ప్రపంచ వివాహ దినోత్సవం 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు పెళ్ళి దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము అమెరికాలో మొదలయిన వేడుక ఈ ప్రపంచ వివాహ దినోత్సవం వైవాహిక జీవిత ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ సమాజ నిర్మాణానికి ఆధారము , ఆలంబనము అయిన భార్యాభర్తల్ని కుటుంబ పెద్దలుగా భావించి , గౌరవించే సంప్రదాయాన్నీ పాటించాలని , దాన్నో సంస్కృతిగా అలవరుచుకోవాలని ' వరల్డ్ మ్యారేజ్ డే' అమూల్యమైన సందేశము అందిస్తోంది . 'వరల్డ్ వైడ్ మ్యారేజ్ ఎన్‌కౌంటర్ ' 28 ఏళ్ళ క్రితం ఫిబ్రవరి నెలలో 2 వ ఆదివారాన్ని వివాహవేడుక దినం గా ప్రోత్సహించడం తో " వివాహ దినోత్సవం " మొదలైనది . సమాజానికి మౌలిక పునాది అయిన భార్యాభర్తలను గౌరవించే ప్రత్యేక రోజుగా 1983 లో " వరల్డ్ మ్యారేజ్ డే" గా ఫూపాంతరం చెందినది . మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగలిగిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్ని .. ఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి. యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు. సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు
No comments:
Post a Comment