Wednesday, May 28, 2025

 💐 *నేను ఎవరు ?* 

రిటైర్మెంట్ తర్వాత, 
పని లేకుండా ఖాళీగా ఉండి,
 ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత, 
నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను.

నేను ఎవరు?

బంగ్లా కట్టాను, 
ఫార్మ్‌హౌస్ నిర్మించాను, 

ఎన్నో వ్యాపారాల లో పెట్టుబడి పెట్టాను,

కానీ ఇప్పుడు, నాలుగు గోడల మధ్యే బంధించబడ్డాను.

సైకిల్‌తో ప్రారంభించాను, 
మోపెడ్, బైక్, కార్లు కొన్నాను,

కానీ ఇప్పుడు, 
నా గదిలో ఒంటరిగా నడుస్తున్నాను.

ప్రకృతి నవ్వుతూ అడిగింది, “ నీవెవరు,  మిత్రమా?”
నేను సమాధానమిచ్చాను: “నేను… నేనే!”

రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు చూసాను,
కానీ ఇప్పుడు, నా ప్రయాణం
 డ్రాయింగ్ రూమ్, కిచెన్ వరకు మాత్రమే.

వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకున్నాను,

కానీ ఇప్పుడు, 
నా కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.

ప్రకృతి నవ్వుతూ అడిగింది, “ నీవెవరు, మిత్రమా?”
నేను సమాధానమిచ్చాను: “నేను… నేనే!”

పుట్టినరోజులు, నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు ఘనంగా జరుపుకున్నాను,
కానీ ఇప్పుడు, కూరగాయల ఖర్చు లెక్కపెడుతున్నాను.

ఒక్కప్పుడు పశువులకు, కుక్కలకు అదనపు రొట్టెలు వేసేవాడిని,
కానీ ఇప్పుడు, నాకు కొద్దిగా తినడమే సవాలుగా మారింది.

ప్రకృతి నవ్వుతూ అడిగింది, “ నీవెవరు, మిత్రమా?”
నేను సమాధానమిచ్చాను: “నేను… నేనే!”

బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు —
అన్నీ లాకర్లలో నిశ్చలంగా ఉన్నాయి.

సూట్లు, బ్లేజర్లు —
అన్నీ అలమారలో నిండుగా ఉన్నాయి.

కానీ ఇప్పుడు, 
ఒక మామూలు కాటన్ దుస్తులో  తిరుగుతున్నాను.

ప్రకృతి నవ్వుతూ అడిగింది, “ నీవెవరు, మిత్రమా?”
నేను సమాధానమిచ్చాను: “నేను… నేనే!”

ఆంగ్లం, ఫ్రెంచ్, హిందీ నేర్చుకున్నాను,
కానీ ఇప్పుడు, నా మాతృభాషలో వార్తలు చదువుతున్నాను.

పనికోసం ఎన్నో ప్రయాణాలు చేశాను,
కానీ ఇప్పుడు,
 వాటి లాభనష్టాలపై ఆలోచిస్తున్నాను.

వ్యాపారం చేశాను, 
కుటుంబం పెంచాను, 
అనేక సంబంధాలు ఏర్పరుచుకున్నాను

కానీ ఇప్పుడు, 
నా దగ్గర ఉండేది 
స్నేహంగా వుండే పక్కింటి వ్యక్తి.

విద్యలో వేల నిబంధనలు పాటించాను,
కానీ ఇప్పుడు, 
వాస్తవం చూస్తున్నాను

జీవితం లో 
అన్ని ఒడిదుడుకుల తర్వాత,
ఒక్కసారి, ఒంటరిగా వున్నప్పుడు 
నా ఆత్మ స్వరం వినిపించింది.

ఇక చాలు…
తయారు అవ్వు,  
ఓ బాటసారి  …
ఇప్పుడు నీ గమ్యం చేరే 
ఆఖరి ప్రయాణానికి సిద్దపడు.

ప్రకృతి నవ్వుతూ అడిగింది, “ నీవెవరు, మిత్రమా?”
నేను సమాధానమిచ్చాను:

“ఓ ప్రకృతి! 
నేనూ నీవే…
నీవే నేను...

ఒక్కప్పుడు ఆకాశంలో ఎగిరాను,
ఇప్పుడు భూమిని తాకాను.

క్షమించు నన్ను…
ఇంకోసారి జీవించడానికి అవకాశం ఇవ్వు…

*మనీ+షి గా కాకుండా,*
మనిషిగా జీవించుటకు,

సంస్కారంతో,
కుటుంబంతో, 
ప్రేమతో 
జీవించేందుకు…

 Senior Teenagers అందరికీ 
శుభాకాంక్షలు & అభినందనలు

No comments:

Post a Comment