Tuesday, September 30, 2025

 🙏🕉️ హరిఃఓం  🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(231వ రోజు):--
        నిజానికిదంతా ప్రత్యక్షంగా కని పించేదే ; ప్రతి ఆచార్యుడూ తన శిష్యుల్లో చెడ్డవారూ, సామాన్యులూ, మంచివారూ ఉంటారని గ్రహించాలి  ఆచార్యుని ప్రోద్బలం, తోడ్పాటులతో చెడు విద్యార్ధి బాగుపడతాడు సామా  న్యుడైన విద్యార్ధి గురువుయెడల భక్తి ప్రపత్తులతో మెలుగుతాడు ; మంచి విద్యార్ధి మాత్రమే అధ్యాపకుని కఠిన మైనక్రమశిక్షణలో ఎదిగి, తనుకూడా ఒక మంచి ఆచార్యునిగా రూపొందుతాడు. 
        మీకు చాలాపెద్ద జాబు వ్రాశాను. నన్ను నిరాశపరచడం మీ ఉద్దేశమై తే, ఈవిషయంలో మీకు విజయం లభించలేదనే చెప్పాలి. శిక్షణ పూర్తి చేసిన యువతీయువకులూ, ఇప్పు డు సాందీపనిలోశిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులూ ఎలా పని చేస్తున్నారో నేను గమనిస్తూనే ఉన్నా ను; ఆత్రుతతో పరిశీలిస్తూనే ఉన్నా ను. ఎవరినీ తొందరపెట్టడంవల్ల ప్రయోజనం లేదు. సహజంగా, సావ కాశంగా జరిగినపుడే, అభివృద్ధి సరైనరీతిలో జరిగి చిరకాలం నిలు స్తుంది. పూవు ఎలా వికసిస్తుందో, ఉదయాన్నే సూర్యుడు ఎలా ఉద యిస్తాడో, సాయంత్రం ఎలా అస్తమి స్తాడో చూడండి ! తొందరేమీలేదు; దేముడు నిర్దేశించిన రీతిలోనే జరగనీయండి !
      ప్రాపంచికవాసనలను పరిత్యజిం చినవారికి వస్తువిషయాల్లో శక్తి వృధా కాదు కనుక ధ్యానంద్వారా వారి మనోబలం పెరుగుతుందని స్వామీజీ తన విద్యార్థులకు పదేపదే చెప్పారు. ఈ శక్తిని సద్వినియోగం చేసే మార్గమేదీ లేకపోతే, అతిగా లోనికి ప్రవహిస్తున్న నీటిని వదల టానికి మార్గమేదీలేని ఆనకట్టలా, పగిలిపోయి నాశనమౌతుంది. ఈ సమస్యను నివారించడానికి విద్యా ర్థులు తమ శక్తిని అధ్యయనానికీ, ధ్యానానికీ, వాటితోపాటు బోధించ డం, సేవించడం వంటి భౌతికకార్య కలాపాలకూ వినియోగించాలి. మనసు విచ్చిన్నం కాకుండా ఉండా లంటే, శక్తిని ఏదైనా మంచి పనికి వినియోగించడం చాలా ముఖ్యం. 
       వేదాంతాన్ని బోధించేటప్పుడు, తమలో పెరిగే అవకాశం ఉన్న అహంభావం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేవారు. "బోధిం చడం అంటే భగవంతుని ధ్యానించ డం కూడా. దానిని పైకి వినిపించే టట్లు చేస్తున్నారని భావించాలి. ఇతరులకు అది ఉపయోగపడితే, మంచిదే ; అలాకాకపోయినా, మంచిదే. మీ మాటలవల్ల మీ పురో గమనమే అన్నిటికన్న ముఖ్యమైన విషయం" అని స్వామీజీ పదేపదే గుర్తుచేసేవారు. 
         సాందీపని మొట్టమొదటి విద్యార్ధిబృందంలో ఉన్న స్వామి పురుషోత్తమానంద, స్వామిని శారదాప్రియానంద, స్వామి జ్యోతి ర్మయానంద ఆశ్రమంలో శిక్షణ పూర్తై నప్పటినుంచీ చిన్మయమిషన్ కు శ్రద్దతో సేవచేశారు. వారితోపాటే శిక్షణపొందిన స్వామి హరినామా నంద 20 ఏళ్ళు చిన్మయమిషన్ లో పనిచేశారు. స్వామిని గంగానంద, స్వామి సర్వానంద వంటి వారెంద రో తమ సమయాన్నంతనూ మొదటి నుంచీ పూర్తిగా చిన్మయమిషన్ కే వినియోగించ నప్పటికీ, వారి స్వస్థలాల్లో యజ్ఞ కార్యక్రమాలనూ, పఠనబృందాలనూ నిర్వహించ డానికి కృషిచేశారు. తన విద్యార్థులు తనకుగాని, చిన్మయమిషన్ కు గాని ఏవిధంగానూ ఋణపడిఉన్నారని స్వామీజీ ఎన్నడూ భావించలేదు. తమ మహోన్నతమైన సంస్కృతికీ, తమ ఆధ్యాత్మిక తత్వానికీ చెందిన జ్ఞానం సంపాదించిన విద్యార్థులు ప్రపంచంలో ఏ రంగంలో పనిచేసి నా దానికొక ప్రత్యేకతను తెస్తారనీ, ఆ విధంగా వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారనీ ఆయన విశ్వశించారు. వేదాలను బోధించ టమొక్కటే కాదు, ఏ ప్రయోజనకర మైన పనైనా దైవకార్యమే. 
                     --**--
       🕉️🙏 హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment