🙏 *రమణోదయం* 🙏
*"ఆ శరీరమే అతడు" అని ఒకరిపై నీవు ప్రేమాభిమానాలు చూపిస్తే, తదనంతరం ఆ శరీరం మరణిస్తున్నప్పుడు నీకు చాలా దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలగకుండా ఉండాలంటే ఆ మిథ్యా ప్రాణం యొక్క నిజస్వరూపం ఆత్మ కాబట్టి, దాని మీద నీ నిజమైన ప్రేమను చూపించు. అప్పుడు ఆ వియోగం నిన్ను బాధించదు.*
వివరణ: *ఆత్మ జనన మరణాలు లేనిది. కాబట్టి ఆత్మప్రేమలో వియోగ దుఃఖం లేదని భావం.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.370)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద |*
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment