Tuesday, September 30, 2025

 *_యవ్వనంలో సంపాదించిన ప్రతీ రూపాయే… వృద్ధాప్యంలో నీకు ఆత్మవిశ్వాసంగా, నీ అడుగులకు ఆధారంగా మారుతుంది. కాలం మారుతుంది… శక్తి తగ్గుతుంది… కానీ అవసరాలు మాత్రం తగ్గవు. అందుకే డబ్బు అనేది కేవలం వస్తువు కాదు,అది భవిష్యత్తు భద్రత._*

*_యవ్వనంలో కష్టపడిన ప్రతి క్షణం, సంపాదించిన ప్రతి రూపాయి…వృద్ధాప్యంలో మనకు ఆత్మవిశ్వాసంగా చేతికర్రగా, ఆధారంగా మారుతుంది. అందుకే ధనాన్ని ఆదా చేయడం, గౌరవించడం, సద్వినియోగం చేయడం మన జీవనశైలి లో భాగం కావాలి._*

*_“డబ్బు పోతే తిరిగి ఈరోజు కాకపోతే ఇంకో రోజు  సంపాదించుకోవచ్చు” అనే మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ, ప్రాక్టికల్ ప్రపంచంలో అంతగా పనిచేయవు.  ఎందుకంటే ఆరోగ్యం, వయసు, పరిస్థితులు అన్నీ ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు._*

*_ఇంతే కాదు… ఈ కలియుగంలో డబ్బుంటేనే మాటకీ, మనిషికీ విలువ.  లేకపోతే… ఎంత మంచి ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా… ఎదుటివాళ్లు మనల్ని పట్టించుకోవడం అనేది కాస్త కష్టమే  అన్న అసలు నిజం కళ్ల ముందు స్పష్టమవుతుంది._*

*_అందుకే అన్నారు సుమీ.. “ధనం మూలం ఇదం జగత్” అన్న వాక్యం ఏకాకాలపు మాట కాదు… అది అనుభవం నాటిన నిజం._*

*_కాబట్టి జీవితాన్ని నమ్మకం మీద కాదు, ధనాన్ని జాగ్రత్తగా నిల్వ చేయడం మీద నడిపించు.ఎందుకంటే… చివరికి నీకోసం  నిలబడేది నీవే, నీ సంపాదనే!☝️_*


*_✍️మీ.డా.తుకారాం జాదవ్.🙏_*

No comments:

Post a Comment