*అప్పిచ్చు వాడు వైద్యుడు!*
*కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!*
*తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!*
*కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుడు!*
*బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు!*
*వండి పెళ్ళామును మెప్పిచ్చు వాడు అసలు మొగుడు!*
*మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు!*
*ముప్పూటా స్విగ్గీ తెప్పిచ్చువాడు భార్యా బాధితుడు!*
*ఇంట్లో ఉండీ లేడని చెప్పిచ్చువాడు దేశ ముదురుడు!*
*పాటకు లిప్పిచ్చు వాడు కథానాయకుడు!*
*పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు మేటి రాతగాడు!*
*ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!*
*ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!*
*ఆపద తప్పిచ్చు వాడు భగవంతుడు!*
*కాలము తీరినంత పైకి రప్పించ్చు వాడు యమకింకరుడు!*
*మొబైలే లేని వాడు దైవ స్వరూపుడు!*
*వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు!*
*వాట్సప్ ఉండీ మెస్సేజస్ ఫార్వర్డ్ లు చేయనివాడు ధృఢచిత్తుడు కదరా సుమతీ!?*
😄😅😄 😅😄😅 😄😅😄
*మనలో ఎంతమంది ధృడచిత్తులు?!*
🥲😀🤣 😆🤪😆 🤪😁😂
No comments:
Post a Comment