 * ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో మనకు ఆ దర్శనం కలిగినా అది ధారాపాతంగా కొనసాగుతూనే ఉంటుంది.*
 *చమత్కారంలా కన్పించే ఈ పరమోన్నత స్థితిని చాలా మంది మరణం తర్వాత ఆశిస్తుంటారు. కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే ఆ స్థితి మహోన్నతమైనది.*
  *దాన్ని తెలుసుకుంటే చాలు “జీవితం ఎలా గడపాలి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది.* (సేకరణ)
చివరిగా
మనం సరైన సాధన చెస్తే ఆన్ని అద్భుతాలు సాధించవచ్చు... అహం అహంకారాలు, జన్మ జన్మల చెడు కర్మల దగ్దం.. వదలవలదిన అవసరం లేనివి వదిలించుకొని కావలసిన అవసరమైన అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో పొందవచ్చు.
పరమాత్మ స్వరూపం అయిన ఆత్మ ఎక్కడో లేదు... నీ శ్వాస లోనే ఉందనే సత్యాన్ని గమనించాలి... దేహమే దేవాలయం జీవుడే దేవుడు.. ఆ దేవుడు శ్వాస లోనే ఉన్నారనే అధ్యాత్మిక సత్యాన్ని గమనించాలి... కొద్దిగా అర్ధం చేసుకొండి... శ్వాస ఉంటే శివం లేకుంటే శవం... శ్వేసే జీవుడు, జీవుడే దేవుడు.

🙏కృష్ణం వందే జగద్గురుం 🙏

Friday, June 9, 2023

 ఎవరి ఎదుగుదల కొరకు వారు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారాలు చేస్తారు వారిని వారు ఉద్దరించుకోడానికి వారి వారి ప్రచారాలు రకరకాలుగా. ... ఎవరినో ఉద్ధరించడానికి కాదు... కానీ నీ ప్రచారాలు వినేవారికి లబ్ది చేకూరీతే కొంత లబ్ది ప్రచారకులు కూడా ఆటోమేటిక్ గా పొందుతారు..
నాగరికత ముసుగులో బంధాలు అనుబంధాలు డబ్బు చుట్టు తిరుగుతూ కుటుంబ వ్యవస్థ అంటే నేను, నా భార్య/భర్త పిల్లల వరకే పరిమితం... ఇదే వ్యవస్థ పుట్ట గొడుగులు లాగా అధ్యాత్మిక రంగంలో కూడా అర్ధం పర్ధం లేని వ్యక్తిగత అజెండా, వ్యక్తిగత కుంపట్లతో చెదలు, తుప్పు లాగా నిప్పు పై నివురు లాగ కప్పుకున్నారు.... ముందుగా అధ్యాత్మిక రంగంలో మార్పులు వస్తే ఆటోమేటిక్ గా కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు సహజంగానే వస్తాయి ప్రేమతత్వం, కృతజ్ఞతాభావం, క్షమాగుణం సేవా భావంతో... కావాల్సింది కొంత సమయం మరికొంత సరైన సాధన మాత్రమే.
ఆద్యాత్మిక రంగంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం.. ఓషో మార్గం, బుద్ధుని మార్గం, కృష్ణుని మార్గం, రాముని మార్గం, అల్లాహ్ మార్గం, క్రీస్తు మార్గం, రమణ మార్గం, సాయి మార్గం అలాగే ఈమధ్య వచ్చిన పత్రీజీ మార్గం... ఆన్ని మార్గాలలో ఉన్న సారాంశం నిన్ను నీవు తెలుసుకో, నీ సమస్యలకు కారణం నీవు చేసిన చెడు పనుల వలన మాత్రమే... అందరూ దుఃఖ రహిత జీవితం గురించి మాత్రమే చెప్పారు... ప్రస్తుత సాధకులు సరైన సాధన ద్వారా అంతరంగంలో కి ప్రవేశించినపుడు మాత్రమే సరైన ఆత్మజ్ఞానం పొంది వారు చెప్పారు, వీరు చెప్పారు అనే ప్రచారాలు మానేసి నేను చెబుతున్నా  అనే స్థితికి ఎదగాలి.. ఆధ్యాత్మిక సత్యాన్ని ఆత్మజ్ఞానంతో చదివినవారు మాత్రమే చెప్పగలరు, చేయగలరు... ప్రతి ఒక్కరికీ ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అనే రెండు జీవిత అనుభవాలను కలిగియుంటారు.. ఏది ఎమైనా ఎంత ఎక్కువ సరైన సాధన చేస్తోరో వారే మహా మహా గొప్ప సాధకులు.. ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగి యుంటారు.
పెండలం జైపూర్ క్రిష్టల్ మాయలో ఎవరూ పడకండి... గతంలో కూడా ఇలాగే ఒకతను ప్రచారాలు చేసి ప్రస్తుతం చిరునామా లేకుండా పోయాడు.
సరైన సాధన తప్ప మిగతావన్నీ మాయా ప్రచారాలు మనసు మాయలో... మాయ గాళ్లకు మనసు సహకరిస్తుంది.మనసుకు మాయ గాళ్ళకు వీడని బంధం ఉంది.
మనసు మాయను మనసుతోటే జయించాలి... అదే శ్రద్దవాన్ లభితె... అనగా నేను ధ్యానం చేస్తున్నాను, ఈ ధ్యాన సాధనలో శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటున్నారు అని subconceous మైండ్ కి ఫీడింగ్ ఇచ్చి సాధనకు కూర్చోండి అది కూడా కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో.

ఆధ్యాత్మిక పురోగతి వివిధ దశలలో జరుగుతుంది.

 *🌹. శివ సూత్రములు - 095 / Siva Sutras - 095 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-06. గురు రూపాయః - 2 🌻*
*🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴*

*ఆధ్యాత్మిక పురోగతి వివిధ దశలలో జరుగుతుంది. మొదట, ఇది సైద్ధాంతిక అధ్యయనం మరియు వాటిని అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల జ్ఞానం లభిస్తుంది. తదుపరి దశ అనుభవానికి దారితీసే ఆ సైద్ధాంతిక జ్ఞానాన్ని అమలు చేయడం. అనుభవం నుండి జ్ఞానం పొందబడుతుంది. పొందిన జ్ఞానంతో, బ్రహ్మాన్ని అన్వేషించడం ప్రారంభిస్తారు మరియు ఒక సమయంలో భగవంతుడు తన స్వయం అని అర్థం చేసుకుంటాడు. ఈ అవగాహన ధృవీకరణగా మారినప్పుడు, అతను స్వీయ-సాక్షాత్కారమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. మొత్తం ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు, కొన్ని ప్రక్రియలను సిద్ధాంతాలు వివరించలేవు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 095 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-06. guru Rupāyah   - 2 🌻*
*🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self.   🌴*

*Spiritual progression happens in different stages. First, it begins with theoretical study and understanding them. By doing so, one acquires knowledge. The next stage is the implementation of acquired theoretical knowledge that leads to experience. From experience one derives wisdom. With the attained wisdom, one begins to explore the Brahman and at one point of time he understands that God is his own self. When this understanding transforms into affirmation, he is considered as a Self-realised person.  The whole process is highly complicated and sometimes, theories cannot explain certain processes.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 358 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. 🍀*

*ఆలోచనలు చీకటిలాంటివి. అవి చీకటి వచ్చినట్టే వస్తాయి. నిజమనిపిస్తాయి. కాంతి రంగవేశం చేస్తే మాయమవుతాయి. అవి వున్నట్లనిపిస్తాయి. అది భ్రాంతి. కాబట్టే నువ్వు చీకటిని సరాసరి ఎదుర్కోలేవు. తరిమెయ్యలేవు. అట్లాగే నువ్వు చీకటిని తీసుకురాలేవు. అది లేనిది గనుక ముక్కు సూటిగా వ్యవహరించలేవు. అది కేవలం కాంతి లేకపోవడమే. అక్కడికి కాంతిని తీసుకు రావడమొక్కటే నువ్వు చేయాలి. మనసుకు సంబంధించిన విషయం కూడా అలాంటిదే. మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. చీకటిలా మాయమవుతుంది.*

*మనం మనసనే భ్రమలో బ్రతుకుతూ వుంటాం. నిజమైన ప్రపంచం దూరంగా వుంటుంది. అది వాస్తవ ప్రపంచాన్ని అడ్డుకుంటుంది. తన ప్రపంచాన్ని ముందుకు తెచ్చి అదే నిజమైన ప్రపంచమని భ్రమపెడుతూ వుంటుంది. వాస్తవాన్ని చూడనియ్యడు. నిన్ను నువ్వు కూడా చూడాలంటే అడ్డుపడుతుంది. అంతర్భహి: ప్రపంచాల్ని అదృశ్యం చేస్తుంది. పునాది లేని ప్రపంచమే సర్వస్వం అవుతుంది. అది నీపై అజమాయిషీ చేస్తుంది. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. భ్రమలో జీవించడం నిష్ఫలం అక్కడ అభివృద్ధి వుండదు. పరిణితి వుండదు. సంపన్నత వుండదు. అవగాహన వుండదు. ఆనందముండదు. సత్యముండదు. అందముండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

Dhyana Matrutvam(ధ్యాన మాతృత్వం) telugu pdf ebook download link

 Dhyana Matrutvam(ధ్యాన మాతృత్వం) telugu pdf ebook download link

Thursday, June 8, 2023

సృష్టిలో అద్భుతమైనది స్త్రీ, డి.వి.శ్రీదేవి telugu pdf ebook download link

 సృష్టిలో అద్భుతమైనది స్త్రీ, డి.వి.శ్రీదేవి telugu pdf ebook download link

🔻కధానిక పేరు.. ట్రంకు పెట్టె.🌷 (నేను వ్రాసింది కాదు.... ఎవరో రచయత తెలియదు... నెట్ లో దొరికింది.)

 🔻కధానిక పేరు.. ట్రంకు పెట్టె.🌷
(నేను వ్రాసింది  కాదు.... ఎవరో రచయత  తెలియదు... నెట్ లో దొరికింది.)🚩
వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది. పెళ్లి రోజు ని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు. తలంటుకున్నారు. పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారం తురుముకుందామె. " ఈ మధ్యనే" అయిదారేళ్ళక్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడతను. కధ లోకి వస్తే.. మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేమునికి దండం పెట్టుకున్నారు. మరో పద్ధెనిమిది పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటి కి అతనికి నూరేళ్ళు వస్తాయి. ఆమె మరో ఇరవైరెండు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటి కి ఆమెకి నూరేళ్ళు వస్తాయి. దానాదీనా ఇద్దరూ నిండునూరేళ్ళు బతకాలని కోరుకున్నారు. దేమునికి కొట్టిన కొబ్బరికాయ ని ప్రసాదముగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది. అయ్యయ్యో అనుకుని ఆందోళన తో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసాడతను.
బతికినంతకాలం బతకదు. ఉన్న నాలుగు రోజులూ హాయిగా బతకనీయండి. ఇంటికి తీసుకుపొమ్మని డాక్టర్ అంటే .. ఇంటికి తీసుకువచ్చాడు. వీలయిన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళ లోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు. గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే.. పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచపెట్టలేదు. అన్నీ అతనితో పంచుకునే బతికింది. ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద వుంది. దాని విషయం అడగకండి! అందులో ఏమున్నదీ చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నదీ చూడనూ లేదు. చూడాలని చాలా సార్లు అనుకున్నా ఆ కోరిక ని అణచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు. చూడాల్సిందే.. అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి.. అందామె. అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూసాడు. ఏమున్నాయి అందులో?
రెండు ఊలు స్వెట్టర్ లు వున్నాయి. అంతేనా? ఓ మూడులక్షల రూపాయలు కూడా వున్నాయి. పెద్ద మొత్తమే!
ఈ స్వెట్టర్ లు ఏంటి? అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటుగా నేనిక్కడికి బయలుదేరి వస్తునపుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతను.
భర్త తో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకీ, చేష్టలు కీ పోట్లాడాలన్నంత కోపం వస్తే, ఎంచక్కా స్వెట్టర్ లు అల్లుతూ కూర్చో.. కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేసాను అన్నదామె. ఆ మాటలకి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. చేతిలోని రెండు స్వెట్టర్ లనూ ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు. అరవైసంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండే సార్లన్నమాట! చాలు! ఐయామ్ గ్రేట్ అనుకున్నాడతను.
మరి ఈ మూడులక్షలు? ఇంత డబ్బు ఎక్కడది? అని అడిగాడు.
అదీ.. అదీ.. ఈ అరవైఏళ్ళలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె. అతను కళ్ళు తేలేసాడు.
😜😜😜

Wednesday, June 7, 2023

*✍️ నేటి కథ ✍🏻* *ఆదర్శబాలుడు - వికాస్*

 *✍️ నేటి కథ ✍🏻*

*ఆదర్శబాలుడు - వికాస్*

ఒక ఊళ్లో వికాస్ అనే అబ్బాయి ఉన్నాడు. అతని వయస్సు ఎనిమిది
సంవత్సరాలు. తమ గ్రామంలోని ప్రాథమిక
పాఠశాలలో ఐదవ తరగతి మంచి మార్కులతో
పాసయ్యాడు. వారి గ్రామంలో ఉన్నత పాఠశాల
లేదు. వాళ్ళ నాన్న రామారావు అతడిని
పట్టణంలోని ఉన్నత పాఠశాలలో చేర్చాలను
కున్నాడు.వేసవి సెలవుల తరువాత పాఠశాలలు
తెరిచారు. వికాస్ ను విద్యారణ్య ఉన్నత
పాఠశాలలో చేర్చాలని తండ్రి రామారావు
నిశ్చయించుకున్నాడు. ఆ పాఠశాల చాలా పేరు
పొందినది. పట్నానికి బస్సులో బయలు
దేరారు. పోను పోను ప్రయాణికుల రద్దీ
ఎక్కువైంది. చాలా మంది నిలబడే ఉన్నారు.
నిలబడిన వారిలో ఒక యాభై ఏళ్ళ ఆవిడ బస్సులో ఉసూరంటూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ
నిలబడటానికి చాలా ఇబ్బంది పడుతోంది.
వికాస్ ఆమెను చూశాడు. వెంటనే లేచి నిలబడి ఆమెని పిలిచి “ఇక్కడకు వచ్చి కూర్చోండి" అన్నాడు. ఆమె తటపటాయించింది.
“పర్వాలేదు బాబూ, నువ్వు కూర్చో,నువ్వూ చిన్న పిల్లవాడివే కదా” అంది ఆవిడ.వికాస్ “లేదండీ, నిలబడి ప్రయాణించడం
నాకేమీ కష్టం కాదు.” అని గట్టిగా అన్నాడు.ఆమె వచ్చి కూర్చుంది.వికాస్ వాళ్ళు దిగి, విద్యారణ్య
పాఠశాల వైపు నడిచారు.
వికాస్ వాళ్ళు ఆ పాఠశాలకి చేరుకుని,
స్కూలు ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ ఆఫీసులో గుమస్తాని సీటు అడగగా “ఆరవ తరగతిలో
అడ్మిషన్లు పూర్తి అయ్యాయి. ఇక ఖాళీ
లేదు. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు”
అని సమాధానం ఇచ్చాడు.
రామారావు ఎంత బతిమాలినా గుమస్తా ఏమీ లాభం లేదన్నాడు. చేసేది ఏమీలేక నిరాశతో బయటకు వస్తున్నారు
వికాస్, రామారావు.
వరండాలో నడుస్తున్న వారికి ఇందాక బస్సులో కలిసినావిడ ఎదురు పడింది. ఆవిడ వారిని చూసి "ఏమిటీ? మీరిక్కడికి ఎందుకొచ్చారు?” అని అడిగింది.అప్పుడు రామారావు ఆవిడతో “నా పేరు రామారావు. వీడు మా అబ్బాయి వికాస్.
వీడిని ఆరవ తరగతిలో చేర్చడానికి వచ్చాం.
ఆఫీసులో గుమస్తా ఆరవ తరగతిలో సీటు
ఖాళీ లేదని చెప్పారు. హెడ్మాష్టర్ గారిని
కలిసినా లాభం ఉండదని అన్నారు." అని
బాధగా చెప్పాడు. ఇదంతా విని ఆమె “నాతో
రండి” అని వాళ్ళని తన గదికి తీసుకెళ్ళింది.
ఆవిడ గది ముందర హెడ్ మిస్ట్రెస్ అని బోర్డు కన్పించింది వికాస్ తండ్రికి,వాళ్ళను కూర్చోమని చెప్పి, ఒక జవానును పిలిచి “నీవు ఆఫీసుకు వెళ్ళి ఒక
అడ్మిషన్ ఫారం పట్టుకురా” అని పంపింది.జవాను తెచ్చాడు. దానిని వికాస్ తండ్రికి
ఇచ్చి పూర్తి చెయ్యమన్నారు హెడ్మాస్ట్రెస్.వికాసికి ఐదవ తరగతిలో వచ్చిన మార్కులు
తెలుసుకుని ఆవిడ వికాస్ని అభినందించింది.“ఆఫీస్ క్లర్క్ చెప్పింది నిజమే. సీట్లు ఖాళీ లేవు. అయినా హెడ్మాస్ట్రెస్ని కాబట్టి నా కోటాలో నేను ఇద్దరిని చేర్చుకునే
వీలుంది. మీ అబ్బాయి వికాస్ చాలా మంచి
నడవడిక కలవాడు. పెద్దల పట్ల గౌరవం,ఇంత చిన్న వయస్సులోనే అతడిలో ఉన్నాయి. అలాంటి వాడిని మా పాఠశాలలో
చేర్చుకోవడం మాకూ ఆనందమే" అని వికాస్ కి ఆరవ తరగతిలో సీటిచ్చింది. వికాస్ మంచి ప్రవర్తనే అతనికి సీటు తెచ్చిపెట్టింది.

భగవంతునిపై విశ్వాసమే… *భక్తులకు రక్ష!*

 భగవంతునిపై విశ్వాసమే…

               *భక్తులకు రక్ష!*
               

*భగవంతునిపై మనకు పరిపూర్ణమైన, అచంచలమైన విశ్వాసముంటేనే ఆయన దర్శనం, రక్షణ లభిస్తాయి.*

*అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి. దీనికి ఉదాహరణగా ఓ కథ…*

*ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతలవైపు ఉన్న ఓ బ్రాహ్మణుని యింటికి రోజూ పాలు తీసుకుని వెళ్లి అమ్ముతుండేది. రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ “ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్?” అని అడిగేడు.*

*దానికా గొల్లవనిత “ నేను ఇంటిదగ్గరనుండి పెందలకడనే బయలుదేరుతున్నాను. కాని ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది. ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటేవాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది.” అని చెప్పింది.* 

*“ భగవన్నామస్మరణ చేస్తూ సంసారసాగరాన్నే ఈదవచ్చు కదా! అలాంటిది ఈ ఏటిని దాటలేవా?” అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా .*

*అలా అనగానే ఆ గొల్లవనిత ‘ఇదేదో బాగుందే’ అనుకుంటూ వెళ్ళిపోయింది.*

*మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు “ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చేవ్?” అని అడిగేడు.*

*దానికా గొల్లవనిత “మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటి వచ్చేసేను. నాకింక ఆ తెప్పవాడితో పనిలేదు.” అని చెప్పింది.* 

*అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది. ”అయితే నువ్వు ఏరు ఎలా దాటేవో నాకు చూపిస్తావా?” అని అడిగేడు.* ”

*ఓ దానికేం భాగ్యం? నాతో రండి.” అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్లి “మీరూ రండి.” అంటూ తాను ఏటి మీద నడచుకుంటూ వెళ్లిపోసాగింది.*

*కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకుని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు.* 

*వెంటనే గొల్లవనిత “అదేంటి స్వామీ? దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పేరు కదా! మరి మీరు అంత భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట.” అంది.*

*నిజమేకదా! భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది.*

*భగవంతునిపై విశ్వాసంతో, తీవ్రపరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది. రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ.*

*జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవిగుండా ఒంటరిగా పోవలసివచ్చేది. అలా వెళ్ళడానికి భయపడుతుండేవాడు. ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పేడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి “నీకు భయం వేసినప్పుడల్లా ‘కృష్ణా’ అని పిలువు.” అని చెప్పింది.* 

*“కృష్ణుడెవరమ్మా?” అని అడిగేడు ఆ అమాయకుడు.*

 *“కృష్ణుడు నీ అన్న” అని చెప్పింది తల్లి. *

*“అయితే సరేనమ్మా” అన్నాడు ఆనందంగా ఆ అర్భకుడు.*

*మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి ‘కృష్ణా’ అని పిలిచేడు.*

*ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా “అన్నా! కృష్ణా! ఎక్కడున్నావు? తొందరగా రా. నాకు భయమేస్తుంది. నాకు తోడుగా రా.” అని ఎలుగెత్తి పిలిచేడు.* 

*అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొఱను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రాణ పరాయణుడు. వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి “రా తమ్ముడూ! ఇంక నీకేం భయం ఉండదు. నీకు నేను తోడుగా ఉండి పాఠశాలవరకూ వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టేడు. పైగా “ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు. లేదా రోజూ పిలిచినా వస్తాను” అని చెప్పి అంతర్దానమైపోయేడు ఆ భక్తవత్సలుడు.* 

*అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు.*

*”ఇతర చింతనలన్నిటినీ మాని నన్నే స్మరించుచూ యే జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారో ఆ జనులయొక్క యోగ క్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను.” అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *దేవుడు ఎక్కడున్నాడో తెలుసా*
             

  *అందమైన   జీవితం  అందరికీ ఉండదు ..     కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళుంటే ఆ లోటు తెలియదు.*

* భార్య అలక తీర్చే భర్త , భర్త అలసట అర్థం చేసుకొనే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే..వివాహ బంధం!*

 *మనిషి    ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి , "లేదా" పూర్తిగా నమ్మకుండా ఉండాలి . అంతేగానీ సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే.*

*మనిషికి ఆశ ఎక్కువ .. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది మనసు. కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది.* 

*మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు.. ఎ సి బోగీలో వెళ్తాడు , మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ బోగీలో వెళ్తాడు , పేదవాడు సాధారణ బోగీలో వెళ్తాడు.*

*కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరతారు . అందరూ దిగేది ఒక ప్లాట్ ఫాం మీదకే . రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంత వరకే ఈ తేడాలు.*

*అలాగే జీవితం కూడా అంతే .  ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే  ఈ తేడాలు. అది గ్రహించుకుని ధన-పేద బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి , ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ బోగీ లో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది .*

*మనకి డబ్బుందికదా అని దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. అదే పేద వాళ్ళకి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడుంటాడు. అది దేవుడికే     ఇస్తున్నామనే భావన మనలో కలగాలి.  అప్పుడే పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం మనకు తృప్తి , దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది.*

*మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు ..  అది ఎంతమందికి ఉపయోగ పడుతుంది అన్నది ముఖ్యం.*

*మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడక్కరలేదు మంచితనం కనబడితే చాలు.*

* ఇక్కడ మారాల్సింది మనిషి యొక్క మనసు, ఆలోచించే విధానం.*

*మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి , చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.*

*అవసరం ఉన్నా .. లేకపోయినా ఒకేలా ఉండాలి.   అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వితం కావు . అర్థం చేసుకొనే ఓర్పు ,  సర్దుకుపోయే నేర్పు , బాధ్యత గల మనస్సూ ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది.*

*చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే జీవిత సత్యం!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

నిజమైన ధనవంతుడు

 నిజమైన ధనవంతుడు     

        ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.

Tuesday, June 6, 2023

బుద్ధుడు తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు. మోక్షదాతగానూ చెప్పుకోలేదు. తాను ఒక మార్గదాతనని మాత్రమే చెప్పాడు. ఆచరణలో చూపాడు. అది ఎలాగో తెలుసుకుందాం .

 బుద్ధుడు తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు. మోక్షదాతగానూ చెప్పుకోలేదు. తాను ఒక మార్గదాతనని మాత్రమే చెప్పాడు. ఆచరణలో చూపాడు. అది ఎలాగో తెలుసుకుందాం .

దుఃఖసాగరంలో మునిగి తేలుతున్న మానవ సమాజానికీ, అసమానతలతో అలమటిస్తున్న ప్రజా సందోహానికీ దుఃఖ నిర్వాణ మార్గాన్ని చూపించాడు. అందువల్లనే బుద్ధుడు కాలంతోపాటు కనుమరుగు కాలేదు. ‘‘నేను చెప్పినది ఏదైనా మీ అనుభవానికి అందకపోతే గుడ్డిగా విశ్వసించకండి’’ 
అని చెప్పాడు. కాబట్టే కాలాన్ని జయించి, ఇన్ని వేల సంవత్సరాలు తన ధర్మంతో ధరణీతలాన్ని తడిపి, మానవీయ ఫలాలను పండించగలుగుతున్నాడు.
అలాంటి మనహనీయుడు సాధారణ మానవుల్లా మరణానికి భయపడతాడా! అలాంటి భయం లేదు కాబట్టే ప్రాణాలకు ప్రమాదం కలిగించే యుద్ధ క్షేత్రాల మధ్యకు వెళ్ళి నిలబడ్డాడు. యుద్ధాలను ఆపుచేయించాడు. అతి క్రూరులైన వారి దగ్గరకు ఒంటరిగానే వెళ్ళాడు. వారిలో పరివర్తన కలిగించాడు. సర్వాన్నీ త్యజించిన త్యాగి... ప్రాణం కోసం పాకులాడుతాడా!
బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అనుకున్నాడు. 
అది బుద్ధుడి ఎనభయ్యో సంవత్సరం. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. తన చివరి ‘చారిక’లో భాగంగా వైశాలీ నగరానికి వచ్చాడు. ఆమ్రపాలికి చెందిన ఆమ్రవనంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడకు దగ్గరలో ఉన్న బేళువ అనే గ్రామంలో ఆ ఏడాది వర్షావాసాన్ని గడిపాడు. ఆ కాలంలోనే ఆయనకు ఉదర సంబంధమైన వ్యాది కలిగింది. ఔషధాలు సేవిస్తూ, ధ్యానం ద్వారా నొప్పిని భరించాడు. వ్యాధి తగ్గి, వర్షావాసం ముగిశాక తిరిగి వైశాలిలోని చాపల చైత్యానికి చేరాడు. తన ప్రధాన అనుయాయుడైన ఆనందుణ్ణి పిలిచి, ‘‘ఆనందా! తథాగతుడు పరినిర్వాణం చెందే సమయం ఆసన్నమయింది. మూడు నెలల్లో పరినిర్వాణం పొందుతాను. ఆనందా! మనకు ప్రియమైనవి దూరం అవుతాయి. విభాజ్యం చెదుతాయి. విడిపోతాయి. పుట్టిన ప్రతీదీ గిట్టుతుంది. సంస్కారాలు సర్వం అనిత్యాలే!’’ అన్నాడు మందహాసంతో. ఆనందుడు కలవరపడ్డాడు. అతని కంట నీరు గూడు కట్టింది.
ఆ రోజు మాఘ పున్నమి. బుద్ధుని కోరికపై శ్రావస్తి సమీపంలోని భిక్షువులందరినీ మహాకూటగారశాలలో ఆ పున్నమి రాత్రి సమావేశపరిచారు. బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేసి, తన నిర్మాణాన్ని ప్రకటించాడు. ఆ మరునాడు లిచ్ఛవుల రాజధాని వైశాలి నుంచి మల్లుల రాజధాని కుసీనరకు బుద్ధుడు బయలుదేరాడు. వైశాలి ఉత్తర పొలిమేర దాకా లిచ్ఛవులు వచ్చారు. వారికి తన భిక్షా పాత్రను ఆయన ఇచ్చేశాడు. జనం కన్నీరు మున్నీరవుతూ బుద్ధుణ్ణి సాగనంపారు.  ‘‘ఇదే వైశాలిని నేను చూసే చివరి చూపు’’ అని అయన వెనక్కు తిరిగి, చాలా సేపు వైశాలి వైపు చూశాడు. అనంతరం బయలుదేరి, పలు గ్రామాల మీదుగా భోగనగరం చేరి, ఆనంద చైత్యంలో కొన్నాళ్ళు ఉన్నాడు.
అక్కడ ప్రజలకు బోధ చేస్తూ, ‘‘ఎవరైనా ‘‘బుద్ధుడి నోటి నుంచి నా చెవులారా విన్నాను. తథాగతుడు చెప్పినది ఇదే!’’ అని చెబితే దాన్ని మూఢంగా నమ్మకండి. నా సూత్రాలు, నియమాలతో కలవని దేనినీ బుద్ధ వచనంగా విశ్వసించకండి’’ అని చెప్పాడు.  అక్కడే చైత్ర పౌర్ణమి సమావేశం జరిగింది. ఆ తరువాత మరిన్ని గ్రామాలు తిరుగుతూ పావానగరం చేరాడు. చుందుడు అనే అనుయాయుడు పెట్టిన ఆహారం తిన్నాక, బుద్ధుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడే కొన్నాళ్ళు ఉండి, తిరిగి బయలుదేరి, వైశాఖ పౌర్ణమి నాటికి కుసీనరకు చేరాడు. ఆ రాత్రే బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగింది. 
ఇలా... బుద్ధుడు తన పరినిర్వాణ విషయాన్ని మూడు నెలలు ముందే... మాఘ పున్నమి నాడు ప్రకటించాడు. అలా ఈ పున్నమికి బౌద్ధంలో ఒక విశేష ప్రాధాన్యం ఉంది. అంతేకాదు... తన బౌద్ధ సంఘం మొత్తానికి ధ్మసేనాపతిగా సారిపుత్ర భిక్షువును మాఘ పున్నమి రోజునే బుద్ధుడు నియమించాడు. అలాగే... తొలి ధర్మచక్ర ప్రవర్తన జరిగిన ఆషాఢ పున్నమి అనంతరం వచ్చిన వర్షావాసం తరువాత.... మాఘ పున్నమి రోజునే బౌద్ధ సంఘానికి తొలిసారిగా కొన్ని నియమాలు బుద్ధుడు ఏర్పరిచాడు. ఈ భిక్షు నియమాలు ‘వినయ పిటకం’గా ప్రసిద్ధి చెందాయి. అలా బౌద్ధ సంస్కృతిలో మాఘ పున్నమి ఒక విశిష్ట స్థానాన్ని పొందింది.బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అనుకున్నాడు.

సేకరణ .మీ రామిరెడ్డి మానస సరోవరం👏

నేటి మంచి మాటలో కొన్ని ఆణిముత్యాలు

 నేటి మంచి మాటలో కొన్ని ఆణిముత్యాలు

*ఎదుగుదల అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది..* *అదే వినాశనం జరిగేటప్పుడు భారీ శబ్దాలు వస్తాయి.. ఎలా అంటే విత్తనం* *మొలకేత్తేటప్పుడు నిశబ్దం గా ఉంటుంది..* *అదే చెట్టుగా మారి కూలేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది..మన ఎదుగుదల కూడా నిశ్శబ్దం గానే ఉంటుంది..*
 *అదే ఏదైనా ప్రమాదం జరిగితే జరిగే పరిణామం కూడా చాలా దారుణంగానే ఉంటుంది..
 
*మనం పనిచేస్తే తప్ప గొప్పతనాన్ని సాధించలేము.కఠోరమైన పరిశ్రమ లేకుండా కలలు ఎన్నటికీ నిజం కావు.ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కష్టపడి పనిచేయడం వల్లనే పనులు జరుగుతాయి, లక్ష్యాలు సాధించబడతాయి.నిద్రపోతున్న సింహం నోటిలో జింకవచ్చి దూరదు కదా! స్వప్రయత్నం ద్వారానే మనం అనుకున్నవి సాధించగలుగుతాము.* 

 *మేధావి ఒక శాతం పుట్టుకతో వచ్చిన ప్రేరణతోనూ, తొంభైతొమ్మిది శాతం చెమటోడ్చి పని చెయ్యడం ద్వారానే తయారవుతారు కాబట్టి కష్టే ఫలిః...* 
                                      
*అర్ధం కాలేదు...అనే స్థితి నుండి.అర్ధం అయ్యింది.అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.* 
*అర్ధం అయ్యింది.*అనే స్థితి నుంచి.అర్ధం కాలేదు అనే స్థితికి ఎదగడం జ్ఞానం. తెలియనితనం అనేది అజ్ఞానం కాదు. అదే శుద్ధజ్ఞానం.*

 *అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు.ఆ శుద్ధ తెలియనితనమే- శిశుత్వం, ఋషిత్వం, దైవత్వం.*                            

*మీరు గతంలో జీవించ టం మరియు ఇతరులను గమనించడం ఆపేస్తే ఇక మీ ఆనందాన్ని మీ నుండి ఎవరూ వేరు చేయలేరు..* 

 అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రామిరెడ్డి మానస సరోవరం👏

కఠోరమైన సాధన ఒక్కటే విజయానికి మార్గం కాదు అది ఎలాగో తెలుసుకుందాం .

 కఠోరమైన సాధన ఒక్కటే విజయానికి మార్గం కాదు అది ఎలాగో తెలుసుకుందాం .

సుప్రసిద్ధ జెన్‌ గురువుల్లో గిజాన్‌ ఒకరు. జ్ఞానార్జన కోసం, సత్య దర్శనం కోసం, సమాధి స్థితి సాధించడం కోసం తపిస్తున్న కోషు అనే యువకుడు ఆయనను కలిశాడు. తన కోరికను వెల్లడించాడు. శిష్యుడిగా తనను అంగీకరించి, తాను చేయవలసిన పని ఏమిటో చెబితే... అది ఎంత కష్టతరమైనా చెయ్యడానికి సిద్ధమేనని చెప్పాడు. 
అతని జిజ్ఞాసను గమనించి, తన శిష్యుడిగా గిజాన్‌ చేర్చుకున్నాడు. అతనికి బోధ చేయడంతో పాటు, సాధనా పద్ధతులను సూచించాడు. గురువు ఏది చెప్పినా అత్యంత శ్రద్ధతో కోషు సాధన చేశాడు. రాత్రింబవళ్ళు కఠోరంగా శ్రమించాడు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి. కానీ తను కోరుకున్న సమాధి స్థితిని కోషు పొందలేకపోయాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా సాధనను కొనసాగించాడు. 

గిజాన్‌ అప్పుడప్పుడు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. శిష్యులకు సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి తన మందిర ప్రాంగణంలోనే వారం రోజులు కొనసాగే సమావేశాలను మొదలుపెట్టాడు. 
తన ధ్యేయాన్ని సాధించడానికి అదే సరైన సమయమని కోషు భావించాడు. మందిర ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న గోపురం ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఉన్న మహనీయుల విగ్రహాలను చూస్తూ ‘‘నేను నా కలను నెరవేర్చుకోవడమో, లేదా విగత జీవుడిగా ఈ గోపురం అడుగు భాగాన పడి ఉండడమో జరుగుతుంది’’ అని ప్రమాణం చేశాడు. కళ్ళు మూసుకొని కుర్చున్నాడు. ఏడు రోజులు నిద్రాహారాలు మానేశాడు. అప్పుడప్పుడు అంతర్ముఖంగా... లోలోతులకు వెళ్ళి వచ్చాడు. కానీ సమాధి స్థితికి చేరాలన్న అతని కల నెరవేరలేదు. 
‘ఇంత కఠోరంగా దీక్ష చేస్తున్నా నాకు ఆ స్థితి ఎందుకు అందడం లేదు? నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాకీ దురవస్థ? అని కోషు ఆవేదన చెందాడు. చివరకు ఓటమిని అంగీకరించాడు. ఇక జీవించి లాభం లేదనుకున్నాడు. గిజాన్‌ పర్యవేక్షణలోనే తను అనుకున్నది సాధించలేనప్పుడు... ఇక మరణం తప్ప మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరచి... ముందున్న పిట్టగోడ వైపు నడిచాడు. ఆ ఎత్తు నుంచి కిందికి దూకి మరణించాలనుకున్నాడు. 

ఆ ఆలోచన రాగానే అతని మనసు ప్రశాంతమయింది. పిట్టగోడ పైకి ఎక్కబోయాడు. అంతే... అద్భుతం! అనూహ్యంగా అతని కోరిక నిజమయింది. అతను కోరుకున్న సమాధి స్థితి కలిగింది. కొంతసేపు అలాగే నిలబడిపోయాడు. తరువాత... హృదయమంతా ఆనందంతో ఉప్పొంగుతూ ఉండగా... గబగబా గోపురాన్ని దిగాడు. సరాసరి గురువు గదికి పరుగులు తీశాడు.
కోషు ముఖాన్ని చూసి, అతను ఏదీ చెప్పకముందే ‘శభాష్‌ కోషూ! చివరకు సాధించావు’ అన్నాడు గిజాన్‌. కఠోరమైన సాధన చేస్తున్న సమయంలో ‘నేను చేస్తున్నాను’ అనే భావన, సమాధి స్థితిని చేరాలనే కోరిక కోషులో దృఢంగా ఉండేవి. ఎప్పుడైతే అతను వాటిని సంపూర్ణంగా వదులుకొని, ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడో... అడ్డంకులన్నీ తొలగిపోయాయి. స్వచ్ఛమైన సమాధి స్థితి అతనికి ఆకస్మికంగా కలిగింది. ఇది వింతేమీ కాదు. శ్రీ రామకృష్ణ పరమహంస దైవ సాక్షాత్కారం కోసం తపించి, ఎన్నో కఠోర సాధనలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు కాళికాదేవి విగ్రహం చేతిలోని ఖడ్గాన్ని తీసుకొని, తనను తాను అంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడే ఆయనకు దివ్య దర్శనం (నిర్వికార సమాధి) కలిగినట్టు ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తోంది.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
 నేటి మంచిమాటలో కొన్ని ఆణిముత్యాలు

*🔸సంతోషం అనేది పది వేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు..* 
 *మన అనుకునే వారితో పది నిముషాలైనా మనసువిప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది..* 

 *🔹ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు,ఒక్కోసారి దుఃఖం, బాధ కూడా కలుగుతాయి..అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది..* 

 *✨సంతోషం  ఆనందం పొందాలి అంటే మనం మన మైండ్ ని 🎼tune చేసుకోవాలి* 
 *లేదంటే ఎన్నటికీ మనం* *ఆనందంగా ఉండలేం !* 
 *కల్మషం లేని మనసు ఆనందానికి సుఖ సంతోషాలకు పుట్టిల్లు..* 

 *🍁మార్చలేని జీవితం గురించి మాట్లాడటం నిరుపయోగం ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది..శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది..* 

 *🌷మీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే..మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది..అదే బంధం మీ తోటి వారికి మేలు చేసేది అయితే..అప్పుడు అంతా అద్భుతంగా ఉంటుంది..*

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రామిరెడ్డి మానస సరోవరం👏
 మనిషి మనసులో ప్రశ్న మొలిస్తే, ఆ వెంటనే జవాబు కోసం వెతుకులాట మొదలవుతుంది. అతడి ప్రయత్నం కొనసాగుతున్నకొద్దీ, ఆత్మను ఆవరించి ఉన్న ‘జడత్వం’ అనే ముసుగు తొలగిపోతుంది. దాని స్థానంలో చేతనత్వం చోటుచేసుకుంటుంది. ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గానికి మళ్లుతాడు. అతడు కచ్చితంగా భక్తుడిగా మారతాడు.

భక్తిమార్గంలో వినిపించే పదం ‘ఎవడు’. ఆ మూడక్షరాల మాటలోనే ఎన్నో భావాలు ఇమిడి ఉన్నాయి. అందులో అమాయకత్వం ఉంది. గడుసుతనమూ కనిపిస్తుంది. తెలిసిన తత్వంతో పాటు తెలియనితనం సైతం దాగి ఉంటుంది. ‘ఎవడు’ అని పలికే తీరును బట్టి, లోపలి భావం ప్రశ్నగానే కాక జవాబుగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆ పదం పోతన మహాకవికి ఎంతో అభిమానపాత్రమై నిలిచింది. ఆ ఒక్క పదమే ఆయువుపట్టు అనిపించేలా, దాన్ని ఆయన పలు సందర్భాల్లో, అర్థాల్లో వాడాడు. అదీ ఆ సహజ కవి దూరదృష్టి! కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు చేసిన పనీ అదే! వాటిని సామాన్యులు ఉన్నపళంగా చదవలేరు. ఒకవేళ చదివినా, వారికి ఉపనిషత్తులు అప్పటికప్పుడు అవగతం కాకపోవచ్చు. అలాంటివారికీ ఉపనిషత్స్ఫురణ కలిగే విధంగా, పోతనామాత్యుడు ‘ఎవడు’ పద ప్రయోగాన్ని వివిధ రూపాల్లో చేశాడు.

భారతం, భాగవతం- రెండింటినీ వ్యాసుడే సంస్కృతంలో రచించాడు. భాగవతానికి పోతన అనువాద పటిమ- దాన్ని ఆయనే రాశాడన్నంత పేరు సంపాదించిపెట్టింది. వ్యాస భారతంలోని ఆనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు సహస్ర నామాలున్నాయి. భీష్ముడు వాటిని యుధిష్ఠిరుడికి ఉపదేశించాడంటారు. ఆ పేర్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ‘ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే సంసార బంధనాలన్నీ తొలగిపోతాయో...’ అంటాడు వ్యాసుడు. ఆయన మీద భక్తిభావం గల పోతన- భాగవతంలోనిది కాకపోయినా తన అనువాద ప్రారంభంలో ‘ఎవరి అవతారం అన్ని ప్రాణులకీ సుఖాన్ని కలగజేస్తుందో, ఎవరి శుభనామం తలిస్తే అందరి సంసార బంధనాలూ తొలగిపోతాయో, ఎవరి చరితను హృదయంలోకి చేరిస్తే మృత్యుభయం ఉండదో...’ అని రాశాడు. అక్కడ పరమాత్మ, భగవంతుడు వంటి పదాలు ఉపయోగించకుండా ‘ఎవరి’ పదాన్ని ప్రయోగించడంలోనే గొప్ప ఆంతర్యముంది.

భగవంతుడు గొప్పవాడని కొందరు నమ్ముతారు. మరికొందరు- మానవమాత్రుడే గొప్ప అని తలుస్తారు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

ఈ లోకంలో అకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

 ఈ లోకంలో అకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

 బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత వయసు వచ్చేవరకు తన ఎదుగుదలకు, శరీరభాగాల కదలికకు సైతం ఏదో ఒక శక్తి మూలమై ఉందనే ఊహ కలగదు. ఆ దివ్యశక్తినే అందరూ తలో రకంగా భావిస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ కలిగే రకరకాల అనుభవాల సారంతో కొంత వివేకం కలిగి, మానవజన్మ ఏదో ఒక విధ్యుక్తధర్మ నిర్వహణ నిమిత్తం ప్రాప్తించిందనే స్పృహ ఏర్పడుతుంది. అంతవరకు తన గురించి తనకే తెలియని పసివాడిలాగే, యాంత్రికంగా జీవితం సాగిపోతుంటుంది.
అద్భుతమైన యంత్రంలా, వాహనంలా, బహుళార్థక సాధక పరికరంలా ఉపకరించే మానవ శరీరం- పరమాత్మ ప్రసాదితం. ఆ దివ్యానుగ్రహంతోనే హృదయస్పందన, శ్వాసక్రియలతో కూడిన జీవచైతన్యం సాగుతుంటుంది. జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమతమ కర్మలు చేస్తుంటాయి. శరీరాల పరిమాణంలోను, పరిణామంలోను అంతరం ఉన్నా అన్నింటిలోనూ పరమాత్మ అంశ మాత్రం ఒకటే. అన్నీ ఆయన బంధువర్గంలోనివే. అన్నింటిలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిణామం చెందినవాడు మానవుడు. మానవజన్మ ఏ నిమిత్తం ఎంత సామర్థ్యంతో ప్రాప్తించిందో అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు. ఆ ఎరుకతో తన ధర్మాచరణే ధ్యేయంగా జీవితం సాగించే మానవుడికి పరమాత్మ అనుగ్రహమైన ఆధ్యాత్మిక శక్తి బలంగా రూపొందుతుంది. జీవన యానానికి ఉపకరించే శారీరక, మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తి. జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం, మానసికం, శారీరకం అనే మూడు విధాలైన శక్తులు కూడా అవసరమే. మూడింటి సహకారంతోనే జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు. వాటిమధ్య సమన్వయం సాధించలేని జీవితం కేవలం యాంత్రికంగా సాగుతున్నట్లు ఉంటుంది. యాంత్రికమైన జీవితంలో ఏదీ కూడా స్వయంకృషితో సాధించిన ఆత్మ తృప్తి కలగదు. ఆనందంగా జీవిస్తున్న అనుభూతి కలగదు. యాంత్రికంగా సాగుతున్నట్లు కనిపించే జీవితానికి వెనక ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది.

విశ్వంలో భాగమైన ప్రతీ జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదవాక్కు. తన సృష్టిలో జీవులన్నీ వాటివాటి ప్రజ్ఞతో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని, లోకాస్సమస్తా సుఖినోభవంతు అని సృష్టికర్త ఆశించడం సహజం. ఆయన సంకల్ప మార్గంలో సాగడమే ఆధ్యాత్మిక పరమావధి. మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆయన దివ్యశక్తి తోడవుతుంది. ఆధ్యాత్మిక శక్తిప్రదాత ఎవరో తోడున్నారనే విశ్వాసంతో ఏ పని చేపట్టినా విజయం పొందగల మనోస్థైర్యం కలుగుతుంది.

పరమాత్మ ప్రమేయం లేకుండా ఏ కార్యమూ జరగదు. తాము ఉన్నత స్థితికి చేరాలంటే కేవలం తమ ప్రజ్ఞే కాదు, పరమాత్మ దివ్యానుగ్రహం సైతం పొందాలని గ్రహించడమే వివేకం. అది సాధించడానికి తగిన కర్తవ్య నిర్వహణతో జీవించాలి. అప్పుడే మానవ జన్మ ప్రాప్తించిన నిమిత్త కారణానికి న్యాయం చేసినట్లు అవుతుంది.

ఏ సంకల్ప సాధనకై ఎంత కృషి చేయవచ్చు అనే వెసులుబాటు మన చేతిలోనూ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛ అద్భుతమైన వరం లాంటిది. ఆ స్వేచ్ఛ వినియోగంలో వరప్రదాత సంకల్పాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అది విస్మరించకుండా చేసే కృషి వల్ల లభించిన వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ దివ్యానుగ్రహ సాధన ఫలితంగా పొందే ఆనందం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. మానవజన్మ సార్థకం అవుతుంది!

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

నేటి మంచిమాట లో కొన్నిఆణిముత్యాలు.

 నేటి మంచిమాట లో కొన్నిఆణిముత్యాలు.

 *సమస్యలు నిన్ను చుట్టుముడుతాయి.* 
 *బాధలు నిన్ను అమాంతం అలుముకుంటాయి.* 

 *కష్టాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.అనేక భావోద్వేగాలు నిన్ను ఆవేదనకు గురిచేస్తాయి.*

 *నువ్వు అష్టదిగ్బంధనంలో ఇరుక్కుంటావు కానీ నువ్వు ఓర్పుతో నేర్పుతో పట్టుదలతో క్రమశిక్షణతో ఉండు కాలమే ప్రతి సంఘర్షణకు సమాధానం ఎందుకంటే ఏ నిమిషం శాశ్వతం కాదు...* 

*మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే..* 
 *మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా* *మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి కత్తెరలా అందరిని విడకొట్టకుండా సూదిలా* *అందరిని కలుపుకుంటుపో అప్పుడు అందరు నీతోనే ఉంటారు వారే నీకు కొండంత బలం అవుతారు నీ విజయానికి దోహద పడతారు...* 

  *మనిషిగా పుట్టడమే* 
     *ఒక అదృష్టం.* 
    *ముడిపడుతున్నా* 
   *బంధాలు ‘వరాలు’.* 
  *ఎదురయ్యే అడ్డంకులు*
  *విలువైన ‘పాఠాలు’.* 
  *కష్టాల గురించే ఆలోచించరాదు అవి వచ్చిపోతుంటాయి.* 

  *ఆనందంగా పదిమంది మంచిగా చెప్పుకునేలా జీవించాలి* 
   *ఇదే జీవిత పరమార్థం.*
       
అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి. మీ రామిరెడ్డి మానస సరోవరం👏

కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవంతుడయిన కృష్ణుడికీ, యోధుడైన అర్జునుడికీ మధ్య... 700 శ్లోకాల్లో జరిగిన సంభాషణ...

 కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవంతుడయిన కృష్ణుడికీ, యోధుడైన అర్జునుడికీ మధ్య... 700 శ్లోకాల్లో జరిగిన సంభాషణ... 

భగవద్గీత. యుద్ధం మొదలయ్యే ముందు... ఆ యుద్ధంలో తన బంధువులు, మిత్రులు అనేకమంది మరణిస్తారనే చింత అర్జునుడిలో కలిగింది. అనేక విధాలుగా ఇది చెడ్డదని అతను వాదించాడు. అర్జునుడిలో ఈ సందిగ్ధావస్థ ‘చేసేవాడిని నేనే’ (అహంకర్త) అనే భావన నుంచి ఉద్భవించింది. దీన్నే ‘అహంకారం’ అని కూడా అంటారు. ఈ అహంకారం మనం ప్రత్యేకమైన వాళ్ళం అని మనకు చెబుతుంది, కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. ‘ఇగో’ అనే మాట ‘అహంకారం’ అనే సాధారణ అర్థాన్ని ఇస్తుంది. కానీ అహంకారం తాలూకు అనేక రూపాల్లో ఇగోను ఒకటిగా పరిగణించవచ్చు. కృష్ణార్జునుల సంభాషణ మొత్తం ఈ అహంకారం గురించే... అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దాన్ని తొలగించుకోవడానికి వివిధ మార్గాలనూ, మైలు రాళ్ళనూ కృష్ణుడు చూపించాడు.
కురుక్షేత్ర సంగ్రామాన్ని ఒక ఉపమానంగా  తీసుకున్నట్టయితే...  కుటుంబంలో కావచ్చు, పని చేసే చోట కావచ్చు, ఆరోగ్యం, సంపద, సంబంధాల్లాంటి విషయాల్లో కావచ్చు... మనమందరం నిత్య జీవితాల్లో అర్జునుడిలా ఇలాంటి సందర్భాల్లోకి అడుగుపెడతాం. ఒక వ్యక్తి జీవించినంతకాలం, అహంకారాన్ని అర్థం చేసుకున్నంత వరకూ ఇలాంటి సందిగ్ధావస్థలు సహజం.  భగవద్గీత ‘మనం ఏమిటి?’ అనే అంశానికి సంబంధించినది, మనకి తెలిసిన వాటి గురించో, మనం చేస్తున్న వాటి గురించో కచ్చితంగా కాదు. సైకిలు తొక్కడానికో, ఈత కొట్టడానికో మనకు థియరీతో ఎలాంటి నిమిత్తం లేదు. అలాగే మనం జీవితాన్ని ముఖాముఖి చూడనంతకాలం ఎలాంటి వేదాంతమూ సాయం చెయ్యలేదు, అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి భగవద్గీతలోని మార్గదర్శక సూత్రాలు మనకు సాయపడతాయి - ఆ గమ్యమే అంతరాత్మ, అది అహంకారరహితం. పైనుంచి చూసినప్పుడు... అర్జునుడికి కృష్ణభగవానుడు గీతను బోధించాక... కాలం చాలా మారిపోయినట్టు కనిపించవచ్చు. గత రెండు దశాబ్దాల్లో సైన్స్‌ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో మార్పులు కచ్చితంగా వచ్చాయి. కానీ, వాస్తవానికి, ‘పరిణామం’ అనే దృక్పథంతో చూసినప్పుడు, మానవులు ఏ మాత్రం పరిణామం చెందలేదు. సందిగ్ధావస్థ తాలూకు అంతర్గత పార్శ్వం అలాగే ఉంది. మన అవతారాలు (వృక్షాలు) చూడడానికి భిన్నంగా కనిపించవచ్చు, కానీ లోపలి భాగం (వేర్లు) అలాగే ఉంది.
‘దారులన్నీ రోమ్‌కే చేరుతాయి’ అనే నానుడిలా... భగవద్గీత అందించే దారులన్నీ మనల్ని అంతరాత్మవైపు నడిపిస్తాయి. కొన్ని మార్గాలు పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు. అయితే, ఇది ఒక వృత్తంలాంటిది. ప్రయాణం ఎటువైపు మొదలుపెట్టినా... అదే గమ్యానికి మనల్ని చేరుస్తుంది. గీత వివిధ స్థాయిల్లో సాగుతుంది. కొన్నిసార్లు అర్జునుడి స్థాయికి కృష్ణుడు దిగి వచ్చాడు, మరికొన్నిసార్లు ఆయన పరమాత్మగా కనిపించాడు. ఈ రెండు స్థాయిలూ భిన్నంగా కనిపిస్తాయి కాబట్టి ప్రాథమిక దశలో అవగాహనకు ఇది ఇబ్బందులు సృష్టిస్తుంది. కిందటి శతాబ్దం ఆరంభంలో, కాంతిని అర్థం చేసుకొనేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. ప్రాథమికంగా, ‘కాంతి ఒక తరంగం’ అని రుజువైంది, తరువాత అది ఒక కణంలా కూడా వ్యవహరిస్తుందని గ్రహించారు. ఈ రెండు సిద్థాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా కనిపిస్తాయి. కానీ మనకు బాగా సుపరిచితమైన కాంతి... ఎన్నో వైరుధ్యాల సమ్మేళనం. జీవితం కూడా అంతే. ఒక గ్రామంలోకి ఏనుగు వచ్చింది. కొందరు అంధులు దాన్ని గుర్తించడానికో లేదా అర్థం చేసుకోడానికో ప్రయత్నించారు. వాళ్ళు ముట్టుకున్న భాగాన్ని బట్టి... ఏనుగు ఎలా ఉండొచ్చనేది ఊహించుకున్నారు. తొండాన్ని ముట్టుకున్న వ్యక్తి ‘‘ఏనుగు పొడవుగా, గరుకుగా ఉండే జీవి’’ అని చెప్పాడు. మరో వ్యక్తి దాని దంతాన్ని ముట్టుకున్నాడు... ‘అది రాయిలా గట్టిగా ఉండే జంతువు’ అని అన్నాడు. మరో వ్యక్తి దాని పొట్టను పట్టుకున్నాడు... అది పెద్దదనీ, మెత్తగా ఉంటుందనీ చెప్పాడు. వారి ఊహాగానాలు ఈ విధంగా కొనసాగాయి.
ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తున్న అన్ని వ్యత్యాసాలకూ కారణం... ఒకే సత్యం విషయంలో భిన్నమైన అవగాహనలే. ఏనుగు అనేది ఆ కథలో చెప్పినవాటిలో ఏదీ కాదు, కానీ అది అవి అన్నీ కూడా. మనుషులు, విషయాలు, సంబంధాలు ఆ ఏనుగులాంటి చిక్కుముడిలా ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తులకూ, మనకూ మానసిక స్థితిలో తేడా లేదు. పాక్షికమైన అవగాహన మనల్ని దుఃఖం వైపు నడిపిస్తుంది. భగవద్గీత ఆవశ్యకంగా ఒక పాక్షికమైన అవగాహన నుంచి పరిపూర్ణత వరకూ తీసుకువెళ్ళే ప్రయాణం. 80-20 సూత్రంలా, ఈ అవగాహనలో కనీసం కొన్ని అడుగులు వెయ్యగలిగినా అది జీవితంలోకి సంతోషాన్ని తీసుకువస్తుంది.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

నేటి మంచి మాట

 నేటి మంచి మాట

🌹గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు..వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది..* 

 *🌟చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు,ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం,చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు,వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం..* 

 *⭐ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు..నీ మీద వుంచిన నమ్మకాన్ని మంచి గౌరవాన్ని కోల్పోయావని త్వరలో* *తెలుస్తుంది..మోసాగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతోకాలం నిలువదు..* 

 *🔅అందంగా ఉన్నవన్నీ ఆనందాన్ని కలిగించవు..వస్తువులు, సదుపాయాలు కొంత వరకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి..కానీ మీ మనసు ప్రశాంతముగా ఉన్నప్పుడు మాత్రం అన్నీ అందంగానే కనిపిస్తాయి..* 

 *🔸ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసుని ప్రశాంతముగా* *ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము..ఘర్షణ పడుతూ ఏమి* *సాధించగలగుతున్నాము..* 

 *🔹ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే..మనకు మనమే..మార్గదర్శకులుగా..మారతాం..* 
 *ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకోకు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు..* 

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రామిరెడ్డి మానస సరోవరం👏

*కాలం విలువ* బంగారంతో సమానం అది ఎలాగో తెలుసుకుందాం

 *కాలం విలువ* బంగారంతో సమానం అది ఎలాగో తెలుసుకుందాం
                ➖➖➖✍️

కాలం చాలా విలువైనది. *‘కాలం కాంచన తుల్యం!’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? 

వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే,  ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు. అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం   లేక  ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.

ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. 

కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.

వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.

బాల్యం అంటే చిన్నప్పుడు 
యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు
వృద్దాప్యం అంటే ముసలివారు….
పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.

బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. 
బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజూ కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.
సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… 

ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ    ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు. 

కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. 

అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది. 

అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది. 

ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు. 

అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. 

ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.

ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి *‘కాలం కాంచన తుల్యం’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

_నవీన్ పట్నాయక్ (ఒరిస్సా ముఖ్యమంత్రి) కంటతడి... 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...

 *_నవీన్ పట్నాయక్ (ఒరిస్సా ముఖ్యమంత్రి) కంటతడి... 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం... _* 



నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు…

ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే..?

కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…



చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు…

2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…

గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…



*‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…*

ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!

***ఇలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి, తరాలు సంపద కూడబెట్టే వాళ్ళు కాదు. విన్నారా👂 

చూసారా👁️. ఇంకోసారి చదవండి, వీలైతే ఇటురులకు చెప్పండి🙏

పిల్లలకు ఏది నేర్పించాలో తెలుసుకుందాం.

 పిల్లలకు ఏది నేర్పించాలో తెలుసుకుందాం.

మన సమాజంలో ఎక్కువగా రెండు తరాలకు చెందిన ప్రజలు ఉంటారు. ఒక తరం వారు ఒకలా ఆలోచిస్తే, మరో తరం మరో విధంగా ఆలోచిస్తుంది.  తమ మాట అందరూ వినాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. దీంతో తరాల మధ్య అభిప్రాయబేధాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ ధోరణి ఇంతకుముందు కాలంలోనూ ఉండేది. కానీ ఈ మధ్య మరీ ఎక్కువయింది. తమ పిల్లలకు ఏది నేర్పించాలో తెలియక, బేధాభిప్రాయాలను ఎలా తగ్గించాలో అర్థంకాక తల్లితండ్రులు అయోమయంలో ఉంటున్నారు. కాలక్రమేణా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆచారాలూ, సంప్రదాయాలూ మారుతూ ఉంటాయి. మనం పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తాం. ఎవరైనా ఏదైనా ఇస్తే ‘థ్యాంక్స్‌’ చెప్పమంటాం. మంచీ, మర్యాదా తప్పకుండా నేర్పాల్సిందే. కానీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని బలవంతంగా ఏదీ బోధించలేం. 
ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. పూర్వం నార్వేలో విద్యావిధానం తక్కువ స్థాయిలో ఉండేది. దాన్ని మెరుగుపరచడం కోసం... ముందుగా వాళ్ళు హోంవర్క్‌ తీసేశారు. ఉదయం బడికి వచ్చే పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండడం లేదు. తరగతి గదిలో ఉన్నా.. ‘ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళి ఆడుకుంటామా?’ అనేదే ధ్యాస. ఇది గమనించి... కేవలం రెండు గంటలు మాత్రమే చదువుకు కేటాయించారు. మిగిలిన సమయమంతా ఆడుకోవచ్చు. ఈ మార్పు వల్ల జరిగిందేమిటంటే... పిల్లలు రోజంతా బయట ఆడుకొనేవారు. క్లాసులోకి వచ్చాక... చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టడం మొదలెట్టారు. తద్వారా నార్వేలో విద్యా విధానం ఎంతో పురోగతి సాధించింది. ఒకప్పుడు ఆరో స్థానంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు మొదటి స్థానాన్ని చేరుకుంది. మన సమాజం ఈ పద్ధతిని అనుసరించగలుగుతుందా? ఆధునికమైన ఏయే పద్ధతులు సఫలమయ్యాయో, ఏవి అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయో... వాటిని అవలంబించడం కోసం మనమంతా ఏకం కావాలి. తద్వారా ఒక నూతన శకానికి నాంది పలకాలి. అందులో ప్రతి ఒక్కరూ సఫలీకృతులు కావాలి. 
ఈనాటి యువతరాన్ని గమనిస్తే.. ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెలూన్‌లో గాలిని అలాగే ఊదుతూ పోతే ఏమవుతుంది? ఏదో ఒక క్షణంలో పేలిపోతుంది. అలాగే పిల్లల్ని ‘నువ్వు ఇలా కావాలి, నువ్వు అలా కావాలి’ అంటూ పసితనం నుంచే ‘సక్సెస్‌’ అనే గాలిని ఊదుతూ పోతే... ఆ మాటలు వారిలో బాగా నాటుకుపోతాయి. కానీ అలా జరగనప్పుడు వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యాధి పిల్లలనే కాదు, సమాజాన్నంతటినీ పట్టి పీడిస్తోంది. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్పు’ అని ఏ పిల్లవాడు గ్రహించకపోయినా... సమాజమంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టే. పిల్లలు తమ జీవితానందాన్ని పొందాలి. కానీ వాళ్ళు బాల్యాన్ని కోల్పోతున్నారు. విజయం సాధించాలనే ఈ రోగం అతి భయంకరమైనది.
మీరు అనుకున్నవన్నీ జరిగినంత మాత్రాన సక్సెస్‌ అయినట్టు కాదు. విజయం మీతోనే ప్రారరంభమవుతుంది. అది ఒక పువ్వు లాంటిది. మొక్కకు నీరు పోస్తే... పువ్వు దానంతట అదే విరబూస్తుంది. చేత్తో బలవంతంగా లాగితే... ఏ పువ్వూ వికసించదు. మీరు ఎంత ప్రయత్నించినా అది జరగని పని. ఆ పుష్పాన్ని తనకుతానుగా వికసించనివ్వండి. నిజానికి విజయం మిమ్మల్ని ఎప్పుడో వరించింది. మీరు ఏనాడైతే తొలి శ్వాస తీసుకున్నారో.. ఆ రోజే మీరు విజయం సాధించారు. మీలోనికి శ్వాస వస్తూ పోతున్నంత కాలం... మీరు విజయం సాధిస్తున్నట్టే. 
ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. జీవితంలో ఆశ అనేది లేకపోతే సర్వం సమాప్తమయిపోతుంది. కాబట్టి మీలోని ఆశను ఎన్నటికీ అంతం కానివ్వకండి. సదా చైతన్యవంతులై ఉండండి. చక్కగా జీవించండి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

Monday, June 5, 2023

60 ఏళ్ళ పూర్వం ఆనాటి జీవన శైలి....

 60 ఏళ్ళ  పూర్వం ఆనాటి జీవన శైలి....

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక,  (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే,  నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే,  అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.  అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు.  అంతే.   ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే.    పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం.  అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర.   వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి,  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.

అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.

కక్షలూ కార్పణ్యాలు.  కోప తాపాలు కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు  వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.

వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.....

Sunday, June 4, 2023

*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే" “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.*

 🅄🅂🄴🄵🅄🄻 🄸🄽🄵🄾🅁🄼🄰🅃🄸🄾🄽
*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"    “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.*

 *ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,"మనం జీవించే విధానం లోనే ఉన్నాయని"*
*మనసును హాయిగా ఉంచు కున్న వారికి     ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.           ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరి దిద్దే పనిలో పడ్డారు.*

      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._
    
*ఇది వరకు తిన కూడదు*
     *అన్న అన్ని రకాల*
     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*
    *తిన మంటున్నారు.*

_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు._

*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్  వాక్"  చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.*

      ఒక్క సారిగా వీరి వైఖరి
      ఇలా మారి పోడానికి
      కారణం సరికొత్త
      అధ్యయనాలలో
      వెలుగు చూస్తున్న అంశాలే
      కారణం. 
*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది.          దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో చూద్దాం.*  

*➢    "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*
       కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                ఇది రావ డానికి, ముదర డానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  
"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !

*➢  "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*

     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 
"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే  "అధిక రక్తపోటు" ఎక్కువట !

*➢   "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*

        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!

*➢   "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*
       "అధిక స్వార్ధం", 
       "మొండితనం"
*ఉన్నవారి లోనే ఎక్కువట !*

*➢  "అతి విచారం" వల్ల ఆస్త్మా  ::*

    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 
అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 

*➢   "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*

ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.

అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 

*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.         వారి అధ్యయనం ప్రకారం-* 

  *  50% ఆధ్యాత్మికత
      లోపంవల్ల
  *  25% మానసిక కారణాల
      వల్ల
  *  15% సామాజిక,
      స్నేహబాంధవ్యాల లోపం
      వల్ల
  *  10% శారీరక కారణాల
       వల్ల...
*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 

*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 

       -  స్వార్ధం, 
       -  కోపం, 
       -  ద్వేషం, 
       -  శత్రుత్వం, 
       -  ఆవేశం, 
       -  అసూయ,
       -  మొండితనం, 
       -  బద్ధకం, 
       -  విచారం, 

*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*

       -  కారుణ్యం, 
       -  త్యాగం, 
       -  శాంతం, 
       -  క్షమ, 
       -  నిస్వార్ధం, 
       -  స్నేహభావం,
       -  సేవాభావం, 
       -  కృతజ్ఞత, 
       -  హాస్య ప్రియత్వం,
       -  సంతోషం , 
       -  సానుకుల దృక్పథం
పెంచు కోవాలి.”☝️ పాత సమాచారమే... కొత్త వారికి ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశంతో
 [6/4, 11:57] +91 98491 63616: అబద్దం ఎపుడు అందంగా ఉంటుంది... నిజం ఎపుడు నిష్టూరంగా ఉంటుంది... యదార్థ వాది లోక విరోధి అని గురువులు, పెద్దలు ఊరకే చెప్పలేదు... వ్యక్తి గత ఎదుగుదలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు అధ్యాత్మిక రంగాన్ని ఏది క చేసుకునే హక్కు ఎవరికీ లేదు...సత్యాన్ని మాత్రమే చెప్పాలి, సత్యంగా ప్రచారాలు చేయాలి, చేసి తీరవలసిందే ధ్యాన సాధన గురించి... ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా గురువులు చెప్పినా చివరకు చేయవలసింది చెప్పవలసింది అంతరంగ ప్రవేశం గురించి... అది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని కూడా చెప్పారు...

[6/4, 16:04] +91 98491 63616: కొంత సేకరణ
మనిషి మనసుకు బానిస... మనసు మాయకు బానిస... మాయ పరమాత్మకు బానిస.. సరైన సాధన ద్వార పరమాత్ముని పట్టుకుంటే మాయ తొలగిపోతుంది, మాయ తొలగిన మనసు నిర్మలం అవుతుంది... నిర్మలమైన మనస్సుతో పొజిటివ్ అలోచనలు... పాజిటివ్ ఆలోచనలతో మనిషి మనీషి గా ఎదుగుతారు, మారుతారు.. భగవంతునికి సాధ్యం కానిది ఈ విశ్వంలో ఏమి లేదు.. సరైన సాధన ద్వార ఈ అనంత విశ్వమే సరైన సాధకుల అంతరంగంలో ఉంటుంది... ఈ ప్రక్రియ మొత్తం సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని సాధకులు అందరూ గుర్తించాలి. ఎలాంటి మార్గాలు లేవు గాక లేవు.
ధ్యానం సర్వరోగ నివారిణి
ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి
ధ్యానం సత్య ఙ్ఞాన ప్రదాయిని
ధ్యానం ఆత్మ ఙ్ఞాన ప్రభోధిని
అహం బ్రహ్మాస్మి, అంతా తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ
ఇవన్నీ ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... ఇది సత్యం, తధ్యం
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616

*పోలాండ్* కు *భారతదేశం* పై అంత మమకారం ఎందుకు? ఏ రకంగా వారిని మనం కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ???

 పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష 
కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!
*పోలాండ్* కు *భారతదేశం* పై అంత మమకారం ఎందుకు? ఏ రకంగా వారిని మనం కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ???
పోలాండ్‌పై *హిట్లర్* రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే... బతికితే మళ్లీ కలుద్దాం!
500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ ఇరాన్‌లోని ఓడరేవుకు   చేరుకుంది,ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు,
మళ్లీ అలా వెల్తూ వెల్తూ  అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు.. చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది.
అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున....
అప్పటి జామ్‌నగర్ రాజు *"#జామ్_సాహబ్_దిగ్విజయ్_సింగ్"* తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని *బాలచాడి* లోని
సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.
అదే శరణార్థి పిల్లల్లో ఒకరు తరువాత
*పోలాండ్ ప్రధాని* అయ్యారు....
నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.
పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు *"మహారాజా జామ్ సాహబ్"* పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో *"మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్"* గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి *వసుధైక కుటుంబం* మరియు *సహనం* అనే పాఠాన్ని బోధిస్తోంది, మరియు నేటి కొత్త నాయకులు, కుండ జర్నలిస్టులు, మలచా మొదలైనవారు భారతదేశ సహనాన్ని ప్రశ్నిస్తున్నారా?
రాజు *జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా*  వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు సైనిక శిక్షణ ఇచ్చి, వారికి యుద్దవిద్యలు  నేర్పించారు, తరువాత ఆయుధాలు ఇచ్చి పోలాండ్‌కు పంపారు, అక్కడ వారు జామ్‌నగర్ నుండి నేర్చుకున్న సైనిక శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించారు.
నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు.  *పోలాండ్* రాజ్యాంగం ప్రకారం, *జామ్ దిగ్విజయ్ సింగ్* గారు వారికి దేవుడు లాంటివాడు.  అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.
భారతదేశంలో *దిగ్విజయ్ సింగ్* గారిని అవమానిస్తే, ఇక్కడ లా అండ్ ఆర్డర్‌లో శిక్షించే నిబంధన లేదు.  కానీ అదే తప్పు పోలెండ్ లో చేస్తే  ఫిరంగికి కట్టేసి పేల్చేస్తారు.
ఈ పోలాండ్ ప్రజలు *"జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జడేజా"* పేరుతో ఎందుకు ప్రమాణం చేస్తున్నారో తెలుసా?
ఉక్రెయిన్ నుండి వచ్చే భారత ప్రజలను వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి పోలాండ్ ఎందుకు అనుమతిస్తుందో తెలుసా?
జామ్ సాహిబ్ చేసిన ఆ పనిని పోలాండ్ నేటికీ మరచిపోలేదు.  కాబట్టి ఈ రోజు భారతదేశం వీసా లేకుండా వచ్చేవారిని అనుమతిస్తోంది.  వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.
భారతదేశ చరిత్ర పుస్తకాలలో దిగ్వాజ్ సింగ్ గురించి ఎప్పుడైనా బోధించారా?  పోలాండ్ పౌరుడు ఒక భారతీయుడిని, "మీకు *"జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్"* తెలుసా?" అని అడిగితే, ఉక్రెయిన్‌లో డాక్టర్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో  యాక్షన్ అనేదే లేదు !
లేదు,మనల్ని దాని స్వంత మూలాల నుండి దూరం చేసిన అటువంటి విద్యా వ్యవస్థకు సిగ్గుపడదాము !

మానవత్వం!* *➖➖➖✍️* *– జాఫర్ ఇర్షాద్*

 *మానవత్వం!*
                 *➖➖➖✍️* 

 *– జాఫర్ ఇర్షాద్* 

 *నేను జర్నలిస్ట్ గా అనేక ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకు వెళ్ళాను, రిపోర్ట్ తయారు చేశాను. కానీ నాకు ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంపై వచ్చిన విమర్శలు, వాదోపవాదాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.* 

 *ఈ విమర్శలు చేసినవారెవరూ ఆర్ ఎస్ ఎస్ చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పుడూ చూసినవారుకాదు, తెలుసుకున్నవారుకాదు.* 

 *కానీ ఒక జర్నలిస్ట్ గా నేను వారి సేవాకార్యక్రమాలను దగ్గరగా చూశాను. అందుకే ఇప్పుడు వాటి గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను.* 

 *ఆర్ ఎస్ ఎస్ ముస్లిములకు వ్యతిరేకమా, హిందువులకు అనుకూలమా అంటే నేను చెప్పలేనుకానీ అది మానవత్వానికి విరుద్ధంకాదని మాత్రం చెప్పగలను.* 

 *నా 24 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక సందర్భాల్లో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎలాంటి పేరు, గుర్తింపు కోరుకోకుండా ప్రజలకు సహాయపడ్డం చూశాను కానీ ఏ మత ఘర్షణలో, దొమ్మిలో పాల్గొన్నట్లు చూడలేదు.* 

 *అలాగే ఇతర జర్నలిస్ట్ లు లేదా నాయకులు కూడా మత ఘర్షణల్లో వారి పాత్ర ఉందని చెప్పగలరని నేను అనుకోవడం లేదు.* 

 *అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.* *నాకు ఆర్ ఎస్ ఎస్ తో గాని, బిజెపితోగాని ఎలాంటి సంబంధం లేదు.* 

 *అది 2011 జులై 10. నేను కాన్పూర్ లో ఒక న్యూస్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్నాను. ఆదివారం కావడంతో కాస్త విశ్రాంతిగా ఉన్నాను. హఠాత్తుగా మా ఎడిటర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫతేపూర్ దగ్గర మాల్వాలో రైలు ప్రమాదం జరిగిందని, వెంటనే వివరాలు సేకరించమని చెప్పారు.* 

 *నేను వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం అడిగాను. వాళ్ళు రైలుప్రమాదం జరిగిందని, అదికూడా పెద్ద ప్రమాదమేనని చెప్పారు.* 

 *నేను వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరాను. గంట ప్రయాణం తరువాత ఘటన స్థలానికి చేరాను.* 

 *మాల్వాకు 10-12 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చుట్టుపక్కల ఎక్కడా జనవాసాలు లేవు. అక్కడికి చేరాలంటే దాదాపు 4కి.మీ లు పొలాల్లో నడిచి వెళ్ళాలి.* 

 *అక్కడికి చేరుకోగానే నేను పని ప్రారంభించాను. ప్రమాదం గురించి డిల్లీలోని మా ఎడిటర్ కు, న్యూస్ డెస్క్ కు సమాచారం అందించడం మొదలుపెట్టాను. పూర్తిగా దెబ్బతిన్న బోగీల నుంచి శవాలను బయటకు తీస్తున్నారు.* *గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దగ్గరవారిని కోల్పోయిన వారి ఏడ్పులు, గాయాల మూలంగా బాధితులు పెడుతున్న  పెడబొబ్బలు ఆ ప్రదేశాన్ని భయానకంగా మార్చాయి. శవాలను దగ్గర ఉన్న పొలాల్లోకి చేర్చారు. బాగా ఛిద్రమైన వాటితోపాటు ఇతర శవాలపై కొందరు తెల్లబట్ట కప్పుతూ కనిపించారు. వాళ్ళంతా ఖాకీ నిక్కర్లు వేసుకుని ఉన్నారు.* 

 *తమవారిని కోల్పోయి బాధలో ఉన్నవారు కూర్చున్న చోటికి వెళ్ళాను. వారిని ఆకలి, దప్పిక కూడా బాధిస్తోంది. అప్పుడే కొద్దిమంది అక్కడికి వచ్చి బాధితులకు టి, బిస్కట్ లు ఇవ్వడం చూశాను.* 

 *నాతోపాటు మరో 24మంది జర్నలిస్ట్ లు అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు కప్పు టీ, రెండు బిస్కట్ లు తెచ్చి ఇచ్చాడు.* 

 *ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నాలుగు గంటలుగా పనిచేస్తున్న మాకు ఆ టీ అమృతప్రాయంగా అనిపించింది. అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత నిర్మానుష్య ప్రదేశంలో టీ, బిస్కట్ లు ఉచితంగా ఇస్తున్న వీళ్ళు ఎవరు? వీళ్ళు ప్రభుత్వోద్యోగులా? వెంటనే వాళ్ళలో ఒకరిని అడిగాను -`భాయిసాబ్ మీరు ఎందుకు ఇవి పంచుతున్నారు? ఎవరి తరఫున పనిచేస్తున్నారు?’ అందుకు ఆ వ్యక్తి `మీకు మరికొంత టీ కావాలంటే ఆ చెట్టు దగ్గరకి రండి’ అన్నాడు.* 

 *నా సందేహం తీర్చుకునేందుకు నేను అతను చెప్పినట్లే చెట్టు దగ్గరకి వెళ్ళాను. అక్కడకి వెళితే నాకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. కొద్దిమంది మహిళలు అక్కడ కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు. రొట్టెలకు పిండి తయారుచేస్తున్నారు. ఆ పక్కనే కట్టెల పొయ్యి మండుతోంది. దానిపై టీ మరుగుతోంది. అక్కడే కొన్ని వందల బిస్కట్ ప్యాకెట్ లు ఉన్నాయి.  మరోపక్క కొందరు బాధితులకు అందించడం కోసం మంచినీటిని కవర్ లలో నింపుతున్నారు.* 

 *కుర్తా, పైజమా వేసుకున్న ఒక వ్యక్తి పని త్వరగా చేయాలంటూ అందరికీ సూచనలు ఇస్తూ కనిపించాడు.* 

 *నేను అతని దగ్గరకు వెళ్ళి `మీ పేరేమిటి’ అని అడిగాను. అతను నవ్వాడుగానీ సమాధానం చెప్పలేదు. నన్ను నేను పరిచయం చేసుకుని ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారని అడిగాను. బాధితులకు అందిస్తున్న సేవ గురించి నేను రాస్తానని చెప్పాను. ఎప్పుడైతే నేను జర్నలిస్ట్ నని చెప్పానో వెంటనే అతను అక్కడ నుంచి వెళిపోయి బాధితులకు టీ అందించడంలో నిమగ్నమయ్యాడు. టీ అందిస్తూ అతను ఎవరినీ... ‘నీ మతం ఏది? నీ కులం ఏది’ అని అడగలేదు.* 

 *నేను కూడా చనిపోయినవారు ఎంతమంది, గాయపడినవారు ఎంతమంది అని తెలుసుకుని, సహాయ కార్యక్రమాల గురించి మా ఆఫీస్ కు సమాచారం అందించడంలో పడిపోయాను.* 

 *అది అర్ధరాత్రి సమయం. శవాలను బోగీల నుండి తీసే పని కొనసాగుతోంది. అప్పుడే మధ్యాహ్నం నేను కలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నాకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. “ఇందులో నాలుగు రొట్టెలు, కొద్దిగా కూర ఉన్నాయి. మీరు మధ్యాహ్నం నుంచి పని చేస్తూ అలిసిపోయి ఉంటారు. ఆకలిగా ఉండిఉంటుంది. తినండి’’అన్నాడు.* 

 *నాకు నిజంగానే బాగా ఆకలిగా ఉంది. అయినా ‘మీ పేరు, మీరు ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారో చెపితేనే ప్యాకెట్ తీసుకుంటా’నని షరతు పెట్టాను.* 

 *అప్పుడు అతను తాము రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలమని చెప్పాడు. రైలు ప్రమాద బాధితులకు సహాయం అందించడానికి వచ్చామని చెప్పాడు. వెంటనే నా జర్నలిస్ట్ బుర్రకు ఇది చాలా మంచి స్టోరీ అవుతుందనిపించింది. అతని పేరు చెప్పమని పదేపదే అడిగాను. అయినా అతను తన పేరు మాత్రం చెప్పలేదు. పైగా ఇది ఎక్కడా ప్రచురించనని నేను అంతకుముందే చేసిన వాగ్దానాన్ని గుర్తుచేశాడు.* 

 *అప్పుడు రోజంతా అక్కడే ఉండి, అందరికీ టీ, టిఫిన్ తయారుచేసిన మహిళల గురించి అడిగాను. వాళ్ళంతా తమ కార్యకర్తల కుటుంబాల నుంచి వచ్చినవారు అని చెప్పాడు.* 

 *శవాలపై కప్పిన తెల్ల బట్ట గురించి అడిగితే అది బట్టల దుకాణం ఉన్న స్వయంసేవకులు స్వచ్ఛందంగా ఇచ్చిన బట్ట అని చెప్పాడు. రొట్టెల పిండి, నూనె కిరాణా దుకాణం ఉన్న వాళ్ళు ఉచితంగా ఇచ్చారని చెప్పాడు.* 

 *“ఆర్ ఎస్ ఎస్ హిందూ సంస్థ కదా, మీరు ఇతరులకు కూడా సహాయం అందిస్తున్నారేమిటని” అడిగాను.* 

 *అందుకు అతను “భాయిసాబ్, ఇక్కడ బాధితులందరికి మేము సహాయం అందిస్తున్నాము. సహాయం అందించడంలో కులం, మతం చూడకూడదని మా సంస్థ భావిస్తుంది’’ అని సమాధానమిచ్చాడు.* 

 *శవాలపై బట్ట కప్పుతున్నప్పుడు కూడా చనిపోయినవారి మతం ఏమిటో, కులం ఏమిటో తమకు తెలియదని, అది పట్టించుకోమని చెప్పాడతను.* 

 *ఈ మాటలు చెప్పి ఆ నిజాయతీపరుడైన `భగవంతుని సేవకుడు’ తన పేరు చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.* 

 *నేను ప్రమాద స్థలంలో 36 గంటలపాటు ఉన్నాను. అంతసేపూ వాళ్ళు బాధితులకు, జర్నలిస్ట్ లకు, డ్యూటీలో ఉన్న ప్రభుత్వాధికారులకు కావలసినవి అందిస్తూ కనిపించారు.* 

 *ఆ మర్నాడు ప్రమాద వార్తను పత్రికలన్నింటిలో చూసిన నాకు బాధితులకు నిస్వార్ధంగా సేవ చేసిన ఆ కార్యకర్తల పేర్లు గానీ, ప్రస్తావన గానీ ఎక్కాడ కనిపించలేదు.✍️*

 *జయహో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్🕉️🚩🕉️🚩🕉️🚩*


*విమర్శలు చేసేవారు పై సందేశాన్ని చదవండి, చదివించండి..*
 *ఎప్పుడైనా ఒక సంస్థ పైన ఆరోపణలు చేసేటప్పుడు అ సంస్థకు సంభందించిన అన్ని విషయాలు క్షుణంగా తెలుసుకున్న తర్వాత విమర్శలు చేయండి.* 

 *ఆర్ఎస్ఎస్ అంటే ఇతర  మతస్థులకు వ్యతిరేకమని భావన ఉన్నది. కావున ఆ సంస్థను విమర్శించేవాళ్లు లోతుగా అధ్యాయనం చేయాలి.👈🏻* 
 *చాలామంది విమర్శలు చేసిన వారు తమ తప్పులను తెలుసుకున్నారు🙊* 
 *ఆ సంస్థ ఎవరికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో ఎవరికైనా వాతావరణం విపత్తులు వచ్చిన అనుకోని ప్రకృతి  సహకారం  లబించక , నష్టం జరిగినా యుద్ధ సమయాల్లో దేశ రక్షణ సైనికులకు రక్తదానం వారికి ఇతరత్రా సామాగ్రి అందించడంలో గాని ఎప్పుడు ముందుంటుంది 👈🏻*
 *దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకం👈🏻 జాతీయవాదమే వీరిపునాది, దేశానికి వ్యతిరేకంగా ఏనాడు కూడా మాట్లాడలేదు .* 
 *అటువంటి సంస్థను నిషేదిస్తామని కుహన రాజకీయ పార్టీలు ఇతర మతస్తుల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు.* 
 *అంటే వారికి మంచి నిర్ణయం తీసుకునే  అవగాహన లేదు.* 
 *ఎప్పుడు హిందూ జాతిపై విద్వేషము చిమ్మతున్న  పార్టీలను మట్టు పెట్టవలసి పడవలసిన సమయం ఆసన్నమైంది.* 

 *చాలా సంతోషం*

 *జయహో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్*
 *🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩*
 కొంతమంది సంపాదనే జీవితం, జీవితమే సంపాదన అన్నట్లుగా కష్టపడతారు. తమకు తమ పని, వ్యాపారాలు తప్ప వేరే ధ్యాసే ఉండదు. నిజమే సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే, కష్టపడటంలో ఎలాంటి తప్పులేదు కానీ ఎంతవరకు? నీ జీవితం మొత్తం ఇలాగే కష్టపడుతూ పోతే ఇంక సుఖపడేదెప్పుడు, సంతోషంగా జీవించేది ఎప్పుడు? డబ్బు ధ్యాసలో పడి మీరు మీ జీవితాన్ని కోల్పోవడం లేదు కదా? మీకంటూ కొన్ని మధుర జ్ఞాపకాలైనా ఉండాలి కదా? తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీ వద్ద చాలా డబ్బు ఉంటుంది, కానీ మీతో అయిన వాళ్ల ప్రేమ ఉండదు, వారితో మీరు పంచుకునే అపురూప క్షణాలు ఉండవు. చివరకు మీరు కోల్పోయిన కొన్ని చిన్నచిన్న ఆనందాలను, మీరు ఎంత డబ్బు పోసినా కొనలేరు, అప్పుడు మీ వద్ద ఎంత ఆస్తి ఉండి ఏం లాభం, మీరు ఎంత ధనవంతులై ఏం లాభం. గడిచిన సమయం తిరిగి రాదు, అందుకే సమయం అన్నింటికన్నా విలువైనది అని చెబుతారు. ఇక్కడ మనమొక చిన్న కథ చెప్పుకుందాం. ఇది అందరికీ తెలిసిన కథే కావచ్చు, కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే కథ.

ఒకసారి ఒక మత్స్యకారుడు సముద్రపు ఒడ్డున ఒక చెట్టు నీడలో కూర్చుని బీడీ తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక ధనిక వ్యాపారి అతని వద్దకు వచ్చి, ఇలా చెట్టుకింద హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోడానికి నీకు సిగ్గుగా లేదా? ఎందుకు పనిలేకుండా కూర్చున్నావు అంటాడు. దానికి ఆ పేద మత్స్యకారుడు తనకు రోజుకు సరిపడా చేపలు దొరికాయని బదులిస్తాడు.

అది విని ఆ ధనవంతుడు కోపం తెచ్చుకుని.. ఇలా ఖాళీగా కూర్చొనే బదులు ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా అంటాడు.

మత్స్యకారుడు మాట్లాడుతూ మరిన్ని చేపలను పట్టుకొని నేను ఏమి చేస్తాను? అంటాడు.. అందుకు ధనిక వ్యాపారి స్పందిస్తూ ఎక్కువ చేపలు పడితే, ఎక్కువ అమ్ముకోవచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, పెద్ద పడవను కొనుగోలు చేయవచ్చు. నాలాగా నువ్వు ధనవంతుడిలా మారవచ్చు అంటాడు..

ధనికుడి మాటలకు మత్స్యకారుడు నవ్వి, మీలా ధనవంతుడిగా మారితే ఏంటి ఉపయోగం అంటాడు. మత్స్యకారుడి మాటలను మూర్ఖపు మాటలుగా భావించిన ధనికుడు.. ఓరి పిచ్చివాడా ఎక్కువ డబ్బు సంపాదించి, ధనవంతుడిగా మారితే జీవితాన్ని ప్రశాంతగా, ఆనందగా ఆస్వాదించవచ్చు అని హితబోధ చేస్తాడు. అందుకు మత్స్యకారుడు ధనవంతుడి వైపు ఒక చూపు చూసి ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా అంటూ హాయిగా రిలాక్స్ అవుతాడు. మత్య్సకారుడి మాటకి ధనిక వ్యాపారి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారిగా ఆలోచించి ఇతడు చెప్పింది నిజమే కదా అనుకుంటాడు. ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకడానికి డబ్బే ఉండనవసరం లేదని జ్ఞానోదయం పొందుతాడు.

నీతి ఏమిటి? రేపు సంతోషంగా ఉండటానికి ఈరోజు మీ జీవితంలోని ఆనందాన్ని కోల్పోనవసరం లేదు. మనకు ఉన్నది ఒక్కటే జీవితం, ఈ క్షణాన్ని మనసారా ఆస్వాదించండి, సంతోషంగా జీవించండి. ఈ ఆదివారాన్ని సెలవు రోజును హాయిగా గడపండి. హ్యాప్పీ సండే!