Wednesday, May 7, 2025

 శ్రీ శ్రీ గారి కవిత....🌹🙏🌹🙏🌹🙏*శ్రీ శ్రీ జయంతి సందర్భంగా..*
*మరోప్రస్థానం....!!*

అక్షరాలతో విప్లవ శంఖం పూరించన సవ్యసాచి
జగన్నాధ రథచక్రాలు నడిపించిన మహా సారధి
సామాన్యుడిని రథములో ఎక్కించిన అక్షర సాహసి
సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అక్షర తపస్వి..

అక్షరాలలో ఢమరుకం మోగించిన లయకారి
కంఠాన్ని ఎలుగెత్తి అరిచినా శబ్ద గాంబీర్యం
కలాన్ని కాలములో పరిగెత్తించిన దార్శనికి 
గలాన్ని విశ్వ వీధిలో రెపరెపలాడించిన పతాకం..

కర్షక కార్మిక గొంతులకు భావాన్ని అందించిన అక్షరం
రక్తసిక్తమైన చరిత్రను ముందుంచిన చారిత్రకం
కాలగతిని కళ్ళ ముందు ఉంచిన అక్షర దర్పణం
అక్షరానికి ఆకలి చూపించి గర్భం చీల్చిన వెలుగు..

కన్నీళ్ళను కలములో ముంచి కార్చిన మానవత్వం
కవిత్వానికి కష్టజీవిని పరిచయము చేసిన తత్వం
భూస్వాములను పెత్తం దార్లను నిందించిన సాహసం
మంటల చేత మాట్లాడించిన నిప్పుల అగ్నిహోత్రం..

రక్తము చేత రాగాలు పలికించిన విప్లవ గీతం
మరో ప్రస్థానానికి దారి కల్పించిన చైతన్య ప్రవాహం
కవిత్వాన్ని తానే నడిపిస్తానని ఎలుగెత్తి చాటిన నామం
సాహిత్య ప్రతిజ్ఞ కావించి ఉర్రూతలూగించిన ప్రభంజనం..

ఉద్యమానికి తొలిపొద్దు ఉదయించిన సూర్యోదయం
పోరాట రూపాలకు కవిత్వపు కిరణాల మహోదయం

No comments:

Post a Comment