Wednesday, May 28, 2025

 *ప్రేమంటే అదృష్టం కాదు, అది ఓ పవిత్రమైన ఎంపిక!*

*వృద్దాప్యంలోనూ ఒకరిపై ఒకరు గాఢమైన ప్రేమను పంచుకుంటూ సాగిపోతున్న జంటలను చూసినప్పుడు, ఎంత "అదృష్టవంతులో" అని తేలిగ్గా అంటుంటాం. కానీ ఆ వయసులోనూ అదే ప్రేమ, ఆదే ఆప్యాయతతో వారు కలిసి ఉన్నారంటే అది వారి నిబద్ధతకు నిదర్శనం. నిజమైన, శాశ్వతమైన ప్రేమ యాదృచ్ఛికంగా దొరికేది కాదు; అది ప్రతిరోజూ ఓర్పుతో, క్షమాగుణంతో, పట్టుదలతో అణువణువునా నిర్మించబడుతుంది. బలమైన బంధాలు ఎందుకు నిలబడతాయంటే, ఆ బంధంలో ఉన్న ఇద్దరూ ఆనందంలోనే కాదు, కష్టాల్లోనూ, మాటల్లేని మౌనంలోనూ, జీవితాన్ని కుదిపేసే తుఫానుల్లోనూ ఒకరికికొకరు తోడుగా నిలబడతారు కాబట్టి. ఎలాంటి బాధ వచ్చినా, ఎదుగుదలలోనూ, ఎన్నో లోపాలున్నా ప్రేమతోనే కలిసి ఉండాలిని దేఢంగా నిర్ణయించుకుంటారు. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటారు, క్షమించుకుంటారు, కలిసి ఎదుగుతారు.*

*నిజమైన ప్రేమకు ఎలాంటి లోపాలు ఉండవు అనుకోవడం పొరపాటు, అది నమ్మకమైనది. అవతలి వ్యక్తిలో లోపాలున్నా సరే వాళ్ళని ప్రేమతో అంగీకరించడం, నిరాశలో ఉన్నప్పుడు దయ చూపడం, సందేహాలు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకొవడం - ఇదంతా నిజమైన ప్రేమ లక్షణం. ఒక చిన్న మృదువైన మాట, కష్టంలో తోడుగా నిలిచే చేయి, పంచుకునే చిరునవ్వు... ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే నిజమైన ప్రేమ కనిపిస్తుంది. జీవితాంతం కలిసి ఉండే జంటలు కేవలం కాలంతో కొట్టుకుపోరు - వాళ్ళు తమ బంధాన్ని తామే నిర్మించుకుంటారు. ప్రతిరోజూ, ప్రతీ క్షణం, ఎంతో కృషితో, వినయంతో, అచంచలమైన అంకితభావంతో ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధం లాంటిది వారి ప్రేమ. అందుకే, మీరు అలాంటి అద్భుతమైన, శాశ్వతమైన ప్రేమను చూసినప్పుడు గుర్తుంచుకోండి: అది విధి నిర్ణయించినది కాదు. అది హృదయంతో, ధైర్యంతో పదేపదే తీసుకున్న ఒక మహత్తరమైన ఎంపిక!*


*꧁❀❀━❀🙏🙇‍♂️🙏❀━❀❀꧂*

No comments:

Post a Comment