Wednesday, May 28, 2025

 [5/26, 16:47] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!


*తాత్పర్యం:*

పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా
ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో
జీవించగలగాలి.
[5/26, 16:47] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.*
[5/26, 16:47] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*చిలకమ్మ పెండ్లి*


చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ
కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా
కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ
కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువూదగా
నెమలి సొగసుగా - నాట్యం చేయగా
సాలీడిచ్చిన చావు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగా
మల్లీమాలతి - మాధవీ లతలు
పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ
మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై
[5/26, 16:47] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*విన్నవన్నీ నమ్మొద్దు నమ్మినవన్నీ చెప్పొద్దు*


ఒకవేళ నమ్మితే ఆ మాటలను మనసులోనే ఉంచుకోవాలి కానీ దాన్ని మరొకరి దగ్గర చెబితే కొన్ని సందర్భాల్లో దోషరహితులను దోషులుగా ప్రచారం చేసినట్లు అవుతుంది.
[5/26, 16:47] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*ఊకదంపుడు*

ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో.
[5/26, 16:47] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*ఉన్నట్టుండి గంట.. గణగణ మోగిందే!*

అడవిలో అల్లరిచిల్లరగా తిరిగే అడవిపిల్లికి ఒకరోజు అది వెళుతున్న దారిలో ఒక చిన్న గంట దొరికింది. అడవి గుండా రాజధాని హీలాపురికి వెళుతున్న ఓ ఎడ్ల బండికి కట్టి ఉన్న ఓ ఎద్దు మెడలోని గంటలహారం లోంచి జారి పడిన చిన్న గంట అది. దాన్ని చూసి ముచ్చట పడిన అడవిపిల్లి ఓ మొక్క తీగకు దాన్ని తగిలించుకుని మెడలో అలంకరించుకుంది.
వాగునీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, మురిసిపోసాగింది అడవిపిల్లి. అటుగా వెళుతున్న జింక దాన్ని చూసి ‘ఏమిటంతగా మురిసిపోతున్నావు?’ అని అడిగింది. మెడలో అలంకరించుకున్న గంటను చూపించి ‘గంట మెడలో వేసుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ!’ అని అడిగింది అడవి పిల్లి. ‘చాలా బాగున్నావు. ఈ గంట నీ మెడలో చాలా అందంగా ఉంది’ అని చెప్పి వెళ్లిపోయింది జింక.
మెడలో ఆ గంట కదులుతూ చేస్తున్న శబ్దానికి అడవి పిల్లి మురిసిపోతూ దార్లో కనిపించిన ప్రతీ జంతువునూ ఆపి మెడలోని గంటను చూపించి ‘ఎలా ఉంది?’ అని అడుగుతుంది. అవి మెచ్చుకునే వరకూ వదిలిపెట్టట్లేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే.. మెడలోని గంట కదులుతూ శబ్దం చేస్తుంటే.. ఆ ధ్వని చాలా మధురంగా అనిపించసాగింది పిల్లికి.

మధ్యాహ్నం కావడంతో ఆకలి వేసింది పిల్లికి. పొంచి ఉండి చిన్న చిన్న పిట్టల్నీ, ఉడతల్నీ, మిడతల్నీ పట్టుకోబోయింది. మెడలో ఉన్న గంట చేసే శబ్దం విని అవి ఆపద శంకించి పిల్లికి దొరక్కుండా తప్పించుకుని అవి పారిపోసాగాయి. ఎంతసేపు ప్రయత్నించినా పిల్లికి తినడానికి ఒక పిట్ట గానీ, ఉడుత గానీ దొరకలేదు. ఇక చేసేది లేక భూమిలో నుంచి దుంపలు పీక్కుతినడానికీ ప్రయత్నించింది. కానీ అలవాటు లేని ఆహారం కదా..! దానికి అంతగా రుచించలేదు.
సాయంత్రం అవుతున్న కొద్దీ ఆ గంట చేసే శబ్దం పిల్లికి నచ్చలేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఇంతకు ముందు మధురంగా అనిపించిన గంట చప్పుడు ఇప్పుడు కర్ణ కఠోరంగా వినపడసాగింది. చివరికి పిల్లి.. అటుగా వెళుతున్న తోడేలును ఆపి ‘ఈ గంట శబ్దం వినలేకపోతున్నాను. అది వినిపించకుండా ఏదైనా ఉపాయం చెప్పు మావా!’ అని ప్రాధేయపడింది. దానికి తోడేలు ‘దానిదేముంది అల్లుడూ!’ అంటూ.. మెడలోంచి గంట తీసేయడానికి ప్రయత్నించింది.
పిల్లి ఒప్పుకోలేదు. ‘నా మెడలో ఈ గంట చాలా అందంగా ఉంది. దాన్ని తీయకుండా శబ్దం రాకుండా ఆపలేవా?’ అని అడిగింది పిల్లి. ‘అలా చేయడం నాకే కాదు. ఎవరికీ చేతకాదురా అల్లుడూ’ అంటూ వెళ్లిపోయింది తోడేలు. అడుగడుక్కీ వినిపిస్తున్న గంట శబ్దం పిల్లి వినలేకపోతోంది. దార్లో కనిపించిన జంతువులన్నింటినీ ఆపి, మెడలో నుంచి గంట తీయకుండా నాకు ఆ శబ్దం వినబడకుండా ఏదైనా ఉపాయం చెప్పండి’ అంటూ ప్రాధేయపడింది.
అంతా విని నక్క ‘ఓస్‌! ఇంతే కదా! నీ మెడలో నుంచి గంట తియ్యకుండా గంట శబ్దం చెయ్యకుండా చెయ్యాలి. అంతే కదా! అని చిటికెలో ఏదో గమ్మత్తు చేసింది నక్క. ఇప్పుడు పిల్లి మెడలో గంట ఉంది గానీ అది శబ్దం చేయడం లేదు. పిల్లి నక్కకు కృతజ్ఞత తెలుపుకొని మెడలో ఉన్న అందమైన గంటను ఊపుకుంటూ వెళ్లిపోయింది. మెడలో గంట శబ్దం చెయ్యకపోవడంతో అది పిట్టల్నీ, ఉడుతల్నీ ఒడుపుగా పట్టుకుని భోం చేయసాగింది.
ఇంతకీ చేసిన ఉపాయం ఏమిటో చెప్పలేదు కదూ! ఏం లేదు. నక్క, పిల్లి మెడలోని గంట లోంచి అది మోగడానికి ఉపయోగపడే చిన్ని కాడని తీసేసింది అంతే!

- కోనే నాగ వెంకట ఆంజనేయులు
[5/26, 16:47] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*🟥బూడిద తెల్లగా ఉంటుందేం? Ash color is white why?*

🟩బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.

బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.
[5/26, 16:47] +91 79819 72004: *e Reading Summer Camp Activities- Day-26*
*3-5 తరగతుల విద్యార్థులకు*
*తెలుగు నీతి కథ - *మూడు వరాలు*

*చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు.*

*ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్ట పడేవారు, కాని యెంత కష్ట పడ్డా బీదరికం తప్పలేదు.*

*ఒక రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది.*

*ఎంతో కాలంగా రాయి లో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి మూడు వరాలు ప్రసాదించింది.*

*భార్య రైతుతో, “డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సద్దుకుంటాయి” అంది.*

*రైతు, “వద్దు! హటాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళి పోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము” అన్నాడు.*

*అలాగే దేవత వాళ్లకు ఒక్క రోజు గడువు ఇచ్చింది.*

*ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళం రైతుతో, “డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే యెంత బాగుండేది!” అని నిట్టూర్పుతో అంది.*

*వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండి పోయాయి.*

*రైతు కోపంగా, “అనవసంగా ఒక వరం పాడు చేసావు! ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో!” అని తిట్టాడు.*

*వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరు భయ పడి పోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు.*

*అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి.*

*అలా ఆలోచించకుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు మూడు వరాలనీ వేస్టు చేసుకున్నారు.*

*ఆ తరువాత తల పట్టుకుని బాధ పడితే మట్టుకు ఏమి లాభం!*

*English:*
*Thirsty Crow*

*Today we are going to Read the Story in a Funny Way*

*Maths:*
*Comparison of Numbers*

Drawing:*
*Squirrel with 6*
[5/26, 16:47] +91 79819 72004: *e Reading Summer Camp Activities- Day-26*
*6-9 తరగతుల విద్యార్థులకు*
తెలుగు నీతి కథ: *చిట్టి జీవి.. గట్టి సాయం!*

*ఒక అడవిలో సింహం ఉండేది. అది వేటాడేప్పుడు ఎండిన కొమ్మమీద పడి పెద్ద గాయం తగిలింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చిక్కిశక్యలమైంది. సన్నబడ్డాక మరణించింది. ఆ తర్వాత యువ సింహం ఆ అడవికి రాజుగా ప్రకటించుకుంది. అసలే రారాజు. తన గాండ్రింపులు వింటే చాలు జంతువులన్నీ దూరంగా పరిగెత్తేవి.*

*ఆకుల మధ్య దాక్కునేవి. సహజంగా సింహరాజులో ఉండే ధైర్యం, విశ్వాసం చూసి మిగిలిన జంతువులన్నీ ‘గర్విష్టి, పొగరుబోతు, అధికారం’ అని తిట్టుకుంటున్నాయి. అయితే ఈ యువసింహం మంచి మనసున్నది.*

*ప్రాణాలొడ్డయినా సరే అడవిని కాపాడుకోవాలనే ఆశయం ఉన్న రాజు.*

*యువరాజు కాలంలో అన్నీ బావుండేవి. జంతువులన్నీ హాయిగా సంచరించేవి. ఒక రోజు సింహం చెట్టుకింద నిద్రపోతోంది. ఒక చిట్టెలుక తిరుగుతోంది.*

*ఊరికే ఉండకుండా చెట్టు ఎక్కి సింహం మీద దూకడం ప్రారంభించింది. సింహం ఊరుకున్నది. అయినా ఎలుక ఆగడాలకు, అల్లరికి తట్టుకోలేక తన పంజాతో పట్టుకుంది.*

*‘సింహరాజా.. మీరు నాలాంటి చిన్న జీవులను తినటం భావ్యం కాదు.*

*ఎవరైనా నవ్విపోదురు గాక’ అన్నది. ‘భళా.. మాటలు నేర్చిన చిట్టెలుకా’ అన్నది వ్యంగ్యంగా. ‘యువరాజా వారూ... చిట్టెలుకే కదా అని తక్కువ అంచనా వేయకండి.*

*ఇపుడు నా ప్రాణాలను వదిలేస్తే.. మీ ప్రాణాలూ ఎపుడోసారి కాపాడుతా’ అన్నది. ఈ మాటలు విని సింహం నవ్వుకుంది. ‘బతుకు జీవుడా’ అంటూ ఎలుకను వదిలేసింది.*

*జింకలను, ఏనుగులను పట్టాలంటే సింహం నుంచి తప్పించుకోవాలనే భయంగా మారింది ఓ ఇద్దరు వేటగాళ్లకు. ఈ భయం కాస్త ఎక్కువై ముందు అడవిలో సింహంను చంపేస్తే మిగతా పని సులువు అని నిర్ణయించుకున్నారు.*

*సింహం జాడలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీళ్లు తాగుతుంది? ఇలా రెక్కీ చేశారు. సింహం జాడ కనుక్కుని వేటగాళ్లు వల పన్నారు. నీళ్లు తాగి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వలలో చిక్కుకుపోయింది సింహం. గట్టిగా అరిచింది. వల చుట్టుకుంది.*

*ఆ క్షణంలో ఏమి చేయాలో అర్థంకాలేదు. ఇంతలో చిట్టెలుక.. తన పళ్లతో వలను కొరుకుతోంది. గట్టిగా అరవటంతో చిట్టెలుక స్నేహితులూ వచ్చారు. వలను కొరికేశారు. దూరంగా ఉండే వేటగాళ్లు రెండు నిముషాల్లో చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చారు.*

*వల దగ్గరికొస్తూన్న వేటగాళ్లపై వలలోంచి దూకింది. ఈ జీవితం చిట్టెలుక ఇచ్చిందే.. అనుకుని సిగ్గుపడింది. చిట్టెలుకకు ధన్యవాదాలు చెప్పింది.*

*English Story:*
*Solomon and The Bees*

*Solomon was a wise king. One day the Queen of Sheba went to see him. She stood in front of him at a distance. She held two garlands in her hands.*

*One garland was made up of real flowers while the other garland was made up of not-real flowers.*

*“Which is true? Which is false?" asked the Queen.*

*Solomon was silent for a while. He saw some bees outside the window. They were sitting on the rose.*

*“Open the window," said the king to a servant.*

*The servant obeyed the order. The bees entered the room through the window. They sat upon the garland of real flowers.*

*Everybody now knew which the real garland was.*

*The Queen praised Solomon’s wisdom and returned to the room in peace.*

*Maths:*
*Decimals Addition*
Solve the following Decimals Additions. One Example is given below.

*Activity:*
*Puzzles Solve*

No comments:

Post a Comment