Wednesday, May 28, 2025

 *బుద్ధి ఎలా ఏర్పడుతుంది?* 

*ఆకాశ భూతం అగ్ని భూతంతో కలవడం వల్ల బుద్ధి ఏర్పడుతుంది.*

*మనిషికి బుద్ధి చాలా ప్రధానమైనది బుద్ధి ఉంటేనే మనిషి సక్రమంగా ఉంటాడు.*

*బుద్ధి లేకపోతే మనిషి ఎందుకు పనికిరాడు అందుకే ప్రతి ఒక్కరు తిడతారు.*

*నీకు బుద్ధి లేదా బుద్ధి లేదు అని.* 

*మనిషికి బుద్ధి చాలా ప్రధానం బుద్ధి ఉన్నవారే సక్రమంగా ఉంటారు, బుద్ధి లేని వారు ఇష్టమొచ్చినట్లు ఉంటారు.*

*బుద్ధి సక్రమంగా ఉండాలంటే బుద్ధికి ఏం కావాలి.?*

*బుద్ధి సక్రమంగా ఉండాలంటే తినే ఆహార పదార్థాలు సక్రమంగా ఉండాలి, తాగేటివి సక్రమంగా ఉండాలి.* 

*మద్యం తాగిన వాడి బుద్ధి చూడండి. వాడేం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు ఎలా ప్రవర్తిస్తుంటాడో వాడికి తెలియదు.* 

*వాడికి తెలియకుండానే వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఉదయం లేవగానే అయ్యో నాకు ఏం తెలియదు అంటాడు.* 

*చాలామంది చాలా రకాలుగా బుద్ధిని చెడగొడతారు. మాయ మాటలు చెప్పి దిక్కుమాలిన గ్రంథాలను బోధించి మతిస్థిమితం లేని వారంతా బుద్ధి చెడిపోయిన వారే, వ్యసనాలకు బానిస అయిన వారు బుద్ధి సరిగా లేనివారే.*

*ఇతరుల ధనమాన ప్రాణాలకు హాని చేసేవారికి బుద్ధి సరిగా లేనట్లు బుద్ధి సరిగా లేని వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు.* 

*తర్వాత కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు వస్తే బాధపడతారు. అయ్యో నేను ఇలా చేయడం తప్పు అని తర్వాత తెలుసుకుంటారు.*

*బుద్ధి సరిగా లేనివారే దొంగతనాలు చేస్తారు, బుద్ధి సరిగా లేనివారు దోపిడీలు చేస్తారు, బుద్ధి సరిగా లేనివారే మత పిచ్చిలో ఉంటారు, బుద్ధి సరిగా లేనివారే కుల పిచ్చిలో ఉంటారు.*
 
*బుద్ధి సరిగా లేనివారే ఏదో ఒక పిచ్చిలో ఉంటారు. మరి బుద్ధి సరిగా లేకపోవడానికి కారణం? బుద్ధికి సరైన జ్ఞానం లేకపోవడమే*

*మరి బుద్ధికి సరైన జ్ఞానం ఎలా వస్తుందో మరి.?.*

*┈┉┅━❀꧁బుద్ధిజ్ఞానం꧂❀━┅┉┈*
 *🙏సర్వేజనాః సుఖినో భవంతు 🙏*
🦜🦚🦜 🌹🙇‍♂️🌹  🦜🦚🦜

No comments:

Post a Comment