236వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకం 24
ప్రకృత్యా శూన్య చిత్తస్య కుర్వతో$స్య యదృచ్చయా|
పాకృతస్యేవ ధీరస్య న మాపో నావమానతా||
స్వభావతః శూన్యమైన మనసుతో ప్రారబ్ధానుగుణంగా సంభవించే సంఘటనలను సాక్షి మాత్రంగా చూస్తూ జ్ఞాని సామాన్యని వలె కాక మానవమానాలకు లోను గాక శాంతంగా జీవిస్తాడు.
జీవన్ముక్తుడైన జ్ఞాని సహజంగా కోరికల నుండి విడివడి శూన్య మనస్కుడై ఆలోచనల ఉధృతి తగ్గి శాంతుడై ఉంటాడు. మానసిక పరిణామాలు ఏవి అతని మనశ్శాంతిని భంగపరచవు. ప్రారబ్ధవశాత్తు సంభవించే సంఘటనలను ప్రశాంతంగా వీక్షిస్తూ ఆనందంగా జీవిస్తాడు. మనవలనే జీవిస్తున్నట్లు కనిపిస్తున్న మనవలె మానవ మానాలకు మతిని పోగొట్టుకోకుండా ధీరత్వంతో శాంతితో జీవితాన్ని ఆటగా బాసించగలుగుతాడు. జగన్నాటక రంగంలో జ్ఞాని దేహము ఎండుటాకు గాలికి చలించేటట్టుగా పూర్వ సంస్కారాల అనుగుణంగా చరిస్తూ ఉంటుంది .అహంకార రహితుడైన అతనిలో కతృత్వ బోకృత్వ భావాలు ఉండవు .సర్వ భావ రహితుడైన సర్వేశ్వరుని దివ్య లీల విలాసము నర్తిస్తూ లోక కళ్యాణకారకము, సర్వజనశ్రేయోదాయకము అయిన కర్మలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది .మానవమానాలు బుద్ధికి చెందిన విలువలు మాత్రమే. మనోబద్దుల నదిగమించిన అతనిలో మానవమానాల స్థానం ఎక్కడ?🙏🙏🙏
No comments:
Post a Comment