Tuesday, September 30, 2025

 అరుణాచలమే జ్ఞానమార్గం |
💗✨అడుగుకొక లింగం చొప్పున చిన్న చిన్న శకలాలుసైతం కోటాను కోట్ల లింగాలు అదియో అరుణాచలం!

ఆడుతూ పాడుతూ అన్నామలేశ్వరునికి చేతులు జోడించండి. తిరు అణ్ణామలై అనకండి. అఖండ జ్యోతి తిరు అణ్ణామలై అనే అనండి, అని  సిద్దపురుషులు నొక్కివాఖ్యనించారు.  అఖండ జ్యోతి అంటే ? పంచభూత లింగాలుగా పరమేశ్వరుడు ఐదు పుణ్య క్షేత్రాలలో కృపా కటాక్షాలను ప్రసరిస్తున్నాడు. పృద్వి (నేల), ఆపస్  (నీరు), వాయు (గాలి), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం) మొదలైన భూతాలకు అగ్నే ఆది స్థానం అయినది. అగ్ని స్థలమైన తిరుఅణ్ణామలైలోనే పరమేశ్వరడు ప్రపంచానికి ప్రధమంగా అగ్నిని ప్రాసాదించి అంతర్గతంగా అఖండజ్యోతి

ఈ ప్రకారం సదాశివ  పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడు తన ఉనికిని తెలియజేసేందుకు అఖండజ్యోతి రూపమై తిరుఅణ్ణామలై ఆకారంలో ఆవిర్బవించాడు. ఆ విధంగా అవతరించిన అఖండజ్యోతి ప్రప్రథమైన అగ్ని. దీని నుండే సూర్యుడు చంద్రుడు, దీపకాంతులు, నక్షత్రజ్యోతులు, అగ్నికణాలు మొదలైన వన్ని ఉద్బవించాయి.

విద్యుద్దీపం విద్యుత్ శక్తివల్ల వెలుగుతున్నట్టు కనుపించినా ఆ విద్యుత్ శక్తి కూడా అఖండ జ్యోతి అంశమైన మెరుపు అనబడే  అకాశ మార్గ కాంతే కదా.

ఆది శివుడు తన శరీరాన్నే పర్వతరూపంగా  ప్రభవింపజేసుకున్న ఈ స్థలం, కొండరాళ్ల రూపంలో  కనుపిస్తున్నది. కానీ, దాని లోలోపల పొదగబడివున్న నిక్షిప్త నిధులు ఎన్నో, ఎన్నెన్నో.

శ్రీ రమణ మహర్షికి రాళ్లలో పుట్టి పెరిగిన మర్రి చెట్టు ఆకులో భగవంతుని దివ్యమంగళ దర్శనం అయినదనే విషయం మనకందరికీ తెలుసు. ఆ మర్రి చెట్టులోనే సాక్షాత్ శ్రీ దక్షీణామూర్తి తన భౌతికకాయంతో సత్, చిత్, ఆనంద యోగధ్యానంలో అవతరించాడు.  ఆ దృశ్యాన్ని చూచేందుకు కోటినేత్రాలు అవసరం.
*అరుణాచల శివ*...🙏🪷🙇‍♂️

No comments:

Post a Comment