*_మన జీవితం అనేది… మనం ఎలా జీవించాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇతరులు మన గురించి ఏమనుకుంటారు అనే భయంతో కాదు…మన మనసుకు నచ్చే మార్గంలో, మన విలువలు నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలి._*
*_ప్రతి మనిషికీ జీవితంలో కొంత బాధ ఉంటుంది.కొంత నష్టమూ ఉంటుంది కానీ, ఆ బాధను మోసుకుంటూ నిలబడే శక్తి కూడా మనలోనే ఉంటుంది. ప్రతి అంధకారానికీ ఒక ఉదయం ఉంటుంది. ప్రతి విఫలతకి ఒక విజయం ఎదురుగా ఉంటుంది._*
*_నిజాయితీగా బతకడం అంటే ఒంటరిగా పోరాడటం లాంటిదే…కానీ ఆ పోరాటంలో నీలోని నిజమైన నువ్వు నిలిచిపోతావు.జీవితం అంటే గొప్పగా ఎదగడం మాత్రమే కాదు…గర్వంగా తలెత్తి “నేను నా విలువలతో జీవించాను” అనడం కూడా..._*
*_అందుకే... ఎదుటివారి అభిప్రాయాలపై కాదు…నీ అంతరాత్మపై ఆధారపడి బతుకు. నీ నమ్మకాన్ని నువ్వు ఎన్నటికీ వదులుకోవద్దు. ఎందుకంటే... ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు మించిన బలం లేదు!☝️_*
*_✍️𝕋ℍ𝕌𝕂𝔸ℝ𝔸𝕄 𝕁𝔸𝔻ℍ𝔸𝕍._*
No comments:
Post a Comment