Tuesday, September 30, 2025

 *_మళ్ళీ గతంలోకి వెళ్ళే అవకాశం వస్తే... మీ జీవితంలో మీరు ఏ దశను కోరుకుంటారు?!?!?_*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

*ఓ సారి ఓ కార్యక్రమంలో ఒక ప్రశ్న వేశారు.* 
*🌹మీకు గతంలోకి మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం వస్తే, మీ జీవితంలో ఏ సమయాన్ని మళ్ళీ జీవించాలని కోరుకుంటారు?” అని...🌺* 
*=•=•=•=•=•=•=•=•=*
*దానికి చాలా మంది బాల్యమనీ, student life అనీ, job లో చేరిన రోజనీ ఇలా రకరకాలుగా చెప్పారు. కానీ, ఒక ఆయన మాత్రం యిలా చెప్పారు.* 

 *_❤️“నాకు మళ్ళీ అలాంటి అవకాశం గనక వస్తే, మా అమ్మ గర్భంలోకి వెళ్లి "ఆ 9 నెలలు" మళ్ళీ గడపాలని వుంది అని._* 

*ఎందుకంటే... నేనెవరో తెలియకపోయినా, అమ్మ కడుపులో నేను బీజం పోసుకున్నానని తెలిసి అమ్మా, నాన్నా ఎంతో మురిసిపోతారు. నన్ను అసలు చూడకపోయినా నాకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రపంచలోకి ఏ మహారాజో, ఏ చక్రవర్తో వస్తున్నట్లు నా రాక కోసం మాసాలు, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకుని మరీ మురిసిపోతుంటారు. తన జన్మకి ప్రమాదం ఉందని తెలిసి కూడా, అదసలు ఓ విషయమే కాదన్నట్టు నా రాక కోసం అమ్మ ఎదురు చూసే ఆ ఊహని ఆస్వాదిస్తూ, అమ్మ కడుపులో వెచ్చగా, సురక్షితంగా ఆ 9 నెలలు గడపాలని ఉంది” అలా సాగింది ఆయన ప్రసంగం.*
 
 *°•°•°•°•°•°*
*అది విన్న వారంతా ఆ గదిలో అందరం మాటలే రానివాళ్ళలా [speechless] అయిపోయాము.* *speechless మాత్రమే కాదు అందరూ ఓ భావోద్వేగంలోకి వెళ్లి పోయారు. ఇంకో ఆయన ఆ speech ఎలావుందో చెప్పటానికి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ, కొద్ది సేపటికే... గద్గదస్వరముతో ఇక మాట్లాడలేక పోయాడు.*

*భగవంతుని ఎవరూ చూడలేదు... కాని అమ్మే కదా అందరికీ ప్రత్యక్ష దైవం.*

*జన్మించక ముందు అమ్మ గర్భంలో వెచ్చదనం, జన్మించాక అమ్మ కమ్మని ఒడిలో వెచ్చదనం..*

*_అమ్మ పెట్టిన ముద్దు_* 
*_అమ్మ పెట్టిన ముద్ద_*

*పుట్టిన్రోజున అమ్మ హడావుడి పొద్దున్నేలేపి తలంటు పోసి, కంట్లో కుంకుడుకాయ రసం పడితే కళ్ళు మండి నేను ఏడుస్తుంటే...* 
*అమ్మ తన చీరకొంగు చివరని ముడిగా చేసి దానిమీద నోటితో వెచ్చని గాలి ఊది ఆ వెచ్చదనాన్ని నా కనురెప్ప మీద పెడుతూ నన్ను ఓదారుస్తూ అమ్మ పడే గాభరా, కంగారు, ఆవేదన... కొత్త బట్టలు వేసి, నేనేదో దేవుణ్ణి అయినట్టు బొట్టు పెట్టి నాకు హారతిచ్చి, నోట్లో మిఠాయి పెట్టి మురిసిపోయే అమ్మ ఓ అద్భుత అనుభూతి, అంతులేని ఓ ఆనందం !*

🙏🙏 *మాతృదేవోభవ* 🙏🙏
*¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦|||||||||||||||||¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦*
*_{దీనిని నేను ఇవాళ ఒక వాట్సాప్ గ్రూపులో చదివాను. దానిని కాస్త modify చేసి (టైపింగ్ దోషాలు సరిచేసి)  మీకు అందిస్తున్నాను...... ఈ సందర్భంగా నా అనుభవం కూడా మీతో పంచుకోవాలని ఉంది. నేను వాశిలి హైస్కూల్లో పనిచేస్తున్నప్పుడు (07-08-2009 నుండి 21-04-2018 వరకూ) విచిత్రంగా పిల్లలకు నేను ఇదే టాపిక్ ఇస్తే పిల్లలు చాలా మంది ఎంతో వైవిధ్యంగా రాశారు. అవన్నీ నాదగ్గర భద్రపరచాను. అయితే ఇప్పటికిప్పుడు వాటిని వెతికి, టైపింగ్ చేసి మీకు తెలపాలని ఉన్నా బాగా ఎక్కువ సమయం పడుతుందని వాయిదా వేసుకోక తప్పడంలేదు. #ఇప్పుడు #మీరైతే #ఏదశకు #వెళ్ళాలనుకుంటారో.. అదే ఎందుకో నాలుగైదు వాక్యాలలో తెలపమని నా ప్రార్థన.. మన్నిస్తారా? ఆసక్తితో ఎదురు చూస్తూంటాను మరి. మీ: -వెలిశెట్టి నారాయణరావు 🙏}_*

No comments:

Post a Comment