235 వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకం 23
కుత్రాపి న జీహాసా$క్తి ఆశావా$పి న కుత్రచిత్|
ఆత్మా రామస్య ధీరస్య శీతలాచ్ఛతరాత్మనః||
పవిత్రము శాంతము అయిన మనసుతో నిత్యము ఆత్మానంద స్థితుడైన యోగి దేనిని త్యజించాలని కోరుకోడు, ఏది సంభవించిన నష్టంగా భావించడు.
మనసును అధిగమించినప్పుడే ఆత్మ అనుభవం సిద్ధిస్తుంది. ఆలోచన ప్రవాహమే మనసుగా ఏర్పడుతుంది .ఈ ప్రవాహానికి కారణమైన అహంకారము కోరికలు నశిస్తేనే మనసు అచేతనమవుతుంది. అహంకారం అదృశ్యమయి మనసు అచేతనమైనప్పుడు జగత్తుగా బ్రమకొల్పే భావన ప్రవాహం కూడా అదృష్టం అయిపోతుంది. అటువంటి స్థితిలో కేవలం ఆత్మ మాత్రమే ఆనందంగా ఉంటుంది. ఆనందాన్ని అనుభవించే యోగిలో ఏ విధమైన కోరికలు ఉండవు. దేనిని త్యజించాలనికాని, కావాలని కానీ అనుకోడు. అటువంటి భావాల అవకాశమిచ్చే జగత్తే కనిపించదు అతనికి."శీతలాఛ్చతరాత్ననః ".... పవిత్ర శాంతితో నిండిన అంతరంగముతో అతడు జీవిస్తాడు.
దేనిని త్యజించాలనుకోడు..... అంటే సర్వాన్ని వాంచిస్తాడని అర్థం కాదు. మాన్యుడు కూడా దేన్ని త్యజించాలని కోడు. అది తనకు బాధాకరము కానంతవరకు. ఈ భావాన్ని స్పష్టము చేయటానికి "నాశోవాపి కుత్రచిత్"... ఏది సంభవించిన నష్టపోయానని అనుకోడు అని అంటున్నారు. జీవన్ముక్తుని జీవిత దృక్పదము పరిధి మన మామూలు మనసుకు అందనంత చిత్రంగా ఉంటుంది. పరస్పర ఆధారమైన ఈ పరిమిత ప్రపంచము కలిగించే కష్టనష్టాలు బాహ్యభ్యంతరాలలో అతనిని ఏ విధంగానూ కదిలించజాలవు. నిత్య శాంతితో పరిపూర్ణతృప్తితో అద్వయమైన ఆత్మగా తనను తాను గుర్తిస్తూ జీవిస్తాడు. అతని అహంకారం మనశ్శరీరాల అధిగమించి ఆత్మగా జాగృతమయి అహం సర్వభూతాత్మగా అనంత శాంత పరిపూర్ణ స్వరూపంగా భాషిస్తుంది.🙏🙏🙏
No comments:
Post a Comment