Tuesday, September 30, 2025

 🙏 *రమణోదయం* 🙏

*పరమేశ్వరునికి అపచారం చేసినట్లుయితే, దానిని సద్గురువుల దయతో సరిదిద్దవచ్చు. అయితే సద్గురువులకి అపచారం జరిగితే మాత్రం, దానిని పరమేశ్వరుడు కూడా సరిదిద్దలేడు. ఈ మాటనే పెద్దలందరూ ముక్తకంఠంతో చెప్పుతున్నారు.*

వివరణ: *దైవభక్తి కన్న గురుభక్తిలో చాలా జాగర్త అవసరం అని ఉపదేశం*

కలల ప్రయాణం మెలకువ వరకు
అలల ప్రయాణం తీరం వరకు
జీవుని ప్రయాణం దేవుని వరకు.

పువ్వులో మకరందం ఉంటే
భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది.
మనలో ఆర్తి ఉంటే
ఆత్మ దానికదే వచ్చి ఆవహిస్తుంది!

💐ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!💐

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.800)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment