🕉️ *శ్రీశ్రీశ్రీ త్యాగరాజ స్వామి వారి జయంతి 3rd may*🕉️
*గురుబోధ:*
శ్రీ త్యాగరాజ స్వామివారు 96 కోట్ల రామ నామ జపం చేసారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అలాగే మనం కూడా ఏదో ఒక భగవన్నామాన్ని తరచూ స్మరిస్తుండడం వల్ల తెలియకుండానే ఆ నామం మనకు అలవాటు అయ్యి మనల్ని తరించేట్లు చేస్తుంది.
శ్రీ త్యాగరాజ స్వామి వారి నిత్య పారాయణ గ్రంథం పోతనగారి శ్రీమద్ భాగవతం. త్యాగరాజస్వామికి గొప్ప బహుమానం ఇవ్వాలని తన ప్రియశిష్యులలో ఒకరు శ్రీ పోతనభాగవతాన్ని మొత్తం స్వయంగా వ్రాసి బహూకరించాడు. త్యాగరాజాస్వామికి పోతన భాగవతం అంటే అంత ఇష్టం. అటువంటి గొప్ప గ్రంథాలని నిత్యం మనం కూడా పారాయణం చేయడం వల్ల భగవంతునికి మరింత దగ్గర అవుతాము.
పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర
శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
No comments:
Post a Comment