Wednesday, May 28, 2025

స్త్రీలో అందం నచ్చినట్లుగా వ్యక్తిత్వం నచ్చదు చాలామంది పురుషులకి .. స్త్రీలకి అది ఒకరకంగా చెప్పాలంటే శాపమే.

 *స్త్రీలో అందం నచ్చినట్లుగా వ్యక్తిత్వం నచ్చదు చాలామంది పురుషులకి .. స్త్రీలకి అది ఒకరకంగా చెప్పాలంటే  శాపమే.*

*అలాగే భర్త సంపాదన తో బ్రతుకుతూ, మరొక పురుషుని సాంగత్యం లో ఉండే ఆడదాని వల్ల ఆ భర్త ఎన్ని అవమానాలను పొందుతాడో అతనికి మాత్రమే తెలుసు*
*నేటి ఈ విపరీత పోకడలు ఎటు నడుపుతున్నాయో.*

*స్త్రీలో అలా కేవలం అందం మాత్రమే గుర్తించే పురుషుడికి ఆమె తనపై ఆధారపడాలని తన మాటే పరిగణలో తీసుకోవాలనే వాంఛ ఎక్కువగా ఉంటుంది మనసులో.*

*ఆ బలీయమైన భావనకి  ఆమెని రక్షిస్తున్నానో  పోషిస్తున్నాననో ఓ ఆత్మవంచన ఒకటి పురుషుడు ఏర్పరుచుకుని  మనస్పూర్తిగా అదే నమ్ముతూ ఆమెని ఎంతో కొంత కంట్రోల్ చేయాలని చూస్తూ ప్రపంచాన్ని కొద్దికొద్దిగా దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.*

*అలాకాకుండా ఎవరికీ ఏ ఇబ్బందీ‌ కలిగించకుండా తన జీవితాన్ని తను చూసుకునే స్త్రీ ఒకరుందంటే ఆమెకి అహం ఎక్కువనో ఉత్త (మ‌) ప్రవర్తన అవలంబించదనో నిందలు వేయడానికి సిద్ధమవుతాడు సామాన్యంగా పురుషుడు  -  తనపై ఆధారపడకుండా జీవితాన్ని స్వతంత్రంగా ఆమె గడుపుతుతోందనే ఓర్వలేని గుణం ‌ఎంతో కారణమవుతుందనుకుంట ఈ రకంగా అతను ప్రవర్తించడానికి.*

*చిత్రమేంటంటే ఇలా సొంత భావాలతో జీవితాన్ని గడిపే స్త్రీ అంటే సాటి స్త్రీలలో‌కూడా అంత మంచి అభిప్రాయం ఉండదు - ఆమె జీవితం గురించి వారికంతలా  అవగాహన లేకపోయినా తోటివారితో ఆమె గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెడుగా చాలా తేలికగా మాట్లాడే తత్వాన్ని మీరు చాలామంది మధ్య తరగతి స్త్రీలలో గమనించవచ్చు - దీనికి‌ కారణం ' తాము గడుపుతున్న విధంగా కాకుండా ఈమె ఇంకోలా తన జీవితాన్ని తనకి నచ్చినట్లు గడుపుతోందని ' పైకి అంతలా‌ కనపడని అంతర్గత అసూయ వారికుండడం వల్లనే  తప్ప  సమాజ నియమాలూ ,, కట్టుబాట్లు పట్ల వారికేమీ గట్టి నమ్మిక ‌ఉండి కాదు అని ఒక అభిప్రాయం.*

*సాధారణంగా అతను ఆమెకు ప్రపంచ పోకడలు అర్థం చేసుకునేలా తనని తీర్చినపుడు ఆ స్త్రీ అతనిని నిర్లక్ష్యం చేసి తన ఉనికి కలుషితం చేసుకున్న వేళ ఆమెని విడనాడడం కంటే చేయగలిగింది ఏమీ లేదని నా అభిప్రాయం.*

Sekarana

No comments:

Post a Comment