Monday, May 26, 2025

 *గడిచిన 20 ఏళ్లలో మెల్ల మెల్లగా మనకి కనిపించకుండా, మన ఎరుకకి తెలీకుండా పోతున్నవి ఏంటి?*

చిన్న చిన్న లెక్కలు నోటితోనే చేసెయ్యడం. తప్పు కాలిక్యూలేటర్ ది కానే కాదు. ఆలోచించడం మానేసాం.. అంతే.!!!

బంతి భోజనాలు. ముప్పైయ్యేళ్ళకే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులనే మిష తో మనం వదిలేసిన ఇంకో ఆచారం.

బోరింగ్ పంపు లో నీళ్లు..కాకపోతే ఫ్లోరైడ్ ఎక్కువై తప్పదు వదిలేశాం.

ఆలిండియా రేడియో లో హైదరాబాద్, విజయవాడ A కేంద్రాల కార్యక్రమాలు. పాడి-పంట, కార్మికుల కార్యక్రమం, బాలనందం, సంక్షిప్త శబ్ద చిత్రం, భక్తి రంజని అన్నీ వదిలేశాం, ఈ తరానికి ఇవి ఉన్నట్టు కూడా తెలియదే.

స్వగృహ ఫుడ్స్ కాకుండా ఇంట్లో ఎవరైనా అరిసెలు చేస్తున్నారా..? రోట్లో అరబెట్టిన తడి బియ్యం దంచి మోదుగ ఆకులతో అరచేయి మందానా చేసే అరిసెలు చూస్తున్నామా?

తెలుగు నవలలు ఇంకా చదివే వాళ్లు ఎందరో..? యండమూరి, యద్దనపూడి, మల్లాది, మైనం పాటి భాస్కర్, సూర్యదేవర నవలలు చదవలేకపోతున్నాం. మల్లాది వారి కథకేళి మరో సారి చదవాలనుంది. ఫస్ట్ టైమ్ బాహుబలి సినిమా నా? ఒక తెలుగు నవలనా అంటే రెండోదానికే నా అమూల్యమైన ఓటు.

70s, 80s పాటలు వినడానికి సమయం లేదు కదూ..? కుంకుడు కాయలు, వేరు శనక్కాయలు, మిరపతోట కు నీరు పెట్టడం, అష్ట చెమ్మ, వైకుంఠ పాళి, సైకిల్ తొక్కడం ఇంకా చాలా…!!!

No comments:

Post a Comment