Tuesday, September 30, 2025

 🙏🕉️ హరిఃఓం  🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(232వ రోజు):--
     24. ప్రపంచ పర్యటన 
       నేను పశ్చిమదేశాలకు వస్తున్నది  మీకు బోధించటానికి మాత్రమేకాదు, మీనుంచి నేర్చుకోవాలనికూడా అను కుంటున్నాను. 
       -స్వామి చిన్మయానంద,1964
       ప్రాచీనకాలపు హిందూఋషుల వివేకాన్ని అందరితోనూ పంచుకోవా లనే ఉద్దేశంతో చివరకు స్వామీజీ విదేశపర్యటనకు అంగీకరించారు. 1962లో స్వామీజీ ప్రసంగం వినిన పుడు శ్రీ బి.వి.రెడ్డిగారికి హిందూ వేదాంతగ్రంథాలను ఆయన వివరిం చిన తీరు నచ్చింది. మంచి వ్యాపార స్థుడైన ఆయనకు అంతర్జాతీయ యోగపాఠశాల స్థాపించాలనే ఆలో చన ఉంది. తలంతా ఆలోచనల తోనూ, ఉత్సాహంతోనూ నిండిన ఆ వ్యాపారస్థుడు స్వామీజీ మద్రాసులో రైలెక్కబోతుండగా, "స్వామీజీ,మీరు విదేశపర్యటన ఎందుకు చేయకూడ దు ? యోగాన్ని విదేశాలకు ఎగుమ తి చేయాలనుకుంటున్న నాకు కొంత సాధన సామాగ్రి కావాలి." అన్నారు. ఆయనొక్కరేకాదు స్వామీజీని విదేశా ల్లో పర్యటించమన్నది ; సాందీపని సాధనాలయాన్ని దర్శించిన చాలా మందిఅమెరికన్లూ, ఐరోపావాసులూ  కూడా ఆయనను తమ దేశాలకు రమ్మని ఆహ్వానించారు. తగిన సమ యంలో తప్పక వస్తానని ఆయన బదులిచ్చేవారు. కాని, ఈసారి మాత్రం, "సరే, కానివ్వండి" అంటూ రైలెక్కారు. 
        చెప్పినట్లే రెడ్డిగారు ఏర్పాట్లన్నీ చేశారు. రెండు సంవత్సరాలూ, 15 వందల ఉత్తరప్రత్యుత్తరాలూ సాగిన తర్వాత స్వామీజీ పర్యటన ప్రారంభ మైంది. థాయిలాండ్, స్విజ్జర్లాండ్ వంటి విభిన్నమైన దేశాలతో సహా 12 దేశాల్లో పర్యటించాలి. ప్రతి పట్ట ణంలోనూ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి - ఆహ్వాన సమితులు ఏర్పాటయ్యాయి ; కార్లు అద్దెకు తీసు కోవటం జరిగింది ; వార్తాపత్రికల్లో ప్రకటనలీయటం, సభాప్రాంగణాన్ని ఏర్పాటుచెయ్యడం వంటివన్నీ చక చకా జరిగిపోయాయి. 
        తన మొట్టమొదటి ప్రపంచ పర్యటనకు ముందుగా స్వామీజీ హృషీకేశ్ వెళ్లి ఆనందకుటీరాన్నీ, స్వామి శివానంద మహాసమాధి స్థలాన్నీ దర్శించారు. (స్వామి శివా నంద 1963 జులై 17 న పరమపదిం చారు. సామాన్యవ్యక్తులకు చేసినట్లు మహాత్ములకు దహనక్రియలు జరు పరు, వారికి శరీరకబంధాలుండవు కనుక) సుమారు 20 సంవత్సరాల క్రితం స్వామి శివానంద వేదాలలోని సనాతనధర్మపు సందేశాన్ని విదేశా ల్లో కూడా చాటాలనే ఉద్దేశాన్ని వ్యక్తంచేశారు. అదే ఇప్పుడు నిజం కాబోతోంది. ఢిల్లీకి తిరిగివచ్చాక, స్వామీజీ రెడ్డిగారితో పాటు 1965 మార్చి ఆరవ తేదీన విమానమెక్కా రు. వారి మొదటి గమ్యం బ్యాంకాక్.
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment