Tuesday, September 30, 2025

 
*_పదిమంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా_*
        *_ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు._*......
*****************
 *కోపంతో ఒక దెబ్బ కొట్టినా  కొన్నాళ్లకు మర్చిపోతాం ......  కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే , దాని వల్ల బాధపడ మనసు కొన్నాళ్లకు మనుషులని నమ్మడమే మానేస్తుంది* ........




------------------------------------------------------------



ఈ మూడు లక్షణాలు ఉన్నవారు ప్రతిభ మేధస్సుతో సంబంధం లేకుండా జీవితంలో రాణిస్తారు ....... *బాధ్యత* -  తమ జీవితానికి తమదే బాధ్యత  అన్నది గుర్తుతెరిగి  వంద  శాతం కృషి చేయడం .......... *అనుకూలత* -  పోటీ ప్రపంచంలో చరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ నిత్య నూతనంగా ఉండడం ........   *ఉత్సాహం* -  పనిని మొక్కుబడి తతంగంలా  , భారంగా భావించకుండా ఉత్సాహంతో చేయడం  .......  అప్పుడే మరింత నేర్చుకోవాలన్న తపన ఉంటుంది ....... విజయవంతమైన జీవితం లభిస్తుంది ....                     -     VLS.... 30.09.25.

------------------------------------------------------------

*Objects in the mirror are closer than they appear.* 

*Problems are smaller than they appear, when you begin to face them.* 

Happy Tuesday - Bhoumavasare


శుభోదయం  -  सूषा      

May it be so good a morning  that I will worship God.


---------------------------------------------------

Madhavi Raj..Tg:
*_యథాశక్తిగా అమ్మను ప్రార్థించి. పూజ పూర్తి అయ్యాక పాడ్యమి మొదలు దశమి వరకు రోజు చదవవలసిన అమ్మ కథలను చదువుకుందాం..._*


*దుర్గముడి చరిత్ర*

అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కథ. అష్టమినాడు. దుర్గాష్టమి అంటారు అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడికి రురువు అనే కొడుకు ఉండేవాడు, వాడు మహా పరాక్రమవంతుడు. హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణుడు వరాహరూపంలో ఉన్నప్పుడు యుద్ధం చేసి చనిపోయాడు. రురువు కొడుకుల్లో ఒకడు దుర్గముడు అనే కొడుకు ఉన్నాడు. వాడు భయంకరా కారుడు క్రూరుడు, చిన్నప్పటినుంచి అన్నిటినీ చంపడమే వాడి పని. ఈ పాపాత్ముని దగ్గరకు ఒకనాడు కొంత మంది రాక్షసులు వచ్చి, దుర్గమ నువ్వు ఎంత పరాక్రమవంతుడు అయితే మాత్రం ఉపయోగం ఏముంది? జాతికి ఉపయోగ పడకపోతే! దుర్గము తెల్లబోయి మన జాతికి నేను ఉపయోగపడటం లేదా? అన్నాడు. ఇప్పుడు ఏం ఉపయోగపడుతున్నావు? వంశాలను ఎప్పటికప్పుడు దేవతలు నాశనం చేస్తున్నారు. ఒకపక్కన ఇంద్రుడు మరో పక్కన విష్ణువు మరో పక్కన ఈశ్వరుడు అంతా కుట్రలు పన్ని రాక్షసులు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని వరాలు పొందినా అన్యాయంగా చంపేస్తున్నారు.. అందులో మీ తాత హిరణ్యాక్షుడు మహా పరాక్రమవంతుడు, శ్రీ మహావిష్ణువు చేతిలో చనిపోయాడు. మీ తండ్రి రురువు శివుడి చేతిలో చనిపోయాడు. ఇలా చచ్చిపోతున్న మన వాళ్ళని రక్షించడానికి నీ వంతు సహాయం నువ్వు ఏం చేశావు అని అడిగారు. అయితే నన్ను ఏం చేయమంటారు ?అని దుర్గమ అడిగాడు. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేయి, గొప్ప వరాలు పొంది ఆ వరాల తోటి దేవతల్ని చీల్చి చెండాడి . ఋషుల్ని నాశనం చేసి, ధర్మం నాశనం చేసి,రాక్షస జాతిని అభివృద్ధి చేయి. దుర్గముడు సరే అని హిమాలయ పర్వతాలకు వెళ్ళి కఠోర దీక్షతో బ్రహ్మ గురించి మహా తపస్సు చేసాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే.... దుర్గమ బాగా ఆలోచించి దేవతల అభివృద్ధికి కారణము యజ్ఞములు. యజ్ఞములు చేయాలంటే, వేదాలు ఉండాలి, వేదములు భూలోకంలో బ్రాహ్మణోత్తములు కంఠస్థం చేసి యజ్ఞం చేస్తున్నారు, ఈ యజ్ఞము వలన దేవతలకు బలం పెరుగుతుంది, విజృంభిస్తున్నారు. కాబట్టి దేవతల్ని నాశనం చేయాలంటే యజ్ఞములను ఆపాలి. యజ్ఞములను ఆపాలంటే వేదాలు ఆగిపోవాలి. వేదాలు ఆగాలంటే ఈ బ్రహ్మని వరం కోరుకోవాలి అనుకున్నాడు అందుకని వాడు ఇలా అన్నాడు *"సకల లోకాల కి మూల కారణమైన బ్రహ్మదేవా! మూడు లోకాలలో వేదములు చదువుకుంటున్నటువంటి వాళ్ళు వేదాలు మర్చిపోవాలి. ఆ మంత్రాలు నాకు మాత్రమే గుర్తుండి పోవాలి ఎవరికీ గుర్తు ఉండకూడదు.నా కోరిక ఇదే అన్నాడు వాడు. బ్రహ్మ తెల్లబోయి వరమిచ్చాడు తథాస్తు! అన్నాడు. ఆ రోజు నుంచి మొత్తం భూలోకంలో, దేవలోకంలో, పాతాళ లోకంలో, ఏ లోకంలో ఉన్నప్పటికీ విప్రులు వేదాలు మర్చిపోయారు. వేదాలు మర్చి పోవడం వలన స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా గుర్తు లేకుండా పోయింది. సంధ్యావందనం మర్చిపోయారు. జపాలు ఆగిపోయాయి. హోమాలు ఆగిపోయాయి పూర్వం వాళ్ళు తరచుగా ఇంద్రాది దేవతల కోసం శ్రద్ధగా యజ్ఞాలు చేస్తే, యజ్ఞముల లో పడిన ద్రవ్యం దేవతలకు ఆహారంగా వెళ్ళేది, ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలు ఆపేయడం వలన దేవతలకు ఆహారం ఆగిపోయింది. సృష్టిలో ఉన్న వాళ్లంతా వేదాలు మర్చిపోవడం వల్ల, త్రిమూర్తులు తప్ప తక్కిన వాళ్లంతా వేదాలు మర్చిపోవడం వల్ల లోకం అస్తవ్యస్తం అయిపోయింది. యజ్ఞములు జరగకపోతే ఇంద్రాది దేవతలు బలహీనమై పోతారు. వాళ్లు బక్కచిక్కి పోతే వర్షాలు కురిపించే శక్తి వాళ్లకు ఉండదు. దాంతో వర్షాలు ఆగిపోయాయి. భూలోకమంతా కరువు వచ్చింది. 100 సంవత్సరాల కరువు వచ్చింది. 100 ఏళ్ళపాటు యజ్ఞము లేక, దేవతలకు ఆహారం లేకపోవడం వలన, ఇంద్రుడు వర్షం కురిపించ లేకపోయాడు. ఎప్పుడు కూడా మనకు వర్షం కురవాలంటే దానికి ఒక విధానం ఉంది. యజ్ఞము చేస్తే ఇంద్రుడికి ఆహారం చేకూరుతుంది సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఆయన ఆధీనంలో ఉన్న మేఘాలను వదల గలుగుతాడు. అప్పుడు ఆ మేఘాలు ఆకాశంలో అవృతమై సకాలంలో వర్షాలు కురుస్తాయి వర్షాకాలంలో చక్కగా వర్షాలు వస్తాయి. వర్షము వలన చెరువులు, నదులు సమృద్ధిగా నీటితో నిండుతాయి. ఆ నీటితో మనము వ్యవసాయం చేస్తాం .ఆ నీటి వలన గడ్డి పెరుగుతుంది -వ్యవసాయం మీద వచ్చేటటువంటి పంట ని కొంత మనం ఉపయోగించుకొని కొంత లోకానికి ఇస్తాం. గడ్డి ఏమో ఆవులు మేస్తాయి, ఆవులు చక్కగా గడ్డి మేసి పాలిస్తాయి. ఆ పాలలో నుంచి వచ్చే సారం కొంత మనం స్వీకరిస్తాం కొంత నెయ్యి దేవతలకు ఇస్తాం. నిజంగా దేవతలని మనం సంతోషపెడితే మనల్ని సంతోషపెడతారు.ఎప్పుడైతే విప్రులంతా వేదమంత్రాలు మర్చిపోయారో .యజ్ఞాలు ఆగి పోయాయో దేవతలు చిక్కిపోయారు లోకమంతా భయంకరమైన క్షామం వచ్చి పడింది. లక్షలు కోట్లు జీవులు క్రమక్రమంగా నశించిపోవడం మొదలుపెట్టారు. పిట్టలు రాలినట్టు రాలిపోయారు. ఇలా అనావృష్టి పూర్తిగా వంద సంవత్సరాల కాలం అయిపోయింది. ఆవులు దేవతలు చచ్చిపోయాయి, జనులు చచ్చిపోయారు, పశువులు నశించిపోయాయి, నేలంతా నెర్రలు వచ్చేసింది, ఎండి పోయింది బీటలువారి పోయింది.

ఏ ఇళ్ళు చూసినా శవాల కుప్ప లే, అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరకు వెళితే బ్రహ్మ అన్నాడు నేనేం చేయను ఆ దుర్గముడు అందరూ వేదమంత్రాలని మర్చిపోవాలి అన్నాడు నేను తప్పక తప్పనిసరిగా ఆ తపస్సుకి మెచ్చుకొని వరం ఇవ్వవలసి వచ్చింది, తపస్సు వల్ల నేను వాడికి లొంగి పోతాను తపస్సు బ్రహ్మ ని విష్ణువుని, శివుడిని కూడా ఆకర్షిస్తుంది. తప్పదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతా కలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మే మనలను కాపాడుతుంది అనగానే. అంతా ఓపిక తెచ్చుకొని అతికష్టం మీద హిమాలయ పర్వతాలకు వెళ్లారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి, అమ్మా! భయంకరమైన సంకటం లో ఉన్నాం నిన్ను స్తోత్రం చేయడానికి కూడా మా దగ్గర వేద మంత్రాలు లేవు. ఏదో తోచిన మాటలు ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాము అని వేద మంత్రాలు లేకుండా అని కేవలం ఓ మహేశ్వరి ! జగదంబ! అంబికా పాహి పాహి రక్షించు ! రక్షించు! అన్నారు. శ్రీ సూక్తం లేదు. దుర్గా సూక్తం లేదు. వేధం లేకపోవడం వలన అన్ని మర్చిపోయారు. మమ్మల్ని రక్షించు! ఇప్పటికి నూరు సంవత్సరాలు గా దేవతలకు ఆహారం లేదు. జీవులకు ఆహారం లేదు. జీవులు దేవుళ్లు అంతా నశించి పోతున్నారు పరిపరివిధాలుగా ప్రార్థిస్తే.... అమ్మవారు ఆనంద పడిపోయి ఎదురుగుండా ప్రత్యక్షం అయింది. ఈసారి అమ్మ నల్లని నీలా కారం కాళికా రూపం లో ప్రత్యక్షమయ్యింది. పెద్ద సింహం, సింహం మీద ఎనిమిది చేతులు రకరకాల ఆయుధాలు పుచ్చుకుని నీల వర్ణం లో ప్రత్యక్షమయ్యింది. కళ్ళు కూడా నీలంగా ఉన్నాయి.రకరకాలైన కూరగాయలను చేతిలో ధరించింది. అమ్మవారి చేతుల్లో పండ్లు, కూరలు, పువ్వులు ఉన్నాయి. దేవతలంతా మానవులంతా పురుషులంతా నీరసంతో ఉన్నారని రకరకాల పదార్ధాలతోటి భోజనం పెట్టింది. అమృతము కూడా దాని ముందు సరిపోదు. వాళ్లు ఆ భోజనాలు ఫలాలు తిని ఓపిక తెచ్చుకున్నాక, అప్పుడు అమ్మ అన్నది, నాకు తెలుసు ఈ బ్రహ్మదేవుడు తొందరపడి ఆ హిరణ్యాక్షుడి మనవడికి వరాలు ఇచ్చాడు, తర్వాత మీరందరూ వేదాలు మర్చిపోయారు . యజ్ఞాలు అగిపోయాయి దేవతలు అటు జీవులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ దుర్గ ముడిని సంహరించి తిరిగి పూర్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను అనగానే వాళ్ళు తల్లి ఎంత తిన్నా నీరసంగానే ఉంది. మాకు మళ్లీ ఆహారం పెట్టు అన్నారట. ఆ తల్లి వాళ్ళ మాటలు విని మంచి రుచికరమైన పండ్లు కంద మూలాలు రకరకాల పిండివంటలతో కూడిన భోజనం ఇచ్చింది. అప్పుడు అమ్మవారిని దేవతలంతా అన్నారు కూరగాయలతో, పిండివంటలతో ఫలాలతో, కంద మూలాలతో రక రకాల పదార్థాలతో మా అందరికీ భోజనం పెట్టి కడుపు నింపిన తల్లి శాకంభరి అని నామం ఇచ్చారు. ఈ శాకంభరీ అనే పేరుతో అమ్మ వారు అద్భుతమైన నామం పొంది వారందరికి భోజనం పెట్టి కాపాడి ఉద్ధరించింది. ఇప్పుడు వీళ్లంతా సంతోషంతో జయహో జగదంబ మమ్మల్ని రక్షించావ్ అంటుండగా..... అమ్మవారు ఒక్కసారి హూంకారం చేసింది. ఆ హుంకారంతో ఈ దేవతల యొక్క కోలాహలం అమ్మవారి యొక్క సింహనాదం విన్న దుర్గముడు, ఎక్కడ నుంచి రా! శబ్దం వస్తుంది అని దూత అని పంపాడు. ఆ దూతలు వచ్చి ఎవరో ఒక ఆశ్చర్యకరమైన సుందరీమణి అండి సింహం మీద ఉన్నది. నీలం గా ఉంది, పరమ సౌందర్యవతి ఎనిమిది చేతులు ధరించింది రకరకాల పిండివంటలతో దేవతలకి భోజనం పెట్టింది. ఋషులకు భోజనం పెట్టింది. చచ్చిపోతున్న ప్రజలను కాపాడింది. ఏం సౌందర్యం అవిడది అనగా దుర్గముడు అలాంటి సౌందర్యవతి నీ నేను పెళ్లి చేసుకొని సింహాసనం మీద పక్కన పట్టపు రాణిగా పెట్టుకుంటాను అని వాడు సైన్యంతో వచ్చి ఆవిడతో యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు అమ్మవారికి ఆ దుర్గముడికి,ఆ దుర్గముడి సైన్యానికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా బంగారపు రంగులోకి తన శరీరాన్ని మార్చుకున్నది. ఎర్రని శరీరంతో పుటం పెట్టిన బంగారంలా ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై తన శరీరం నుంచి కొన్ని అద్భుత శక్తులను సృష్టించింది. ఆ శక్తులే దశవిద మహావిద్యలు పిలవబడ్డాయి.కాళకా, తారిణీ, బాలా, త్రిపురా, భైరవీ, రమా, భగళాచైవ మాతంగీ తథా త్రిపుర సుందరి, కామాక్షి, తులజా దేవీ, జంభినీ, మోహినీ, తధాచిన్నమస్త, గుహ్యకాళ, దశసాహస్ర బాహుకా.32 శక్తులు 10 విద్యలు. పది రకాల శక్తులు కలిగిన అమ్మవార్లను దశవిధ మహా దేవతలు దశ మహా విద్యలు అంటారు. 32+ 10 మొత్తం 42 శక్తులు పుట్టుకొచ్చాయి. వీటిలో మొదటి పదింటిని దశ మహా విద్యలు అని పూర్వ కాలంలో వారి యొక్క రూపాలు వాటి ఉపాసనలు తెలుసుకునేవారు. తర్వాత 32 కి ద్వాతౌసికృతులు అంటారు. అవి చాలా గొప్పవి. ఈ శక్తులు అమ్మవారి సాయానికి, అమ్మవారి శరీరం నుంచి పుట్టాయి. ఇవన్నీ కలిసి దుర్గ మాసురుడిని వాడి సైన్యాన్ని నశించిపోయే లా చేశాయి. అప్పుడు అమ్మవారు ఏరా మూర్ఖుడా !ఇప్పటికైనా దేవతలకు క్షమాపణ చెప్పి వేదాలు వారికి చ్చేసి నీ వరాన్ని ఉపసంహరించుకుని పాతాళానికి పోతే బ్రతుకు తావు లేదా నీ అంతం చూస్తాను అంటే. ఆ దుర్గముడు మూర్ఖుడు కాబట్టి నిన్ను బంధించి పెళ్లి చేసుకుంటాను అంటూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు అమ్మవారు తీవ్రమైన ఖడ్గంతో వాడి తల నరికి అవతల పారేసింది.

వాడు చావగానే బ్రహ్మ వాడికి ఇచ్చిన వరం పోయింది. దాంతో ఋషులు అందరికీ దేవతలందరికీ తిరిగి వేదాలు వచ్చేశాయి. వాళ్లంతా వేదపండితులు అయిపోయారు. మళ్ళీ యధా ప్రకారంగా బలవంతులు అయ్యారు. ముఖంలో విద్యా కాంతి వచ్చింది. పూర్వపుస్థితి యధాస్థితి వచ్చేసింది. అమ్మ జగన్మాత రకరకాలైన ఆయుధాలతో ఆ దుర్మార్గుడి ని సంహరించి మమ్మల్ని రక్షించావు, దుర్గమా సురుడిని సంహరించిన నీవు ఈ రోజు నుంచి దుర్గా అనే పేరుతో మా పూజలు అందుకో అన్నారు. అప్పుడు అమ్మ కూడా అంది. నేను కూడా ఈరోజు నుంచి దుర్గముడు ని చంపడం వలన దుర్గా అనే పేరు ధరిస్తా ను విజయవాడలో ఉన్నప్పుడు కనకదుర్గ అనే నామంతో కూడా ఉంటాను. అష్టమినాడు ఈ దుర్మార్గుడిని చంపాను కనుక ఆ పేరు మీదుగా ఈ అష్టమి దుర్గాష్టమి అని పేరు వచ్చుగాక! ఆరోజు తలారా స్నానం చేసి నా విగ్రహానికి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకం చేసి కుంకుమతో పూజించి ఆ కథను భక్తిశ్రద్ధలతో విని ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టి అక్షతలు శిరస్సున వేసుకున్న వాడికి ఏ విధమైన పీడా ఉండదు. శరీర పీడ, మానసిక పీడ, శత్రుపీడ, సకల పీడలను తొలగిస్తాను. నేను అటువంటి వారిని సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తాను అని అమ్మవారు స్వయముగా వరమిచ్చింది. అట్టి పవిత్రమైనది ఈ తిధి. ఈ రోజు తులసి దళాలు, నిమ్మకాయలు, దానిమ్మ కాయలు సమర్పించండి. దళాలతో కూడా ఒక దండ గుచ్చి అమ్మ వారి మెడలో వేయండి. నిమ్మకాయల దండ వేయండి ( ఆ తర్వాత ఈ నిమ్మకాయలను వంటకు వాడుకోవచ్చు లేదా ఇంటికి లేదా వాహనానికి దృష్టి దోషం పోవడానికి కట్టుకోవచ్చు). ఇళ్ళకి కడితే తోరణం కింద దృష్టి దోషాలు పోతాయి. తప్పక ఈరోజు దానిమ్మకాయ కనీసం ఒక్కటి అయినా అమ్మ కు నైవేద్యంగా పెడితే ఇంట్లో పిల్లలకి దంత సంబంధమైన రోగాలు ముఖ సంబంధమైన రోగాలు తొలగిపోతాయి ప్రసాదాన్ని స్వీకరిస్తే, (దానిమ్మ కాయలు నైవేద్యం పెట్టి తర్వాత తినాలి.) ఈ విధంగా అమ్మవారిని పూజించి ప్రదక్షిణ చేసి దుర్గాదేవి కటాక్షాన్ని పొందండి. దుర్గాష్టమి నాడు అమ్మని పూజించినవారు అష్టకష్టాల నుంచి విముక్తి పొందుతారని మంచి విశిష్టమైన టువంటి పాండిత్యం పొందుతారని, శరీరం విడిచి పెట్టిన తర్వాత అమ్మవారి సన్నిధానానికి వెళతారని దేవీ భాగవతం చెబుతున్నది. ఈ విధంగా అమ్మని పూజించి అందరూ కూడా తరించ లగలరు.


ఈ విధంగా అష్టమి రోజున అమ్మవారిని పూజించి, కథ విని భక్తులందరూ కూడా అనేక శుభాలు పొందాలని అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


               *దుర్గాష్టమి*
*శరన్నవరాత్ర దుర్గాదేవీ  పూజా విధానం*

*పూజా విధానం ప్రారంభం*


గణేశ ప్రార్ధన

శుక్లామ్బరధరమ్ విష్ణుమ్  శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

*దీప ప్రజ్వలన*

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి  జ్యోతిషాం  ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను

శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

*ఆచమనం*

ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా , ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

*ప్రాణాయామము*

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
ఏ  రోజు తిధి  ఆ రోజు  చెప్పుకొనవలెను.

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ / గంగా /గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన     (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే      (ఉత్తర/దక్షిన) ఆయనే 
(ప్రస్తుత ఋతువు)    ఋతౌ       (ప్రస్తుత మాసము) మాసే      (ప్రస్తుత పక్షము)   పక్షే   
(ఈరోజు తిథి)   తిథౌ    (ఈరోజు వారము) వాసరే      (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే 
శుభయోగే , శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం , శుభతిథౌ , శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య 
(మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన , కనక , వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం , సర్వాపదా నివారణార్ధం , సకలకార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్యర్ధం , పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం , సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

*కలశారాధన*

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము , కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన , తమపైన జల్లుకొనవలెను.)

తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.

*పసుపు వినాయకుని పూజ*

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి , ఆవాహయామి , నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు , గంధం పువ్వులు వేయవలెను.

ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాదిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయనమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః, మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
           
శ్రీ మహాగణాధిపతి బెల్లము లేదా  పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).

*ప్రాణ ప్రతిష్ట చేయు విధానం*

అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి , పళ్లు , ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః

ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం

స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద

*శ్రీ దుర్గా  దేవి ఆవాహన పూజ*

శ్రీ దుర్గా  దేవియే నమః ధ్యాయామి , ఆవాహయామి , నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్రీ దుర్గా  దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా  దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)

శ్రీ దుర్గా  దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి  (గంధం చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవియే నమః అక్షతాన్ సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)

*ధ్యానం*

లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః

*అధాంగ పూజ*

ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

*శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ*

అక్షతలు , పుష్పములు పూజ చెయ్యండి

దుర్గా అష్టోత్తర శత నామావళి

ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధమయ్యై నమః
ఓం పుణ్యాయై నమః (10)

ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః (20)

ఓం వాణ్యై నమః
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః (30)

ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః (40)

ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామసంహర్త్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
ఓం సుజయాయై నమః (50)

ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః (60)

ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః (70)

ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః (80)

ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధాయై నమః
ఓం నారీ మధ్యగతాయై నమః (90)

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై నమః (100)

ఓం పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)

            *నైవేద్యము*
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా   దేవి యే నమః  (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

శ్రీ దుర్గా  దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

*ఉద్వాసన*

ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.

*శ్రీ దుర్గా  దేవి పూజ సమాప్తం*

         *_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏


----------------------------------------------

_*🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా).🚩*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దుర్గాష్టమి.*

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ *'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'* అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి.* విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

*దుర్గాష్టమి.*

దుర్గాదేవి *"లోహుడు"* అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే *మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.* ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. *"ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము",* అని అంటారు.

*మహర్నవమి.*

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

*విజయదశమి.*

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  *'శ్రవణా'* నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి *'విజయా'* అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. *'చతుర్వర్గ చింతామణి'* అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే *'విజయం'* అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

*'శమీపూజ'* చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే *'జమ్మిచెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న *'అపరాజితా'* దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం *'పాలపిట్ట'* ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

*శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*

*అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||*

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి🙏💐








No comments:

Post a Comment