*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*దైవేచ్ఛ...!!*
*మనం ఏదైనా పని చేయ తలపెడతాం. ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం. అదంతా మన ఘనతేనని చాటుకుంటాం. అదే విఫలమైతే దానికి కారణం ఇతరుల పైన నెడతాం. లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం. భగవంతుడికి మన మీద దయ లేదు, అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోసేస్తాం... అంతే కాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వ జన్మ కర్మల ఫలితమేననీ, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకోం. అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు.!!!*
*అది ఎలా ??? ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము!!...*
*ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు... అతడు కూటికి పేద అయినా అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు. కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం* *సాగిస్తుండేవాడు. అలా ఆ ఊళ్లోవాళ్ళందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది.*
*“దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది, దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను, దైవేచ్ఛ వల్ల నేను ఈ రోజు ఇంత సంపాదించ గలిగేను.” ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే అనుకుంటూ ఉండే వాడు. ఓ రోజు రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు, ఇంతలో కొంత మంది దొంగలు అటు వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఓ మనిషి కావలిసివచ్చి ఈ పేదవాడ్ని లాక్కెళ్ళి పోయేరు.*
*అలా తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగిలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు. ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసిన ఆ దొంగలు పారిపోయేరు...*
*రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఆ పేదవాడ్ని చూసి వీడే దొంగ అని తీసుకుని పోయి కారాగారంలో బంధించారు...*
*మర్నాడు విచారణకు అతడిని రాజు గారి వద్దకు తీసుకొచ్చేరు. ఈ విషయం తెలిసి ఆ ఊళ్లోవాళ్ళందరూ వచ్చి రాజుగారితో... “ప్రభూ!ఇతను మాకందరికీ తెలుసు, చాలా మంచివాడు, గొప్ప భక్తుడు కూడా, దొంగ కాదు ” అని చెప్పేరు. అది విని ఆ రాజుగారు పేదవాడితో... “నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా..?“ అని అడిగితే... దానికి ఆ పేదవాడు “ప్రభూ! దైవేచ్ఛ వల్ల నేను రాత్రి ఇంటిబయట కూచున్నాను... దైవేచ్ఛ వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది. దైవేచ్ఛ వల్ల వాళ్ళు నన్ను తమవెంట తీసుకుపోయేరు, దైవేచ్ఛ వల్ల వాళ్ళు దొంగిలించిన నగలమూటను నా నెత్తిన పెట్టేరు. దైవేచ్ఛ వల్ల మీ భటులు నన్ను దొంగనుకుని కారాగారంలో బంధించేరు. దైవేచ్ఛ వల్ల ఇప్పుడు నేను మీవద్దకు విచారణకు తీసుకురాబడ్డాను. అంతా దైవేచ్ఛయే ప్రభూ!“ అని చెప్పేడు. ఆ పేదవాడి భక్తినీ, అమాయకత్వాన్నీ చూసి రాజుగారు ఇతడు దొంగ కాదని చెప్పి వదిలేసేరు...*
*చూసేరా! ఆ పేదవాడు అంతా దైవేచ్ఛయే అనుకుంటుండడాన్ని తనను దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం గాని, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకుగాని, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం గాని, విచారం గాని కలుగలేదు. అంతా కూడా దైవ నిర్ణయమె, దైవేచ్ఛ యే... అనే భావం ఎప్పుడూ మనలో వుండాలి, అప్పుడే మనలని ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు...*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment