Tuesday, September 30, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

           *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️
```
అద్భుతమైన విషయాలు మనకు చేరువలోనే ఉన్నాయి. అయితే వాటిని తెలుసుకునే శ్రద్ధాసక్తులు మనలో వికసించాలి.

ప్రకృతి మనకోసం గొప్ప సంపదను ఆవిష్కరించింది. ప్రకృతిమాత మనకు గొప్ప పాఠాలను నేర్పగలదు. కానీ వాటిని పొందాలంటే మనకు ఆధ్యాత్మిక దృష్టి కావాలి.

ఒక పొర తర్వాత ఒక పొర తీసేస్తే సత్యాలు వాటంతటవే ఆవిష్కరించుకుంటాయి. 
అది జరిగినప్పుడు మనిషి ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని, దివ్యశక్తి, తనలోనే ఉన్నదని కనుగొంటాడు.

దీనిని ఎవ్వరూ ఇవ్వలేరు, మనకు మనమే సాధించుకోవాలి.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment