Tuesday, September 30, 2025

 *@ కాదనలేకపోతే..@59
      తేది: 29/09/2025
""""''""""""""""""""""""""""""""""""""

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీకాంత్ అమ్మానాన్నలను తనతో పాటు
అమెరికా తీసుకెళ్లిపోతూ ఊళ్లో ఉన్న పొలాలను బేరం
పెట్టాడు హడావుడిగా అమ్మడం దేనికి, ఊళ్లోనే ఉన్నానుగా
నేను చూసుకోనా అని నిష్ఠూరంగా అన్న మేనమామ
మాట కాదనలేక అలాగే వదిలేసి వెళ్లిపోయాడు ఆయ
నేమో వాళ్లు ఇక తిరిగి రారని, ఆస్తులన్నీ తనకి అప్పజెప్పే
శారని ఊళ్లో ప్రచారం చేశాడు దానికనుగుణంగా కాగితాలు
పుట్టించి మంచి ధరకు అమ్మేసుకున్నాడు ఏడెనిమిదేళ్లు
అమెరికాలో ఉండి ఒకసారి బంధువులందరినీ చూసి,
అలాగే పొలాలవీ అమ్మేసుకుని వెళ్లామని వచ్చిన శ్రీకాంత్
తల్లిదండ్రులకు పొలం కాదు కదా, ఇల్లూ వాకిలీ కూడా
లేవని తెలిసి నిశ్చేష్టులయ్యారు.
శ్రీరాములు పల్లెటూరి నుంచి
వచ్చి టౌన్ ,బడ్డీకొట్టు నడుపు కొంటున్నాడు
ఊరి నుంచి చిన్ననాటి స్నేహితుడు ప్రదీప్ వచ్చాడు
కొడుక్కి మెడికల్
కాలేజీతో పేమెంట్ సీట్ వచ్చిందని అయిదు లక్షలు డబ్బు సర్దమని అడిగాడు అతడంత నమ్మకస్తుడు కాదని శ్రీరాములుకు తెలుసు అయినా ఏడాది క్రితం ఊరెళ్లినప్పుడు
బడాయికి పోయి ఏదైనా అవసరమైతే కలవమని తనే చెప్పాడు అందుకే వచ్చాడు ప్రదీప్ అయిదు లక్షలంటే
చాలా పెద్ద మొత్తం చేసేదిలేక మనసులో ఆందోళన
చెందుతూనే భార్య వద్దంటున్నా వినకుండా దాచుకున్న
డబ్బు తెచ్చిచ్చాడు పదేళ్ల కష్టార్జితాన్ని పణంగా పెట్టాడు
రఘు, రాజు ఉదయపు నడకలో స్నేహితులయ్యారు
రాజు ఏవో వ్యాపారాలు చేస్తున్నానని చెప్పుకొనేవాడు విలా
సవంతమైన జీవనశైలి తరచూ మిత్రులందరికీ పార్టీ ఇచ్చేవాడు రఘు కూడా ఒకట్రెండు సార్లు ఆపార్టీలకు
వెళ్లాడు ఒకసారి వ్యాపారానికి అర్జెంటుగా కావాలని ఒక
ఫైనాన్షియర్ దగ్గర 50 లక్షలు రుణం తీసుకుంటూ రఘుని
హామీగా ఉండమని అడిగాడు నడకలోనూ, పార్టీలోనూ
కలవడం తప్ప రాజుది ఏ ఊరో, ఎక్కడి వాడో రఘుకి
తెలియదు మొహమాటస్తుడైన రఘు భయపడుతూనే
హామీ సంతకం పెట్టాడు రాజు అలా ఎంతోమంది దగ్గర
డబ్బు తీసుకుని పరారయ్యాడు ఫైనాన్షియర్లు రౌడీలను
వెంటేసుకుని వచ్చి రఘును పట్టుకున్నారు హామీ ఇచ్చినందుకు నువ్వు చెల్లించాల్సిందేనన్నారు లబోదిబోమన్నాడు రఘు తన ఆస్తి మొత్తం అమ్మినా అంత డబ్బు రాదు
దిక్కుతోచక అయినవారిని వదిలి ఎటో వెళ్లిపోయాడు
ఎదుటివాళ్లతో  మంచి అనిపించుకోవాలనే కోరిక చాలా
మందికి ఉంటుంది దాని ఫలితమే మొహమాటం అంత్య నిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలంటారు పెద్దలు మొదటే
కాదు కుదరదు అని చెప్పేస్తే  తాత్కాలికంగా వాళ్లు
బాధపడతారు కొన్నాళ్లు ముభావంగా ఉంటారు
ఆ తరువాత
మామూలైపోతారు వాళ్లు మనల్ని చెడ్డవాళ్లనుకుంటారని
మొహమాటానికి పోయి ఒప్పుకొంటే గోటితో పోయేదాన్ని
గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్లవుతుంది జీవితకాల శత్రువులను
తయారు చేసుకున్నట్లవుతుంది మొహమాటం అనేది
తనకు తానే హాని చేసుకోవడం తెలిసి తెలిసీ ఊబిలోకి
దిగడం అవతలి వ్యక్తి పూర్వాపరాల గురించి తెలుసుకోకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు...*

No comments:

Post a Comment