ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…
*నువ్వు ఎక్కడున్నా నీవెంటే*
➖➖➖✍️
```
గుజరాత్ లో నివసించే ఒక కుటుంబం, వారికి పరమాచార్య స్వామివారు కాని, స్వామివారి వైభవం కాని ఏమీ తెలియవు.
ఒకరోజు ఉదయం ఆ ఇంటావిడ తన భర్తని ఒక గుజరాతీ పత్రికను తెమ్మని చెప్పింది.
భర్తకు ఏమీ అర్థం కావడంలేదు. రోజూ దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు. ఆమెకే కాదు ఇంట్లో ఎవరికీ కూడా దినపత్రికలు కొనడం, చదవడం అలవాటు లేదు. దాంతో, అతనికి కొంత అయోమయంగా తోచి, ఆమె విజ్ఞాపనని పట్టించుకోలేదు.
“నువ్వు రోజూ దినపత్రిక చదువుతావా? ముందు ఒక కప్పు టీ ఇవ్వు!” అని ఆమె మాటలను అతను పట్టించుకోలేదు.
“ముందు వెళ్లి నాకు ఆ దినపత్రికని తెచ్చిపెట్టండి; తరువాతనే నేను టీ తయారుచేస్తాను” అని కొద్దిగా అభ్యర్థించింది.
తన భార్య ఎందుకు ఇలా చెబుతోందో అర్థం కాక, బయటకు వెళ్లి ఆమె చెప్పిన పత్రికను కొనుక్కుని ఇంటికి తిరిగొచ్చాడు. ఇంకా ఇంటిలోకి అడుగుపెడుతుండగానే, ఆమె వచ్చి అతని చేతిలోని పత్రికను లాక్కొని, గబగబా పేజీలు తిప్పుతోంది.
చివరి పేజిలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మంటప కుంబాభిషేకానికి సంబంధించిన పూర్తిపేజీ ప్రకటన అది. అందులో దండంతో సహా నిలబడిన పరమాచార్య స్వామివారి నిలువెత్తు చిత్రాన్ని కూడా ముద్రించారు.
మహాస్వామి వారి చిత్రం చూడగానే, ఆ గుజరాతీ వనిత ఆనదంతో “అవును! ఈయనే! అది ఈయనే!” అని సంతోషంతో అరవసాగింది.
ఆవిడ భర్తకి ఏమీ అర్థం కాకపోగా, ఆందోళన ఎక్కువ అయ్యింది.
కొద్దిగా చికాకు పడుతూ, “ఏం మాట్లాడుతున్నావు? ఈ పత్రికను తీసుకురమ్మని చెప్పావు. తెచ్చి ఇచ్చిన తరువాత ‘ఈయనే! అది ఈయనే!’ అని అరుసున్నావు. అసలు ఏమయ్యింది నీకు?” అని అడిగాడు.
“నా కలలో వచ్చిన మహాత్ముడు ఈయనే” అని ఆమె చెప్పడంతో, అయితే ఆమెకు ఏదో కల వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు.
“సరే! నీకు ఏదో కల వచ్చింది. ఈయనే ఆ కలలో వచ్చిన వ్యక్తి అని నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు భర్త.
తన కలను వివరంగా భర్తకు చెప్పింది.
“నాకు ఒక కల వచ్చింది. నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను. అప్పుడు నా ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యారు. నాకు ఆయన సాధారణ ‘సన్యాసి’లా అనిపించలేదు. ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పులకించిపోయింది. వారిని లోపలకు రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను. ‘మీరు లోపలకు రారా?’ అని అడిగాను. ఆ మహాత్ముడు లోపలకు వచ్చి కూర్చున్నారు. వారికి నేను నమస్కారం చేశాను. వారు నాతో, ‘నీవు నన్ను చూడడానికి రాకపోయినా, నేను నిన్ను చూడడానికి వచ్చాను’ అని అన్నారు.
నాకు ఏమీ అర్థం కాలేదు. నేను వారితో, ‘స్వామీ! మీరు ఎవరో నాకు తెలియదు. ఎక్కడుంటారో కూడా తెలియదు. మరి నేను మీవద్దకు వచ్చి, మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను?’ అని అడిగాను.
అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు. అక్కడితో కల ఆగిపోవడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. అందుకే ఈ పత్రికను తీసుకునిరమ్మని నేను మిమ్మల్ని అడిగాను. ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మాహాత్ములే, నాకు కలలో కనబడిన స్వామివారు. వారు ఎక్కడున్నా సరే మనం వెళ్లి వారిని దర్శించుకోవాలి”
భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇది బహుశా దేవుని ఆజ్ఞయే అని అనుకున్నాడు. ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘కంచి కామకోటి పీఠం’ అని అక్కడ వ్రాసి ఉండడంతో ఇద్దరూ కాంచీపురం బయలుదేరారు.
వారు కాంచీపురం చేరుకొని విచారించగా, పరమాచార్య స్వామివారు ఇక్కడలేరని ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నారని తెలుసుకున్నారు.
వారు వదలకు అక్కడకు కూడా పయనమయ్యారు. వారు అక్కడకు చేరుకొని, వారు రావడానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు.
వారు అంతదూరం నుండి రావడం వల్ల బాగా అలసిపోయి ఉండడం వల్ల, శిష్యులు వారిని చూసి జాలిపడి, ముందుగా స్నానం చేసి, కాస్త ఏదైనా ఫలహారం తిని, తరువాత స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పారు.
కాని వీరు దానికి ఒప్పుకోలేదు. ముందు స్వామివారి దర్శనం తరువాతే ఏమైనా అని తెలపడంతో శిష్యులు లోపలకు వెళ్లి విషయం స్వామివారికి చెప్పారు.
పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. ఆమె స్వామివారిని చూసి “మీరే నా దైవం; నేను ఎప్పటికీ మీవద్దనే ఉంటాను” విపరీతంగా ఏడుస్తోంది.
ఆమె కొంచం స్థిమితపడిన తరువాత స్వామివారు ఆమె ఎవరని, ఎక్కడ నుండి వచ్చారని, తన గురించి వాళ్లకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు అక్కడున్న వారికి స్వప్న దర్శన రహస్యం తెలియరాదని.
“నా కలలో మిమ్మల్ని దర్శించాను” అని బదులిచ్చి మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది.
స్వామివారు చిన్నగా నవ్వారు.
“ఆ కల నీకు ఎప్పుడు వచ్చింది?”
“వారం పది రోజుల ముందు”
“ఆరోజు పౌర్ణమియే కదా?”, స్వామివారే స్వయంగా వెళ్లి ఆరోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్నవారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు.
దేవుణ్ణి చూసిన ఆనందంతో, కళ్ళల్లో ఆనందభాష్పలు రాలుతుండగా, ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది.
“దిగులు పడకు. నువ్వు ఎక్కడున్నా నేను నీవెంటే ఉంటా” అని స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపారు.
ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందారు వారిరువురు!✍️
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
“కంచిపరమాచార్యవైభవం”🙏
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment