Sunday, May 4, 2025

శ్రీరమణీయం "జ్ఞాపకాలతో పనిలేకుండా మనసు అన్ని పనులు చేయగలుగుతుందా ?

 శ్రీరమణీయం
"జ్ఞాపకాలతో పనిలేకుండా మనసు అన్ని పనులు చేయగలుగుతుందా ?"
మనసుకు బాగా అలవాటైన పనికి జ్ఞాపకంతో పనిలేదు. మన ఆచార వ్యవహారాలన్నీ మనసుకు మంచి విషయాలను అలవాటుగా మార్చేందుకు ఏర్పడినవే.
తెల్లవారుఝామున నిద్రలేవటం నేర్పితే మనసుకు అదే అలవాటుగా మారుతుంది. ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రమేల్కొంటే మనసుకు అదే అలవాటు అవుతుంది. విద్యార్థులు తెల్లవారుఝామున నిద్రలేస్తే మంచిదంటారు. అలా లేవాలని చెప్పే మన ఆచారాలను మాత్రం వద్దని విమర్శిస్తారు. దైవం అంటే భక్తి ఉందని చెపుతూనే పూజలు, భజనలు ఎందుకని ఆక్షేపించేవారు పని దొంగలతో సమానం. తన ముందుకు వచ్చిన పనిని శ్రద్ధగా చేయటంలో సంపూర్ణత ఉన్నదిగాని, తనకిష్టమైనవే చేస్తాననటంలో అసంపూర్ణతే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మన దైనందిన జీవితంలో చాలా విషయాలు జ్ఞాపకాలతో సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి !*_

1. ఎప్పుడూ ఉండేది సహజస్థితి.

2. విషయాల్ని గ్రహిస్తున్నప్పుడు కూడా ఎరుక స్థిరంగా ఉంటే దాన్ని సహజ స్థితి అంటారు.
3. ప్రయత్నపూర్వకంగా మనసును ఆలోచనా రహితంగా వుంచగలిగినప్పుడు మనం
ఆస్థితిలో ఉండ గలుగు తాము. అదే సహజస్థితి.
4. మనస్సు ఆత్మలో అణిగి విశ్రాంతిగా ఉండటమే, సహజ స్థితి. కానీ, మన మనసు తద్భిన్నముగా బాహ్య విషయాలలో ఆసక్తి కలిగి ఉంటుంది.
5. సంకల్ప వికల్పాలు లేనిస్థితి 'సమాధి'. అదే మన సహజ స్థితి.

ఉపాసన, ఆధ్యాత్మిక సాధన చేయకపోతే, మనం నిశ్చయంగా పరిపూర్ణ స్థితిని పొందలేము. సాధన సమయంలో సహజ స్థితి అనుభవమే ఉపాసన.
ఆ ఉపాసన, దానికది నిశ్చలంగా ఉండటమే "జ్ఞానము" అంటారు.

No comments:

Post a Comment