Tuesday, May 6, 2025

 🙏 *రమణోదయం* 🙏

*ప్రేమని నిరోధించటం, ప్రేమను వక్రమార్గంలో బలవంతంగా రుద్దటం వలన జీవులు ఎన్నో రకాలైన కష్టాలతో హరించుకుపోతున్నారే!*

వివరణ : *ఇష్టమైన వస్తువులకు కీడు కలిగించడం, అయిష్టమైన వస్తువులను సేకరించటం, ఇలా ఆశ వృత్తిరూపంలో ప్రేమ వ్యవహరించటం వలన జీవులకు ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి. కనుక ఇష్టానిష్టాలనే వృత్తులు లేవకుండుటయే ప్రేమను అణచకుండటం, విపరీత ధోరణిలో రుద్దకుండటం అవుతుందని గ్రహించు. దీనినుద్దేశించే శ్రీ భగవాన్ ఇష్టానిష్టాల రెంటినీ త్రోసిపుచ్చాలని "నేనెవరు?" గ్రంథంలో బోధించారు.*

' తిరువారూర్ 'లో జన్మిస్తే మోక్షం
' చిదంబరం ' క్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం
' వారణాసి ' లో మరణిస్తే మోక్షం
' అరుణాచల శివ ' అని స్మరిస్తే చాలు మోక్షం!

పొందవలసినది దైవదర్శనం కాదు
జ్ఞాన దర్శనం..
జ్ఞానం పొందనంత వరకు
ఈ దర్శనాలన్నీ మానసిక దర్శనాలే!

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.654)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment