Tuesday, September 30, 2025

 *_మన జీవితంలో చీకటి లేకపోతే,వెలుగు విలువ ఏమిటో మనం ఎప్పటికీ తెలుసుకోలేం._*

*_రాత్రి చీకటి కమ్ముకున్నప్పుడే ఆకాశం అంతా నక్షత్రాల వేదికగా మారుతుంది.అదే విధంగా,..._*

*_మన హృదయాన్ని కమ్మేసే బాధలు,ఒంటరితనం, నిశ్శబ్దం ఇవన్నీ కలిసే మనలోని కాంతిని బయటపెడతాయి._*

*_నేనూ చాలాసార్లు అనుకున్నాను ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఈ నిరాశ,ఈ మౌనం,ఈ చీకటి నన్ను వెంబడిస్తోంది..? అనీ.._*

*_కానీ,కాలక్రమంలో గ్రహించాను.ఇవన్నీ నా లోపల నిద్రిస్తున్న నక్షత్రాలను మేల్కొలిపే శక్తులని._*

*_ప్రతి విఫలమైన కల వెనుక ఒక పాఠం ఉంది,ప్రతి బాధ వెనుక ఒక బలం ఉంది,ప్రతి చీకటి వెనుక ఒక కొత్త ఉదయం ఉంది._*

*_నక్షత్రాలు రాత్రిని చూసి భయపడవు.అవి రాత్రిని ఆలింగనం చేసుకుంటాయి.ఎందుకంటే,రాత్రి లేకపోతే వాటి అస్తిత్వమే కనబడదు.అదే తత్వం మనకు వర్తిస్తుంది._*

*_మనం ఎదుర్కొనే చీకటిని తప్పించుకోవడం కాదు,దానిని మన ప్రకాశానికి ఆధారంగా మార్చుకోవడం నేర్చుకోవాలి.☝️_*


*_-మీ. తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment