Tuesday, September 30, 2025

 🍁 *శ్రీ దేవీ శరన్నవరాత్రులు/దుర్గాష్టమి* 🍀
*తొమ్మిదవ రోజు: శ్రీ దుర్గాదేవి అలంకారము*
*30/09/2025 మంగళవారం / ఆశ్వయుజ శుద్ధ అష్టమి*

   *దేవీ అవతారం విశిష్టత -- శ్రీ మహా దుర్గాదేవి*

*ఈరోజు అమ్మవారికి నైవేద్యం: కదంబం*
*అలంకరణ కోసం చీర/రెవిక రంగు: ముదురు నీలం*

శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) : దుర్గా దేవి పూజ 👇

*పూజా సమయాలు:* 
ప్రాతః కాలం: ఉ 05.57 - 08.21
ప్రదోష కాలం: సా 05.57 - 08.21
అష్టమి నవమి సంధికాలం మహాష్టమి పూజ సా 05.42 - 06.30

         *సర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమన్వితే|*
         *భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే* ॥

  ‼️ *నేడు అమ్మవారు శ్రీ మహా దుర్గాదేవీ అలంకారం* ‼️

   🌿🌿🌿🌿🙏 *శ్రీ మహా దుర్గాదేవీ* 🙏🌿🌿🌿🌿

👉 దుర్గే దుర్గతి నాశిని..ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.

*శ్లో* ||     *సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే*, 
             *శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే*

      ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి.సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. వచ్చిన వారు దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.

       ”యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా:
        నమస్త స్యై నమస్త స్యై నమస్త స్యై నమో నమ:”

అని దుర్గా స్తుతి. ఈ అమ్మ దుర్గా అష్టమి నాడు అవతరించినది కావున ఆరోజు దుర్గాష్టమిగా ప్రసిద్ధి. దుర్గదేవి నక్షత్రం పూర్వాషాడతో కూడి ఉన్న ఉత్తరాషాడ కావున ఆ ఆమ్మను 

         *ఆషాఢ ద్వయ సంభూతో వ్యాఘ్రవాహ మహేశ్వరీ*
         *త్రిశూల ఖడ్గ హస్తాఛ దుర్గాదేవీ నమోస్తుతే ||*

       దుర్గాదేవినే భువనేశ్వరీ దేవిగా కూడా సేవించెదరు.

  *విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం*
  *కన్యాభి: కరవాలఖేల విలద్దస్తా భిరాసేవితాం!*
  *హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం* 
  *బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గం త్రినేత్రం భజే*

          *శ్రీ దుర్గా ద్వా త్రిశం నామ మాల స్తోత్రం*

దుర్గా  దుర్గార్తి  శమనీ   దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా 
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ
ఓం దుర్గ  మోహా దుర్గమదా  దుర్గామాత స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహార్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమ్యా దుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః..

          👉 *దుర్గాష్టకం*

ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్‌
తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః
జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః
దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!
శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ!
అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!
భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః
 
             👉 *ఫలశృతి*

     *యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః*
     *పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్‌*

8 పర్యాయములు స్మరించవలెను.  పై మంత్రము సాద్యము కానీ వారు *ఓం దుం దుర్గాయై నమః* అనే మంత్రమును 108 జపించవలెను.

*ఎవరు చెయ్యాలి ? ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ?*

ఈ రోజు అమ్మవారిని సశాస్త్రీయముగా పూజించడము వలన జాతకములలోని కుజ , రాహు క్షీణ - నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గును. తద్వారా ఆకస్మిక గండములనుండి విముక్తి కల్గును. వైవాహిక సమస్యలు తొలగి కుటుంబములో కలతలు తగ్గుతాయి.

రాహు గ్రహము వలన ఏర్పడిన వ్యసనముల నుండి విముక్తి లభించు అవకాశము కలదు.

తీవ్రమైన మానసిక ఆందోళనతో బాదపడుట - డిప్రెషన్ - భయము - ఉన్మాదము వంటి సమస్యల నుండి ఉపశమనము లబించే అవకాశము ఉన్నది. ఎందుకనగా వీటన్నింటికి కారణం వారి వారి జాతకములలోని చంద్ర , కుజ , రాహు గ్రహముల ప్రభావమే అని ఘంటా పదముగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలున్న వారు ఈ రోజు దుర్గా దేవిని సశాస్త్రీయం గా పూజించుట అత్యంత శ్రేష్ట దాయకము. వివాహము ఆలస్యములు తొలగి సకాలములో వివాహము జరుగును.

🍁 శ్రీ [ *మహా కాళీ - మహాలక్ష్మీ - మహాసరస్వతి* ] 🍀

 *'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’*

🙏 *వాసు ముక్తినూతలపాటి* 🙏

No comments:

Post a Comment