Wednesday, May 28, 2025

 🙏 *రమణోదయం* 🙏

*ముల్లుని ముల్లుతోనే తీయాలి. అట్లాగే చిత్తంలో లోతుగా పాతుకుపోయిన అశుభ వాసనలను శుభవాసనలిచ్చే అభ్యాసంతో తీసేసి తర్వాత ఆ శుభవాసనలను కూడా అనవసరమైనవని నిర్మూలించాలి.*

వివరణ : *నిర్మూలించవలసినవి అశుభవాసనలు. సద్వాసనలు కావు. సద్వాసనలు అంటే బ్రహ్మనిష్ఠలో స్థిరంగా ఉండటానికి అవశ్యకమైనవి.*

 మీరు దూరంగా ఒదిగి ఒక సాక్షిగా ఉంటే మీకు దుఃఖం ఉండదు.
ప్రపంచాన్ని ఒక ఆటగా చూస్తారు.

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

 ఎవరూ లేకపోవడమే దేవుడుండడం.
ఏమి తెలియక పోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం..!!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.676)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment