♥️ *కథ*♥️
అసలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేదానిని ఏది నిర్ణయిస్తుంది?
*ప్రయాణం*
ఒకసారి, ఒక సాధువు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా, ఒక బాటసారి అతని వద్దకు వచ్చి, ఒక కాగితం చూపించి, " స్వామి, దయచేసి, ఈ ప్రదేశం ఎంత దూరంలో ఉందో చెప్పగలరా?" అంటూ తన రెండు చేతులలోనూ రెండు భారీ సూట్ కేసుల బరువును మోయడానికి ప్రయత్నిస్తూ, "అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?" అని అడిగాడు.
సాధువు ఏమీ మాట్లాడకుండా లేచి, ఆ వ్యక్తిని తనను అనుసరించమని సైగ చేసి, అతనితో పాటు నడవడం ప్రారంభించాడు. ఆ సాధువు యొక్క వింత ప్రవర్తనకు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, కొంచెం భయపడ్డాడు కూడా.
సాధువుతో, “దయచేసి మీరు ఇబ్బంది పడకండి. నేను తెలుసుకోవాలనుకున్నది దూరం మాత్రమే. నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళగలను" అన్నాడు.
అప్పటికీ, సాధువు ఏమీ మాట్లాడలేదు ఆ వ్యక్తితో నడవడం కొనసాగించాడు. పదిహేను నిముషాల తర్వాత ఆగి, "నువ్వు ఆ ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకా రెండు గంటలు పడుతుంది", అని అన్నాడు.
"మీరు మొదట్లోనే ఆ సంగతి చెప్పవచ్చు కదా! నాతో ఒక మైలు నడవాల్సిన అవసరం లేదు కదా," అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
సాధువు ఇలా సమాధానమిచ్చాడు, " నీ నడక వేగం తెలియకుండా నీవు తీసుకునే సమయాన్ని ఎలా అంచనా వేయగలను?
ఎంత సమయం పడుతుంది అనేది దూరాన్ని బట్టి కాదు, నడిచే వ్యక్తి యొక్క వేగాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. నీవు ఈ రెండు భారీ సూట్ కేసులను వెంట తీసుకువెళుతున్నావు. అది నీ వేగాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు నేను నీతో పాటు నడిచాను కాబట్టి నువ్వు ఊరు చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుందని చెప్పగలను”,
ఇలా చెప్పి, సాధువు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రయాణికుడు సాధువుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన 'జీవిత లక్ష్యాన్ని' చేరుకోవడానికి సరైన సమయాన్ని చూపినట్లుగా, అతని వైపు కొంత సేపు చూస్తూ ఉండిపోయాడు.
*అంతా మన వేగం మీద ఆధారపడి ఉంటుంది. మన వేగం మన స్థితిపై ఆధారపడి ఉంటుంది.*
మనం పరిగెత్తగలిగితే, త్వరగా చేరుకుంటాం. మనం నెమ్మదిగా నడిస్తే, అలాంటప్పుడు, మన ప్రయాణ సమయం ఎక్కువ అవుతుంది. వెంటనే గమ్యాన్ని చేరుకునేలాగా కూడా మన వేగం ఉండచ్చు.
ఇది మన అంతర్గత ప్రయాణానికి (జీవితపు యథార్థ లక్ష్యం) కూడా వర్తిస్తుంది. మనం రెండు భారీ సూట్‌కేసులను మోస్తున్న బాటసారులం, ఒకటి గత అనుభవాలతో నిండి ఉంది, మరొకటి భవిష్యత్తు మీద అంచనాలతో నిండి ఉంది.
గతం తాలూకు ఇంకా భవిష్యత్తుకు చెందిన ఈ భారాల నుండి మనం విముక్తి పొంది, వర్తమానంలో జీవించడం ప్రారంభించినప్పుడు, మన జీవిత ప్రయాణం ఉత్సాహంతో, ఆనందంతో వేగవంతం అవుతుంది.
అత్యంత తపనతో, ఆత్రుతతో మన వంతు ప్రయత్నం చేస్తే, మనం ఇప్పుడే, ఇక్కడే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఒక మనిషి గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తితే, మరొకరు నడిచి గమ్యాన్ని చేరుకుంటారు, వ్యత్యాసం ఏమిటి? ఒకరు సమయాన్ని ఆదా చేసుకుంటారు, మరొకరు సమయాన్ని వెచ్చిస్తారు. 🌼
No comments:
Post a Comment