*ఆలోచించండి*
🩷🩷🩷
*గోళ్లు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం... అంతే కానీ వేళ్ళను కాదు కదా...*
*అలాగే మనస్పర్థలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ బంధాన్ని కాదు.*
*నాలుక ఒక్కోసారి పళ్ళకింద పడి తెగ ఇబ్బంది పెడుతుంది... అలాగని నాలుకని కోసుకోలేము పళ్లని రాల గొట్టుకోలేము...*
*అప్పుడప్పుడు జీవితంలో బంధం బాధిస్తుందని దూరం చేసుకోవడం తెలివైన పని కాదు*
*మనసు లోలోపల ఉన్న చెడు గుణాల కంటే మించిన బద్ద శత్రువు ఎక్కడా ఉండదు..*
*అశాంతికి కారణమైన పనులు చేసి శాంతి కోసం వెతకడం అంటే చీకట్లో నల్లపూస వెతికినట్లు అవుతుంది...*
*ద్వేషానికి పగ...*
*పగకు ప్రతీకారం...*
*ఎప్పుడూ సమాధానం కానేరాదు...*
*ప్రేమకు మించిన సర్వోన్నత ఔషధం ఈ సృష్టిలో లేనే లేదు..*
*జీవితంలో ఏ బంధాన్ని తక్కువగా చూడకూడదు...*
*ఎందుకంటే ఐదు రూపాయల పెన్ను కూడా కోట్ల చెక్కుని రాస్తుంది...*
*జీవితంలో బంధం విలువ కూడా అంతే...*
*ఎవరి విలువ వారిది...*
*జీవితం చాలా చిన్నది...*
*ఎంత కాలం ఉంటామో... ఎప్పుడూ పోతామో మనకే తెలియదు...*
*బంధం వద్దనుకుంటే పోయేది కాదు...*
*కావాలంటే వచ్చేది కాదు... బతుకు ఒక రంగస్థలం...* *మనమంతా పాత్రధారులం...*
*రాసే వాడు పైన ఉన్నాడు...*
*నటించే వారంతా మన చుట్టూ ఉన్నారు...*
*ఉన్న కొద్ది రోజులు కలసి మెలసి అనందంగా జీవిద్దాం... పోయేది ఏముంది?*
🙏🙏🙏
No comments:
Post a Comment