*_లోకం తీరుకు నీ బ్రతుకు బలి పెట్టకు. బ్రతుకు నీది, బాధ్యత నీది, భరించాల్సింది నీవు, సాధించాల్సింది కూడా నీవే._*
*_ఒక్కొక్కసారి విలువ లేని దుమ్ము కూడా విలవిలలాడేలా చేస్తుంది.!_*
*_అలాగే విలువ లేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో బాధపెట్టాలని చూస్తారు..._*
*_ఆ మాటలు పట్టించుకుంటూ... బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం ఒంటరి అయిపోతావ్..._*
*_నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు... ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా.! ఆ పని చేసి వాళ్ల నోర్లు మూతపడేలా చెయ్యి..._*
*_బాధపడి, బాధపడుకుంటూ కూర్చుంటే బ్రతుకు భారంగా తోస్తుంది. ఒక్కసారి సహనంతో నీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తే... అద్భుతాలు సృష్టించగలవు._*
*_అంతే కాని, వాళ్ళన్నారని... వీళ్ళన్నారని బాధపడుతూ నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఆపేస్తే నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు మూలన పడిపోతాయి..._*
*_కాబట్టి, ఏమి జరిగినా వాటిని దులుపుకుని నువ్వు చేరాల్సిన గమ్యానికి వెనుతిరగ కుండా ప్రయత్నిస్తూ... సాగిపో..._*
*_మిత్రమా... చివరిగా ఒక్క మాట..._*
*_చేయగలనా.? చేయాలా.? వద్దా.? అనే సంశయాన్ని వదిలి నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే... ముందు నీపై నీకు విశ్వాసం ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి._*
*_పట్టుదలతో అకుంఠిత పట్టుదలతో... దక్షతతో ప్రయత్నించు... ఈరోజు నిన్ను హేళన చేసే వారే... నీపై ప్రశంసల జల్లులు కురిపిస్తారు...☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🎍🙇🏻♂️🎍 🌹🌹🌹
No comments:
Post a Comment