*మార్గదర్శి.....*
*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా...*
*🪔📿 దీపం చిన్నదైనా, చీకటికది మందే. వెలిగించు📿🪔*
*పుట్టుటతో ప్రతిమనిషికీ కొన్ని హక్కులుంటాయి. ఎన్నో బాధ్యతలు గూడ ఉంటాయి. చిన్నప్పటి నుండి హక్కుల కోసం పోరాడటమే మనకి తెలుసును. అది గూడ స్వసుఖం కోసము మాత్రమే. కొంత వయస్సు వచ్చేవరకూ ఆ పోరాటం చెల్లుబాటవుతుంది. ఒక వయస్సు వచ్చాక, పోరాటం ఇక నడవదు. అపుడు బాధ్యతలను గుర్తించవలసి ఉంటుంది. నెరవేర్చవలసివస్తుంది. బాధ్యతాయుతమైన జీవితం గడిపేవాడిని సమాజం హర్షిస్తుంది. వానినే ఉత్తమపౌరుడంటారు. అతణ్ణి దైవం అనుగ్రహిస్తాడు.*
*కర్తవ్యాన్ని మరచిన వ్యక్తిని దైవమనుగ్రహించదు. సమాజం గూడ ఛీత్కరిస్తుంది. కనుక కర్తవ్యాన్ని గుర్తించుకొని బాధ్యతలనెఱింగి జీవించేవాడినే "కర్మయోగి" అంటారు. ఈ బాధ్యతలు వ్యక్తిగతమైన వాటితో ప్రారంభిస్తే, కుటుంబపరమైనవి కొన్ని ఉంటాయి.*
*సమాజ శ్రేయస్సుకు సంబంధించినవి మరికొన్నైతే, భగవత్పరమైనవి ఏన్నో ఉంటాయి. దీనిలో ఏవి నెరవేరుస్తున్నా, అవి మరోవ్యక్తికి, మరోరంగానికి ఉపద్రవకరం కారాదు. ఉదాహరణకు "వ్యక్తిగత బాధ్యతనూ చూద్దాం! తన శరీరాన్ని సమర్ధవంతమైన పరికరంలా ఆరోగ్యంగ ఉంచుకోవడం అవసరం. ఏదో ఒక కుటంబంలోనే ప్రతి మనిషి ఉంటాడు కనుక ఈ వ్యక్తిగత కర్తవ్యం కుటుంబ ఆరోగ్యానికి భంగకరంకాకుండా చూసుకోవాలన్నమాట. కుటుంబాన్ని ఏడిపించే స్వసుఖాభిలాష పనికిరాదు. అది సవరించుకోవలసి ఉంటుంది. తానా కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే కనుక. ఇది తెలిసికొని ప్రవర్తించడమే "బాధ్యతాయుత" జీవితం గడపడం. అలానే, కుటుంబంలో వ్యక్తులు కలసి చేసేపనులు, తోటి ఇరుగుపొరుగులకు మిగిలిన సమాజానికి హానికరంగ, వారిని దుఃఖ పెట్టేట్టుండ తగదు. ఒకవేళ అలా ఉంటే వాటిని సంస్కరించు కోవడం "బాధ్యత" లోక "కర్తవ్యం” అవుతుంది. ఇలానే సమాజంలోని ఏదో ఒక వర్గం, వారంతా, అది ఏపేరుమీద ఏర్పడ్డ వర్గమైనాసరే, కలసి తమ సుఖంకోసం చేసే ఏపనైనా తాముండే ప్రాంతంలోని, దేశంలోని ఇతర వర్గాల ఉనికికి ఇబ్బంది కరంకారాదు. ఒకవేళ అలా ఉంటే వాటిని సమాజానికి భంగంకానిరీతిలో పరిష్కరించుకోవడం, బాధ్యత అవుతుంది. అలా వ్యవహరించేవాడే 'కర్మయోగి', భగవత్పరమైన బాధ్యతలుకూడ పైవిధంగానే సవరించుకోవాలి. ఒక రూపంలో, పేరుతో ఒకరు చేసే భగవత్కార్యం, మిగిలిన వారిని పీడించేట్టుండటం తగదు. అలా ఉంటే దాన్ని సవరించుకోవాలి. దానిక్కావలసిన అవగాహన పెంపొందించుకోవడం అందరిబాధ్యత. 'స్వీయ 'ఆరాధన' ఉండాలి. తదితరమైన 'సర్వ ఆదరణ' నేర్వాలి. ఏది చేసినా అది, ఆ రూపంలో ఉండే జగదాధారుడు, పరమాత్మునికే చెందుతుందని శ్రీకృష్ణుడు స్పష్టంగ తెలిపాడు. అపుడు ఏ ప్రాణికి, ఏవస్తువుకు మంచి చేసినా అదీ, ఆ రూపంలో ఉండే “మాధవునికి చెందే సేవేకద! "మాధవసేవగ సర్వప్రాణిసేవ" అనేది ప్రతివ్యక్తికి "జీవనాడి" కావాలి. "ఉత్తమ కర్మయోగి"కిది లక్షణం.*
*అయితే ఇంతటి ఉదాత్త హృదయంతో మనం ఆచరించగలమా? అసలది మన మనస్సులో సదానిలుస్తుందా? శ్రమించి అభ్యాసమా రంభించినా, అది పూర్తయ్యేదెప్పుడు? ఒకవేళ ఆరంభించి మధ్యలో మానేస్తే చేసినదంతా వ్యర్థం! తలదూర్చకుండా మన బ్రతుకేదో చూచుకుంటే సరిపోతుందిగద! వినియోగించిన సమయం వ్యర్థం! ఎందుకిదంతా అసలా చికాకులో తలదూర్చకుండా మన బ్రతుకేదో చూచుకుంటే సరిపోతుందిగద! అనే ఉపేక్షావాదులకు శ్రీకృష్ణుడు ఇచ్చే అత్యుత్తమమైన భరోసా ఇది.*
*మాధవ సేవగ, బాధ్యత నెరింగి సత్ కర్మయోగము నారంభిస్తే, అలాంటి కర్తవ్యపాలన మెంతవరకు చేయగలిగితే అంత ఫలమూ తప్పక ఉంటుంది.*
*స్వార్థంతో, హృదయంలో రాగద్వేషాది మాలిన్యంతో ప్రారంభించిన పనులైతే, ప్రారంభించినవి మధ్యలో మానేస్తే కొన్ని వ్యర్థమైపోతాయి. కొన్ని విపరీతఫలితాలిస్తాయి. కొన్ని ప్రాణాంతకాలౌతాయి. ఆత్మ వినాశానికి దారితీస్తాయి. ప్రారంభించినవి పూరైనా లభించే ఫలితం అంతంతమాత్రమే. అదిగూడా తాత్కాలికంగానే ఉండి నశించిపోతుంది. తనసేవగ ప్రారంభించే కర్మయోగానిదైతే "అభిక్రమనాశః ఇహ న” ఇలాంటి పని ప్రారంభిద్దామనుకొంటూ, కొద్దిగ ఆరంభించి మానివేయడం లాంటిది జరిగినా ఆ చేసినంతవరకూ విఫలంకాదు. వ్యర్ధము కానేకాదు. ఒకవేళ చేయడంలో కాస్త లోటుపాట్లు ఏర్పడ్డా అవి విపరీత ఫలాన్నిచ్చి వినాశానికి దారితీయవు. భగవత్సేవగా చేయాలి లౌకిక, వైదిక కర్మలు మధ్యలో మానినా, మార్చినా జీవితానికి, కీర్తికీ హానిని కల్గిస్తాయని, అలా మానిన కొందరు బ్రహ్మరాక్షసులైనారని గూడ పురాణాలు చెపుతున్నాయి. బాధ్యత నెరిగి చేసే కర్మయోగానికి శ్రీకృష్ణుడు తానే రక్షణగ ఉంటానని హమీనిస్తున్నాడు. 'మహలోభయాత్ త్రాయతే' ఎంతెంత చేస్తే అంతంత వరకైనా సత్ఫలితాన్నిస్తుంది, పర్యవసానంగ అది భయంకరమైన ఈ అహంకార రూపమైన సంసారమనే సాగరంనుండి మనలను కాపాడుతుంది అలా మనలను రక్షించి బాగుచేయడానికి మంచి బాధ్యతతో చేసే పని అంతా అవసరంలేదు. అందులో "స్వల్పమపి" అతి కొద్ది భాగమైన ఇంత మంచి లాభాన్ని కల్గించును. కనుక బాధ్యత తెలిసి, భగవత్సేవగ మన జీవిత కార్యాలనన్నింటిని ప్రారంభిద్దాం! నిర్లక్ష్య వాదానికి నీళ్ళువదులుదాం! "నాకెందుకులెద్దూ నాకు చెందినదికాదు. నాదాకవస్తే అప్పుడు చూద్దాం!" వంటి నిర్లిప్త, నిరాసక్త ఉదాసీన వైఖరులను పారద్రోలుదాం! భగవంతుని భరోసాను విశ్వసిద్దాం! మంచిపనిలో ముందడుగువేద్దాం!*
*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺
No comments:
Post a Comment