🙏 *రమణోదయం* 🙏
*కొన్ని సమయాలలోనే సాధన చేయాలన్న నియమాన్ని దాటి నిరంతరం జరిగే సహజాత్మ నిష్ఠతో వాసనలనబడే కేశాలు శిరస్సున ఆలోచనల రూపంలో మొలవటానికి ఎటువంటి అవకాశమివ్వక నాశనం చేయటమే సన్యాసులు చేసుకొనే నిజమైన శిరోముండనం.*
వివరణ: *సాధువులు నెలకొకసారి తలబోడి చేసుకోవటాన్ని శిరోముండన మంటారు. దీని భావమేమంటే : అప్పుడప్పుడు ఆలోచనల రూపంలో ఎగసే వాసనలను నాశనం చేయటమే. ప్రతిదినం ఉదయం సాయంకాలం అని ఒక నియమిత కాలాల్లో మాత్రమే సాధన చేసి అప్పుడు ఎగసే తలపులనే నాశనం చేయడానికి పోల్చి చూపారు. అయిన్నప్పటికీ ఎడతెరిపి లేకుండా సహజంగా జరిగే సహజాత్మ నిష్ఠగల జ్ఞాని స్థితే సంపూర్ణ వాసనాక్షయం (మళ్ళీ మళ్ళీ వాసనలు ఎగయని స్థితి) కాబట్టి, అదే ఉత్కృష్టమైన శిరోముండనమని యిందు బోధించారు.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.675)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment