Friday, May 30, 2025

 *🌸|| ఓం వ్యాసదేవాయ నమః ||🌸*

         🌹 *మానసిక తపస్సు*🌹

*మనః ప్రసాదః సౌమ్య త్వం*(17అ - 16శ్లో)

*1.ఆత్మ వినిగ్రహః*
*మనసును సరైనరీతిలో నిగ్రహించుకోవాలి. రోజుకి 60 వేల ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో గతానికి, భవిష్యత్తుకు సంబంధమైన ఆలోచనలే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటివరకు గతం గురించి బాధపడడం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడడం అన్నది అలవాటయింది*

*భగవంతుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తూ, మననం చేసుకుంటూ ఉండు. భగవంతుడు ఏం చెప్పారు అన్న దాని మీద, భగవంతుని బోధ మీద మనసు లగ్నం చేయి. ఆ బోధే నిన్ను నడుపుతూ ఉంటుంది. భగవంతుని చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నప్పుడు నీకు ఏ బాధ, భయము ఉండదు.*

*పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారు*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹

No comments:

Post a Comment